కీర్తన యొక్క దివ్యకళ

యోగరూపంగా గానం చేయడం

1920లో పరమహంస యోగానందగారు అమెరికాకు వచ్చినప్పుడు భక్తిగానం అనే భారతదేశ విశ్వజనీన కళను పాశ్చాత్య దేశాలకు తీసుకువచ్చారు, భగవంతుడి కోసం భక్తిపూర్వకంగా గానం చేయడమనే అనుభవాన్ని వేలాది మందికి పరిచయం చేశారు.

మీరు, మీ ధ్యానసాధనలో భక్తిగానాన్ని చేర్చుకోవడానికి ఈ పేజీని వనరుగా ఉపయోగించుకోవచ్చునని మేము ఆశిస్తున్నాము. మీరు వ్యక్తిగతంగా లేదా సామూహికముగా గానం చేస్తున్నప్పుడు, పరమహంస యోగానందగారు ‘ఒక యోగి ఆత్మకథ’లో గానం చేయడాన్ని “యోగము లేదా ఆధ్యాత్మిక క్రమశిక్షణ యొక్క ప్రభావవంతమైన రూపం” అని వర్ణించడాన్ని గుర్తుంచుకోండి.

పెరుగుతున్న భావావేశంతో పాడడానికి బదులుగా ఏకాగ్రత మరియు మనఃపూర్వకమైన భక్తితో మీరు ఈ దివ్యకళారూపానికి మిమ్మల్ని మీరు అన్వయించుకోవచ్చు – దీనిలో పరమహంస యోగానందగారు వాగ్ధానం చేసిన అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ‘యోగదా సత్సంగ పాఠాల’లో గురుదేవులు చెప్పినట్లుగా ప్రార్థన లేదా గానం చేస్తునప్పుడు, పదాల గురించి ఆలోచించకుండా వాటి అర్థం గురించి ఆలోచిస్తూ, మానసికంగా వాటి వెనుక ఉన్న భావాన్ని భగవంతునికి నివేదించండి మరియు భగవంతుని చైతన్యమనే సముద్రపు లోతులలో మీ ప్రార్థన నేరుగా కలసిపోతుంది.

దివ్య అవగాహనకు ఒక మార్గం

పరమహంసగారు పైన చెప్పినట్లుగా, ఒక కీర్తనలోని పదాల భావముతో గాఢముగా ఏకత్వం పొందడం చాలా ముఖ్యం. దీనిని చేసేందుకు ఒక మార్గముగా, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు స్వామి చిదానందగిరి గారు నిర్వహించే మార్గదర్శక ధ్యానంలో పాల్గొనమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. పరమహంస యోగానందగారు గానం చేసిన కీర్తన “శాంతి మందిరంలో” ఆనందాన్ని దృశ్యమానం చేయడం మరియు అనుభూతి చెందడంపై దృష్టి సారిస్తుంది మరియు దర్శన అనుభవం – ఒక వ్యక్తి నిజమైన గురువు లేదా మహాత్ముల సాన్నిధ్యంలో ఉన్నప్పుడు పొందే ఆశీస్సులు, ఈ సందర్భంలో నిజమైన గురువు పరమహంసగారు.

Play Video

పైన ఉన్న మార్గదర్శక ధ్యానం, విశ్వగీతాల (Words of Cosmic Chants) గురించి గురుదేవుల మొత్తం పలుకులు ఎంత విలువైనవో స్వామి చిదానందగారు ప్రశంసించడంతో ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్క పదము “ఆ అవగాహనలోకి మనల్ని మనం గ్రహించుకొనే ద్వారం” అని పేర్కొంటారు. పరమహంస యోగానందగారు, భగవంతుని కోసం ఆ నిర్దిష్టమైన కీర్తనను స్వరబద్ధం చేసినప్పుడు అదే అనుభవం పొందారు.

గురుదేవులు బోధించిన వై‌.ఎస్‌.ఎస్./ఎస్.ఆర్.యఫ్. ప్రక్రియలు – హాంగ్-సా ప్రక్రియ, ఓం ప్రక్రియ మరియు క్రియాయోగమును సాధన (ఆధ్యాత్మిక క్రమశిక్షణ) చేయడం ద్వారా – మరియు భక్తిని అవలంబించడం ద్వారా ఒక వ్యక్తి అనంత ప్రేమమయుడితో అంతర్గతంగా అనుసంధానం ఎలా పొందవచ్చో కూడా స్వామి చిదానందగారు వివరిస్తారు. ఆ ప్రక్రియలు ‘వై.ఎస్.ఎస్. పాఠాల’లో నేర్పబడతాయి.

పరమహంస యోగానందగారు రచించిన “శాంతి మందిరంలో”

శాంతి మందిరంలో ప్రశాంతి ఆలయంలో,
నిన్ను కలుస్తా, నిన్ను సృశిస్తా, నిన్నే ప్రేమిస్తా,
నా ప్రశాంతి వేదిక పైకి ఆహ్వానిస్తా.

సమాధి మందిరంలో ఆనంద ఆలయంలో, నిన్ను కలుస్తా, నిన్ను సృశిస్తా, నిన్నే ప్రేమిస్తా, నా ఆనందపు వేదిక పైకి ఆహ్వానిస్తా.
para-ornament

మరిన్ని విషయాల కోసం:

ఇతరులతో పంచుకోండి