యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా గురించి

"ఆత్మసాక్షాత్కారమంటే మనం పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వంతో ఏకమై ఉన్నామనీ — శరీరంలోనూ, మనస్సులోనూ, ఆత్మలోనూ — తెలుసుకోవడం..."

—పరమహంస యోగానంద

పరమహంస యోగానందగారి ప్రామాణిక ఫోటో

భారతదేశంలో సహస్రాబ్దుల క్రితం ఉద్భవించిన పవిత్ర ఆధ్యాత్మిక సశాస్త్రీయమైన క్రియాయోగం యొక్క సార్వత్రిక బోధనలను భారతదేశంలో మరియు పొరుగు దేశాలలో అందుబాటులోకి తీసుకురావడానికి పరమహంస యోగానందగారు 1917లో యోగదా సత్సంగ సొసైటీ (వై.ఎస్.ఎస్.) సంస్థను స్థాపించారు. ఏ మతమునకు సంబంధం లేనటువంటి ఈ బోధనలు సర్వతోముఖ విజయం మరియు శ్రేయస్సును సాధించడానికి పూర్తి తత్వశాస్త్రం మరియు జీవన విధానాన్ని, అలాగే జీవిత అంతిమ లక్ష్యాన్ని — పరమాత్మతో జీవాత్మ యొక్క ఐక్యత సాధించడానికి ధ్యానం యొక్క పద్ధతులు కలిగి ఉంటాయి.

పరమహంస యోగానందగారు రూపొందించిన ఆశయాలు మరియు ఆదర్శాలలో వ్యక్తీకరించబడినట్లుగా, విభిన్న ప్రజలు మరియు మతాల మధ్య మరింత అవగాహన మరియు సద్భావన స్ఫూర్తిని పెంపొందించడానికి కూడా వై.ఎస్.ఎస్. ప్రయత్నిస్తుంది. మానవ ఆత్మ యొక్క అందం, ఉదాత్తత మరియు దైవత్వాన్ని తమ జీవితాల్లో మరింత పూర్తిగా గ్రహించి, వ్యక్తీకరించడానికి అందరికీ సహాయం చేయడం దీని లక్ష్యం.

భారతదేశం మరియు చుట్టుపక్కల దేశాల వెలుపల, పరమహంస యోగానందగారి బోధనలు 1920లో పశ్చిమ దేశాలకు వెళ్ళినప్పుడు పరమహంసగారు స్థాపించిన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) ద్వారా ప్రపంచమంతటా ప్రచారం చేయబడ్డాయి.

పరమహంస యోగానందగారి బోధనలను వారి జీవితకాలంలో వలెనే ఈరోజు కూడా వై.ఎస్.ఎస్. ముద్రించి యోగదా సత్సంగ పాఠాల ద్వారా అందుబాటులో ఉంచారు. ఈ సమగ్ర గృహ-అధ్యయన శ్రేణి, క్రియాయోగం శాస్త్రం యొక్క అన్ని ధ్యాన పద్ధతులలో, అలాగే యోగానందగారు బోధించిన సమతుల్య ఆధ్యాత్మిక జీవనం యొక్క అనేక ఇతర అంశాలలో సూచనలను అందిస్తుంది.

రాంచీ ఆశ్రమం ప్రధాన భవనం

వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు రాంచీ, దక్షిణేశ్వరం, నోయిడా మరియు ద్వారహాట్ ప్రదేశాలలో ఉన్నాయి. ఇగత్‌పురి, సిమ్లా, చెన్నై, పూణే, దిహికా, పూరి, శ్రీరాంపూర్, తేలరీ మరియు కోయంబత్తూరులో భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో రిట్రీట్ సౌకర్యం కూడా ఉంది. భారతదేశం మరియు నేపాల్ అంతటా కలిపి 200 కేంద్రాలు మరియు మండలీలను కలిగి ఉంది.

స్వామి చిదానందగిరి - వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులుపరమహంస యోగానందగారి జీవితకాలంలో తొలి మరియు అత్యంత సన్నిహిత శిష్యులలో ఒకరైన శ్రీ శ్రీ దయామాతగారు, 1955 నుండి 2010 లో మరణించే వరకు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్‌కు ఆధ్యాత్మిక అధిపతి మరియు అధ్యక్షురాలుగా, అలాగే మరొకరు శ్రీ శ్రీ మృణాళినీమాతగారు, యోగానందగారి యొక్క సన్నిహిత శిష్యులు, 2011 నుండి 2017లో ఆమె మరణించే వరకు ఈ స్థానాల్లో పనిచేశారు. శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి  గారు ప్రస్తుత ఆధ్యాత్మిక అధిపతి మరియు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు.

చాలా మంది వై.ఎస్.ఎస్. భక్తులు పని మరియు కుటుంబ బాధ్యతలు కలిగిన పురుషులు మరియు మహిళలు, వారు ధ్యానంతో తమ చురుకైన జీవితాలను ఎలా సమతుల్యం చేసుకోవాలో యోగదా సత్సంగ బోధనల ద్వారా నేర్చుకుంటారు. యోగానందగారి బోధనలలో, వారు వివాహం మరియు కుటుంబ జీవితాన్ని ఆధ్యాత్మీకరించడం, వ్యాపారం మరియు వృత్తిపరమైన ప్రయత్నాలలో విజయం మరియు శ్రేయస్సును సృష్టించడం మరియు వారు సమాజానికి, దేశం మరియు ప్రపంచానికి అర్థవంతమైన మరియు సేవాదృక్పథంతో సహకరించడానికి మార్గదర్శకత్వం పొందుతారు.

పరమహంసగారి కోరికలకు అనుగుణంగా, యోగదా సత్సంగ సొసైటీ వారి లక్ష్యాలను భారతదేశం యొక్క ప్రాచీన స్వామి సంప్రదాయం ప్రకారం వారు స్థాపించిన సన్యాసుల క్రమం ద్వారా మార్గనిర్దేశం చేయబడింది. వై.ఎస్.ఎస్. యొక్క సన్యాసులు వైరాగ్య అధికారిక ప్రమాణాలు తీసుకుంటారు మరియు యోగదా సత్సంగ భక్తులు మరియు స్నేహితుల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి బాధ్యత వహిస్తారు.

భారత ఉపఖండంలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క అనేక కార్యకలాపాలు మరియు సేవలలో ఇవి ఉన్నాయి:

  • పరమహంస యోగానందగారి మరియు వారి సన్యాసుల శిష్యుల రచనలు, ఉపన్యాసాలు మరియు రికార్డ్ చేసిన ప్రసంగాలను ప్రింట్ రూపంలో మరియు ఈ-బుక్స్‌గా ప్రచురించడం.
  • ఆశ్రమాలు, ఏకాంత ధ్యాన వాసాలు (రిట్రీట్) మరియు ధ్యాన కేంద్రాలను నిర్వహించడం — వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం తో సహా — ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు సంఘం మరియు సహవాస స్ఫూర్తితో కలిసి ఉండవచ్చు.
  • పరమహంస యోగానందగారి బోధనల ప్రదర్శనకు అంకితమైన వెబ్‌సైట్ మరియు YouTube ఛానెల్ని నిర్వహించడం. వారి సన్యాసుల శిష్యుల వీడియో చర్చలతో సహా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు ట్విట్టర్‌లలో వై.ఎస్.ఎస్. సోషల్ మీడియా ఉనికిని కూడా కొనసాగిస్తున్నారు.
  • ఒక పత్రిక, యోగదా సత్సంగ, శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క స్వస్థతకు అంకితం చేయబడింది.
  • వై.ఎస్.ఎస్. సన్యాసుల సంఘాల్లోని సన్యాసుల ఆధ్యాత్మిక శిక్షణ.
  • వివిధ ప్రదేశాలలో సాధన సంగమాలతో సహా సాధారణ ఉపన్యాస పర్యటనలు మరియు తరగతులను నిర్వహించడం. సాధన సంగమములు పరమహంస యోగానందగారి క్రియాయోగ ధ్యాన పద్ధతులు మరియు బోధనలలో నిమగ్నమై అనేక రోజుల పాటు సాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు.
  • పిల్లల కోసం ధ్యానం మరియు ఆధ్యాత్మిక జీవనంపై కార్యక్రమాలు.
  • లేఖ, టెలిఫోన్ మరియు వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందించడం
  • వివిధ స్వచ్ఛంద సహాయ మరియు సంక్షేమ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం.
  • ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలి యొక్క పనికి మార్గనిర్దేశం చేయడం – శారీరక, మానసిక లేదా ఆధ్యాత్మిక సహాయం అవసరమైన వారి కోసం ప్రార్థన చేయడానికి అంకితమైన సమూహాలు మరియు వ్యక్తుల నెట్‌వర్క్; మరియు ప్రపంచ శాంతి మరియు సామరస్యం కోసం.
గురుదేవ మరియు రాంచీ ఆశ్రమం

ఇతరులతో పంచుకోండి