నేటి ప్రపంచంలో కల్లోలం మరియు అనిశ్చితిని ఎదుర్కొంటున్న చాలా మంది ప్రజలు తమకు మరియు తమ కుటుంబాలకు అవగాహన మరియు దిశను కోరుకుంటున్నారు.
పరమహంస యోగానందగారి జ్ఞాన బోధనలలో, మనకు ఎదురయ్యే ఎలాంటి సంక్షోభానికైనా మనకు మార్గనిర్దేశం మరియు సహాయం లభిస్తుంది. ఈ క్రింద ఇవ్వబడిన లింక్‌లు, పరమహంస యోగానందగారు మరియు వారి శిష్యుల మాటల నుండి తీసుకోబడ్డాయి. దేవుడి శాశ్వతమైన ప్రేమ మరియు రక్షణలో మీరు ఇక్కడ ఒక నూతన విశ్వాసాన్ని పొందుతారని – మీవాడైన దేవుడు ఇచ్చిన శక్తితో ఈ భూమిపై నడిచే ఆయన అమరమైన బిడ్డగా, శక్తి, అవగాహన మరియు అందరి పట్ల దయ కలిగి ఉంటారని ఆశిస్తున్నాం.
అభ్యాసం చేయడానికి పరమహంసగారి నుండి ప్రేరణ
జాతి, మతం, వర్ణం, వర్గం మరియు రాజకీయ పక్షపాతం ద్వారా మనం విభజించబడినట్లు కనిపించినప్పటికీ, ఒకే భగవంతుడి బిడ్డలుగా మన ఆత్మలలో సోదరత్వాన్ని మరియు ప్రపంచ ఐక్యతను అనుభవించగలుగుతాం….మన హృదయాలలో ద్వేషం మరియు స్వార్థపరత్వం నుండి బయటపడటం నేర్చుకొందాం. దేశాల మధ్య సామరస్యత కోసం మనం ప్రార్థిద్దాం, తద్వారా వారు చెయ్యి చెయ్యి కలిపి ఒక న్యాయమైన క్రొత్త నాగరికత దిశగా ముందుకు సాగుతారు.
— శ్రీ శ్రీ పరమహంస యోగానంద
అభ్యాసము కోసం ఒక ప్రతిజ్ఞ: “నేను సేదతీరి నా మానసిక భారములను పారద్రోలడం ద్వారా దేవుని పరిపూర్ణమైన ప్రేమ, శాంతి మరియు జ్ఞానము నా ద్వారా వ్యక్తీకరించడానికి అంగీకరిస్తాను.”
భయాన్ని అధిగమించడానికి ఒక సాధారణ అభ్యాసం: “భయం హృదయం నుండి వస్తుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాద భయం మిమ్మల్ని అధిగమించినట్లు భావిస్తే మీరు గాఢంగా, నిదానంగా, మరియు లయబద్ధంగా శ్వాస తీసుకోండి మరియు విడిచిపెట్టండి, ప్రతి నిశ్వాసముతో (ఊపిరి వదులుతూ) సేద తీరండి. ఇది రక్త ప్రసరణ సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది. మీ హృదయం నిజంగా ప్రశాంతంగా ఉంటే, మీకు అసలు భయమనేది కలుగదు.”
ప్రతికూల భావోద్వేగాలను పోగొట్టుకొనేందుకు ఒక ప్రక్రియ
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్ అధ్యక్షులైన శ్రీ శ్రీ చిదానందగారి సందేశం చదవండి

















