ఏకాంత ధ్యాన వాసాలు

ప్రతిరోజు తీరికలేనితనం నుండి వైదొలగి, నిశ్శబ్దంలో మిమ్మల్ని ఉత్తేజపరచుకోండి మరియు మీ దైవానుభూతిని గాఢం చేసుకోండి.

టెస్ట్ 3

దేవునితో ఏకాంతంగా ఉండడమనేది మీ మనస్సు, శరీరం మరియు ఆత్మలకు ఏమి చేకూర్చుతుందో చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు….నిశ్శబ్దం అనే ప్రవేశ ద్వారము గుండా జ్ఞానము మరియు శాంతి యొక్క స్వస్థత చేకూర్చే సూర్యుడు మీపై ప్రకాశిస్తాడు.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క జీవించడం-ఎలా ఏకాంత ధ్యాన వాస కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పునరుత్తేజం కోరుకొనేవారికి మరియు దైనందిన జీవితంలోని ఒత్తిళ్లకు దూరంగా ఉండాలని కోరుకొనేవారికి — కొద్ది రోజులే అయినప్పటికీ — దైవ అవగాహన గాఢం చేసుకొనేందుకు అందుబాటులో ఉంటాయి. పరమహంస యోగానందగారి మాటల్లో చెప్పాలంటే, “అనంతం ద్వారా పునరుత్తేజం పొందే ప్రత్యేక ప్రయోజనం కోసం [మీరు] వెళ్లగల ఒక నిశ్శబ్ద డైనమోను ఈ కార్యక్రమాలు అందిస్తాయి.”

నిత్య జీవితంలోని నిరంతర కార్యకలాపాల నుండి తమ దృష్టిని మరల్చి, ఆంతరిక నిశ్శబ్దంపై దృష్టిపెట్టి, తద్ద్వారా దేవుని శాంతి మరియు పరమానందాల అమృతం పానం చేసే ఒక అద్భుత అవకాశాన్ని శ్రద్ధాళువులైన సాధకులు పొందుతారు. సేద తీర్చుకొనేందుకు మరియు ఆధ్యాత్మిక పునరుత్తేజం, ప్రేరణ పొందేందుకు వారు ఈ ఏకాంత ధ్యాన వాసాలకు రావచ్చు. లేదా ఆంతరిక మార్గనిర్దేశం, అవగాహన మరియు గాఢమైన పర్యాలోచన ద్వారా మాత్రమే పరిష్కరించబడే, సమస్యలకు పరిష్కారాల కోసం లేదా ప్రశ్నలకు సమాధానాల కోసం ఇక్కడ ప్రయత్నించవచ్చు.

సాధకులు ఒక వ్యక్తిగత ఏకాంత ధ్యాన వాసం ఎన్నుకోవచ్చు లేదా పరమహంస యోగానందగారి పరిజ్ఞానంపై ఆధారితమైన జీవించడం-ఎలా స్ఫూర్తిదాయక సమావేశాలు మరియు దైనందిన ధ్యానాలతో కూడిన ఏకీకృత కార్యక్రమాలు నిర్వహించబడే ఏకాంత ధ్యాన వాసం ఎన్నుకోవచ్చు. ఈ ఏకాంత ధ్యాన వాసాలు భారతదేశంలోని వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు మరియు వివిధ వై.ఎస్.ఎస్. ఏకాంత ధ్యాన వాస ప్రదేశాలలో నిర్వహించబడతాయి.

వై.ఎస్.ఎస్. ఏకాంత ధ్యాన వాస ప్రదేశాలు

దేశమంతటా ప్రత్యేకంగా ఏకాంత ధ్యాన వాసాల కోసం మాత్రమే ఉద్దేశించబడిన వివిధ ప్రదేశాలను యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా కలిగి ఉంది. నగర జీవన రణగొణ ధ్వనులకు, గందరగోళాలకు దూరంగా ప్రకృతి మరియు ప్రశాంత పరిసరాలలో ఈ ప్రదేశాలు నెలకొన్నాయి; పాల్గొనేవారు తమ స్వస్వరూపానికి దగ్గరగా ఉండేందుకు, సాధనలో లోతుగా వెళ్ళేందుకు మరియు విశ్రాంతి తీసుకొనేందుకు అనువైన వాతావరణాన్ని ఇవి అందిస్తాయి.

ఈ ఏకాంత ధ్యాన వాస ప్రదేశాలకు అదనంగా వివిధ వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో కూడా ఏకాంత ధ్యాన వాసాలు నిర్వహించబడతాయి. భారతదేశంలోని వివిధ వై.ఎస్.ఎస్. ఆశ్రమాల గురించి మరింతగా తెలుసుకొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

రాబోయే ఏకాంత ధ్యాన వాసాలు

వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు మరియు ఏకాంత ధ్యానవాస కేంద్రాలలో నిర్వహించబోయే ఏకాంత ధ్యానవాసాలను ప్రకటించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. సంబంధిత కార్యక్రమాలను గురించి వీక్షించడానికి దయచేసి నెల లేదా ప్రదేశం పేరుపై క్లిక్ చేయండి. ఒక నిర్దిష్ట ఏకాంత ధ్యానవాస కార్యక్రమం గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి సంబంధిత ఆశ్రమం/ఏకాంత ధ్యానవాస కేంద్రాన్ని సంప్రదించండి.

దయచేసి గమనించండి: వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించే ఏకాంత ధ్యానవాసాలు, సంబంధిత ఏకాంత ధ్యానవాసం యొక్క వివరాలలోనే సూచించబడతాయి. మిగిలిన అన్ని ఏకాంత ధ్యానవాసాలను వై.ఎస్.ఎస్. భక్తులు నిర్వహిస్తారు.

వీటి ద్వారా చూడండి :
  • "భగవంతుడు మీకోసం నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం దివ్య అస్తిత్వంతో జీవించడం" అనే అంశంపై ఏకాంత ధ్యాన వాసం
    సెప్టెంబర్ 19, 2026, శనివారం – సెప్టెంబర్ 20, 2026, ఆదివారం
    వారంపాటు క్రియాబాన్ల ఏకాంత ధ్యాన వాసం
    సెప్టెంబర్ 26, 2026, శనివారం – అక్టోబర్ 2, 2026, శుక్రవారం
  • లాహిరీ మహాశయ స్మారకోత్సవ ఏకాంత ధ్యాన వాసం
    సెప్టెంబర్ 26, 2026, శనివారం – సెప్టెంబర్ 27, 2026, ఆదివారం
    ఏకాంత ధ్యాన వాసం (హిందీ)
    (వై.ఎస్.ఎస్. సన్యాసులచే విర్వహణ)
    సెప్టెంబర్ 28, 2026, సోమవారం – సెప్టెంబర్ 30, 2026, బుధవారం
  • "ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పునరుద్ధరించుకోవడం" అనే అంశంపై ఏకాంత ధ్యాన వాసం
    అక్టోబర్ 2, 2026, శుక్రవారం – అక్టోబర్ 4, 2026, ఆదివారం
    వారాంతపు ఏకాంత ధ్యాన వాసం
    అక్టోబర్ 10, 2026, శనివారం – అక్టోబర్ 11, 2026, ఆదివారం
  • ఏకాంత ధ్యాన వాసం (తెలుగు)
    అక్టోబర్ 23, 2026, శుక్రవారం – అక్టోబర్ 25, 2026, ఆదివారం
    "మీ అనంతత్త్వాన్ని తెలుసుకోవడమే ఆత్మ-సాక్షాత్కారం" అనే అంశంపై ఏకాంత ధ్యాన వాసం
    అక్టోబర్ 24, 2026, శనివారం – అక్టోబర్ 25, 2026, ఆదివారం
  • "గురుదేవుల అడుగుజాడలలో నడవడం" అనే అంశంపై ఏకాంత ధ్యాన వాసం
    నవంబర్ 13, 2026, శుక్రవారం – నవంబర్ 15, 2026, ఆదివారం
    ఏకాంత ధ్యాన వాసం (తెలుగు)
    నవంబర్ 13, 2026, శుక్రవారం – నవంబర్ 15, 2026, ఆదివారం
  • "ఒక యోగి ఆత్మకథ" అనే అంశంపై ఏకాంత ధ్యాన వాసం
    నవంబర్ 27, 2026, శుక్రవారం – డిసెంబర్ 4, 2026, శుక్రవారం
    "మహాత్ముల మార్గాన్ని అనుసరించండి" అనే అంశంపై ఏకాంత ధ్యాన వాసం
    నవంబర్ 28, 2026, శనివారం – నవంబర్ 29, 2026, ఆదివారం
  • వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమం నుండి ఏకాంత ధ్యాన వాసం యొక్క ప్రత్యక్ష ప్రసారం
    (వై.ఎస్.ఎస్. సన్యాసులచే విర్వహణ)
    డిసెంబర్ 4, 2026, శుక్రవారం – డిసెంబర్ 6, 2026, ఆదివారం
    ఏకాంత ధ్యాన వాసం (హిందీ/ఇంగ్లీష్)
    (వై.ఎస్.ఎస్. సన్యాసులచే విర్వహణ)
    డిసెంబర్ 4, 2026, శుక్రవారం – డిసెంబర్ 6, 2026, ఆదివారం
  • ఏకాంత ధ్యాన వాసం (ఇంగ్లీష్)
    (వై.ఎస్.ఎస్. సన్యాసులచే విర్వహణ)
    డిసెంబర్ 4, 2026, శుక్రవారం – డిసెంబర్ 6, 2026, ఆదివారం
    క్రిస్మస్ ఏకాంత ధ్యాన వాసం
    డిసెంబర్ 25, 2026, శుక్రవారం – డిసెంబర్ 27, 2026, ఆదివారం
  • "విశ్వ కూటస్థ చైతన్యంతో సంబంధం పెట్టుకోవడం ఎలా" అనే అంశంపై ఏకాంత ధ్యాన వాసం
    డిసెంబర్ 26, 2026, శనివారం – డిసెంబర్ 27, 2026, ఆదివారం
  • వారంపాటు క్రియాబాన్ల ఏకాంత ధ్యాన వాసం
    సెప్టెంబర్ 26, 2026, శనివారం – అక్టోబర్ 2, 2026, శుక్రవారం
    వారాంతపు ఏకాంత ధ్యాన వాసం
    అక్టోబర్ 10, 2026, శనివారం – అక్టోబర్ 11, 2026, ఆదివారం
  • "ఒక యోగి ఆత్మకథ" అనే అంశంపై ఏకాంత ధ్యాన వాసం
    నవంబర్ 27, 2026, శుక్రవారం – డిసెంబర్ 4, 2026, శుక్రవారం
    క్రిస్మస్ ఏకాంత ధ్యాన వాసం
    డిసెంబర్ 25, 2026, శుక్రవారం – డిసెంబర్ 27, 2026, ఆదివారం
  • లాహిరీ మహాశయ స్మారకోత్సవ ఏకాంత ధ్యాన వాసం
    సెప్టెంబర్ 26, 2026, శనివారం – సెప్టెంబర్ 27, 2026, ఆదివారం
  • "భగవంతుడు మీకోసం నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం దివ్య అస్తిత్వంతో జీవించడం" అనే అంశంపై ఏకాంత ధ్యాన వాసం
    సెప్టెంబర్ 19, 2026, శనివారం – సెప్టెంబర్ 20, 2026, ఆదివారం
    "మీ అనంతత్త్వాన్ని తెలుసుకోవడమే ఆత్మ-సాక్షాత్కారం" అనే అంశంపై ఏకాంత ధ్యాన వాసం
    అక్టోబర్ 24, 2026, శనివారం – అక్టోబర్ 25, 2026, ఆదివారం
  • "మహాత్ముల మార్గాన్ని అనుసరించండి" అనే అంశంపై ఏకాంత ధ్యాన వాసం
    నవంబర్ 28, 2026, శనివారం – నవంబర్ 29, 2026, ఆదివారం
    "విశ్వ కూటస్థ చైతన్యంతో సంబంధం పెట్టుకోవడం ఎలా" అనే అంశంపై ఏకాంత ధ్యాన వాసం
    డిసెంబర్ 26, 2026, శనివారం – డిసెంబర్ 27, 2026, ఆదివారం
  • ఏకాంత ధ్యాన వాసం (తెలుగు)
    అక్టోబర్ 23, 2026, శుక్రవారం – అక్టోబర్ 25, 2026, ఆదివారం
    ఏకాంత ధ్యాన వాసం (తెలుగు)
    నవంబర్ 13, 2026, శుక్రవారం – నవంబర్ 15, 2026, ఆదివారం
  • వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమం నుండి ఏకాంత ధ్యాన వాసం యొక్క ప్రత్యక్ష ప్రసారం
    (వై.ఎస్.ఎస్. సన్యాసులచే విర్వహణ)
    డిసెంబర్ 4, 2026, శుక్రవారం – డిసెంబర్ 6, 2026, ఆదివారం
  • ఏకాంత ధ్యాన వాసం (హిందీ)
    (వై.ఎస్.ఎస్. సన్యాసులచే విర్వహణ)
    సెప్టెంబర్ 28, 2026, సోమవారం – సెప్టెంబర్ 30, 2026, బుధవారం
    ఏకాంత ధ్యాన వాసం (హిందీ/ఇంగ్లీష్)
    (వై.ఎస్.ఎస్. సన్యాసులచే విర్వహణ)
    డిసెంబర్ 4, 2026, శుక్రవారం – డిసెంబర్ 6, 2026, ఆదివారం
  • ఏకాంత ధ్యాన వాసం (ఇంగ్లీష్)
    (వై.ఎస్.ఎస్. సన్యాసులచే విర్వహణ)
    డిసెంబర్ 4, 2026, శుక్రవారం – డిసెంబర్ 6, 2026, ఆదివారం
  • "ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పునరుద్ధరించుకోవడం" అనే అంశంపై ఏకాంత ధ్యాన వాసం
    అక్టోబర్ 2, 2026, శుక్రవారం – అక్టోబర్ 4, 2026, ఆదివారం
    "గురుదేవుల అడుగుజాడలలో నడవడం" అనే అంశంపై ఏకాంత ధ్యాన వాసం
    నవంబర్ 13, 2026, శుక్రవారం – నవంబర్ 15, 2026, ఆదివారం
  • నమోదు

    వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. పాఠాల విద్యార్థులు, నిర్వహించబడే ఏదో ఒక ఏకాంత ధ్యాన వాసంలో పాల్గొనవచ్చు లేదా తమకు వీలైన సమయంలో ఒక వ్యక్తిగత ఏకాంత ధ్యాన వాసంలో పాల్గొనేందుకు యోచించవచ్చు. ఈ ఏకాంత ధ్యాన వాస కార్యక్రమాలలోని ఏదో ఒకదానిలో మీరు పాల్గొనాలనుకుంటే, సంబంధిత ఆశ్రమం/ఏకాంత ధ్యాన వాస ప్రదేశానికి దయచేసి కనీసం ఒక నెల ముందు సమాచారం ఇవ్వండి:

    • పూర్తి పేరు
    • వయస్సు
    • చిరునామా
    • ఈ-మెయిల్
    • సంప్రదించాల్సిన ఫోన్
    • వై.ఎస్.ఎస్. పాఠాల నమోదు సంఖ్య (లేదా ఎస్.ఆర్.ఎఫ్. సభ్యత్వ సంఖ్య)
    • మీ ఆగమనం మరియు నిష్క్రమణ తేదీలు

    దయచేసి గమనించండి:

    • పురుషులు మరియు స్త్రీలకు విడివిడిగా వసతి కల్పించబడుతుంది. అయినప్పటికీ, 65 సంవత్సరాలు, అంతకంతే ఎక్కువ వయస్సుగల దంపతులకు కొన్ని మినహాయింపులు ఉంటాయి. తదనుగుణంగా కుటుంబ సభ్యులు దయచేసి ఏర్పాట్లు చేసుకొని, సామాను తెచ్చుకోగలరు.
    • 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లలు అనుమతించబడరు.
    • వాతావరణం, వసతి లేదా మీ ప్రయాణానికి సంబంధించిన ఇతర సమాచారం, ఏకాంత ధ్యాన వాసంలో నివాసం గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటే, దయచేసి సంబంధిత ఆశ్రమం/ఏకాంత ధ్యాన వాసమును నేరుగా సంప్రదించండి.

    మీ తోడ్పాటు అవసరం

    ఈ ఏకాంత ధ్యాన వాసాలకు స్థిరమైన ఛార్జీలు ఉండవు. మీ ఆర్ధిక సహాయ సామర్థ్యంతో సంబంధం లేకుండా, గురుదేవుల ఏకాంత ధ్యాన వాసాలు అందరికీ తెరిచి ఉంటాయి. భోజనం, వసతి, పోషణ, నిర్వహణ వంటి సౌకర్యాల ఖర్చులను భరించేందుకు మీ విరాళాలపైనే ఆధారపడవలసి ఉంటుంది. మా ఖర్చులను తీర్చేందుకు మరియు చిత్తశుద్ధిగల అన్వేషకులందరికీ గురుదేవుల ఆతిథ్యాన్ని అందించేందుకు వీలు కలుగజేసే పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వగలిగిన వారందరికీ మేము కృతజ్ఞులం.

    ఆన్‌లైన్ ద్వారా సమర్పించే విరాళాలను, ‘కేంద్రా ఫండ్’ అని ఎంచుకొని, తరువాత ‘కేంద్రం పేరు’ నుండి ఏకాంత ధ్యాన వాసం ప్రదేశం యొక్క పేరు ఎంచుకొని చేయవచ్చు. ఏకాంత ధ్యాన వాస కేంద్రానికి “చెక్కు” పంపించడం ద్వారా కూడా ఒక వ్యక్తి విరాళం సమర్పించవచ్చు.

    ఏకాంత ధ్యాన వాస కార్యకలాపాలు

    ఏకాంత ధ్యాన వాసం సందర్భంగా, సేద తీర్చుకొని, సర్వవ్యాపకమైన దేవుని ఆశీస్సులు గ్రహించేట్లుగా తయారు కావడమే మీ పాత్ర. స్వచ్చమైన గాలిలో బయట తిరగడం, వ్యాయామం చేయడం, సేద తీరడం ద్వారా శారీరక విశ్రాంతి పొందండి. దైనందిన జీవితంలోని చికాకులను, భారాలను వదిలివేయడం ద్వారా మానసిక విశ్రాంతి పొందండి. బాహ్యమైన మీ కార్యకలాపాలను విడిచి పెట్టండి; దేవుణ్ణి స్వీకరించేట్లుగా ఉండండి మరియు మీ మనస్సులో అత్యున్నత ఆలోచనగా, జ్వలించే కోరికగా ఆయన మాత్రమే ఉండాలి. ఆయన ఉనికి గురించి మీలో పెరుగుతున్న అవగాహన మిగిలినదంతా చేసేస్తుంది. దేవుని గురించి గాఢమైన అవగాహనను పెంపొందించుకోవడానికి నిరంతర కార్యకలాపాల నుండి వెనక్కి తగ్గే అనుభవం, మీ శక్తిని పునరుద్ధరించేందుకు మరియు మీకు శాశ్వత శాంతి, ఆనందాన్ని తీసుకువచ్చేందుకు అతనికి సహాయం చేస్తుంది.

    అందమైన ఏకాంత ధ్యాన వాసాల ప్రదేశాలలో సేదతీరడానికి మరియు దైవ సాన్నిథ్యాన్ని అనుభవించేందుకు తగినంత ఖాళీ సమయం కూడా ఉంటుంది. శారీరకంగా సేద తీరేందుకు భక్తులు స్వచ్చమైన గాలిలో నడవడంగాని వ్యాయామంగాని చేయవచ్చు. ఉదయం మరియు సాయంత్రం జరిగే సామూహిక ధ్యానాలకు అదనంగా, భక్తులు వ్యక్తిగత ధ్యానం కూడా చేసుకోవచ్చు.

    విజయవంతమైన ఏకాంత ధ్యాన వాసానికి సూచనలు

    ప్రతిఫలదాయక ఏకాంత వాస ధ్యానం యొక్క బాధ్యత ప్రధానంగా ఆ వ్యక్తిపైనే ఆధారపడి ఉంటుంది. మీరు మీ ఆత్మను పునరుద్ధరించుకోవడానికి వచ్చినా లేక ఇబ్బందికరమైన ప్రశ్నలు మరియు సమస్యలకు ఆంతరిక పరిష్కారాలను వెదుకుతున్నా, మీ ప్రయత్నం యొక్క విజయం అంతిమంగా — జీవం, జ్ఞానం, ఆరోగ్యం మరియు ఆనందానికి మూలమైన దివ్యాత్మ, దేవునితో మీ వ్యక్తిగత సంబంధంపై ఆధారపడి ఉంటుంది. అంతర్లీనంగా ఉన్న ఆయన ఉనికి గురించి మీరు అవగాహన పెంచుకొనేంతవరకు, జీవితంలోని ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా మీకు ప్రేరణ, భరోసా మరియు మార్గనిర్దేశం లభిస్తాయి.

    ఈ క్రింది విషయాలలో జాగ్రత్తగా ఉండడం వల్ల మీ జాగృతి (ఎరుక) అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది:

    • ఏకాంత ధ్యాన వాస కార్యక్రమంలో (సాధ్యమైనంత వరకు) పూర్తిగా పాల్గొనండి మరియు మీ నివాస సమయంలో ఇతర కార్యకలాపాలలో నిమగ్నమవ్వకండి.
    • ఆంతరిక వాతావరణాన్ని నిర్మించుకొనేందుకు ఏకాంత ధ్యాన వాసంలో మౌనంగా ఉండి, దేవునితో మరియు గురువులతో మీ అనుసంధానం గాఢం చేసుకోండి.
    • సామూహిక కార్యకలాపాలలో పాల్గొనేలా చూసుకోండి, అవి మిమ్మల్ని ఇతర సారూప్య మనస్తత్వంగల వ్యక్తుల సహవాసంలోకి తీసుకు వస్తాయి, తద్ద్వారా మీ మంచి ప్రయత్నాలు మరియు ఆకాంక్షలు బలోపేతమవుతాయి.
    • దేవుని సాన్నిధ్యాన్ని అభ్యసించండి. దేవుడు ప్రతి క్షణంలో, ప్రతి అనుభవంలో మీ ప్రక్కనే ఉన్నాడని భావించండి.
    • ఏకాంత ధ్యాన వాసానికి ప్రాపంచికమైన వార్తాపత్రికలు లేదా మ్యాగజైన్లు వంటివి మీతో తీసుకువచ్చినట్లయితే వాటిని చదవకండి.
    • మీరు ఏకాంత ధ్యాన వాస ఆవరణలోనే ఉన్నట్లయితే, మీ ఖాళీ సమయంలో మౌనంగా ఉండడం, దేవుని గురించి ఆలోచించడం సులభమవుతుంది, కాబట్టి ఏకాంత ధ్యాన వాస ప్రాంగణంలోనే ఉండండి.
    • మీతో పాటు తీసుకువస్తే, మీ మొబైల్ ఫోన్ల వాడకం నిరోధించండి. అత్యవసర సమయంలో తప్ప ఇతరులకు కాల్ చేయడంగాని, స్వీకరించడం గాని చేయకండి.
    • చివరిగా, ఏకాంత ధ్యాన వాసం సందర్భంగా గాఢంగా ధ్యానం చేయమని మేము మిమ్మల్ని కోరుతున్నాం. దేవునితో మీ సంబంధానికి ధ్యానమే అసలైన పునాది.
    para-ornament

    నూతన సందర్శకులు

    వై.ఎస్.ఎస్. కు మరియు పరమహంస యోగానందగారి బోధనలకు కొత్తవారైతే, క్రింద ఉన్న లింక్ లను అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:

    ఒక యోగి ఆత్మకథ

    ఒక అత్యుత్తమ ఆధ్యాత్మిక రచనగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతున్న తమ పుస్తకం గురించి పరమహంసగారు తరచుగా, “నేను లేనప్పుడు ఈ పుస్తకం నా దూత అవుతుంది,” అనే వారు.

    వై.ఎస్.ఎస్. పాఠాలు

    మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని మార్చడానికి, సమతుల్యతను సాధించటానికి మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడే గృహ-అధ్యయన పాఠ్యక్రమం.

    ఇతరులతో పంచుకోండి