ఆధ్యాత్మిక జీవన కళ

ధ్యానం మరియు ఆధ్యాత్మిక జీవనంపై పరమహంస యోగానందగారి  పాఠాలు

భూమిపై మన జీవితానికి నిజమైన ఉద్దేశ్యం ఏమిటి?

యుగయుగాలుగా, ఆధ్యాత్మికవేత్తలు, సాధువులు, ఋషులు మరియు యోగులు అందరూ మనకు ఒకే సమాధానం ఇచ్చారు: భగవంతునితో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడం — జీవితంలో అనుదినము పరమాత్మతో మనలను కలుపుతుంది. ఆధ్యాత్మిక జీవనం అనేది ఆ సంబంధాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ఆచరణాత్మక విధానం.

"ఆత్మసాక్షాత్కారం అంటే — శరీరం, మనస్సు మరియు ఆత్మలో — మనం భగవంతుని సర్వవ్యాపకత్వముతో ఏకమై ఉన్నామని తెలుసుకోవడం; మనం ఎల్లప్పుడూ దాని సమీపంలో లేము అనుకొని, అది మనకు రావాలని మనం ప్రార్థించాల్సిన అవసరం లేదు, కాని భగవంతుని సర్వవ్యాపకత్వమే మన సర్వవ్యాపకత్వం; మనం ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఆయనలో భాగమే. మనం చేయాల్సిందల్లా మన జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడమే."

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

మనం వెతుకుతున్న జ్ఞానం, సృజనాత్మకత, ఆనందం మరియు భద్రత అన్నీ మనలోనే ఉన్నాయని, అవి మన ఉనికి యొక్క సారమని పరమహంస యోగానందగారు చూపించారు.

దీనిని పూర్తిగా గ్రహించడం — కేవలం మేధో తత్వశాస్త్రంలా కాకుండా మన జీవితంలోని ప్రతి భాగంలో శక్తి మరియు అవగాహనను తెచ్చే వాస్తవమైన అనుభవంగా — తెలుసుకోవడమే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క క్రియాయోగ బోధనలు.

శరీరం, మనస్సు మరియు ఆత్మలో సమతుల్యత మరియు సామరస్యం

ప్రార్థిస్తున్న మరియు ధ్యానిస్తున్న భక్తులుమేము బోధించే సమతుల్య జీవనశైలి మరియు ధ్యాన సాధన శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. అవి మన స్వభావంలోని ఈ అంశాలన్నింటినీ బలోపేతం చేయడానికి, సమతుల్యం చేయడానికి మరియు ఆరోగ్యంగా ఉంచడానికి రూపొందించబడిన సమగ్ర వ్యవస్థ.

ఈ బోధనలు జీవన గమనంలో ఏది వచ్చినా విజయం సాధించడానికి వనరులను అందిస్తాయి మరియు ఒకరి గాఢమైన సాధనకు ప్రమాణంగా — అంతిమ వాస్తవికత యొక్క గాఢమైన అవగాహన మరియు అనుభవాన్ని అందిస్తాయి.

మన భారత ఉపఖండంలో (మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఎస్.ఆర్.ఎఫ్. ద్వారా) ధ్యానం చేసేవారు మరియు ఆధ్యాత్మిక అన్వేషకుల సమాజంలో మద్దతు మరియు సహవాసాన్ని కనుగొనండి.

ఆత్మ-సాక్షాత్కారం కోరుకునే వారందరికీ పరమహంస యోగానందగారు అందించిన ప్రేరణ మరియు సాధన (ఆధ్యాత్మిక సాధన మరియు క్రమశిక్షణ యొక్క మార్గం) వెదకడానికి దిగువ పట్టిక నుండి ఎంచుకోండి, లేదా…

క్రింది ఆధారములను బ్రౌజ్ చేయండి:

ఇతరులతో షేర్ చేయండి