వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.కి ఆధ్యాత్మిక అధినేతగా మరియు అధ్యక్షుడిగా ఎంపికైన స్వామి చిదానంద

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.కి ఆధ్యాత్మిక అధినేతగా మరియు అధ్యక్షుడిగా ఎంపికైన స్వామి చిదానంద.జనవరి 2011 నుండి ఆమె పరమపదించిన నెల క్రితం వరకు అధ్యక్ష పదవిని నిర్వహించిన శ్రీ మృణాళినీమాతగారి తరువాత యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.)కు అధ్యక్షుడిగా మరియు ఆధ్యాత్మిక అధినేతగా స్వామి చిదానంద గిరి ఎంపిక అయ్యారని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సంతోషంగా తెలిపారు. ఎస్.ఆర్.ఎఫ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆగస్ట్ 30, 2017న ఆయన నియమించబడ్డారు.

2010లో ఆమె కాలం చెందక పూర్వం, దివంగత ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షురాలు శ్రీ దయామాత మృణాళినీమాతతో స్వామి చిదానంద మీద ఆమెకు ఉన్న నమ్మకాన్ని తెలిపి, మృణాళినీమాత తరువాత ఆయనే వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.కు అధ్యక్షుడు మరియు ఆధ్యాత్మిక అధినేత కావాలని చెప్పారు. ఆగస్ట్ 3, 2017న మృణాళినీమాత మృతి చెందటానికి కొన్ని నెలలకు పూర్వం దయామాత సిఫార్సును గూర్చి ఆమె అంగీకారాన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ధృవీకరించారు.

స్వామి చిదానంద సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ లో నలభై ఏళ్ళుగా సన్యాసిగా ఉన్నారు, మరియు గత ఎనిమిది సంవత్సరాలుగా ఎస్.ఆర్.ఎఫ్. మరియు వై.ఎస్.ఎస్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో సభ్యుడిగా ఉన్నారు. దాదాపు ఆయన సన్యాస జీవితం మొదటి నుండి కూడా ఆయన శ్రీ మృణాళినీమాతతో దగ్గరగా పని చేశారు. ఆమె యొక్క గురువుతో అనుగుణమైన, జ్ఞానంతో నిండిన శిక్షణను పొందుతూ, శ్రీ పరమహంస యోగనందగారి యొక్క రచనలు మరియు ఎస్.ఆర్.ఎఫ్. ప్రచురణలను కూర్చడానికి మరియు ప్రచురించడానికి ఆమెకు సహాయం చేసారు.

భగవంతుడి సేవ మరియు ఎస్.ఆర్.ఎఫ్. కార్యాచరణ కొరకు మేలుకొలుపు

అన్నాపోలిస్, మేరిల్యాండ్ లో 1953లో జన్మించిన స్వామి చిదానంద, మొదటిసారి శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి బోధనలకు మరియు ఎన్సినీటస్ లో ఆయన స్థాపించిన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కు 1970 దశాబ్దం యొక్క తొలి భాగంలో పరిచయులు అయ్యారు, అప్పుడు ఆయన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, సాన్ డియాగోలో సామాజిక శాస్త్రం మరియు తత్వశాస్త్రం చదువుతున్నారు. భారతదేశపు ఆధ్యాత్మికత పైన ఆయనకు ఉన్న దీర్ఘకాల ఆసక్తి వల్ల, ఆయన యూనివర్సిటీకి ఉత్తరంగా ఉన్న ఎన్సినీటస్ లలోని ఎస్.ఆర్.ఎఫ్. ఆశ్రమాన్ని దర్శించారు. సమీపంలో ఉన్న సముద్ర తీర సముదాయాలలో నివసిస్తున్న విద్యార్థులందరిలో ఈ ఎస్.ఆర్.ఎఫ్. ఆశ్రమము బాగా ప్రాచుర్యములో ఉంది.

కొన్ని నెలల తరవాత, ఆయన ‘ఒక యోగి ఆత్మ కథ’ కాపీని చదవడం తటస్థించింది, ఆ పుస్తకం యొక్క పుటల నుండి వెలువడిన అమోఘమైన జ్ఞానం మరియు దైవ చైతన్యానికి ఆయన తక్షణమే ఆకర్షితులయ్యారు. యూనివర్సిటీలో ఆఖరి సంవత్సరం చదువుతున్నప్పుడు, ఆయన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పాఠాలకు నమోదు చేసుకున్నారు మరియు ఎన్సినీటస్ లో ఎస్.ఆర్.ఎఫ్. సత్సంగాలలో పాల్గొన నారంభించారు. అక్కడ అప్పుడు పరిచారకునిగా ఉన్న స్వామి ఆనందమోయ్ ప్రసంగాలు విని ఆయన ఎంతో ప్రేరణ పొందారు, మరియు స్వామి ఆనందమోయ్ యొక్క వ్యక్తిగత సలహాతో ప్రయోజనం పొందారు కూడా. ఈ పవిత్రమైన వాతావరణంలో–ఎక్కడైతే పరమహంసజీ యొక్క స్పందనలు పూర్తిగా విస్తరించి ఉన్నాయో–అక్కడ ఉంటున్న సన్యాసులు మరియు సన్యాసినుల వల్ల ఆయన లోతుగా ప్రభావితులయ్యారు, మరియు అక్కడ ఆయన జీవితాన్ని సంపూర్ణంగా భగవంతుని తెలుసుకునేందుకు మరియు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి కార్యానికి ఒక సన్యాసి భక్తునిగా సేవ చేయుటకు ఆయనకు దాదాపు వెంటనే కోరిక కలిగింది.

నవంబరు 19, 1977లో ఎన్సినీటస్ లో సన్యాస అభ్యర్థుల ఆశ్రమంలో స్వామి చిదానంద చేరారు. అక్కడ యువ సన్యాసులకు శిక్షణ ఇచ్చే బాధ్యతలో ఉన్న ఒక నిర్మలమైన హౌస్-బ్రదర్, స్వామి ప్రేమమోయి యొక్క ఖచ్చితమైన ప్రేమమయమైన మార్గదర్శకత్వంలో ఒకటిన్నర సంవత్సరాలు గడిపారు. శ్రీ మృణాళినీమాతకు ముందుగా ఈ యువ సన్యాసిని ఎస్.ఆర్.ఎఫ్. సంపాదకీయ శాఖలోకి తీసుకోమని సిఫారసు చేసింది స్వామి ప్రేమమోయే. ఏప్రిల్ 1979లో, ఆయన సన్యాస శిక్షణ ముగించుకున్న తరువాత, స్వామి చిదానంద మౌంట్ వాషింగ్టన్ లో ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. అక్కడ వెంటనే ప్రచురణ విభాగంలో గురూజీ యొక్క రచనలను మరియు ప్రసంగాలను భవిష్యత్తులో ప్రచురించడానికి, స్వయంగా మృణాళినీమాత మరియు సహ-సంపాదకురాలు అయిన సహజమాత కింద సంపాదకీయం చెయ్యడానికి ఆయన నియమించబడ్డారు.

1996లో సహజమాత స్వర్గస్తులైన పిమ్మట, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రచురణ సమితికి సహ-సంపాదకునిగా అధ్యక్షురాలైన శ్రీ దయామాత చేత స్వామి చిదానంద నియమించబడ్డారు. ఈ పదవిలో ఆయన, 2010లో దయామాత స్వర్గస్తులయ్యే వరకు దయామాత మరియు మృణాళినీమాతతో కలిసి సేవ చేసారు. ఈ సమయంలో ఆయన, పరమహంసగారి యొక్క భారీ గ్రంథ భాష్యాలు (గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత మరియు ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్: ద రిసరక్షన్ ఆఫ్ క్రైస్ట్ వితిన్ యూ) మరియు 1980 నుండి ఇప్పటి వరకు ప్రచురించిన ఇతర ఎస్.ఆర్.ఎఫ్. ప్రచురణలతో సహా చాలా రచనల తయారీ మరియు ప్రచురణలో ఈ ఇద్దరు ప్రత్యక్ష భక్తురాళ్లకు సహాయపడ్డారు. దయామాత, మృణాళినీమాత మరియు సహజమాత దగ్గర ఆయన, ప్రగతిశీలంగా లోతైన శిక్షణ కొన్ని సంవత్సరాలు పొందిన తరువాత, తదుపరి వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రచురణలకు ముఖ్య సంపాదకుడిగా ఉండడానికి, మృణాళినీమాత ఆయన్ని నియమించారు.

1997లో స్వామి చిదానందకు చివరి సన్యాస ప్రమాణాలు శ్రీ దయామాత చేయించారు. ఆయన సన్యాస నామం అయిన చిదానంద యొక్క అర్థం “అనంతమైన దైవ చైతన్యం ద్వారా వచ్చే ఆనందం”. సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క నియమించబడ్డ పరిచారకుడిగా, అమెరికా, కెనడా, ఐరోపా మరియు భారతదేశాల్లో ప్రసంగ పర్యటనలలో మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆయన శ్రీ శ్రీ పరమహంస యోగానంద యొక్క బోధనలను పంచుకున్నారు. 2009లో శ్రీ దయామాత చేత ఆయన వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. డైరెక్టర్ల బోర్డ్ లో సభ్యుడిగా నియమించబడ్డారు, మరియు చాలా సంవత్సరాలు ఎస్.ఆర్.ఎఫ్. యొక్క అసంఖ్యాకమైన కార్యాలు మరియు కార్యకలాపాలను పర్యవేక్షించే నిర్వహణ సంఘంలో కూడా సభ్యుడిగా, అధ్యక్షుడి మార్గదర్శకత్వంలో చాలా సంవత్సరాలు పని చేసారు.

 “మన ఆత్మలకు ప్రియమైన వ్యక్తిగా, అందరము కలిసి భగవంతుడిని తెలుసుకోవడము…”

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులతో మాట్లాడుతూ స్వామి చిదానంద ఇలా అన్నారు: “వినమ్రతతో మరియు గురుదేవులు పరమహంస యోగానందగారే ఈ సంస్థకు ప్రముఖులన్న స్పృహతో, మన ప్రియతమ శ్రీ దయామాత మరియు శ్రీ మృణాళినీమాత యొక్క అభ్యర్థనని తీర్చడానికి మరియు వారి అడుగుజాడల్లో నడవడానికి, నేను మీ అందరి ప్రార్థనలు మరియు సహాయాన్ని కోరుతున్నాను. గురుదేవుల ప్రేమ యొక్క పవిత్రమైన మాధ్యమంగా ఉండడానికి (శ్రీ దయామాత మరియు శ్రీ మృణాళినీమాత) అంకితభావం–ఆయన సంకల్పం మరియు మార్గదర్శకత్వంతో వారి ప్రతి ఆలోచనను, నిర్ణయాన్ని మరియు చర్యలను అనుగుణంగా అమర్చుకునే వారి దివ్య ఉదాహరణ–ఇదే నా ఆశ్రమ జీవిత కాలమంతటిలో నాకు ప్రేరణగా నిలిచింది; మరియు ఈ పవిత్ర బాధ్యతా భావంతో, మీ అందరి సహాయం, ప్రార్థనలు, ఆదరణ మరియు దివ్య స్నేహం మీద నమ్మకంతో, నేను దైవం మరియు గురువుల యొక్క ఈ మహత్తర కార్యానికి రానున్న సంవత్సరాలలో సేవ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను.”

“మీలో ప్రతి ఒక్కరూ గురుదేవులచే ఎంపిక కాబడిన భక్తులు. మన ఆత్మలందరి ప్రియతమ ప్రభువుగా భగవంతుని అన్వేషణ కొరకు ఇలా గురుదేవుల శిష్యులం అనే ఒక సమిష్టి ఆధ్యాత్మిక కుటుంబంగా, మన గురువు మనలో అమర్చిన మరియు అన్ని వేళలా ఆయన సంస్థకు ప్రాణం మరియు శక్తి అని ప్రవచించిన–ఆ ఉత్సాహంతో, మనం కలిసి ఈ వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క మహత్తర కార్యాన్ని, దివ్య ప్రేమతో, ఆనందంతో మరియు అహం-సమర్పణతో ముందుకు తీసుకెళ్లగలం అనే విషయానికి మీ అంగీకారాన్నీ తీసుకుంటూ, మీ చరణ ధూళిని స్వీకరిస్తున్నాను. జై గురు! జై మా!”

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ఆధ్యాత్మిక కుటుంబానికి, స్వామి చిదానంద ఈ క్రింద సందేశాన్ని ఇవ్వదలచారు:

“ప్రియమైన భక్తులారా, భగవంతుని మరియు గురుదేవుని ప్రేమతో మీ అందరికీ వందనములు, మరియు మనం అందరం క్రియాయోగా ధ్యానం అనే ఈ ధన్య మార్గంలో మరియు పరమహంస యోగానందగారు మనకు తీసుకువచ్చిన దైవ అనుసంధానంతో, నడవడానికి నేను వారి దీవెనలను కోరుతున్నాను. ఆయన పేరుతో, మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం దొరికినందుకు వినమ్రతతో కూడిన కృతజ్ఞతను తెలుపుతున్నాను. అదే విధంగా వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ఆశ్రమాలలో ఉన్న సన్యాసులు మరియు సన్యాసినులు కూడా మీకు కృతజ్ఞత తెలుపుతున్నారు. భగవంతుని అన్వేషణ కొరకు ప్రపంచవ్యాప్తంగా–భక్తులుగా గాని సన్యాసులుగా గాని–ఈ శిక్షణ యొక్క ఆధ్యాత్మిక దీవెనల కొరకు మరియు మన సొంత సాధనను బలపరచుకోడానికి మరియు భగవంతుడు మరియు మహాత్ములతో అంతర్గత సంధానం కొరకు కృతజ్ఞతతో ఐక్యమౌదాం. మీలో ప్రతి ఒక్కరూ వారి అంతులేని దీవెనలను అనుభూతి చెందుదురు గాక. జై గురు!”

ఇతరులతో పంచుకోండి