శ్రీ శ్రీ పరమహంస యోగానంద

శ్రీ శ్రీ పరమహంస యోగానందశ్రీ శ్రీ పరమహంస యోగానందగారు (1893 – 1952) ఆధునిక కాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తులలో ఒకరిగా గుర్తింపు పొందారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన ఆధ్యాత్మిక ప్రామాణిక గ్రంథం, ‘ఒక యోగి ఆత్మ కథ’ రచయిత అయిన ఈ ప్రియతమ జగద్గురువు, లక్షలాది పాఠకులను తూర్పు యొక్క నాశ రహిత శాశ్వత జ్ఞానాన్ని పరిచయం చేశారు. ఇప్పుడు పడమటి దేశాలలోనూ ఆయన యోగ శాస్త్ర పితామహునిగా విస్తృతంగా గుర్తించబడ్డారు. పరమహంస యోగానందగారు 1917లో ‘యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా’ను, 1920లో ‘సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్’ను స్థాపించారు. శ్రీ శ్రీ మృణాళినీమాతగారి తరువాత ఐదవ అధ్యక్షునిగా ఉన్న శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరిగారి నాయకత్వంలో ఈ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా యోగానందగారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి.

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు తమ సమగ్రమైన బోధనలతో లక్షలాది మంది జీవితాలను గాఢంగా ప్రభావితం చేశారు, వారి బోధనలు:

  • క్రియా యోగ శాస్త్రం మరియు ధ్యానం,
  • నిజమైన మత విశ్వాస మార్గాల యొక్క అంతర్లీనమైన ఐక్యత,
  • సంతులిత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు పొందడం అనే కళ.

పరమహంస యోగానందగారి బోధనలు మరియు వారు నేర్పిన ధ్యాన పద్ధతులు ఇప్పుడు వీటి ద్వారా అందుబాటులో ఉన్నాయి:

  • యోగదా సత్సంగ పాఠాలు, యోగానందులు స్వయంగా ఆరంభించిన సమగ్ర గృహ-అధ్యయన పాఠాల పరంపర;
  • బోధనలను భారతదేశం మరియు ఇతర దేశాలలో విస్తరించడానికి ఆయన స్థాపించిన సంస్థ వై.ఎస్.ఎస్. నుండి పుస్తకాలు, రికార్డింగ్‌లు మరియు ఇతర ప్రచురణలు;
  • దేశవ్యాప్తంగా వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు మరియు ధ్యాన కేంద్రాలలో యోగదా సన్యాసులు నిర్వహించే కార్యక్రమాలు.

Share this on

Share on facebook
Share on twitter
Share on whatsapp