క్రియాయోగ పాఠాలు

క్రియాయోగ పాఠాల కొత్త సంచిక కోసం ఎలా దరఖాస్తు చేయాలో నేర్చుకోండి

Blog-Header-Hands-Petals (1)

కొత్త విద్యార్థులు: క్రియాయోగ దీక్ష కోసం దరఖాస్తు చేయడం ఎలా

మొదటి దశ: పరమహంస యోగానందగారి ప్రాథమిక శ్రేణి యొక్క వై.ఎస్.ఎస్. గృహ అధ్యయన పాఠాలను పూర్తి చేయండి

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా తను బోధించే అధునాతన ఆధ్యాత్మిక పద్ధతులను వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంచుతుంది, ఆసక్తిగల వ్యక్తులందరు దరఖాస్తు చేసుకొనే ఒక గృహ-అధ్యయన పాఠ్యక్రమం. ఉపదేశాన్ని స్వీకరించే ముందు చిత్తశుద్ధితో ఆధ్యాత్మిక గురువును సంప్రదించడం భారతదేశంలోని పురాతన సంప్రదాయం; మరియు వై.ఎస్.ఎస్. పాఠాల కోసం దరఖాస్తు చేయడం ద్వారా, సత్యాన్వేషి పరమహంస యోగానందగారు బోధించిన క్రియాయోగ ధ్యాన శాస్త్రాన్ని నేర్చుకోవడంలో మొదటి అడుగు వేయాలని అతడు లేదా ఆమె చిత్తశుద్ధితో ఉన్నారని పేర్కొంటున్నారు.

ధ్యానం చేయడం నేర్చుకోవడం కోసం దశల వారీ సూచనలను పాఠాలు అందిస్తాయి, అలాగే ఆధ్యాత్మికంగా సమతుల్యమైన మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. పాఠాల యొక్క ప్రాథమిక శ్రేణి 18 పాఠాలను కలిగి ఉంటుంది, ఇవి ప్రతి రెండు వారాలకు విద్యార్థులకు బట్వాడా చేయబడతాయి. ప్రాథమిక శ్రేణిలో పరమహంస యోగానందగారు బోధించిన మూడు శక్తివంతమైన పద్ధతులలో సూచనలను కలిగి ఉంటుంది — హాంగ్-సా ఏకాగ్రత ప్రక్రియ, శక్తిపూరణ వ్యాయామాలు మరియు ఓం ధ్యాన ప్రక్రియ — క్రియాయోగం యొక్క సమగ్ర ఆధ్యాత్మిక శాస్త్రంలో అవసరమైన భాగాలు.

ఈ క్రమబద్ధ పరిచయానికి ఒక ప్రయోజనం ఉంది. హిమాలయాల కొలత తెలుసుకోవాలనుకునే పర్వతారోహకుడు ముందుగా అవసరమైన నిబంధనలను మరియు వాతావరణ పరిస్థితులను సహించడం అలవాటు చేసుకోవాలి, కాబట్టి అన్వేషకుడు, అతడు లేదా ఆమె తన అలవాట్లు మరియు ఆలోచనలను అలవాటు చేసుకోవడానికి, మనస్సును ఏకాగ్రత మరియు భక్తితో సరిచేయడానికి మరియు శరీరం యొక్క జీవ శక్తిని నిర్దేశించడానికి ఈ ప్రారంభకాలం అవసరమవుతుంది.

సుమారు ఎనిమిది నెలల సన్నద్ధత మరియు అభ్యాసం తరువాత, 18 ప్రాథమిక పాఠాల అధ్యయనం పూర్తి చేసిన విద్యార్థులు క్రియాయోగ ప్రక్రియలో దీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు మరియు పరమహంస యోగానందగారు, ఆత్మజ్ఞాన సంపన్నులైన వారి గురుపరంపరతో చిరకాలమైన గురు-శిష్య సంబంధాన్ని అధికారికంగా ఏర్పరచుకుంటారు.

రెండవ దశ: క్రియాయోగ దీక్ష కోసం దరఖాస్తు చేయండి

18 పాఠాల ప్రాథమిక శ్రేణిని పూర్తి చేసిన వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులకు (దాదాపుగా ఎనిమిది నెలల అధ్యయనం పడుతుంది), మీరు ఇప్పుడు క్రియాయోగ దీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు, దీని కోసం 17 వ పాఠంతో పాటు ఆహ్వానం జోడించబడుతుంది.

ఇది మీరు భగవంతుని వద్దకు ఎంచుకున్న మార్గం అని అంతర్గతంగా భావిస్తే మరియు పరమహంస యోగానందగారు, ఆత్మజ్ఞాన సంపన్నులైన వారి గురుపరంపరతో పవిత్రమైన గురు-శిష్య సంబంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటే, 17 వ పాఠం యొక్క ముద్రిత అనువాదంతో చేర్చబడినదాన్ని చదవమని మేము మీకు సలహా ఇస్తున్నాము. ఈ సమయంలో క్రియాయోగం కోసం దరఖాస్తు చేయాలా వద్దా లేదా ప్రస్తుతానికి మీరు పాఠాలలో ఇప్పటివరకు అందుకున్న ప్రాథమిక ప్రక్రియలు మరియు బోధనలతో మీ అధ్యయనం మరియు అభ్యాసాన్ని కొనసాగించాలనుకుంటున్నారా అనే దాని గురించి నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయ పడుతుంది.

17 వ పాఠంలో క్రియాయోగం గురించి మరింతగా తెలుసుకోవడంతో పాటు, ఒక యోగి ఆత్మకథ 26వ అధ్యాయంలో ఈ పవిత్రమైన క్రియాయోగ ప్రక్రియపై పరమహంస యోగానందగారి వివరణను మళ్లీ చదవడం ద్వారా, ఆత్మ-సాక్షాత్కారాన్ని సాధించడంలో ఈ ఆత్మ విజ్ఞానం మీకు ఏ విధంగా సహాయకారి అవుతుందో మీరు గమనించగలుగుతారు.

క్రియాయోగం కోసం దరఖాస్తు చేయడానికి ఈ అడుగు వేయకూడదని భావించేవారు కూడా యోగదా సత్సంగ పాఠాల అధ్యయనం కొనసాగించవచ్చు.

క్రియాయోగ దీక్షను అభ్యర్థించాలా వద్దా అనేది చివరికి ఒకరు నిర్ణయించుకున్నా లేకపోయినా, ఇతర యోగదా సత్సంగ ప్రాథమిక ప్రక్రియల (మొదటి దశ జాబితాలో పైన ఉన్నవి) ద్వారా దివ్య చైతన్యం యొక్క అత్యున్నత స్థితిని చేరుకోవడం సాధ్యమవుతుందనే పరమహంసగారి హామీలోని సత్యాన్ని, తమ సాధనలో శ్రద్ధగల వారందరూ స్వయంగా గ్రహిస్తారు — అయితే క్రియాయోగం అనేది వేగవంతమైన మరియు అత్యంత ప్రభావవంతమైన పద్ధతి.

“క్రియాయోగం సాధారణ శ్వాసకు సంబంధించిన వ్యాయామం కాదు: ఇది ప్రాణాయామం యొక్క ఉన్నత ప్రక్రియ, దీని ద్వారా మీరు శరీరంలోని ప్రాణశక్తిని ఎఱుకతో నియంత్రించవచ్చు తద్ద్వారా విశ్వ చైతన్యాన్ని పొందవచ్చు.”

— పరమహంస యోగానంద

మీరు యోగదా సత్సంగ పాఠాల కోసం నమోదు చేసుకోనప్పటికీ, మీరు మా వెబ్‌సైట్‌లోని ప్రాథమిక సూచనలు మరియు మార్గదర్శక ధ్యానాల ద్వారా ధ్యానం యొక్క ప్రాథమిక విషయాలను నేర్చుకోవచ్చు — ధ్యానం వల్ల కలిగే అనేక రకాల ప్రయోజనాలను పొందడం ప్రారంభించడానికి మీరు వెంటనే ఉపయోగించగల సాధనాలు.

క్రియాబాన్ లు: క్రియాయోగ పాఠాల కొత్త సంచిక కోసం అభ్యర్థించండి

యోగదా సత్సంగ క్రియాయోగ పాఠాల యొక్క కొత్త, మెరుగుపరచబడిన సంచిక ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ సంచిక, “గురువుతో అనుసంధానం” మరియు “క్రియాయోగి అనుసరించవలసిన జీవిత ప్రణాళిక” అనే అంశాలపై కొత్త పాఠాలతో, ఇప్పటివరకు పంపిణీ చేయని విషయాలను కలిగి ఉంది — పరమహంసగారు తాను భూమి మీద అవతరించి ఉన్నప్పటి చివరి సంవత్సరాల్లో, వారు ఏడు-దశల పాఠాల పూర్తి సవరణ మరియు అధునాతన పాఠాల ఏర్పాటు గురించి ఆశిస్తున్నప్పుడు, నిర్దేశించిన సందేశాలు.

ఇప్పటికే మీరు వై.ఎస్.ఎస్. క్రియావంతులైతే, క్రియాయోగ పాఠాల కొత్త సంచికకు ఇప్పుడు డివోటీ పోర్టల్‌లో, ఆన్‌లైన్‌లో సభ్యత్వాన్ని పొందవచ్చు. మీరు ఇంకా డివోటీ పోర్టల్ ఖాతాను ఏర్పాటు చేయకుంటే (లేదా గతంలోని మీ పాఠాల విద్యార్థి స్థితిని ధృవీకరించినట్లయితే) మీరు మీ క్రియా నమోదు ప్రక్రియలో భాగంగా దీన్ని చేయాల్సి ఉంటుంది. మీ పాఠాల విద్యార్థి స్థితిని ధృవీకరించడానికి మీ వై.ఎస్.ఎస్. పాఠాల నమోదు సంఖ్య అవసరం.

గమనిక: క్రియా పాఠాలు కేవలం ముద్రణ రూపంలోనే లభిస్తాయి (వై.ఎస్.ఎస్. పాఠాల యాప్ లో కాదు) మరియు కవరు ముద్రణ, బట్వాడా, మరియు ఇతర సంబంధిత ఖర్చులకు సహాయంగా సూచించబడిన విరాళంతో లభిస్తాయి.

ఇప్పటికే వై.ఎస్.ఎస్. క్రియాబాన్ లుగా ఉండి మీరు కొత్త పాఠాల ప్రాథమిక శ్రేణికి సైన్-అప్ చేయకపోతే, పాఠాలు పునర్వ్యవస్థీకరించబడిన మరియు క్రమపద్ధతిలో అందించబడిన విధానం కారణంగా, కొత్త క్రియా పాఠాలను అభ్యర్థించడానికి ముందు మీరు అలా చేయాలని మేము గట్టిగా సిఫార్సు చేస్తున్నాము. ప్రాథమిక శ్రేణిలో అమూల్యమైన సమాచారం ఉంది, ఇది క్రియాభ్యాసానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ఈ జ్ఞానము యొక్క ముఖ్యమైన భాగం పాఠాల యొక్క గత సంచికలలో చేర్చబడలేదు. మీరు ప్రాథమిక పాఠాలు మరియు క్రియాయోగ పాఠాల యొక్క కొత్త సంచిక రెండింటిలోనూ నమోదు చేసుకోవడానికి ఎంచుకున్నట్లయితే, మీరు ముందుగా క్రియాయోగ పాఠాలను అందుకుంటారు.

క్రియాయోగ దీక్ష కోసం దరఖాస్తు చేయడానికి నాకు అర్హత ఉందా?

మీ క్రియాయోగ దీక్ష అర్హతను నిర్ణయించడానికి మీకు వర్తించే దిగువ ఎంపికను ఎంచుకోండి.

నేను వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థి కాదు (పాత లేదా కొత్త సంచిక). క్రియాయోగానికి నేను దరఖాస్తు చేయవచ్చా?

మీకు ఇంకా అర్హత లేదు. క్రియాయోగం కోసం దరఖాస్తు చేసుకునే ముందు, మీరు తప్పనిసరిగా పాఠాల విద్యార్థి అయి ఉండాలి మరియు 18 పాఠాల ప్రాథమిక శ్రేణిని పూర్తి చేసి ఉండాలి.

యోగదా సత్సంగ పాఠాల గురించి మరింత తెలుసుకోండి మరియు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

నేను వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థిని, కాని నేను ఇంకా ప్రాథమిక శ్రేణిని పూర్తి చేయలేదు. క్రియాయోగానికి నేను దరఖాస్తు చేయవచ్చా?

మీకు ఇంకా అర్హత లేదు. దీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి 17వ పాఠంతో పాటు ఆహ్వానాన్ని అందుకుంటారు.

17వ పాఠంతో పాటు ఉన్న ఆహ్వానాన్ని దయచేసి చూడండి.

నేను వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థిని మరియు నేను ప్రాథమిక శ్రేణిని పూర్తి చేసుకున్నాను. క్రియాయోగానికి నేను దరఖాస్తు చేయవచ్చా?

గత సంచిక పాఠాలను కొన్ని సంవత్సరాల క్రితం చదివాను. క్రియాయోగానికి నేను దరఖాస్తు చేయవచ్చా?

మీరు వై.ఎస్.ఎస్. పాఠాల గత సంచిక యొక్క స్టెప్ II (సంఖ్య 52 ద్వారా) పూర్తి చేసినట్లయితే మీరు క్రియాయోగం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అయినప్పటికీ, మీరు కొత్త ప్రాథమిక పాఠాలను కూడా అధ్యయనం చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము. కొత్త సంచిక గతంలో ప్రచురించని విషయాలని అందిస్తుంది మరియు స్పష్టత కోసం మరియు నేర్చుకునే సౌలభ్యం కోసం పూర్తిగా పునర్వ్యవస్థీకరించబడింది.

దరఖాస్తు చేయడానికి దయచేసి ఒక ఖాతాను ఏర్పాటు చేసుకోండి లేదా డివోటీ పోర్టల్ కు లాగిన్ అవ్వండి.

గత సంచిక పాఠాలకు నేను క్రియాబాన్ ని. క్రియాయోగ పాఠాల కొత్త సంచికను నేను అభ్యర్థించవచ్చా?

అవును, మీరు క్రియాయోగ పాఠాల కొత్త సంచికను అభ్యర్థించవచ్చు.

అయినప్పటికీ, మీరు కొత్త ప్రాథమిక పాఠాలను కూడా అధ్యయనం చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము. కొత్త సంచిక గతంలో ప్రచురించని విషయాలని అందిస్తుంది మరియు స్పష్టత కోసం మరియు నేర్చుకునే సౌలభ్యం కోసం పూర్తిగా పునర్వ్యవస్థీకరించబడింది.

దరఖాస్తు చేయడానికి దయచేసి ఒక ఖాతాను ఏర్పాటు చేసుకోండి లేదా డివోటీ పోర్టల్ కు లాగిన్ అవ్వండి.