
Yogoda Satsanga Dhyana Kendra – Serampore
57, Netaji Subhas Avenue
Hooghly - 712201
West Bengal
ప్రతిరోజు తీరికలేనితనం నుండి వైదొలగి, నిశ్శబ్దంలో మిమ్మల్ని ఉత్తేజపరచుకోండి మరియు మీ దైవానుభూతిని గాఢం చేసుకోండి.
దేవునితో ఏకాంతంగా ఉండడమనేది మీ మనస్సు, శరీరం మరియు ఆత్మలకు ఏమి చేకూర్చుతుందో చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు….నిశ్శబ్దం అనే ప్రవేశ ద్వారము గుండా జ్ఞానము మరియు శాంతి యొక్క స్వస్థత చేకూర్చే సూర్యుడు మీపై ప్రకాశిస్తాడు.
— శ్రీ శ్రీ పరమహంస యోగానంద
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క జీవించడం-ఎలా ఏకాంత ధ్యాన వాస కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పునరుత్తేజం కోరుకొనేవారికి మరియు దైనందిన జీవితంలోని ఒత్తిళ్లకు దూరంగా ఉండాలని కోరుకొనేవారికి — కొద్ది రోజులే అయినప్పటికీ — దైవ అవగాహన గాఢం చేసుకొనేందుకు అందుబాటులో ఉంటాయి. పరమహంస యోగానందగారి మాటల్లో చెప్పాలంటే, “అనంతం ద్వారా పునరుత్తేజం పొందే ప్రత్యేక ప్రయోజనం కోసం [మీరు] వెళ్లగల ఒక నిశ్శబ్ద డైనమోను ఈ కార్యక్రమాలు అందిస్తాయి.”
నిత్య జీవితంలోని నిరంతర కార్యకలాపాల నుండి తమ దృష్టిని మరల్చి, ఆంతరిక నిశ్శబ్దంపై దృష్టిపెట్టి, తద్ద్వారా దేవుని శాంతి మరియు పరమానందాల అమృతం పానం చేసే ఒక అద్భుత అవకాశాన్ని శ్రద్ధాళువులైన సాధకులు పొందుతారు. సేద తీర్చుకొనేందుకు మరియు ఆధ్యాత్మిక పునరుత్తేజం, ప్రేరణ పొందేందుకు వారు ఈ ఏకాంత ధ్యాన వాసాలకు రావచ్చు. లేదా ఆంతరిక మార్గనిర్దేశం, అవగాహన మరియు గాఢమైన పర్యాలోచన ద్వారా మాత్రమే పరిష్కరించబడే, సమస్యలకు పరిష్కారాల కోసం లేదా ప్రశ్నలకు సమాధానాల కోసం ఇక్కడ ప్రయత్నించవచ్చు.
సాధకులు ఒక వ్యక్తిగత ఏకాంత ధ్యాన వాసం ఎన్నుకోవచ్చు లేదా పరమహంస యోగానందగారి పరిజ్ఞానంపై ఆధారితమైన జీవించడం-ఎలా స్ఫూర్తిదాయక సమావేశాలు మరియు దైనందిన ధ్యానాలతో కూడిన ఏకీకృత కార్యక్రమాలు నిర్వహించబడే ఏకాంత ధ్యాన వాసం ఎన్నుకోవచ్చు. ఈ ఏకాంత ధ్యాన వాసాలు భారతదేశంలోని వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు మరియు వివిధ వై.ఎస్.ఎస్. ఏకాంత ధ్యాన వాస ప్రదేశాలలో నిర్వహించబడతాయి.
దేశమంతటా ప్రత్యేకంగా ఏకాంత ధ్యాన వాసాల కోసం మాత్రమే ఉద్దేశించబడిన వివిధ ప్రదేశాలను యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా కలిగి ఉంది. నగర జీవన రణగొణ ధ్వనులకు, గందరగోళాలకు దూరంగా ప్రకృతి మరియు ప్రశాంత పరిసరాలలో ఈ ప్రదేశాలు నెలకొన్నాయి; పాల్గొనేవారు తమ స్వస్వరూపానికి దగ్గరగా ఉండేందుకు, సాధనలో లోతుగా వెళ్ళేందుకు మరియు విశ్రాంతి తీసుకొనేందుకు అనువైన వాతావరణాన్ని ఇవి అందిస్తాయి.
ఈ ఏకాంత ధ్యాన వాస ప్రదేశాలకు అదనంగా వివిధ వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో కూడా ఏకాంత ధ్యాన వాసాలు నిర్వహించబడతాయి. భారతదేశంలోని వివిధ వై.ఎస్.ఎస్. ఆశ్రమాల గురించి మరింతగా తెలుసుకొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
జూలై – సెప్టెంబర్ 2025
ఈ సంవత్సరం తృతీయ త్రైమాసికంలో వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు మరియు ఏకాంత ధ్యాన వాస కేంద్రాల వద్ద జరిగబోయే ఏకాంత ధ్యాన వాసాల గురించి ప్రకటించడం మాకెంతో ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. మిగిలిన నెలలలో జరగబోయే ఏకాంత ధ్యాన వాసాల గురించిన సమాచారం త్వరలోనే ప్రచురించబడుతుంది.
జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | ||
---|---|---|---|---|---|
వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమం | — | జూలై 18-20* | — | సెప్టెంబర్ 12-14* | |
వై.ఎస్.ఎస్. ద్వారహాట్ ఆశ్రమం | — | — | — | సెప్టెంబర్ 28-30* | |
ఇగత్‌పురి | జూన్ 14-15 | జూలై 9-11 జూలై 25-27 | ఆగష్టు 14-17 | సెప్టెంబర్ 26-28 | |
షిమ్లా | జూన్ 6-8 జూన్ 20-22 | — | ఆగష్టు 15-17 | సెప్టెంబర్ 5-7 సెప్టెంబర్ 19-21 | |
పూణే | జూన్ 28-29 | జూలై 26-27 | ఆగష్టు 30-31 | సెప్టెంబర్ 27-28 | |
కోయంబత్తూరు | — | జూలై 18-20* | — | సెప్టెంబర్ 27-28 | |
రాజమండ్రి | — | జూలై 18-20* | — | సెప్టెంబర్ 12-14* |
దయచేసి గమనించండి:
వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. పాఠాల విద్యార్థులు, నిర్వహించబడే ఏదో ఒక ఏకాంత ధ్యాన వాసంలో పాల్గొనవచ్చు లేదా తమకు వీలైన సమయంలో ఒక వ్యక్తిగత ఏకాంత ధ్యాన వాసంలో పాల్గొనేందుకు యోచించవచ్చు. ఈ ఏకాంత ధ్యాన వాస కార్యక్రమాలలోని ఏదో ఒకదానిలో మీరు పాల్గొనాలనుకుంటే, సంబంధిత ఆశ్రమం/ఏకాంత ధ్యాన వాస ప్రదేశానికి దయచేసి కనీసం ఒక నెల ముందు సమాచారం ఇవ్వండి:
దయచేసి గమనించండి:
ఈ ఏకాంత ధ్యాన వాసాలకు స్థిరమైన ఛార్జీలు ఉండవు. మీ ఆర్ధిక సహాయ సామర్థ్యంతో సంబంధం లేకుండా, గురుదేవుల ఏకాంత ధ్యాన వాసాలు అందరికీ తెరిచి ఉంటాయి. భోజనం, వసతి, పోషణ, నిర్వహణ వంటి సౌకర్యాల ఖర్చులను భరించేందుకు మీ విరాళాలపైనే ఆధారపడవలసి ఉంటుంది. మా ఖర్చులను తీర్చేందుకు మరియు చిత్తశుద్ధిగల అన్వేషకులందరికీ గురుదేవుల ఆతిథ్యాన్ని అందించేందుకు వీలు కలుగజేసే పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వగలిగిన వారందరికీ మేము కృతజ్ఞులం.
ఆన్‌లైన్ ద్వారా సమర్పించే విరాళాలను, ‘కేంద్రా ఫండ్’ అని ఎంచుకొని, తరువాత ‘కేంద్రం పేరు’ నుండి ఏకాంత ధ్యాన వాసం ప్రదేశం యొక్క పేరు ఎంచుకొని చేయవచ్చు. ఏకాంత ధ్యాన వాస కేంద్రానికి “చెక్కు” పంపించడం ద్వారా కూడా ఒక వ్యక్తి విరాళం సమర్పించవచ్చు.
ఏకాంత ధ్యాన వాసం సందర్భంగా, సేద తీర్చుకొని, సర్వవ్యాపకమైన దేవుని ఆశీస్సులు గ్రహించేట్లుగా తయారు కావడమే మీ పాత్ర. స్వచ్చమైన గాలిలో బయట తిరగడం, వ్యాయామం చేయడం, సేద తీరడం ద్వారా శారీరక విశ్రాంతి పొందండి. దైనందిన జీవితంలోని చికాకులను, భారాలను వదిలివేయడం ద్వారా మానసిక విశ్రాంతి పొందండి. బాహ్యమైన మీ కార్యకలాపాలను విడిచి పెట్టండి; దేవుణ్ణి స్వీకరించేట్లుగా ఉండండి మరియు మీ మనస్సులో అత్యున్నత ఆలోచనగా, జ్వలించే కోరికగా ఆయన మాత్రమే ఉండాలి. ఆయన ఉనికి గురించి మీలో పెరుగుతున్న అవగాహన మిగిలినదంతా చేసేస్తుంది. దేవుని గురించి గాఢమైన అవగాహనను పెంపొందించుకోవడానికి నిరంతర కార్యకలాపాల నుండి వెనక్కి తగ్గే అనుభవం, మీ శక్తిని పునరుద్ధరించేందుకు మరియు మీకు శాశ్వత శాంతి, ఆనందాన్ని తీసుకువచ్చేందుకు అతనికి సహాయం చేస్తుంది.
అందమైన ఏకాంత ధ్యాన వాసాల ప్రదేశాలలో సేదతీరడానికి మరియు దైవ సాన్నిథ్యాన్ని అనుభవించేందుకు తగినంత ఖాళీ సమయం కూడా ఉంటుంది. శారీరకంగా సేద తీరేందుకు భక్తులు స్వచ్చమైన గాలిలో నడవడంగాని వ్యాయామంగాని చేయవచ్చు. ఉదయం మరియు సాయంత్రం జరిగే సామూహిక ధ్యానాలకు అదనంగా, భక్తులు వ్యక్తిగత ధ్యానం కూడా చేసుకోవచ్చు.
ప్రతిఫలదాయక ఏకాంత వాస ధ్యానం యొక్క బాధ్యత ప్రధానంగా ఆ వ్యక్తిపైనే ఆధారపడి ఉంటుంది. మీరు మీ ఆత్మను పునరుద్ధరించుకోవడానికి వచ్చినా లేక ఇబ్బందికరమైన ప్రశ్నలు మరియు సమస్యలకు ఆంతరిక పరిష్కారాలను వెదుకుతున్నా, మీ ప్రయత్నం యొక్క విజయం అంతిమంగా — జీవం, జ్ఞానం, ఆరోగ్యం మరియు ఆనందానికి మూలమైన దివ్యాత్మ, దేవునితో మీ వ్యక్తిగత సంబంధంపై ఆధారపడి ఉంటుంది. అంతర్లీనంగా ఉన్న ఆయన ఉనికి గురించి మీరు అవగాహన పెంచుకొనేంతవరకు, జీవితంలోని ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా మీకు ప్రేరణ, భరోసా మరియు మార్గనిర్దేశం లభిస్తాయి.
ఈ క్రింది విషయాలలో జాగ్రత్తగా ఉండడం వల్ల మీ జాగృతి (ఎరుక) అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది:
వై.ఎస్.ఎస్. కు మరియు పరమహంస యోగానందగారి బోధనలకు కొత్తవారైతే, క్రింద ఉన్న లింక్ లను అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:
ఇతరులతో పంచుకోండి
నెలవారీ వార్తా లేఖల సభ్యత్వాన్ని పొందండి