ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ — తరచుగా అడిగే ప్రశ్నలు

YSS-SRF-App-Responsive-Devices-July29-2022 (1)

ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ ప్రతి ఒక్కరి కోసం — మీరు పరమహంస యోగానందగారి బోధనలకు కొత్తవారైనా లేదా దశాబ్దాలుగా ఈ గొప్ప బోధకుని జ్ఞాన ధారలో మునిగిపోయినవారైనా సరే. ధ్యానం, క్రియాయోగా శాస్త్రం మరియు ఆధ్యాత్మిక సమతుల్య జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆచరణాత్మక మార్గాల గురించి మరింత తెలుసుకోవాలనుకునే ఎవరికైనా ఇది ఉపయుక్తంగా ఉంటుంది.

వై.ఎస్.ఎస్. గురించి సాధారణ FAQ (తరచుగా అడిగే ప్రశ్నలు) కోసం చూస్తున్నారా?

దిగువ FAQలు (తరచుగా అడిగే ప్రశ్నలు) ప్రత్యేకంగా వై.ఎస్.ఎస్. యాప్ ‌కి సంబంధించినవి, మీరు వై.ఎస్.ఎస్. మరియు ఈ బోధనల కోసం సాధారణ FAQ (తరచుగా అడిగే ప్రశ్నలు) కోసం చూస్తున్నట్లయితే, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

యాప్ లోని ప్రధానమైన విషయాలు/అందించే సౌకర్యాలు, ఉపయోగపడే పరికరాల అవలోకనం

ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి?

వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులు వారి సంబంధిత డివోటీ పోర్టల్ (Devotee portal) వివరాల ఆధారంగా లాగిన్ అవ్వడానికి మరియు వారు సబ్ ‌ఎంచుకున్న భాష(ల)లో వారి పాఠాలను యాక్సెస్ చేయడానికి ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ అనుమతిస్తుంది. వినియోగదారులందరూ, వారు పాఠాల విద్యార్థా కాదా అనే దానితో సంబంధం లేకుండా, ఆన్‌లైన్ ధ్యానాలు, నిర్దేశిత ధ్యానాలు మరియు వై.ఎస్.ఎస్. వార్తలు మరియు బ్లాగ్ పోస్ట్ ‌ల వంటి ఇతర డిజిటల్ వనరులను యాక్సెస్ చేయవచ్చు.

పాఠాల డిజిటల్ ఫార్మాట్ అదనపు వనరుగా అందించబడుతుంది తప్ప పేపర్ లెసన్స్ ‌కు బదులుగా కాదు. పాఠాల డిజిటల్ వెర్షన్ ను ప్రింటెడ్ వెర్షన్ ‌తో కలిపి తెలివిగా ఉపయోగించినప్పుడు విద్యార్థికి అనేక ప్రయోజనాలు సమకూరుతాయి. వై.ఎస్.ఎస్. పాఠాలలో అంతర్లీనంగా ఉన్న సత్యాలు, దైవిక స్పృహ ద్వారా మీరు అధ్యయనం చేయడానికి, సమీకరించుకోవడానికి, ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందడానికి ఉత్తమమైన విధానాన్ని కనుగొనడంలో వివేకాన్ని ఉపయోగించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.

యాప్ లోని కొన్ని ముఖ్యాంశాలు:

  • మా కొత్త eReader ను ఉపయోగించుకుని పాఠాలను చదవండి. ఇందులో అనేక మెరుగైన అంశాలు ఉన్నాయి: టెక్స్ట్-టు-స్పీచ్ ఫంక్షనాలిటీ, ల్యాండ్ ‌స్కేప్ రీడింగ్, అనేక హైలైట్ రంగులు, పదాల శోధనలు, ఫ్లాష్ ‌కార్డ్ సృష్టి వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి!
  • మీ నిర్దిష్ట అవసరాలు మరియు ఆసక్తులపై మార్గదర్శకాలను సులభంగా యాక్సెస్ చేయడానికి టాపిక్ వారీగా అనుబంధ పాఠాలను బ్రౌజ్ చేయండి.
  • study.yssofindia.orgలో మా డెస్క్ ‌టాప్ బ్రౌజర్ రీడర్ ‌ను ఉపయోగించండి. ఇది మొబైల్ యాప్ నుండి మీ రీడింగ్ లొకేషన్, బుక్ ‌మార్క్ ‌లు మరియు హైలైట్ ‌లతో ఆటోమేటిక్ ‌గా సింక్ అవుతుంది.
  • వై.ఎస్.ఎస్. నుండి తాజా వార్తలు మరియు బ్లాగ్ ఎంట్రీల గురించి నిరంతరం తెలుసుకుంటూ ఉండండి.
  • యాప్ నుండి నేరుగా రోజువారీ ఆన్‌లైన్ ధ్యానాలలో చేరండి.
  • వివిధ అంశాలపై నిర్దేశిత ధ్యానాలను అనుభవించండి. ఇప్పుడు మీ షెడ్యూల్ ‌కు అనుగుణంగా వివిధ సమయాలలో కూడా ఇది అందించబడుతుంది.

ఏ రకమైన పరికరాలు ఉపయుక్తంగా ఉంటాయి?

యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ ‌ఫారమ్ ‌లలో అందించబడింది. డెస్క్ ‌టాప్ బ్రౌజర్‌లలో కూడా పాఠాలు అందుబాటులో ఉన్నాయి.

  • ఆండ్రాయిడ్ యాప్ కి అయితే:
    • ఆండ్రాయిడ్ వెర్షన్ 6.0 మరియు అంతకంటే ఎక్కువ ఉన్న డివైజ్ కావాలి
    • Google Play Store మరియు Google Play సేవలు పరికరంలో ఇన్ ‌స్టాల్ చేయబడి ఉండాలి.
  • iOS యాప్ కి అయితే :
    • iOS వెర్షన్ 13.0 మరియు అంతకంటే ఎక్కువ ఉండాలి.
    • iPhone: iPhone 6S మరియు అంతకంటే లేటెస్ట్ వెర్షన్ అయి ఉండాలి.
    • iPad: అన్ని పరిమాణాలు ఉపయోగపడతాయి.
  • డెస్క్ ‌టాప్ బ్రౌజర్ అయితే :
    • అన్ని ప్రధాన బ్రౌజర్‌లు: Chrome, Safari, Firefox, Microsoft Edge ఏవైనా ఫర్వాలేదు.

ప్రస్తుతానికి ఈ క్రింది పరికరాలు ఉపయోగపడవు :

  • అమెజాన్ ఫైర్ టాబ్లెట్ ‌లు
  • ఆండ్రాయిడ్ ఇన్స్టంట్ యాప్ ‌లు
  • గూగుల్ క్రోమ్ బుక్ యాప్ ‌లు

నేను నా కంప్యూటర్ లేదా విండోస్ పరికరంలో పాఠాలను చదవవచ్చా?

అవును! విద్యార్థులు ఇప్పుడు study.yssofindia.orgకి వెళ్ళి వారి డీవోటీ పోర్టల్ (Devotee portal) వివరాల ఆధారంగా లాగిన్ చేయడం ద్వారా వారి కంప్యూటర్‌లలో వారి పాఠాలను యాక్సెస్ చేయవచ్చు.

ఏఏ భాషలలో అందుబాటులో ఉంది?

అప్లికేషన్ (యాప్) భాష: ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది. యూజర్ ఇంటర్ ఫేస్ మరియు పాఠ్యేతర అంశాలను మీరు కోరుకున్న భాషలో వీక్షించడానికి, దయచేసి ‘నా కోసం’ (For me) విభాగంలో యాప్ భాష (App Language) ను ఎంచుకోండి. పాఠ్యేతర విషయాలైన వార్తల పోస్ట్ ‌లు, ఆయా భాషలలో జరిగే ఆన్‌లైన్ ధ్యాన తరగతుల వివరాలు, నిర్దేశిత ధ్యానాలు, ప్రతి వారం సత్సంగాలు, గీతా ప్రసంగాలు, సంగమాలు మరియు సమ్మేళనాల నుండి సత్సంగాలతో కూడి ఉంటుంది.

పాఠాల భాష: యాప్ ‌లోని వై.ఎస్.ఎస్. పాఠాలు ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో అందించబడుతున్నాయి. ఏదైనా భాషలో వీక్షించడానికి, ఒకరు ముందుగా పాఠాల విద్యార్థిగా నమోదు చేసుకోవాలి (దయచేసి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి). ‘నా కోసం (For me)’ విభాగానికి వెళ్ళి, ‘పాఠాల భాష (Lessons Language)’ ని ఎంచుకోవడం ద్వారా యాప్ ‌లో పాఠాల భాషను ఎంపిక చేసుకోవచ్చు.

para-ornament

పాఠాల నమోదు, లాగిన్ చేయడం, అతిథి పద్ధతి (Guest Mode)

నేను యాప్ ‌లో నా పాఠాలను యాక్సెస్ చేయలేకపోతున్నానెందుకు?

  • లాగిన్ చెయ్యడానికి, విషయాన్ని యాక్సెస్ చేయడానికి మీరు ఆన్‌లైన్ ‌లో ఉన్నారో, లేదో నిర్ధారించుకోండి.
  • మీరు యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న నిర్దిష్ట సిరీస్ కోసం మీరు నమోదు చేసుకున్నారో, లేదో నిర్ధారించుకోండి. ప్రాథమిక తరగతులకు, తదనంతర తరగతులకు వేర్వేరుగా నమోదు చేసుకోవాలి.
  • ఈ యాప్, పాఠాల కొత్త ఎడిషన్ ‌కు మాత్రమే యాక్సెస్ ‌ఇస్తుంది. మీరు పాఠాల కొత్త ఎడిషన్ ‌కు సభ్యత్వం పొందకపోతే, దయచేసి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ సందర్శించండి.
  • మీరు మీ పాస్‌వర్డ్ ‌ను మరచిపోయినట్లయితే, మీ పాస్‌వర్డ్ ‌ని రీసెట్ చేయడానికి లాగిన్ స్క్రీన్ ‌పై ‘పాస్‌వర్డ్ మర్చిపోయారా? (Forgot Password?)’ని క్లిక్ చేయండి.
  • మీకు ఇంకా సమస్య ఉంటే, దయచేసి మా హెల్ప్ డెస్క్ ‌ని సంప్రదించడానికి యాప్ యొక్క ‘నా కోసం (For Me)’ పేజీలోని ‘మద్దతు (Support)’ బటన్ ‌ను ఉపయోగించండి. దీనివల్ల మీకు మరింత సహాయం అందించటానికి మాకు వీలవుతుంది. మీరు యాప్ ‌ను ఇన్ ‌స్టాల్ చేయలేకపోతే, దయచేసి [email protected]కు ఇమెయిల్ చేయండి. మెయిల్ లో మీ సమస్యను స్పష్టంగా వివరించండి. దయచేసి మీ పేరు మరియు మీ ఖాతాతో అనుసంధానించబడిన ఇమెయిల్ చిరునామాను చేర్చాలని గుర్తుంచుకోండి.

నేను యాప్‌లోని పాఠాలను ఎప్పుడు యాక్సెస్ చేయగలను?

యాప్ ‌లో నిర్దిష్ట పాఠం ఇంకా అందుబాటులో లేకుంటే, అది లభ్యమయ్యే తేదీ చూపబడుతుంది.

నేను ఇంగ్లీష్ మరియు హిందీ (లేదా తమిళం/తెలుగు) పాఠాలకు సభ్యత్వం పొందాను. కానీ ఇంగ్లీష్ పాఠాలను మాత్రమే చూడగలుగుతున్నాను. నేను నా హిందీ (లేదా తమిళం/తెలుగు) పాఠాలను ఎలా చూడగలను?

పాఠాల భాష (Lessons Language) విభాగాన్ని చూడండి.

para-ornament

యాప్ లోని వివిధ లక్షణాలను, సౌకర్యాలను అర్థం చేసుకోవడం మరియు సమస్యలను పరిష్కరించుకోవడం

పాఠాలు చదవడం కోసం ఈ-రీడర్ (eReader)

గుర్తుంచుకోదగిన అంశాలు, ముఖ్యాంశాలు

పాఠంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదాలను ఎంచుకుని 4 విభిన్న రంగుల్లో హైలైట్ చేసుకోవచ్చు. రెండు కంటే ఎక్కువ పదాలను గనుక మీరు ఎంపిక చేసుకుంటే, మీరు చివరిగా ఉపయోగించిన రంగుతో మీ ఎంపికను యాప్ స్వయంచాలకంగా హైలైట్ చేస్తుంది. మీరు ఎంపిక చేసుకున్న విషయాలు (BOOKMARKS), ప్రస్తుత పాఠంలోని ముఖ్యాంశాలు ఇన్-రీడర్ మెనూలో కనిపిస్తాయి (ఎగువన కుడివైపున ఉన్న మెనూ చిహ్నాన్ని క్లిక్ చేయండి). అన్ని పాఠాల నుండి మీరు ఎంపిక చేసుకున్న విషయాలు (BOOKMARKS), ముఖ్యాంశాలను వీక్షించడానికి, ‘నా కోసం (FOR ME)’ విభాగానికి వెళ్ళి, ‘ఎంపిక చేసుకున్న విషయాలు (BOOKMARKS) మరియు ముఖ్యాంశాలు’ ఎంచుకోండి. మీ అన్ని ఎంపిక చేసుకున్న విషయాలు (BOOKMARKS), ముఖ్యాంశాలు మీ వివిధ పరికరాలలో ఎప్పటికప్పుడు సింక్ అవుతాయి.

పాఠాల సహాయక సమాచారాన్ని యాక్సెస్ చేయడం

నిర్దిష్ట పాఠం యొక్క ల్యాండింగ్ పేజీలో ‘సహాయక సమాచారం (Auxiliary Materials)’ బటన్ ‌పై క్లిక్ చేయండి. దయచేసి “అవలోకనం,” “స్వీయ-సాక్షాత్కారం ద్వారా అత్యధిక విజయాలు” మరియు “ముందుమాట”లో సహాయక సమాచారం లేదని గమనించండి. 1వ పాఠం నుంచి సహాయక సమాచారం అందుబాటులో ఉంది.

పద శోధన (వై.ఎస్.ఎస్. పదకోశం మరియు నిఘంటువు నుండి)

eReaderలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదాలను ఎంచుకుని, దిగువ మెనులో ‘మరింత తెలుసుకోండి (Learn More)’ ని క్లిక్ చేయండి. ఇది వై.ఎస్.ఎస్. పదకోశం మరియు ప్రామాణిక నిఘంటువు రెండింటి నుండి నిర్వచనాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. అనేక పదాలను ఎంపిక చేస్తే, ఎంపిక చేసిన అన్ని పదాల యొక్క వివరాలను యాప్ అందిస్తుంది. నిఘంటువు ఫలితాల కోసం, దయచేసి ఒకసారి ఒక పదాన్ని మాత్రమే ఎంచుకోండి.

ఫ్లాష్ ‌కార్డ్ ‌లు (సృష్టించడం మరియు సమీక్షించడం)

ఫ్లాష్ ‌కార్డ్ ‌ల సృష్టి ఇప్పుడు కొత్త భావనలను నేర్చుకోవడానికి ఒక సాధనంగా అందుబాటులో ఉంది. ఫ్లాష్ ‌కార్డ్ ‌ని సృష్టించడానికి, eReader నుండి ఒక పదబంధాన్ని ఎంచుకోండి (ఇది పదబంధాన్ని హైలైట్ చేస్తుంది). ఆపై హైలైట్ చేసిన విభాగాన్ని మళ్ళీ క్లిక్ చేసి, దిగువ మెనులో ‘ఫ్లాష్ ‌కార్డ్ ‌ని సృష్టించు (Create flashcard)’ ని క్లిక్ చేయండి. ఇది మీ ఫ్లాష్ ‌కార్డ్ యొక్క “నిర్వచనాన్ని” సెట్ చేస్తుంది. సృష్టిని పూర్తి చేయడానికి ‘శీర్షిక (Title)’ ను అందించి, రంగును ఎంచుకోండి. సేవ్ చేసిన అన్ని ఫ్లాష్ ‌కార్డ్ ‌లు యాప్ ‌లోని ‘నా కోసం (FOR ME)’ విభాగంలో కనిపిస్తాయి.

టెక్స్ట్-టు-స్పీచ్ (TTS) పని చేయడం లేదు

టెక్స్ట్-టు-స్పీచ్ (TTS) కొన్ని పరికరాలలో మాత్రమే పని చేస్తుంది. భాషని బట్టి కూడా మద్దతు మారుతుంది. ఉదాహరణకు తమిళంలో TTSకి iOSలో మద్దతు లేదు.

నిర్దిష్ట ఆండ్రాయిడ్ పరికరాలలో (Samsung పరికరాలు వంటివి), డిఫాల్ట్ (లేదా ప్రాధాన్యమైనదిగా) స్పీచ్ ఇంజిన్‌ను ‘Google ద్వారా స్పీచ్ సర్వీసెస్’కి సెట్ చేయండి.

TTS మాట్లాడే స్వరాన్ని మార్చడం

లిజనింగ్ మోడ్ ‌లో ఉన్నప్పుడు, ఆడియో ప్లేయర్ మెనులో దిగువన ఎడమ మూలలో ఉన్న ప్రసంగ (Speech) చిహ్నాన్ని క్లిక్ చేయండి. ఇది మీ పరికరంలో అందుబాటులో ఉన్న అన్ని స్వరాలను జాబితా చేస్తుంది.

మాడ్యూల్ ద్వారా అనుబంధ పాఠాలను బ్రౌజ్ చేయడం (అంశం వారీగా)

ప్రాథమిక పాఠ్య శ్రేణి (పాఠాలు 1–18) పూర్తి చేసిన విద్యార్థులు తదనంతర (అనుబంధ) సిరీస్ ‌కు నమోదు చేసుకోవడానికి అర్హులు. టాపిక్ వారీగా అనుబంధ పాఠాలను బ్రౌజ్ చేయడానికి ‘అనుబంధ పాఠాలు (Supplement Lessons)’ ట్యాబ్ ‌ని ఎంచుకుని, ‘మాడ్యూల్స్’ పై క్లిక్ చేయండి. మీరు అనుబంధ శ్రేణి ప్రారంభించిన తర్వాత, ప్రతి రెండు వారాలకు ఒకసారి కొత్త పాఠాలు అందుబాటులోకి వస్తాయి.

ఆన్‌లైన్ ధ్యానాలు

ప్రత్యక్ష ఆన్‌లైన్ ధ్యానాలలో పాల్గొనడం

యాప్ ‌లోని ‘ధ్యానం | ఆన్‌లైన్’ (‘Meditate | Online’) విభాగంలో రాబోయే ధ్యానాలు జాబితా చేయబడతాయి. నిర్దిష్ట ప్రారంభ సమయం వచ్చినప్పుడు, మీరు జూమ్ (Zoom) లేదా యూట్యూబ్ (YouTube) ద్వారా ధ్యానంలో చేరవచ్చు. ‘జాయిన్ ఆన్’ బటన్ ‌ను క్లిక్ చేస్తే తగిన యాప్ లాంచ్ అవుతుంది (ముందు ఇన్‌స్టాలేషన్ అవసరం).

ఆన్‌లైన్ ధ్యాన జాబితాను ఫిల్టర్ చెయ్యడం (జాబితాలో మనకు కావలసిన దానిని ఎంపిక చేసుకోవడం/వెతుక్కోవడం)

మా ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం వివిధ రకాల కార్యక్రమాలను అందిస్తుంది. మీరు నిర్దిష్ట రకాలను వీక్షించడానికి/చేరడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు ఎగువన కుడి వైపున ఉన్న ‘ఫిల్టర్’ చిహ్నాన్ని క్లిక్ చేసి, వీక్షించటానికి మీకు ఆసక్తి ఉన్న రకాలను మాత్రమే తనిఖీ చేయవచ్చు. మీ మార్పులను సేవ్ చేయడానికి ‘వర్తించు/వినియోగించు (Apply)’ క్లిక్ చేయండి.

నిర్దిష్ట/ ఎంచుకున్న భాషలో ఆన్‌లైన్ ధ్యాన షెడ్యూళ్ళను వీక్షించడం

మీ పరికర భాష (Device language) ను కావలసిన భాషకు సెట్ చేసుకున్నప్పుడు యాప్ మరిన్ని భాషలలో కార్యక్రమాలను చూపుతుంది. అయితే ప్రస్తుతం ఇది హిందీ, తమిళం మరియు తెలుగులో మాత్రమే అందుబాటులో ఉంది.

నిర్దేశిత ధ్యానాలు

నిర్దేశిత ధ్యానాలను చూడడం

యాప్ ‌లోని ‘ధ్యానం | గైడెడ్’ విభాగం ద్వారా మీరు మా సన్యాసుల నేతృత్వంలోని నిర్దేశిత ధ్యానాలను అనుసరించవచ్చు. మొదట అంశాన్ని (Topic)ని ఎంచుకుని, ఆపై ప్రారంభించడానికి కావలసిన వ్యవధిని ఎంచుకోండి. వై.ఎస్.ఎస్. వేదికను వీక్షించడానికి మీ మొబైల్ పరికరాన్ని ల్యాండ్ ‌స్కేప్ మోడ్ ‌లోకి మార్చుకోండి.

నిర్దేశిత ధ్యానాలను డౌన్‌లోడ్ చేసుకోవడం

మీరు ఆఫ్ ‌లైన్ లోనో లేదా ధ్యానాన్ని పునరావృతం చెయ్యడానికో నిర్దిష్ట ధ్యానాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే, ప్లేయర్ కు కుడి వైపు దిగువన ఉన్న ‘డౌన్‌లోడ్’ చిహ్నాన్ని క్లిక్ చేయండి. మీరు మళ్ళీ అదే ధ్యానానికి తిరిగి వచ్చినప్పుడు, డౌన్‌లోడ్ చేయబడిన ఫైల్ ఉపయోగపడుతుంది.

ఇతర భాషలలో నిర్దేశిత ధ్యానాలు

నిర్దేశిత ధ్యానాలు హిందీ, తమిళం, మరియు తెలుగులో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ధ్యానాలను చేయడానికి, అలాగే వార్తల పోస్ట్ ‌లు, నిర్దిష్ట భాషలో ఆన్‌లైన్ ధ్యాన షెడ్యూళ్ళ వంటి అన్ని ఇతర పాఠ్యేతర విషయాలను చూడడానికి, దయచేసి మీ ‘యాప్ భాష (App Language)’ను హిందీ, తమిళం, లేదా తెలుగుకి మార్చండి.

para-ornament

ఇంకా ఏమైనా సహాయం కావాలా?

మీ ప్రశ్నకు సమాధానం దొరకలేదా? సహాయం కోసం మమ్మల్ని సంప్రదించండి.

మా అంతర్జాతీయ స్వచ్ఛంద హెల్ప్ డెస్క్ ద్వారా మద్దతు పొందండి:

యాప్‌లోని ‘నా కోసం (FOR ME)’ విభాగంలో, దయచేసి ‘మద్దతు (SUPPORT)’ పై క్లిక్ చేయండి. మా హెల్ప్ డెస్క్ ‌తో టికెట్ ‌ను రూపొందించడానికి కోరిన సమాచారాన్ని పూరించండి. సమస్య గురించి మీరు ఎంత ఎక్కువ వివరాలను అందించగలిగితే, మేము అంత త్వరగా, సమర్థవంతంగా ప్రతిస్పందించడం సులభం అవుతుంది.

మీరు సపోర్ట్ స్క్రీన్ ‌ని యాక్సెస్ చేయడానికి యాప్ ‌ను తెరవలేకపోతే, దయచేసి సమస్యను వివరంగా, మీ పరికరం యొక్క సమాచారం మరియు మీ విద్యార్థి ఖాతాతో అనుబంధించబడిన ఇమెయిల్ చిరునామాను వివరిస్తూ [email protected]కి ఇమెయిల్ పంపండి.

para-ornament

ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ ను పొందండి

Google Play లేదా Apple స్టోర్ నుండి యాప్ ‌ను డౌన్‌లోడ్ చేయండి:

వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులు డెస్క్ ‌టాప్ యాప్ ‌లో వై.ఎస్.ఎస్. పాఠాలు మరియు సహాయక సమాచారాన్ని కూడా వీక్షించవచ్చు:

ఇతరులతో పంచుకోండి