YSS

వ్యాఖ్యలు మరియు సమీక్షలు

ఆకర్షణీయంగా, వినోదాత్మకంగా మరియు జ్ఞానోదయం

"ఒక యోగి ఆత్మకథ న్యాయబద్ధంగా ఇప్పటివరకు గొప్పగా వ్రాయబడిన, అత్యంత వినోదం మరియు జ్ఞానోదయం కలిగించే ఆధ్యాత్మిక పుస్తకాలలో ఒకటిగా పరిగణించబడుతోంది."

— టామ్ బట్లర్-బౌడన్, రచయిత,
50 ఆధ్యాత్మిక ప్రామాణిక గ్రంథాలు: 50 గొప్ప గ్రంథాల నుండి సనాతనమైన జ్ఞానం, అంతరంగ ఆవిష్కరణ, జ్ఞానోదయం మరియు ప్రయోజన

"ఒక యోగి ఆత్మకథ వంటి సుందరమైన, గాఢమైన, సత్యనిష్ఠమైన గ్రంథం నేటి పాఠకుడికి చాలా అరుదుగా లభిస్తుంది.....అది జ్ఞానపూర్ణమైనది మరియు ఎన్నో వ్యక్తిగత అనుభవాలతో ఐశ్వర్యవంతమైనది...."

— లా పాజ్, బొలీవియా

"చాలా మనోహరమైన శైలిలో...యోగానందగారు యోగాన్ని గురించి నిశ్చయమైన పద్ధతిలో అందించారు మరియు 'ఎగతాళి చేయడానికి' వచ్చిన వారు 'ప్రార్థించడానికి' ఉండిపోవచ్చు."

— శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్

"పూర్తిగా వ్యక్తపరుస్తుంది...తనను తాను బాగా అర్థం చేసుకోవడంలో మానవజాతికి సహాయపడుతుంది...ఆత్మకథ చాలా ఉత్తమంగా...ఉత్కంఠభరితంగా ఉంటుంది...రమణీయముగా, చమత్కారముగా మరియు గొప్ప చిత్తశుద్ధితో చెప్పబడింది...నవల వలె మనోహరంగా ఉంటుంది."

— న్యూస్-సెంటినెల్, ఫోర్ట్ వేన్, ఇండియానా

"ప్రతి సంవత్సరం ప్రచురించబడే వేలాది పుస్తకాలలో, వినోదాన్ని అందించేవి, బోధించేవి, మెరుగుపరిచేవి ఉంటాయి. ఈ మూడింటినీ అందించేది దొరికితే ఒక పాఠకుడు తనను తాను అదృష్టవంతుడిగా భావించవచ్చు. ఒక యోగి ఆత్మకథ ఇప్పటికీ చాలా అరుదైనది. మనస్సు మరియు ఆత్మ యొక్క కిటికీలను తెరిచే పుస్తకం."

— ఇండియా జర్నల్

అత్యధికంగా విక్రయించబడుతున్న ఆధ్యాత్మిక మార్గదర్శి

"దశాబ్దాల తర్వాత కూడా, అత్యధికంగా విక్రయించబడుతున్న మా పుస్తకాలలో ఒక యోగి ఆత్మకథ ఒకటిగా ఉంది. ఇతర పుస్తకాలు వచ్చి వెళ్ళిపోతున్నప్పటికీ ఇది కొనసాగుతోంది, ఎందుకంటే, కాలక్రమేణా విమర్శనాత్మక విచారణలో తెలిసిందేమిటంటే అది ఆధ్యాత్మిక సాఫల్యానికి మార్గాన్ని తీక్షణంగా మరియు ఉత్కృష్టంగా తెరుస్తుందని."

— బోధి ట్రీ బుక్ స్టోర్, లాస్ ఏంజిలిస్

"ఈ అగాధమైన సాహిత్య రచన ద్వారా, ఆధ్యాత్మిక మార్గంలో జీవితం ప్రభావితం కానివారిని కనుగొనడం మీకు అతి కష్టంగా ఉంటుంది. ఇది ఈ రోజు వరకు కొనసాగిన యోగము, ధ్యానము మరియు ఆత్మ-అన్వేషణ మార్గంలో నాకు శ్రీకారం చుటింది."

— జాక్ కాన్ఫీల్డ్, చికెన్ సూప్ ఫోర్ ది సోల్ ® సిరీస్ సహ-సృష్టికర్త

"ఇది పాఠకుణ్ణి వశపరుచుకొనే గ్రంథం, ఎందువల్లనంటే ప్రతి మనిషి హృదయంలో నిద్రాణమై ఉన్న ఆశలను, అభిలాషలను ఇది మేలుకొల్పుతుంది."

— ఇల్ టెంపో డెల్ లునేడి, రోమ్

"మొదట 1946లో ప్రచురించబడింది మరియు తరువాత రచయితచే విస్తరించబడింది, ఇది ప్రపంచ ఆధ్యాత్మిక సాహిత్యంలో అత్యంత ముఖ్యమైన గ్రంథాలలో ఒకటి, ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక జీవితం యొక్క సారాన్ని తెలియజేస్తుంది."

— ది శాంటా ఫే సన్

"అతి మనోహరంగాను మరియు సాధారణంగాను చెప్పిన ఆత్మకథల్లో ఇది ఒకటి...నేర్చుకొనేవారికి నిజమైన జ్ఞానభాండాగారం...ఈ పేజీల్లో మనం కలుసుకొనే వ్యక్తులు గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండిన ఆప్తమిత్రుల్లా మనకు తరచు జ్ఞాపకం వస్తూ ఉంటారు; అలాంటి మహానుభావుల్లో దైవోన్మత్తులైన ఈ గ్రంథకర్త కూడా ఒకరు."

— డాక్టర్ అన్నా వాన్ హెల్మ్‌హోల్ట్జ్-ఫెలన్, ఇంగ్లీష్ ప్రొఫెసర్, మిన్నెసోటా విశ్వవిద్యాలయం

భారతదేశ ఆధ్యాత్మిక సంపద గురించి అంతర్దృష్టితో కూడిన అవలోకనం

"ఒక యోగి ఆత్మకథ నవశకపు ఉపనిషత్తుగా పరిగణించబడుతోంది...ప్రపంచవ్యాప్తంగా లక్షలాది సత్యాన్వేషకుల ఆధ్యాత్మిక పిపాసను ఇది తీర్చింది... భారతదేశ సాధువులు మరియు తత్వశాస్త్రం గురించిన ఈ పుస్తకం యొక్క అపూర్వమైన ప్రజాదరణను భారతదేశంలోని మేము ఆశ్చర్యంగా మరియు ఆకర్షణతో చూశాము. భారతదేశం యొక్క సనాతన ధర్మామృతం, శాశ్వత సత్యసూత్రాలు 'ఒక యోగి ఆత్మకథ' అనే బంగారు పాత్రలో భద్రపరచబడి ఉన్నందుకు మేము అపారమైన సంతృప్తిని మరియు గర్వాన్ని అనుభవిస్తున్నాము."

— డా. అశుతోష్ దాస్, ఎం.ఏ., పి‌హెచ్.డి., ప్రొఫెసర్, కలకత్తా విశ్వవిద్యాలయం

"ఆధునిక హిందూ సాధువుల అసాధారణ జీవితాలు మరియు శక్తుల ప్రత్యక్ష సాక్షిగా, ఈ పుస్తకానికి సమయానుకూలంగా మరియు కాలానుగుణంగా ప్రాముఖ్యత ఉంది.... పశ్చిమంలో ప్రచురించబడిన ఆయన అసాధారణ జీవితం ఖచ్చితంగా భారతదేశ ఆధ్యాత్మిక సంపదలోని అత్యంత జ్ఞానాన్ని తెలియపరుస్తుంది...."

— డబల్యూ . వై. ఎవన్స్- వెంట్జ్, ఎం.ఏ., డి.లిట్ట్., డి.ఎస్‌సి., ప్రఖ్యాత పండితుడు మరియు తూర్పు మతంపై అనేక పుస్తకాల రచయిత

"యోగానందగారు, మరణంలేని సాధువుల గురించి, అద్భుతంగా రోగాల్ని నయం చేయడం గురించి, భారతదేశపు జ్ఞానాన్ని లేదా యోగ శాస్త్రాన్ని గురించి చెప్పినా, పాఠకుడు సమ్మోహితుడు చెందడం ఖాయం."

— డీవెల్ట్వాష్, జూరీచ్, స్విట్జర్లాండ్

అన్ని మతాల యొక్క ఆధ్యాత్మిక మూలం

"అంతిమంగా, అంతరిక్షంలో తిరుగుతున్న ప్రపంచాల నుండి మానవ జీవితంలోని అతిచిన్న వివరాల వరకు, పరస్పర విరుద్ధముకాని మరియు సహజావబోధనతో కూడిన సంతృప్తికరమైన, విశ్వం యొక్క వర్ణన."

— రన్నర్స్ వరల్డ్

"ప్రఖ్యాతి గాంచిన ఒక యోగి ఆత్మకథలో, యోగానందగారు, యోగసాధనలో ఉన్నతస్తరాల్లో సాధకుడు పొందే 'విశ్వచేతనానుభవాన్ని' మనం నిర్ఘాంతపోయే మాటల్లో వర్ణించారు; మానవ స్వభావంలోని వివిధ ఆసక్తికరమైన అంశాలమీద యోగపరమైన, వేదాంతపరమైన దృష్టికోణంనుంచి అనేక వ్యాఖ్యానాలు చేశారు."

— రాబర్ట్ ఎస్. ఎల్‌వుడ్, పి‌హెచ్.డి, ఛైర్మన్, స్కూల్ ఆఫ్ రిలిజియన్, యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా

"ఆత్మకథ యొక్క పూర్తి ప్రామాణికతకు కొన్ని సమాంతరాలు ఉన్నాయి, మీ మత విశ్వాసాలతో సంబంధం లేకుండా మీలోకి చొచ్చుకుపోతుందని హామీ ఇవ్వబడింది."

— బ్రాంచెస్

పత్రికా సమీక్షలు

పరమహంస యోగానందగారి ఒక యోగి ఆత్మకథ యొక్క 75వ వార్షికోత్సవంలో భాగంగా, ఈ పుస్తకం మీ జీవితంపై చూపించిన ప్రభావాన్ని వ్యక్తిగతంగా పంచుకోవడం ద్వారా పుస్తకం యొక్క శాశ్వత వైభవ ఘనతలో పాల్గొనడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

Share this on

Share on facebook
Share on twitter
Share on whatsapp