సంఘ నాయకత్వం

పరమహంస యోగానంద, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. వ్యవస్థాపకులు1917లో స్థాపించబడినప్పటి నుండి 1952లో పరమహంస యోగానందగారు మహాసమాధికి కొంతకాలం ముందువరకు, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కార్యకలాపాలు మరియు సంస్థాగత విషయాలన్నీ పరమహంస యోగానందగారు స్వయంగా నిర్దేశించారు. ఆ తరువాత, ఆయన సంస్థకు నాయకత్వం శ్రీ శ్రీ రాజర్షి జనకానందగారికి ఇవ్వబడింది, పరమహంసగారికి అతి దగ్గరగా ఉన్న శిష్యులైన శ్రీ శ్రీ రాజర్షి జనకానందగారిని వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులుగా ఎంపిక చేశారు, ఆయన 1952 నుండి మూడు సంవత్సరాల తరువాత ఆయన పరమపదించే వరకు ఆ పదవిలో ఉన్నారు.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క మూడవ అధ్యక్షురాలు మరియు ఆధ్యాత్మిక అధిపతి శ్రీ శ్రీ దయామాత. ఆమె యోగానందగారి దగ్గర ఇరవై ఏళ్ళకు పైగా వ్యక్తిగతంగా శిక్షణ పొందారు, మరియు 1955లో రాజర్షి జనకానందగారు పరమపదించిన తర్వాత ఆమె వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షురాలు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయ్యారు – 2010లో ఆమె పరమపదించే వరకు ఆమె ఆ పదవిలో ఉన్నారు.

శ్రీ శ్రీ దయమాత తర్వాత , శ్రీ శ్రీ మృణాళినీమాత సంఘ మాతగా మరియు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఆమె కూడా పరమహంస యోగానందగారి ద్వారా వ్యక్తిగతంగా ఎంపిక చేయబడి, ఆయన మహాసమాధి తర్వాత సంస్థకి మార్గ నిర్దేశం చేయడం కోసము శిక్షణ పొందివున్నారు, మరియు ఎస్.ఆర్.ఎఫ్. సన్యాస శిష్యురాలుగా ఆమె ఏడు దశాబ్దాలలో అనేక ముఖ్యమైన నాయకత్వ పాత్రలను పోషించారు. శ్రీ మృణాళినీమాత 2011 నుండి ఆగష్టు 2017లో ఆమె పరమపదించే వరకు సంఘ మాతగా మరియు వై.ఎస్.ఎస్. / ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షురాలిగా పనిచేశారు.

స్వామి చిదానంద గిరి వై.ఎస్.ఎస్. / ఎస్‌.ఆర్‌.ఎఫ్. ప్రస్తుత అధ్యక్షుడు మరియు ఆధ్యాత్మిక అధిపతి

స్వామి చిదానంద గిరి వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సంస్థలకు ప్రస్తుత అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి, మరియు నలభై సంవత్సరాలుగా సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సన్యాసి. దాదాపుగా ఆయన సన్యాస జీవితం ప్రారంభం నుండి, ఆయన శ్రీ మృణాళినీమాతతో కలిసి పరమహంస యోగానందగారు రచించిన మరియు ఇతర ఎస్.ఆర్.ఎఫ్. ప్రచురణల సంపాదకత్వం మరియు రచనలలో ఆమెకు సహాయకులుగా పనిచేశారు. ఆయన 2009లో శ్రీ దయామాత ద్వారా వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. డైరెక్టర్ల బోర్డు సభ్యునిగా నియమించబడ్డారు మరియు అధ్యక్షుల మార్గదర్శకత్వంలో ఎస్.ఆర్.ఎఫ్. యొక్క అనేక కార్యకలాపాలు మరియు కార్యకలాపాలను పర్యవేక్షించే మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యునిగా కూడా చాలా సంవత్సరాలు పనిచేశారు.

అధ్యక్షులయిన స్వామి చిదానందగారికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సహాయం చేస్తారు. ఇందులో పరమహంసగారి ప్రత్యక్ష శిష్యుల వద్ద శిక్షణ పొందిన ఇతర సన్యాసులు కూడా ఉన్నారు.

యోగానందగారితో వ్యక్తిగత అనుబంధం నుండి ప్రయోజనం పొందిన డజన్ల కొద్దీ ప్రత్యక్ష శిష్యులు, ఆయన మహాసమాధి తరువాత, వై.ఎస్.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. ఆశ్రమాలలో దశాబ్దాల పాటు తమ జీవితాన్ని గడిపారు, ఆయన సంస్థకు విశ్వసనీయంగా సేవలందించారు మరియు ఆయన నియమించిన నాయకత్వానికి మద్దతు ఇచ్చారు. వారి కథలు చదవండి.

డైరెక్టర్ల బోర్డు సభ్యులందరూ మా సంస్థ యొక్క సన్యాసులే, వారు తుది, జీవితకాల పరిత్యాగ ప్రమాణాలను స్వీకరించారు. వారు మరియు వై.ఎస్.ఎస్./ఎస్.‌ఆర్‌.ఎఫ్. ఆశ్రమాలలోని ఇతర సన్యాసులు మరియు సన్యాసినులు పరమహంస యోగానందగారు ప్రారంభించిన సంస్థ కోసం తమ జీవితాలను పూర్తిగా అంకితం చేశారు.

రెసిడెంట్ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఆదేశాల మేరకు, వై.ఎస్.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. వారసత్వ క్రమములోని సన్యాసులు మరియు సన్యాసినులు సంస్థ యొక్క ఆశ్రమ కేంద్రాలలో అనేక హోదాలలో పనిచేస్తారు; ఉపన్యాసాలు మరియు తరగతులు నిర్వహించడానికి మరియు సత్సంగాలు నడిపించడానికి విరివిగా ప్రయాణం చేస్తూవుంటారు; మరియు యోగదా సత్సంగ విద్యార్థులకు ఆధ్యాత్మిక సలహా మరియు మార్గదర్శకత్వమును – ఫోన్ ద్వారా, లేఖల ద్వారా మరియు వ్యక్తిగతంగా అందిస్తూ ఉంటారు.

అనేక మంది అంకితభావంతో ఉన్న వై.ఎస్.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. సామాన్య సభ్యులు కూడా పరమహంస యోగానందగారి ప్రపంచవ్యాప్త పనికి ఆవశ్యకమైన మార్గాల్లో సేవ చేస్తున్నారు-అంతర్జాతీయ ప్రధాన కార్యాలయాలు మరియు ఇతర వై.ఎస్.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. ఆశ్రమ కేంద్రాలలో సన్యాసులతో పని చేయడం, మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆశ్రమాలు మరియు ధ్యాన కేంద్రాలలో అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇతరులతో పంచుకోండి