ఆన్‌లైన్ ధ్యానం మరియు ప్రత్యేక కార్యక్రమాల క్యాలెండర్

నవీకరణ:

శ్రీ స్వామి చిదానందగారితో ఐదు రోజుల సంగమం ఫిబ్రవరి 12, ఆదివారం ప్రారంభమవుతున్న కారణంగా ఫిబ్రవరి 11 నుండి 17 వరకు వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం నిర్వహించే ఆన్‌లైన్ ధ్యానాలు నిర్వహించబడవు.

ఫిబ్రవరి 10, శుక్రవారం సాయంత్రం జరిగే ధ్యానంతో కార్యక్రమాలన్నీ నిలిపివేయబడతాయి, మళ్ళీ ఫిబ్రవరి 18 శనివారం ఉదయం జరిగే ధ్యానంతో తిరిగి ప్రారంభమవుతాయి.

రాబోవు ఆన్‌లైన్ కార్యక్రమాలు

స్వాగతం! ధ్యానం లేదా కార్యక్రమంలో చేరడానికి క్యాలెండర్‌లోని కార్యక్రమం పేరుపై క్లిక్ చేయండి.

మీరు ఆన్‌లైన్ ధ్యానం లేదా కార్యక్రమంలో ఎలా చేరాలి అనే దాని గురించి మరింత సమాచారం కావాలనుకుంటే, దయచేసి మా ఆన్‌లైన్ ధ్యానంలో పాల్గొనడం ఎలా పేజీని సందర్శించండి.

దిగువ క్యాలెండర్‌లోని అన్ని సమయాలు మీ స్థానిక సమయంలో జాబితా చేయబడ్డాయి. 

క్యాలెండర్ లో కనిపించే టైమ్ జోన్ ‌ను మార్చడానికి, క్యాలెండర్ యొక్క కుడివైపు దిగువ మూలలో ఎగువన ఉన్న టైమ్ జోన్ పేరుపై క్లిక్ చేసి “Show All Time zones”, అనే పెట్టెను ఎంచుకోండి. మీరు చూడాలనుకుంటున్న టైమ్ జోన్ ‌ను ఎంచుకుని OK (సరే) నొక్కండి.

ఆన్‌లైన్ ప్రణామి

వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం యొక్క నిర్వహణ, వృద్ధి కేవలం యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు విరాళాల ద్వారా వచ్చే నిధులతోనే జరుగుతుంది. ఈ పనికి మద్దతు ఇవ్వడంలో మీ దాతృత్వం చాలా ప్రశంసార్హమైనది, అత్యవసరమైనది.

ఎక్కువైనా, తక్కువైనా వారికున్నది ఇచ్చి పంచుకునే వారు శ్రేయస్సును చేకూరుస్తారు. అదే దేవుని నియమం. 

— పరమహంస యోగానంద

ఇతరులతో షేర్ చేయండి