
పరమహంస యోగానందగారి శాశ్వతమైన ఆధ్యాత్మిక గ్రంథం యొక్క సమగ్ర అవలోకనం.
2021-22 సంవత్సరాలు పరమహంస యోగానందగారి ఒక యోగి ఆత్మకథ 75వ వార్షికోత్సవానికి ఆనవాలుగా నిలుస్తుంది. అత్యంత ప్రశంసలు పొందిన ప్రపంచంలోని ఆధ్యాత్మిక గ్రంథాలలో ఇది కూడా ఒకటి.
పరమహంస యోగానందగారి జీవిత కథకు అంకితం చేయబడిన ఈ పేజీకి స్వాగతం. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను మరియు మనస్సులను స్పృశించింది. ఏడు దశాబ్దాలకు పైగా ఈ పుస్తకం ప్రపంచ నాగరికతకు భారతదేశం అందించిన అసమానమైన మరియు శాశ్వత సహకారమైన, భారతీయ ప్రాచీన యోగశాస్త్రమును మరియు దైవసాక్షాత్కార శాస్త్రీయ పద్ధతులను లెక్కలేనంతమంది పాఠకులకు పరిచయం చేసింది.
1946లో మొదటిసారిగా ముద్రించబడినప్పటి నుండి ఒక కళాఖండంగా ప్రశంసించబడింది, ఈ ఆత్మకథ నిరంతరం ఎక్కువగా అమ్ముడయ్యే ఆధ్యాత్మిక పుస్తకాల జాబితాలలో ఉంది మరియు వివిధ మార్గాల్లోని ఆధ్యాత్మిక జిజ్ఞాసువులచే చదవబడుతోంది. ఈ గ్రంథం 1999లో “శతాబ్దపు 100 ఉత్తమ ఆధ్యాత్మిక పుస్తకాలలో” ఒకటిగా గౌరవించబడింది.
నిరంతరం కొనసాగుతున్న మరియు విస్తరిస్తున్న ఆసక్తి కారణంగా,ఈ పుస్తకం భారతీయ ఉపఖండంలోని 15 ప్రధాన భాషలలోకి మరియు ప్రపంచవ్యాప్తంగా యాభైకి పైగా భాషలలోకి అనువదించబడింది మరియు ప్రచురించబడింది.
అట్ట కవరు, పేపరు బ్యాక్, ఆడియో మరియు ఈ-పుస్తకము రూపాలలో లభిస్తుంది.
ఈ-బుక్ డౌన్లోడ్ చేసుకోండి
ఈ ఈ-బుక్ పరిశ్రమ-ప్రామాణిక EPUB ఆకృతిలో ఉంటుంది మరియు తగిన ఈ-రీడింగ్ యాప్‌తో ఎక్కువ పరికరాలలో చదవవచ్చు.
ఇంగ్లీష్ ఆడియో పుస్తకం సి.డి.ని కొనుక్కోండి
చదివినవారు: “గాంధీ” చిత్రానికి అకాడమీ అవార్డు గ్రహీత సర్ బెన్ కింగ్స్లే
పుస్తకము నమూనా
అత్యంత స్ఫూర్తిదాయక ప్రకరణము
ఒక విద్యార్థి పరమహంసగారిని ఇలా అడిగాడు: "సార్,ఒక యోగి ఆత్మకథలో మీరు సగటు మనిషికి అత్యంత స్ఫూర్తిదాయకంగా ఏ భాగాన్ని భావిస్తారు?" గురుదేవులు కాసేపు ఆలోచించి ఇలా అన్నారు:
“నా గురుదేవులు శ్రీయుక్తేశ్వర్ గారు చెప్పిన ఈ మాటలు: ‘మనుష్యులందరి గత జీవితాలూ అనేక లజ్జాకర విషయాలతో మసిబారినవే. మనిషి దైవీభావనలో దృఢంగా నెలకొనేవరకు మానవ ప్రవర్తనను ఎన్నటికీ నమ్మడానికి వీలులేదు. నువ్వు కనుక ఇప్పుడు ఆధ్యాత్మిక కృషి చేస్తున్నట్లయితే ఇకముందు ప్రతీదీ మెరుగవుతుంది.'”
ఒక అసమానమైన రచయిత, ఒక అసమానమైన గ్రంథం మరియు ఒక అసమానమైన సందేశం
"మన కాలపు అత్యంత ముఖ్యమైన పోకడలలో ఒకటి చైతన్యం మరియు పదార్థానికి మధ్య ఉన్న సంబంధాన్ని, క్రమానుగత ఆవిర్భావాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం....వైద్యులు, అలాగే వారి రోగులు, మన రోజువారీ ఆరోగ్యం మరియు శ్రేయస్సు అనేది మన మానసిక స్థితిపై ఎంతగా ఆధారపడి ఉందో ఇప్పుడు తెలుసుకోవడం ప్రారంభించారు.....శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క పరస్పర సంబంధాన్ని వెల్లడిస్తూ, ఈ పరిశోధనలు దీర్ఘకాలిక బాధలకు చికిత్స చేయడంలో తీవ్ర ప్రభావాన్ని చూపించాయి మరియు చాలా సంవత్సరాల క్రితం పరమహంస యోగానందగారు బోధించిన "ఎలా జీవించాలి" అనే సూత్రాలు, అపారమైన విలువను తెలియచెప్పే బాధ యొక్క దృక్కోణానికి దారితీశాయి.
ఈ పుస్తకము నాకు చాలా ఇష్టమైనది. తమ ఆలోచనలు మరియు భావజాలాలను సవాలు చేయగలిగే ధైర్యం ఉన్న వారందరు దీనిని తప్పక చదవాలి. ఈ పుస్తకంలోని జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే, మీ జీవితం మరియు దృక్పథం పూర్తిగా మారిపోతాయి. దైవం మీద నమ్మకం ఉంచండి మరియు మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి ?#onelove #begrateful #helponeanother
"(పరమహంస యోగానందగారి) ఒక యోగి ఆత్మకథ చాలా సంవత్సరాలుగా అత్యుత్తమంగా విక్రయించబడుతోంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వారి సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాలు, రిట్రీట్లు హృదయపూర్వకంగా కోరుకునే ఆత్మలకు ఎంతో ప్రియమైనవి....1950లో గ్రేటర్ లాస్ ఏంజిలిస్ లో నేను ఆయనను [సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యాలయములో] కలిసినప్పుడు నా మీద ఆయన ప్రభావము నాకు గుర్తుంది....ఆయనను గురించిన శాంతి భావం ఈ ప్రపంచంలోనిది కానట్లు అనిపించింది మరియు మనం ప్రతిరోజు అన్వేషించే సాధారణ రకమైన ప్రశాంతతకు మించి ఉంది. ఆయన ప్రజాదరణకి కారణం స్పష్టంగా కనిపించింది... ఆకర్షణ కంటే ఆయన విజయమే ఎక్కువ. ఆయన దగ్గర ఒక రహస్యం ఉంది, అది క్రియాయోగ రహస్యం (యోగము యొక్క సార్వత్రిక చర్య..."
"ఆధునిక హిందూ సాధువుల అసాధారణ జీవితాలు మరియు శక్తుల ప్రత్యక్ష సాక్షిగా, ఈ పుస్తకానికి సమయానుకూలంగా మరియు కాలానుగుణంగా ప్రాముఖ్యత ఉంది.... పశ్చిమంలో ప్రచురించబడిన ఆయన అసాధారణ జీవితం ఖచ్చితంగా భారతదేశ ఆధ్యాత్మిక సంపదలోని అత్యంత జ్ఞానాన్ని తెలియపరుస్తుంది...."
"అతి మనోహరంగాను మరియు సాధారణంగాను చెప్పిన ఆత్మకథల్లో ఇది ఒకటి...నేర్చుకొనేవారికి నిజమైన జ్ఞానభాండాగారం...ఈ పేజీల్లో మనం కలుసుకొనే వ్యక్తులు గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండిన ఆప్తమిత్రుల్లా మనకు తరచు జ్ఞాపకం వస్తూ ఉంటారు; అలాంటి మహానుభావుల్లో దైవోన్మత్తులైన ఈ గ్రంథకర్త కూడా ఒకరు."
"ప్రఖ్యాతి గాంచిన ఒక యోగి ఆత్మకథలో యోగానందగారు, యోగసాధనలో ఉన్నతస్తరాల్లో సాధకుడు పొందే 'విశ్వచేతనానుభవాన్ని' మనం నిర్ఘాంతపోయే మాటల్లో వర్ణించారు; మానవ స్వభావంలోని వివిధ ఆసక్తికరమైన అంశాలమీద యోగపరమైన, వేదాంతపరమైన దృష్టికోణంనుంచి అనేక వ్యాఖ్యానాలు చేశారు."
సన్నిహిత శిష్యుల కథలు
“ఒక యోగి ఆత్మకథ” వ్రాయడం అనే బృహత్తర కార్యము పూర్తి చేయడానికి పరమహంస యోగానందగారికి చాలా సంవత్సరాలు పట్టింది. నేను 1931లో మౌంట్ వాషింగ్టన్ వచ్చినప్పటికే ఆయన దానిపై పని చేయడం ప్రారంభించారు. ఒకసారి నేను ఆయన పఠన మందిరములో కొన్ని కార్యదర్శి విధులను నిర్వహిస్తున్నప్పుడు, ఆయన వ్రాసిన మొదటి అధ్యాయాలలో ఒకదాన్ని చూసే భాగ్యం నాకు కలిగింది – అది “టైగర్ స్వామి” అధ్యాయం. అది ఒక పుస్తకంలోకి చేర్చబడేది కావున దానిని భద్రపరచమని గురుదేవులు కోరారు.

“ఆహో” మరియు “ఓహా”ల మధ్య, మేము భారతదేశంలోని గొప్ప సాధువులు మరియు ఋషులతో కలిసి ఆయన గడిపిన జీవిత వృత్తాంతాన్ని, మా సుదీర్ఘ నిరీక్షణ తరువాత చివరకు ఇలా చూడటంతో కలిగిన ఆనందాన్ని పూర్తిగా వ్యక్తపరచలేకున్నాము — ఆయన సాన్నిధ్యంలో మేము గడిపిన అత్యంత విలువైన గంటలలో వాటిని గురించి చెప్పి తరచుగా మమ్మల్ని మంత్రముగ్ధులను చేసేవారు. ఆయన కొన్ని పేజీలను తెరిచి మహావతార్ బాబాజీ పేజీ వద్దకు వచ్చి ఆగిపోయారు. దాదాపు ఊపిరి ఆగిపోయేటంత ఉత్కంఠతతో మేము మా భక్తి భావమును అర్పించాము మరియు మన పరమ-పరమ-పరమగురువుల రూపాన్ని చూసే భాగ్యము పొందిన మొట్టమొదటి వారిలో ఒకరిగా ఉండి ఆశీస్సులు పొందాము.

గురుదేవులు తన పుస్తకంలోని అధిక భాగం ఆశ్రమములోని తన పఠన మందిరములోనే వ్రాశారు. ఆయన రాత్రంతా నిర్దేశించిన సందర్భాలు, మరియు కొన్ని సార్లు రోజంతా లేదా అంతకంటే ఎక్కువ సమయం కొనసాగిన సందర్భాలు ఉన్నాయని నాకు గుర్తు. దయామాత మరియు ఆనందమాత నిర్వహించే కార్యదర్శి విధులలో నేను పాల్గొనలేదు, ఆయన మాటలను వాళ్ళు కొన్నిసార్లు సంక్షిప్త లిపిలో మరియు ఇతర సమయాల్లో టైప్‌రైటర్‌ను ఉపయోగించి వ్రాసుకునేవారు. నా బాధ్యత చాలావరకు వారికి భోజనం వండటం, అందువల్ల వారు నిరంతరాయంగా తమ పని చేసుకునేవారు!

ప్రపంచంలోని 53 భాషల్లోకి అనువదించబడింది
ఒక యోగి ఆత్మకథను రూపొందించడం

ఈ గ్రంథం రచించబడుతుందని చాలా కాలం క్రితమే భవిష్యవాణి చెప్పబడింది. ఆధునిక కాలంలో యోగపునరుజ్జీవనానికి విశేష కృషి చేసిన ప్రముఖ వ్యక్తులలో ఒకరు, పందొమ్మిదవ శతాబ్దపు గౌరవనీయ గురువులైన శ్రీ శ్రీ లాహిరీ మహాశయులు ఇలా ప్రవచించారు: “నేను పోయిన తరువాత సుమారు ఏభైఏళ్ళకి, పడమటి దేశాల్లో యోగవిద్య పట్ల కలగబోయే గాఢమైన ఆసక్తి కారణంగా, నా జీవిత వృత్తాంతం ఒకటి వ్రాయడం జరుగుతుంది. యోగవిద్యాసందేశం భూగోళాన్ని చుట్టేస్తుంది. సర్వమానవ సోదరత్వాన్ని – అంటే, మానవజాతి ఏకైక పరమపిత ప్రత్యక్ష దర్శనంమీద ఆధారపడ్డ ఐకమత్యాన్ని నెలకొల్పడానికి తోడ్పడుతుందది.”
చాలా సంవత్సరాల తరువాత, శ్రీ లాహిరీ మహాశయుల ఉన్నత శిష్యులైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు ఈ భవిష్యవాణిని శ్రీ యోగానందగారికి తెలియజేశారు.
ఒక మనఃపూర్వకమైన హామీ
గ్రంథం చివరి అధ్యాయంలో, పరమహంస యోగానందగారు ఇలా వ్రాశారు:
“దేవుడంటే ప్రేమ; సృష్టికి ఆయన నిర్ణయించిన ప్రణాళిక ప్రేమలోనే పాదుకోగలదు. ఆ చిన్న ఆలోచన, పాండిత్యమండితమైన తర్కవితార్కాలకన్నా ఎక్కువగా మానవ హృదయానికి ఊరట కలిగించడం లేదూ? సత్యగర్భంలోకి చొచ్చుకుపోయిన ప్రతి సాధువూ దివ్యమైన విశ్వప్రణాళిక ఒకటి ఉంటుందనీ అది సుందరమైనదనీ ఆనందమయమైనదనీ ధృవపరుస్తాడు.”
భారతదేశపు ఋషుల సర్వోత్కృష్టమైన సత్యాలపై గాఢమైన విశ్వాసం ద్వారా మీ ఆత్మను మీరు కనుగొనగలరని మా ఆశ మరియు ఆ విశ్వాసం మిమ్మల్ని పరీక్షల ద్వారా, నిజమైన ఆనందం మరియు నెరవేర్పుల ప్రయత్నాలలో మిమ్మల్ని నిలబెడుతుంది.