ప్రారంభకుల కోసం ధ్యాన విధానం

పరమహంస యోగానందగారి బోధనల నుండి

యోగానందగారు ఆరుబయట ధ్యానం చేస్తున్నారు

1) ప్రార్థన

మీరు ధ్యానాసనంలో స్థిరపడిన తర్వాత, మీ భక్తిని వ్యక్తపరుస్తూ మరియు మీ ధ్యానానికి ఆయన ఆశీస్సులు అర్ధిస్తూ, దేవునికి హృదయపూర్వకమైన ప్రార్థనతో ప్రారంభించండి.

2) ఒత్తిడంతా తొలగించడానికి బిగింపు మరియు సడలింపు చేయండి

  • ఊపిరి పీల్చుకోండి, మొత్తం శరీరాన్ని మరియు పిడికిలి బిగిస్తూ.
  • అన్ని శరీర భాగాలను ఒకేసారి సడలించండి మరియు మీరు అలా చేస్తున్నప్పుడు, నోటి ద్వారా శ్వాసను రెండుసార్లు ఉచ్ఛ్వాసము చేస్తూ, “హహ్, హహ్” అని బయటకు వదలండి.

ఈ అభ్యాసాన్ని మూడు నుండి ఆరు సార్లు పునరావృతం చేయండి. ఆ తర్వాత శ్వాసను మరచిపోండి. సాధారణ శ్వాసలో వలె, అది సహజంగా లోపలికి మరియు బయటికి ప్రవహించనివ్వండి.

3) ఆధ్యాత్మిక నేత్రంపై దృష్టి కేంద్రీకరించండి

కనురెప్పలు సగానికి మూసి ఉంచి (లేదా పూర్తిగా మూసి ఉంచి, ఇది మీకు మరింత సౌకర్యవంతంగా ఉంటే), పైకి చూడండి, కనుబొమ్మల మధ్య ఒక బిందువు ద్వారా బయటకు చూస్తున్నట్లుగా చూపును మరియు శ్రద్ధను కేంద్రీకరించండి. (ఏకాగ్రతలో ఉన్న వ్యక్తి తరచుగా ఈ ప్రదేశంలో తన కనుబొమ్మలను ముడివేస్తుంటాడు.) కళ్ళను క్రాస్ చేయవద్దు లేదా ఒత్తిడికి గురి చేయవద్దు; నిశ్చింతగా మరియు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉన్నప్పుడు చూపు పైకి సహజంగానే వస్తుంది.

ధ్యానిస్తున్న బుద్ధుడుకనుబొమ్మల మధ్య స్థానంలో మొత్తం శ్రద్ధను ఉంచడం ముఖ్యం. ఇది కూటస్థ లేదా క్రీస్తు చైతన్య కేంద్రం, ఏసు చెప్పిన ఒకే కన్ను యొక్క స్థానం: “శరీరపు కాంతి కన్ను: కాబట్టి నీ కన్ను ఒక్కటిగా ఉంటే, నీ శరీరమంతా కాంతితో నిండి ఉంటుంది” (మత్తయి 6:22).

ధ్యానం యొక్క ఉద్దేశ్యం నెరవేరినప్పుడు, భక్తుడు తన చైతన్యం స్వతస్సిద్ధంగా ఆధ్యాత్మిక కన్ను వద్ద కేంద్రీకృతమై ఉన్నట్లు కనుగొంటాడు మరియు అతను తన అంతర్గత ఆధ్యాత్మిక సామర్థ్యం మేరకు, ఆత్మతో సంతోషకరమైన దివ్య ఐక్యతా స్థితిని అనుభవిస్తాడు.

ఆధ్యాత్మిక నేత్రాన్ని దర్శించడానికి గాఢమైన ఏకాగ్రత మరియు ప్రశాంతత అవసరం: నీలిరంగు వృత్తం చుట్టూ బంగారు వర్ణం, దాని మధ్యలో ఐదు కోణాల తెల్లని నక్షత్రం కొట్టుకొంటూ ఉంటుంది. ఆధ్యాత్మిక నేత్రాన్ని చూడగలిగిన వారు గాఢమైన ఏకాగ్రతతో మరియు దేవునికి భక్తిపూర్వకమైన ప్రార్థన ద్వారా దానిలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించాలి. దీనికి అవసరమైన గాఢమైన ప్రశాంతత మరియు ఏకాగ్రత, శాస్త్రీయమైన యోగదా సత్సంగ ఏకాగ్రత ప్రక్రియలను మరియు ధ్యాన ప్రక్రియలను నిలకడగా సాధన చేయడం ద్వారా సహజంగానే అభివృద్ధి చెందుతాయి. [అవి యోగదా సత్సంగ పాఠాలలో బోధించబడ్డాయి].

4) మీ స్వంత హృదయ భాషలో దేవునికి గాఢంగా ప్రార్థించండి

ధ్యాన సమాధిలో వై.ఎస్.ఎస్. మాజీ అధ్యక్షురాలు శ్రీ దయామాత

Ways to Deepen Your Meditation

(సారాంశం) (2:54 నిముషాలు)

మీరు ఆధ్యాత్మిక కన్ను యొక్క కాంతిని చూసినా లేదా చూడకపోయినా, మీ ఏకాగ్రతను కనుబొమ్మల మధ్య కూటస్థ కేంద్రంలో కొనసాగిస్తూ దేవునికి మరియు ఆయన మహాత్ములకు గాఢంగా ప్రార్థిస్తూ ఉండండి. మీ హృదయ భాషలో వారి సాన్నిధ్యం మరియు వారి ఆశీస్సుల కోసం ప్రార్థించండి.

యోగదా సత్సంగ పాఠాల నుండి లేదా పరమహంస యోగానందగారి విస్పర్స్ ఫ్రమ్ ఎటర్నిటీ (Whispers from Eternity) లేదా మెటాఫిజికల్ మెడిటేషన్స్ (Metaphysical Meditations) నుండి ప్రతిజ్ఞ లేదా ప్రార్థనను తీసుకొని మీ స్వంత భక్తి, తపనతో దానిని ఆధ్యాత్మికం చేయడం ఒక మంచి అభ్యాసం.

కనుబొమ్మల మధ్య బిందువు మీద దృష్టిని నిలిపి భగవంతుడి ప్రతిస్పందనైన ప్రశాంతత, గాఢమైన శాంతి మరియు ఆంతరిక ఆనందముగా అనుభూతి చెందే వరకు భగవంతుడికి ప్రార్థన చేయండి మరియు గానం చేయండి.

పరమహంస యోగానందగారి ప్రార్థనల నుండి
ఒక ప్రతిజ్ఞను సాధన చేయండి

5) రోజువారీ అభ్యాసంతో గాఢమైన ప్రక్రియల కోసం తయారు కావడం

రాంచీలోని స్మృతి మందిర్‌లో ధ్యానం చేస్తున్న భక్తులు

ధ్యానం వ్యవధి ఉదయం కనీసం ముప్పై నిమిషాలు మరియు రాత్రి ముప్పై నిమిషాలు ఉండాలి. మీరు ధ్యాన ప్రశాంత స్థితిని ఆస్వాదిస్తూ ఎంత ఎక్కువసేపు కూర్చోగలరో, ఆధ్యాత్మికంగా అంత వేగంగా అభివృద్ధి చెందుతారు. ధ్యానంలో మీరు అనుభవించే ప్రశాంతతను మీ రోజువారీ కార్యకలాపాల్లోకి తీసుకెళ్ళండి; మీ జీవితంలోని ప్రతి విభాగంలోనూ సామరస్యాన్ని మరియు ఆనందాన్ని తీసుకురావడానికి ప్రశాంతత మీకు సహాయం చేస్తుంది.

పైన పేర్కొన్న సూచనల ప్రకారం రోజువారీ అభ్యాసం ద్వారా, యోగదా సత్సంగ పాఠాలలో ఇవ్వబడిన ఏకాగ్రత మరియు ధ్యానం యొక్క గాఢమైన ప్రక్రియల సాధన కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవచ్చు. ఈ వైజ్ఞానిక ప్రక్రియలు దేవుని సాన్నిధ్యం అనే మహాసముద్రంలోకి మరింత లోతుగా వెళ్ళటానికి సాధ్యం చేస్తాయి. మనమందరం ఆ పరమాత్మ సముద్రంలో ఈ క్షణంలోనే ఉన్నాము; కానీ స్థిరమైన, భక్తిపూర్వకమైన, శాస్త్రీయ ధ్యానం ద్వారా మాత్రమే మనం భగవంతుని ఆనందం యొక్క విస్తారమైన సముద్రంలో వ్యక్తిగతమైన ఆత్మ కెరటాలమని మనం స్పృహతో గ్రహించగలము.

ధ్యానంలో లోతుగా వెళ్ళడానికి మరిన్ని సాధనములు.

పరమహంస యోగానందగారి రచనల నుండి:

“దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి మొదటి అడుగుగా, భక్తుడు సరైన ధ్యానాసనంలో, నిటారుగా ఉన్న వెన్నెముకతో స్థిరంగా కూర్చోవాలి మరియు శరీరాన్ని బిగించి సడలించాలి – ఎందుకంటే సడలించడం ద్వారా కండరాల నుండి చైతన్యం విడుదల అవుతుంది.

సూర్యాస్తమయ సమయంలో సముద్ర తీరంలో ధ్యానం

“యోగి సరైన గాఢమైన శ్వాసతో ప్రారంభిస్తాడు, అనేక సార్లు శ్వాస పీల్చుతూ మరియు మొత్తం శరీరాన్ని బిగిస్తూ మరియు శ్వాస వదులుతూ మరియు సడలిస్తూ. ప్రతి ఉచ్ఛ్వాసముతో శారీరక నిశ్చల స్థితిని పొందే వరకు అన్ని కండరాల ఒత్తిడి మరియు కదలికలకు దూరంగా ఉండాలి.

“అప్పుడు, ఏకాగ్రత ప్రక్రియల ద్వారా, విరామము లేని కదలిక మనస్సు నుండి తొలగించబడుతుంది. శరీరం మరియు మనస్సు యొక్క సంపూర్ణ నిశ్చలతలో, యోగి ఆత్మ ఉనికికి నిదర్శనంగా అనిర్వచనీయమైన శాంతిని అనుభవిస్తాడు.

“శరీరంలో, ప్రాణం కొలువుంటుంది; మనస్సులో, కాంతి కొలువుంటుంది; ఆత్మలో, శాంతి కొలువుంటుంది. ఆత్మలోకి ఎంత లోతుగా వెళితే అంత శాంతిని అనుభూతి చెందుతారు; అది మహాచైతన్యం/అధిచైతన్యం.

“గాఢమైన ధ్యానం ద్వారా భక్తుడు శాంతి యొక్క అవగాహనను విస్తరింపచేసుకొని మరియు తన చైతన్యం విశ్వమంతా వ్యాపిస్తున్నట్లు, అన్ని జీవులు మరియు సమస్త సృష్టి ఆ శాంతిలో కరిగిపోతున్నట్లుగా తెలుసుకున్నప్పుడు, అతడు విశ్వచైతన్యంలోకి ప్రవేశిస్తున్నాడు. పువ్వులలోను, వాతావరణంలోను – అన్నిచోట్లా ఆ శాంతి ఉందని తెలుసుకుంటాడు. భూమి మరియు సమస్త లోకాలు శాంతి సాగరంలో తేలుతున్న బుడగలలా దర్శిస్తాడు.”

— శ్రీ పరమహంస యోగానంద

ఇతరులతో షేర్ చేయండి