పరమహంస యోగానందగారి సంపూర్ణ రచనలు

పరమహంస యోగానందగారు జన్మించిన ఒక శతాబ్దం తరువాత, మన కాలంలో ఉన్న ప్రముఖమైన ఆధ్యాత్మిక ప్రసిద్ధులలో ఒకరిగా గుర్తింపబడ్డారు; ఇంకా ఆయన జీవితం మరియు రచనల యొక్క ప్రభావం పెరుగుతూనే ఉంది. ఆయన దశాబ్దాల క్రితం కనుగొన్న చాలా మతపరమైన మరియు తాత్విక విషయములు మరియు పద్ధతులు ఇప్పుడు విద్య, మనస్తత్వశాస్త్రం, వ్యాపారం, వైద్య మరియు ఇతర రంగాల్లో కనబడుతున్నాయి – ఇవి మానవ జీవనం యొక్క సమీకృత, దయామయ మరియు ఆధ్యాత్మిక ఆశయాలకు విస్తృతంగా దోహదపడుతున్నాయి.

పరమహంస యోగానందగారి బోధనలు, ఇలా పలు రంగాల్లో మరియు విభిన్నమైన తత్వ మరియు అదిభౌతిక సంస్థల యొక్క జ్ఞానులచే వివరింపబడడం, సృజనాత్మకంగా ఉపయోగపడడం ఆయన నేర్పిన ఆచరణాత్మక ప్రయోజనాన్ని స్పష్టపరుస్తుంది. ఇంకా ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సమయం గడిచేకొద్దీ బలహీనపడకుండా, విచ్ఛిన్నమవ్వకుండా, వక్రీకృతమవ్వకుండా భద్రపరుచుకోవలసిన అవసరం ఎంత వుందో కూడా స్పష్టం చేస్తుంది.

పరమహంస యోగానందగారి గురించి వివిధ ఆధారాలనుండి సమాచారం వస్తున్న కొద్దీ, పాఠకులు ఒక్కొక్కసారి ఆయన జీవితాన్ని మరియు బోధనలను గురించి ఖచ్చితమైన విషయాలే ప్రచరింపడుతున్నాయని ఎలా తెలుసుకోవాలి అని అడుగుతుంటారు. ఆ ప్రశ్నలకు సమాధానంగా మేము చెప్తున్నది ఏమిటంటే పరమహంసగారు ఆయన బోధనలను వ్యాప్తి చెయ్యడానికి మరియు ముందు తరాలకోసం వాటి స్వచ్ఛతని, సమగ్రతని భద్రపరచడం కోసం యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ను స్థాపించారు. ఆయన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క సన్నిహిత భక్తుల్ని స్వయంగా ఎంపిక చేసి, వాళ్ళకు శిక్షణ ఇచ్చారు మరియు వాళ్ళకు తమ ఉపన్యాసాలు, రచనలు మరియు యోగదా సత్సంగ పాఠాల తయారీకి, వాటిని ప్రచురించడానికి ప్రత్యేక సూచనలు ఇచ్చారు. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రచార సమితి యొక్క సభ్యులు ఈ ప్రియతమ విశ్వగురువు యొక్క సార్వత్రిక సందేశాలను వాటి అసలైన శక్తితో మరియు ప్రామాణికతతో భద్రపరచడానికి ఈ సూచనలను పవిత్ర విశ్వాసంతో గౌరవిస్తారు.

పరమహంసగారు ఆయన విశ్వవ్యాప్తమైన ఆధ్యాత్మిక మరియు మానవీయ కార్యాల కోసం స్థాపించిన సంస్థను గుర్తించడానికి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పేరును మరియు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ముద్రను (క్రింద చూపినటువంటి) స్వయంగా ఏర్పాటు చేశారు. ఇవి అన్నీ వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పుస్తకాల మీద, ఆడియో మరియు వీడియో రికార్డింగ్స్, ఫిల్ముల మీద మరియు ఇతర ప్రచురణల మీద కనిపించి పాఠకుడికి ఆ రచన శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు స్థాపించిన సంస్థకు సంబంధించినదేనని హామీ ఇస్తాయి మరియు ఆయన బోధనలను ఆయన ఇవ్వమన్నట్లే యదార్థముగా ఇవ్వబడుతున్నాయని తెలియజేస్తాయి.

అన్ని ముఖ్యమైన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురణలకు వాటి కవరు మీద ఈ హోలోగ్రామ్ (కుడి వైపు చూపినటువంటి) ఉంటుంది. ఇది పాఠకుడికి పరమహంస యోగానందగారిచే స్థాపించబడ్డ సంస్థ నుండి ఈ ప్రచురణలు ఆవిర్భవించినవేనని హామీ ఇస్తుంది మరియు ఆయన బోధనలను ఆయన ఇవ్వమన్నట్లే యదార్థముగా ఇవ్వబడుతున్నాయని తెలియజేస్తుంది.

పరమహంస యోగానంద — తూర్పు మరియు పాశ్చాత్య దేశాలకు యోగి.

ఇతరులతో షేర్ చేయండి