పతంజలి ద్వారా క్రమబద్ధీకరించబడిన అష్టాంగ రాజయోగ మార్గం

తన నిర్వచనాత్మకమైన అనువాదం మరియు వ్యాఖ్యానమైన గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత (God Talks With Arjuna: The Bhagavad Gita) లో పరమహంస యోగానందగారు, భారతదేశానికి అత్యంత ప్రియమైన యోగ గ్రంథమైన గీతలో, యోగము యొక్క మొత్తం శాస్త్రాన్ని ఉపమానంగా వ్యక్తీకరించినట్లు వెల్లడించారు.

యోగ సందేశమైన గీత యొక్క సంగ్రహాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న ఋషి పతంజలి, రాజ (“రాజ”) యోగ మార్గం యొక్క సారాంశాన్ని “యోగ సూత్రాలు” అనే గ్రంథంలో సరళమైన మరియు క్రమబద్ధమైన రీతిలో రూపొందించారు. అది చిన్నదే కానీ ఘనమైనది.

పరమహంస యోగానందగారు ఇలా పేర్కొన్నారు, “పతంజలి సంక్షిప్త సూత్రాల శ్రేణిలో, చాలా విస్తారమైన మరియు సంక్లిష్టమైన ‘భగవంతునితో-సంయోగం’ అనే శాస్త్రం యొక్క సంగ్రహించబడిన సారాంశాన్ని అందిస్తుంది-పరమాత్మతో ఆత్మను ఏకం చేసే ఎంతో అందమైన, స్పష్టమైన మరియు విభిన్న సంక్షిప్తమైన పద్ధతిని నిర్దేశిస్తుంది. తరతరాల పండితులు యోగ సూత్రాలను యోగాపై అత్యంత ప్రాచీనమైన గ్రంథముగా గుర్తించారు.”

పతంజలి యొక్క యోగ పద్ధతిని అష్టాంగయోగ మార్గం అని పిలుస్తారు, ఇది భగవంతుని సాక్షాత్కారం అనే అంతిమ లక్ష్యానికి దారితీస్తుంది.

అష్టాంగ యోగ మార్గం:

  • యమ (ఒకరు వదులుకోవాల్సిన ప్రవర్తనలను వివరించే నైతిక నియమాలు): ఇతరులను గాయపరచడం, అసత్యం, దొంగతనం, ఆపుకొనలేనితనం (లైంగిక ప్రేరణపై నియంత్రణ లేకపోవడం) మరియు దురాశ
  • నియమం (ఆధ్యాత్మిక లక్షణాలు మరియు అలవరచుకోవలసిన ప్రవర్తన): శరీరం మరియు మనస్సు యొక్క స్వచ్ఛత, అన్ని పరిస్థితులలో సంతృప్తి, స్వీయ-క్రమశిక్షణ, స్వీయ-అధ్యయనం (చింతన) మరియు భగవంతుడు మరియు గురువు పట్ల భక్తి
  • ఆసనం: సరైన భంగిమ
  • ప్రాణాయామం: ప్రాణ నియంత్రణ, శరీరంలోని సూక్ష్మ జీవ ప్రవాహాలు
  • ప్రత్యాహార: బాహ్య వస్తువుల నుండి ఇంద్రియ అనుభవాలను ఉపసంహరించుకోవడం ద్వారా చైతన్యం యొక్క అంతర్గతీకరణ
  • ధారణ: కేంద్రీకరించబడిన ఏకాగ్రత; ఒక ఆలోచన లేదా వస్తువుపై మనస్సును నిలపడం
  • ధ్యానం: ధ్యానం, భగవంతుని యొక్క అనంతమైన అంశాలలో ఒకదానిలో విస్తారమైన అవగాహనతో లీనమైపోవడం – ఆనందం, శాంతి, విశ్వ కాంతి, విశ్వ శబ్దం, ప్రేమ, జ్ఞానం మొదలైనవి – సమస్త విశ్వమంతటా వ్యాపించి ఉన్నవి
  • సమాధి: విశ్వాత్మతో వ్యక్తీకరించబడిన ఆత్మ ఐక్యత యొక్క అధిచేతన అనుభవం

ప్రాణాయామం యొక్క అత్యున్నత అభ్యాసం (ప్రాణ-శక్తి నియంత్రణ, అష్టాంగ యోగ మార్గం యొక్క నాల్గవ దశ), రాజయోగము యొక్క శాస్త్రీయ ధ్యాన పద్ధతులను ఉపయోగించి, చైతన్యం యొక్క అంతర్ముఖత్వం (ప్రత్యాహారం) అనే ప్రాథమిక లక్ష్యం సాధించి, మరియు ఆత్మతో ఏకత్వం (సమాధి) అనే అంతిమ లక్ష్యం పొందడం.

సాధారణంగా ప్రాణశక్తి నిరంతరంగా నాడీ వ్యవస్థ మరియు ఇంద్రియాల ద్వారా బయటికి ప్రవహిస్తుంది, తద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం తెలుసుకుంటాము. ప్రాణాయామం యొక్క పద్ధతుల ద్వారా అదే ప్రాణశక్తి (ప్రాణము) వెన్నెముక మరియు మెదడులోని ఆధ్యాత్మిక అవగాహన యొక్క ఉన్నత కేంద్రాల వైపు లోపలికి మళ్లించబడుతుంది,తద్వారా మనలోని విశాలమైన ప్రపంచాన్ని మనం గ్రహించగలుగుతాము.

వై‌.ఎస్‌.ఎస్. యొక్క యోగదా సత్సంగ పాఠాలలో బోధించిన ధ్యాన ప్రక్రియలు, ముఖ్యంగా క్రియాయోగ ప్రక్రియ, అత్యుత్తమమైన రాజయోగ ప్రాణాయామ పద్ధతులను కలిగి ఉంటుంది. పరమహంస యోగానందగారు వీటిని తరచుగా ఆత్మను పరమాత్మ యొక్క ఆనందంతో తిరిగి కలిపే అత్యంత వేగవంతమైన మార్గం అని అనేవారు.

ప్రాణాయామ అభ్యాసం ద్వారా మనం ప్రత్యక్ష మార్గాల ద్వారా జీవిత పరధ్యానాల నుండి దృష్టిని విముక్తి చేస్తాము – మన చైతన్యమును బాహ్యంగా ఉంచే శారీరక శక్తి ప్రవాహాన్ని నియంత్రించడం. తద్వారా మనం పరమాత్మతో ఎల్లప్పుడూ ఒకటిగా ఉండే సత్యమైన, నిశ్చలమైన, అమరమైన ఆత్మగా తెలుసుకోకుండా మనల్ని నిరోధించే చంచలమైన ఆలోచనలను మరియు అల్లకల్లోలమైన భావోద్వేగాలను నిశ్చలం చేయడం జరుగుతుంది.

ఇతరులతో షేర్ చేయండి