ఒక ఆధ్యాత్మిక పునాది

ఒక యోగి ఆత్మకథ రాస్తున్న శ్రీ శ్రీ పరమహంస యోగానంద

భావితరాలకు తన సందేశాన్ని అందించే రచనలకు అంకితం కావడం కోసం మరియు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థల ఆధ్యాత్మిక మరియు మానవత్వ కార్యాలకు శాశ్వతమైన పునాదిని నిర్మించడం కోసం 1930 సమయంలో పరమహంస యోగానందగారు తన దేశవ్యాప్త ఉపన్యాసాలను కొద్దిగా తగ్గించుకోవడం ప్రారంభించారు.

తన పర్యవేక్షణలో, తన తరగతుల విద్యార్థులకు ఆయన అందించిన వ్యక్తిగత మార్గదర్శనము మరియు బోధనలే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా గృహ అధ్యయన పాఠాలుగా సమగ్రమైన క్రమములో ఏర్పాటు చేయడం జరిగింది.

ఎన్సినీటస్ వద్ద పసిఫిక్ మహాసముద్రం వైపు చూస్తున్న శ్రీ పరమహంస యోగానంద

కాలిఫోర్నియాలోని ఎన్సినీటస్ వద్ద పసిఫిక్ మహాసముద్రానికి అభిముఖంగా ఉన్న ఒక అందమైన ఆశ్రమాన్ని గురుదేవుల కోసం, వారు భారతదేశంలో ఉన్న సమయంలో, వారి ప్రియశిష్యులు శ్రీ శ్రీ రాజర్షి జనకానందగారిచే నిర్మించబడింది. గురుదేవులు తన ఆత్మకథ మరియు ఇతర రచనల కోసం చాలా సంవత్సరాలు ఇక్కడే గడిపారు మరియు ఇప్పటికీ కొనసాగుతున్న ఏకాంత ధ్యానవాస కార్యక్రమం ప్రారంభించబడింది.

అనేక సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ మందిరాలను (ఎన్సినీటస్, హాలీవుడ్, మరియు శాన్ డియోగో) కూడా ఆయన స్థాపించారు, అక్కడ ఎస్.ఆర్.ఎఫ్. సభ్యులు మరియు స్నేహితులకు సంబంధించిన అంకితమైన వ్యక్తులతో విస్తారమైన ఆధ్యాత్మిక విషయాలపై క్రమం తప్పకుండా సంభాషించేవారు. ఆయన సంభాషణల్లో చాలా వరకు శ్రీ శ్రీ దయామాతగారి ద్వారా సాంకేతిక లిపిలో రికార్డు చేయబడ్డాయి, అప్పటి నుండి వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ద్వారా యోగానందగారి ప్రసంగాలు మరియు వ్యాసాల కూర్పుగా మూడు సంపుటాలలోను మరియు యోగదా సత్సంగ మ్యాగజైన్ లోను ప్రచురించబడ్డాయి.

ఒక యోగి ఆత్మ కథ పుస్తకపు అట్ట

యోగానందగారి జీవితచరిత్ర, ఒక యోగి ఆత్మ కథ 1946లో మొదటిసారిగా ప్రచురించబడింది (మరియు తరువాతి సంచికలలో ఆయనచే గణనీయముగా విస్తరించబడింది). శాశ్వతంగా, అత్యుత్తమంగా విక్రయించబడుతూ, మొదటిసారి కనిపించినప్పటి నుండి ఈ పుస్తక ప్రచురణ కొనసాగుతూ 50 పైగా భాషలలోకి అనువదించబడింది. అత్యుత్తమ ఆధ్యాత్మిక గ్రంథముగా ఈ పుస్తకం విస్తృతంగా పరిగణించబడుతోంది.

లేక్ ష్రెన్ లో శిష్యులతో శ్రీ పరమహంస యోగానంద

1950లో, పరమహంసగారు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ప్రపంచ సభలను లాస్ ఏంజిలిస్ లోని అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు – ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాదిమందిని ఒక వారం రోజులపాటు ఆకర్షిస్తున్న కార్యక్రమం. పసిఫిక్ పాలిసేడ్స్ లోని ఎస్.ఆర్.ఎఫ్. లేక్ ష్రైన్ ఆలయాన్ని కూడా అంకితం చేశారు, పది ఎకరాల సరస్సు ప్రక్కన ఉన్న ధ్యాన తోటలలో మహాత్మాగాంధీగారి చితాభస్మంలోని కొంతభాగాన్ని ప్రతిష్టించారు, ఇది కాలిఫోర్నియాలోని అత్యంత ప్రముఖ ఆధ్యాత్మిక మైలురాళ్లలో ఒకటిగా మారింది.

ఇతరులతో షేర్ చేయండి