యోగం యొక్క హృదయంలో ఏముంది?

"ఆత్మను పరమాత్మతో కలపటమే యోగం – అందరూ కోరుకుంటున్న మహానందంతో పునఃకలయిక. ఇది అద్భుతమైన నిర్వచనం కదా? పరమాత్మ నిత్యనూతన ఆనందంలో మీరు అనుభవించే సంతోషం అన్ని ఇతర సంతోషాల కంటే ఉన్నతమైనదని మీరు విశ్వసిస్తారు, మిమ్మల్ని ఇంక ఏదీ కుంగదీయలేదు."

—శ్రీ పరమహంస యోగానంద

ప్రాచీన కాలం నుండి భారతదేశ యోగశాస్త్రం యొక్క హృదయంలో ధ్యానం ప్రధానమైనది. దీని ఉద్దేశ్యాన్ని యోగం అనే పదం యొక్క సాహిత్యపరమైన అర్థంలో కనుగొనవచ్చు: “కలయిక”- అనంతము, శాశ్వతము అయిన ఆనందం లేదా పరమాత్మతో మన వ్యక్తిగత చైతన్యం లేదా ఆత్మ యొక్క కలయిక.

పరమాత్మ యొక్క ఆనంద చైతన్యంతో ఈ ఐక్యతను సాధించడానికి – తద్వారా అన్ని రకాల బాధల నుండి మనం స్వాతంత్రం పొందడానికి – కాలపరీక్షలకు నిలిచిన క్రమమైన ఒక ధ్యాన ప్రక్రియను అనుసరించి ఓర్పుతో సాధన చేయటం అవసరం. అంటే మనం ఒక శాస్త్రాన్ని అన్వయించుకోవాలి.

రాజ (రాజోచితమైన) యోగం అనేది భగవత్ సాక్షాత్కారానికి సంబంధించిన సంపూర్ణ శాస్త్రం – యోగ గ్రంథాలలో సూచించబడిన విధంగా దశల వారీ క్రమపద్ధతిలో ధ్యానం మరియు విహిత కర్మాచారణ, సహస్రాబ్దులుగా ఇవి భారతదేశ సనాతన ధర్మానికి (“శాశ్వతమైన మతం”) అవసరమైన అభ్యాసాలుగా అందించబడ్డాయి. ఈ కాలాతీత సార్వజనీన యోగశాస్త్రం నిజమైన అన్ని మతాల నిగూఢమైన బోధనల హృదయానికి మూలాధారం వంటిది.

యోగదా సత్సంగ రాజయోగ బోధనలు శరీరం, మనస్సు మరియు ఆత్మల పరిపూర్ణమైన వికాసానికి దారితీసే జీవన విధానాన్ని బోధిస్తాయి, ఈ విధానానికి ఆధారమైన క్రియాయోగం, కృష్ణ భగవానుడు సంక్షిప్తంగా ప్రస్తావించినది, భగవద్గీత మరియు పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో చెప్పబడిన ప్రాణాయామ (ప్రాణ-శక్తి నియంత్రణ) ప్రక్రియను కలిగి ఉంటుంది. అనేక శతాబ్దాలుగా మానవాళికి దూరమైన క్రియాయోగం మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు, స్వామి శ్రీయుక్తేశ్వర్, మరియు పరమహంస యోగానంద వంటి ప్రఖ్యాత గురువుల ద్వారా ఆధునిక యుగంలో పునరుద్ధరించబడింది.

క్రియాయోగ శాస్త్రాన్ని పాశ్చాత్య దేశాలకు తీసుకురావడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేయటానికి పరమహంస యోగానందగారు తన పూజనీయ గురువులచే ఎంపిక చేయబడ్డారు; ఈ ప్రయోజనం కోసమే ఆయన 1920లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్‌ని స్థాపించారు.

యోగదా సత్సంగ పాఠాలలో పరమహంస యోగానందగారు బోధించిన శాస్త్రీయ ధ్యాన ప్రక్రియల యొక్క దైనందిన అభ్యాసం సంతులిత క్రియాయోగ మార్గంలో ప్రధానమైనది. ధ్యానాన్ని అభ్యసించడం ద్వారా శరీరం మరియు మనస్సు యొక్క అశాంతిని ఎలా నిలుపుదల చేయాలో మనం నేర్చుకుంటాము, తద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏమి జరిగినా స్వభావరీత్యా చెదరని శాశ్వత శాంతి, ప్రేమ, జ్ఞానం మరియు ఆనందమును మనం అనుభవించవచ్చు.

"ఎక్కువగా ధ్యానించండి. అది ఎంత అద్భుతమో మీకు తెలియదు. డబ్బు లేదా మానవ ప్రేమ లేదా మీరు ఆలోచించగలిగే మరేదైనా కోరుకుంటూ గంటలు గడపడం కంటే ధ్యానం చేయడం చాలా గొప్పది. మీరు ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే మరియు మీ మనస్సు అంత ఎక్కువగా కార్యకలాపాల సమయంలో ఆధ్యాత్మిక స్థితిలో కేంద్రీకృతమై ఉంటుంది, మీరు అంత ఎక్కువగా నవ్వగలుగుతారు, నేను ఎప్పుడూ ఆ భగవంతుని ఆనంద-చైతన్యంలో ఉంటాను, ఏదీ నన్ను ప్రభావితం చేయదు; నేను ఒంటరిగా ఉన్నా లేదా ప్రజలతో ఉన్నా, భగవంతుని ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది. నేను నా చిరునవ్వును నిలుపుకున్నాను-కానీ దానిని శాశ్వతంగా గెలవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది! అవే చిరునవ్వులు మీలోనూ ఉన్నాయి; అదే సంతోషం మరియు ఆత్మానందము కూడా ఉన్నాయి. మీరు వాటిని సంపాదించాల్సిన అవసరం లేదు, బదులుగా వాటిని తిరిగి పొందండి."

—శ్రీ పరమహంస యోగానంద

ఇతరులతో షేర్ చేయండి