ప్రయాగరాజ్ (అలహాబాద్) వద్ద కుంభమేళా — 2025


ఈ కార్యక్రమం యొక్క నమోదు ఇప్పుడు ముగిసింది.
ఈ కార్యక్రమం గురించి
చిరకాలంగా భారతదేశంలో జరిపే మతధార్మిక ఉత్సవాల్ని కుంభమేళా లంటారు; ఆధ్యాత్మిక లక్ష్యాల్ని అవి జనబాహుళ్యం దృష్టిలో ఎప్పుడూ నిలుపుతూ ఉంటాయి.
— పరమహంస యోగానంద
మన ప్రియతమ గురుదేవులు పలికిన ఈ మాటల నుండి ప్రేరణ పొంది, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) కుంభమేళాల సందర్భంగా శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. అదే విధంగా, వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రయాగరాజ్ (అలహాబాద్)లో జరిగే కుంభమేళాలో వై.ఎస్.ఎస్. శిబిరాన్ని ఏర్పాటు చేయాలని మేము యోచిస్తున్నాము. ఈ శిబిరంలో హాజరయ్యేందుకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులను ఆహ్వానిస్తున్నాం.
జనవరి 10 నుండి ఫిబ్రవరి 15, 2025 వరకు కుంభమేళా మైదానంలో శిబిరం నిర్వహించబడుతుంది. ఈ సమయంలో పుష్య పూర్ణిమ (సోమవారం, జనవరి 13), మకర సంక్రాంతి (మంగళవారం, జనవరి 14), మౌని అమావాస్య (బుధవారం, జనవరి 29), వసంత పంచమి (సోమవారం, ఫిబ్రవరి 3), మరియు మాఘ పూర్ణిమ (బుధవారం, ఫిబ్రవరి 12) వంటి ప్రత్యేక స్నానపు దినాలు కూడి ఉంటాయి.
కుంభమేళా జరిగినన్ని రోజులు, శిబిరంలో ఉండే భక్తుల బసను సుసంపన్నం చేసేందుకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహిస్తారు. వీటిలో ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం జరిగే సామూహిక ధ్యానాలు, కీర్తనలు (భక్తి గీతాలాపన) మరియు సత్సంగాలు కూడి ఉంటాయి.
ప్రకటన యొక్క సారాంశాన్ని పూర్తిగా చదవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
కార్యక్రమ వివరాలు
ఈ కార్యక్రమానికి నమోదు ఇప్పుడు ముగిసింది.
దయచేసి గమనించండి:
- నమోదు చేసుకున్న భక్తులు మాత్రమే శిబిరం వద్ద నివసించడానికి అనుమతించబడతారు.
- మీరు సూచించిన తేదీలలోనే దయచేసి వచ్చి వెళ్ళగలరు.
- మీ నమోదు ధృవీకరించబడి, ఏ కారణం చేతనైనా మీరు హాజరు కాలేకపోతే, దయచేసి ముందుగా మాకు తెలియజేయండి. మీ నమోదు ఇతరులకు బదిలీ చేయబడదు, అలాగే మీ నమోదు రుసుము తిరిగి చెల్లించబడదని దయచేసి గమనించండి.
నమోదు చేసుకున్న భక్తులు, గరిష్ట సంఖ్యలో తమ స్నానాలు మరియు ఇతర ఆచారాలను నెరవేర్చుకునేందుకు, పరిమితంగా ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకునేలా చూడడానికి, వై.ఎస్.ఎస్. శిబిరం వద్ద ఉన్న వసతి, మీ ఆగమనం మరియు నిష్క్రమణ తేదీలతో కలిపి నాలుగు పగళ్ళు మరియు మూడు రాత్రులకు పరిమితమై ఉంటుంది.
దయచేసి గమనించండి:
- క్యాంప్ వద్ద ఉన్న పరిమితమైన సౌకర్యాల కారణంగా, వై.ఎస్.ఎస్. ద్వారా ఎవరి వసతి ధృవీకరించబడినదో, వారు మాత్రమే శిబిరంలో ఉండడానికి అనుమతించబడతారు. అటువంటి ధృవీకరణ లేని స్నేహితులను మరియు కుటుంబసభ్యులను వెంట తీసుకురావద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.
- గుడారాలలో పురుషులు మరియు స్త్రీలకు విడివిడిగా వసతి ఏర్పాటు చేయబడుతుంది, కావున కుటుంబంతో కలిసి పాల్గొనేవారు తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాం.
వసతి సౌకర్యం
ఈ శిబిరం వద్ద వసతి, ఇసుకపై వేయబడిన గుడారాలతో, చదును చేయబడిన నేల మీద గడ్డితోనూ, ఆపైన కీలుచాప (టార్పాలిన్) తో కప్పబడి ఉంటుంది.
- పరుపు, దిండ్లు, మరియు కప్పుకునే దుప్పట్లు సమకూర్చబడతాయి, కాని మీ స్వంత పక్క దుప్పట్లు, దిండు గలేబులను మరియు స్లీపింగ్ బ్యాగ్ లను తీసుకురాగలరు.
- జనవరి మరియు ఫిబ్రవరి మాసాలలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి, మెత్తని బొంత/రజాయి, స్లీపింగ్ బ్యాగ్, స్వెటర్, క్యాప్ మరియు సాక్స్ వంటి పూర్తి శీతాకాలపు దుస్తులను తప్పకుండా తీసుకురావాలి. సూచించబడిన ఉష్ణోగ్రతలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- పగటి సమయం: 15°C–22°C (59°F–72°F)
- రాత్రి సమయం: 6°C–12°C (43°F–54°F)
- ఈ నెలల్లో అప్పుడప్పుడు వర్షం పడే అవకాశం ఉన్నందున, దోమల నివారణ క్రీమ్, టార్చ్, ఆసనంతో పాటు రెయిన్‌కోట్ లేదా గొడుగు మరియు వ్యక్తిగత ఉపయోగానికి సంబంధించిన ఇతర వస్తువులను కూడా మీరు తీసుకురావచ్చు.
సమీపంలోని హోటళ్ళు
కుంభమేళా సందర్భంలో ప్రత్యేక వసతి మరియు భోజనం అవసరమైన భక్తులు, దయచేసి తమ స్వంత ఏర్పాట్లు చేసుకోగలరు. సమీపంలోని హోటళ్ళ జాబితా క్రింద ఇవ్వబడింది. దయచేసి హోటల్ తో నేరుగా సంప్రదించి రిజర్వేషన్ చేసుకోగలరు.
భోజనం
అదనపు చార్జీలు లేకుండా భక్తులకు సాధారణ భోజనం సమకూర్చబడుతుంది.
ప్రయాగరాజ్ చేరుకోవడానికి:
- విమానం ద్వారా: శిబిరానికి ప్రయాగరాజ్ బమ్రౌలీ విమానాశ్రయం (IXD) దాదాపు 20 కి.మీ. దూరంలో ఉంటుంది.
- రైలు ద్వారా: శిబిరానికి ప్రధాన రైల్వే స్టేషన్, ప్రయాగరాజ్ జంక్షన్ (PRYJ) 10 కి.మీ. దూరంలో ఉంటుంది. సమీప రైల్వేస్టేషన్ ప్రయాగ్‌రాజ్ సంగం, సుమారు 2 కి.మీ దూరంలో ఉంటుంది. ఏ స్టేషన్ లోనైనా దిగి శిబిరానికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసుకోవచ్చు.
విమానాశ్రయం/రైల్వేస్టేషన్ నుండి రవాణా సౌకర్యాలు:
మీ స్వంత ఏర్పాట్లు మీరు చేసుకోవచ్చు లేదా శ్రీ ధర్మేంద్ర జైశ్వాల్ గారిని (+91) 93076 66851 లేదా (+91) 95981 32021 ద్వారా సహాయం కోసం సంప్రదించవచ్చు. నిర్ణీత చార్జీలు వర్తిస్తాయి మరియు అవి భక్తుల నుండి తీసుకోబడతాయి.
ప్రత్యేక స్నానపు తేదీల సందర్భంగా:
పెద్దసంఖ్యలో ఉండే జనసమూహాల కారణంగా, వాహనాల సంఖ్య పరిమితంగా ఉండవచ్చు. కాబట్టి శిబిరానికి మీరు నడవాల్సివస్తే దయచేసి సులభంగా ఉండేట్లు మీ సామాను తీసుకురండి.

కుంభమేళా వద్ద వై.ఎస్.ఎస్. శిబిరం యొక్క చిరునామా
ప్లాట్ నంబర్లు. 1092 మరియు 1093
శంకరాచార్య మార్గం, సెక్టార్ 19
కుంభమేళా క్షేత్రం, ప్రయాగరాజ్
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం, ప్రయాగరాజ్
468/270, 468/270, నయీ బస్తీ సోహ్బాటియా బాగ్,
ప్రయాగరాజ్ (అలహాబాద్),
ఉత్తర్ ప్రదేశ్ – 211006
ఫోన్: 9454066330, 9415369314, 9936691302
ఈ-మెయిల్: [email protected]

విచారణల కోసం సంప్రదించాల్సిన వివరాలు
పరమహంస యోగానంద శాఖా మఠం – రాంచీ
పరమహంస యోగానంద పథ్
రాంచీ – 834001
ఝార్ఖండ్
ఫోన్: (0651) 6655 506
(సోమవారం – శనివారం, ఉదయం 09:30 – సాయంత్రం 04:30)
ఈ-మెయిల్: [email protected]