శ్రీ శ్రీ పరమహంస యోగానంద రచనల నుండి సారాంశాలు

కొన్ని గ్రంథాలలోని భగవంతుడు పగతీర్చుకునే స్వభావం ఉన్న దేవుడు, మనలను శిక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కానీ మనకు దేవుని యొక్క నిజమైన స్వభావాన్ని ఏసు చూపించాడు….ఆయన తన శత్రువులను “పన్నెండు మంది దేవదూతలతో” నాశనం చేయలేదు, కానీ దివ్య ప్రేమ యొక్క శక్తితో చెడును జయించాడు. ఆయన చర్యలు భగవంతుని యొక్క అత్యున్నత ప్రేమను మరియు దేవునిలో ఐక్యం చెందినవారి ప్రవర్తనను ప్రదర్శించాయి.

నీటిపై తేలుతున్న పువ్వు“ఏ గాయమునైనా క్షమించాలి,” అని మహాభారతం చెబుతుంది. “క్షమించడం వల్లనే మానవజాతి కొనసాగుతుందని చెప్పబడింది. క్షమ పవిత్రత; క్షమ ద్వారా విశ్వం కలిసి ఉంటుంది. క్షమ బలవంతుల బలం; క్షమ త్యాగం; క్షమ మనస్సు యొక్క నిశ్శబ్దం. క్షమ మరియు సౌమ్యత స్వయం సంపన్నుల గుణాలు. అవి శాశ్వతమైన ధర్మాన్ని సూచిస్తాయి.”

“అప్పుడు పీటర్ ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ, నా సోదరుడు నా పట్ల చేసిన పాపాన్ని ఎన్నిసార్లు నేను అతనిని క్షమించవచ్చు? ఏడు సార్లు వరకు? అని అడిగెను. ఏసు అతనితో, “నేను నీతో ఏడు సార్లు అని చెప్పలేదు, అది డెబ్బై సార్లు ఏడు,” అని చెప్పాడు. ఈ కఠినమైన సలహాను అర్థం చేసుకోవడానికి నేను గాఢంగా ప్రార్థించాను. “ప్రభూ,” నేను దృఢంగా అడిగాను, “ఇది సాధ్యమేనా?” దివ్యవాణి చివరకు ప్రతిస్పందించినప్పుడు, అది వినయపూర్వకమైన కాంతి ప్రవాహాన్ని తీసుకువచ్చింది: “ఓ మనిషీ, నేను మీలో ప్రతి ఒక్కరినీ రోజూ ఎన్నిసార్లు క్షమిస్తుంటాను?”

మన [తప్పు] ఆలోచనలన్నిటినీ తెలిసి కూడా భగవంతుడు నిరంతరం మనల్ని క్షమిస్తున్నట్లుగా, ఆయనతో పూర్తిగా అనుసంధానం పొందిన వారికి సహజంగా అంతే ప్రేమ ఉంటుంది.

ఇతరుల హృదయాల నుండి అన్ని బాధలను దూరం చేసే సానుభూతి మీ హృదయంలో ఉండాలి, ఆ సానుభూతి ఏసు ఇలా చెప్పడానికి వీలు కల్పించింది: “తండ్రీ, వారిని క్షమించు; ఎందుకంటే వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు.” ఆయన మహోన్నతమైన ప్రేమ అందరినీ ఆవరించింది. ఆయన తన శత్రువులను ఒక్క చూపుతో నాశనం చేయగలడు. అయినా దేవుడు మన దుష్ట ఆలోచనలన్నీ తెలిసినప్పటికీ మనల్ని నిరంతరం క్షమిస్తున్నట్లుగా, అతనితో అనుసంధానమై ఉన్న మహాత్ములు మనకు అదే ప్రేమను ఇస్తారు.

మీరు క్రీస్తు చైతన్యాన్ని పెంపొందించుకోవాలంటే, సానుభూతితో ఉండడం నేర్చుకోండి. ఇతరుల పట్ల నిజమైన భావన మీ హృదయంలోకి వచ్చినప్పుడు, మీరు ఆ గొప్ప చైతన్యాన్ని వ్యక్త పరచడం ప్రారంభిస్తారు….శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: “మనుష్యులందరినీ సమ దృష్టితో చూసేవాడే అత్యున్నతమైన యోగి….”

కోపం మరియు ద్వేషం ఏమీ సాధించలేవు. ప్రేమ ప్రతిఫలమిస్తుంది. మీరు ఎవరినైనా దూషించవచ్చు, కానీ ఆ వ్యక్తి మళ్ళీ లేచిన తర్వాత మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మీరు అతనిని ఎలా జయిస్తారు? మీరు జయించలేదు. జయించాలంటే ప్రేమ ఒక్కటే మార్గం. మరియు మీరు జయించలేని చోట, మౌనంగా ఉండండి లేదా దూరంగా ఉండండి మరియు అతని కోసం ప్రార్థించండి. మీరు ప్రేమించవలసిన మార్గం అదే. దీన్ని మీ జీవితంలో ఆచరిస్తే, అవగాహనకు అతీతమైన శాంతిని మీరు పొందుతారు.

ప్రతిజ్ఞ

ప్రతిజ్ఞ సిద్ధాంతం మరియు సూచనలు

“ఈ రోజు నన్ను బాధపెట్టిన వారందరినీ నేను క్షమిస్తాను. దాహంతో ఉన్న హృదయాలన్నిటికీ, నన్ను ప్రేమించేవారికి మరియు నన్ను ప్రేమించనివారికి కూడా నేను నా ప్రేమను అందిస్తాను.”

మరింతగా అన్వేషించడానికి

ఇతరులతో షేర్ చేయండి