కొత్త సందర్శకులకు సమాచారం

ప్రధాన భవనం, రాంచీ

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు స్థాపించిన లాభాపేక్షలేని ఆధ్యాత్మిక సంస్థ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.)కు స్వాగతం. మీ ఆధ్యాత్మిక తపనను నెరవేర్చుటకొరకు మీకు సేవ చేయడం మాకు ఎంతో ఆనందం.

మీరు పరమహంస యోగానందగారి బోధనలకు కొత్తవారు అయినట్లైతే, మీరు ప్రారంభించడానికి ఇక్కడ కొన్ని సిఫార్సులు ఉన్నాయి:

యోగా మరియు దాని భావనలకు మీరు క్రొత్తా? యోగా సంప్రదాయం యొక్క భావనలు మరియు పరిభాష గురించి తెలియని వారు మా వెబ్సైట్ లో ఉపయోగించిన పదాల సంక్షిప్త ఉపయోగకరమైన వివరణలను మా ఆన్ లైన్ పదకోశంలో కనుగొనగలరు.

ధ్యానం చేయడం నేర్చుకోండి

యోగదా సత్సంగ పాఠాలు

యోగదా సత్సంగ పాఠాలు క్రియాయోగము యొక్క శాస్త్రీయ ధ్యాన పద్ధతుల్లో యోగానందగారి వివరణాత్మక బోధనలను కలిగి ఉన్న సమగ్ర గృహ-అధ్యయన శ్రేణి – అలాగే సమతుల్య ఆధ్యాత్మిక జీవన శైలిపై ఆయన లోతైన మార్గదర్శకత్వం ఈ పాఠాలలో ఉంది.

కొత్తవారికి ధ్యాన సూచనలు

మీరు ఇప్పుడే ధ్యానం ప్రారంభించాలనుకుంటే, మా ధ్యానం నేర్చుకోండి పేజీని సందర్శించండి. అక్కడ మీ ఎంపిక కోసం వివిధ అంశాలు గలవు.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఆశ్రమం, రిట్రీట్ లేదా కేంద్రాన్ని సందర్చించండి

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా 180కి పైగా ఆశ్రమాలు, రిట్రీట్ లు మరియు ధ్యాన కేంద్రాలు ఉన్నాయి – ఆసక్తిగల జ్ఞానార్ధులకు కలిసి సామూహిక ధ్యానం యొక్క శక్తిని ఆస్వాదించడానికి, కేంద్రీకృత రిట్రీట్ కార్యక్రమాలు, ప్రేరణాత్మక సేవలు మరియు ఆధ్యాత్మిక ఫెలోషిప్‌లో పాలుపంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రింది కార్యకలాపాలు ఉన్నాయి:

Girl child meditating.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వారి శరద్ సంగం

ప్రతి సంవత్సరం, మేము శ్రీ పరమహంస యోగానందగారి బోధలతో కూడిన ఆధ్యాత్మిక పునరుద్ధరణ, ఫెలోషిప్ మరియు లోతైన అధ్యయనం కోసం ఒక్క వారము కార్యక్రమాలు నిర్వర్తిస్తాము:

YSS devotees meditating in a group

రిట్రీట్స్

ఆధ్యాత్మిక పునరుద్ధరణకి రావాలనుకునే వై.ఎస్.ఎస్. సభ్యులు మరియు స్నేహితుల కోసం రిట్రీట్ సంవత్సరం పొడవునా (శరద్ సంగం సమయంలో తప్ప) తెరచి ఉంటుంది. పరమహంస యోగానందగారి బోధనలపై, సన్యాసుల ద్వారా నిర్వహింపబడే ప్రత్యేక రిట్రీట్స్ ఏడాది పొడవునా ఉంటాయి. బోధనలు తెలిసి ఉన్నవారి (పరిచితులు) కొరకే ఈ రిట్రీట్ లు నిర్మించబడినప్పటికీ, ఆసక్తి ఉన్నవారు రిసెప్షన్ వద్ద వివరాలు తెలుసుకోమని స్వాగతిస్తునాం.

పరమహంస యోగానందగారి మాటలలో, వై.ఎస్.ఎస్. రిట్రీట్స్ “నిశ్శబ్దం యొక్క అపారమైన శక్తిని అందిస్తాయి, ఇక్కడ (మీరు) అనంతుడైన భగవంతుడి ద్వారా రీఛార్జి చేయబడే ప్రత్యేక ప్రయోజనం కోసం వెళ్ళవచ్చు.” మా రిట్రీట్ కార్యక్రమాల ముఖ్యాంశాలు:

The Noida ashram of Yogoda Satsanga Society of India

సిఫారసు చేయబడ్డ పఠనం

పరమహంస యోగానందగారి బోధనల గురించి మీ అన్వేషణను ప్రారంభించడానికి ఈ క్రింది పుస్తకాలు చదువవలసినదిగా సూచించాలనుకొంటున్నాము.

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి “ఒక యోగి ఆత్మ కథ”

ఈ అత్యధికంగా విక్రయించబడు ఆధ్యాత్మిక ప్రామాణిక గ్రంథం యోగానందగారి జీవితం మరియు బోధనలకు అద్భుతమైన పరిచయంగా ఉపయోగపడుతుంది. మనోహరమైన మరియు వినోదాత్మక కథ, ఇది అస్థిత్వం యొక్క ఉద్దేశ్యం, యోగా, ఉన్నత చైతన్యం, మతం, దేవుడు మరియు రోజువారీ ఆధ్యాత్మిక జీవన సవాళ్ల గురించిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తుంది. ఈ పుస్తకం అన్ని విశ్వాసాల ప్రజలకు మరియు, జీవితం నిజంగా ఏమిటో తెలుసుకోవాలనుకునే వారికొరకు.

శ్రీ శ్రీ పరమహంస యోగానందులవారి “వెలుతురున్న చోట”

పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు ఉపన్యాసాల నుండి సంకలనం చేయబడిన ఈ ఆధ్యాత్మిక చేతి పుస్తకము (చిన్న పుస్తకము, లఘు పుస్తకము) ఆసక్తి గల అనేక అంశాలపై సంక్షిప్త మార్గదర్శకత్వం మరియు ఆధ్యాత్మిక దృక్పదాన్ని తెలియజేస్తుంది, అవి: మానవ సంబంధాలను పరిపూర్ణం చేయడం; వైఫల్యాన్ని విజయంగా మార్చడం; దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడం; మరణాన్ని అర్థం చేసుకోవడం; ఒత్తిడి, ఆందోళన మరియు భయాన్ని అధిగమించడం; ప్రార్థనను ఉపయుక్తము చేయడం; మరియు జీవిత నిర్ణయాలు తీసుకోవటానికి జ్ఞానం మరియు బలాన్ని కనుగొనడం.

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు రచించిన ఉపన్యాసాలు మరియు వ్యాసాల నుండి మూడు సంకలనాలు

Man's Eternal Quest explains aspects of meditation, life after death etc.

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి “మానవుడి నిత్యాన్వేషణ”

పరమహంసగారి ప్రసంగాలు మరియు వ్యాసాల నుండి సేకరించబడిన ఈ మొదటి సంపుటము, ధ్యానం, మరణం తరువాత జీవితం, సృష్టి యొక్క స్వభావం, ఆరోగ్యం మరియు వైద్యం మరియు మానవ మనస్సు యొక్క అపరిమిత శక్తుల గురించి, చాలా తక్కువగా తెలిసిన మరియు అరుదుగా వివరించిన అంశాలను అన్వేషిస్తుంది.

The Divine Romance deals with topics like habits, memory, karma and reincarnation.

శ్రీ శ్రీ పరమహంస యోగానందవారి “దివ్య ప్రణయం”

సేకరించిన ప్రసంగాలు మరియు వ్యాసాల యొక్క ఈ రెండవ సంపుటిలో, యోగానందగారు మన దివ్య స్వభావం మేల్కొల్పడం ద్వారా శారీరక, మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం రోజువారీ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చెప్పారు. ఆయన మన దగ్గరి సంబంధాల యొక్క లోతైన ఆధిభౌతిక (మెటాఫిజికల్) మూలాలను వెల్లడిస్తారు మరియు ఈ సంబంధాలను ఏకం చేసే ప్రేమ యొక్క అదృశ్య, సార్వత్రిక దారము మనల్ని ఎలా తిరిగి అన్ని ప్రేమలకు మూలము దగ్గరకు ఆకర్షిస్తుందో వివరించారు. ఈ పుస్తకములో ఉన్న ఇతర విషయాలు: అలవాట్లు, జ్ఞాపకశక్తి, కర్మ మరియు పునర్జన్మ, యోగా మరియు ధ్యానం, మరియు తనకు, తన ఇంటికి, తన సంఘానికి మరియు ప్రపంచానికి ఎలా సామరస్యాన్ని తీసుకురావచ్చు.

Journey to Self Realization: topics include: how to express lasting youthfulness; acquiring attunement with the Source of success; balancing business and spiritual life; overcoming nervousness etc.

శ్రీ శ్రీ పరమహంస యోగనందగారి “ఆత్మసాక్షాత్కారం వైపు ప్రయాణం”

ఉపన్యాసాలు మరియు వ్యాసాల యొక్క కూర్పు అయిన ఈ మూడవ సంపుటము, తమను తాము అర్థము చేసుకోవాలని మరియు జీవితము యొక్క నిజమైన పరమార్థము గ్రహించాలని అనుకొనేవారికి చక్కని సలహాలు అందిస్తుంది. యోగానందగారు మానవ అనుభవాలలోని అనేక సంక్లిష్టతలకు, విశ్వజనీన మరియు దూరదృష్టితో కూడిన దృక్పదాన్ని తెస్తూ – జీవితమనే సాహసంలో ఆపదలను మరియు అడ్డంకులను కూడా ఉపయోగకర భాగంగా ఎలా చూడాలో చూపించారు. ఈ పుస్తకంలోని ఇతర విషయాలు: శాశ్వత యవ్వనాన్ని ఎలా వ్యక్తపరచాలి; సాఫల్యము యొక్క మూలంతో సామరస్యాన్ని పొందడం; వ్యాపార మరియు ఆధ్యాత్మిక జీవితాన్ని సమతుల్యం చేయడం; అధైర్యాన్ని అధిగమించడం; ఇతరులతో కలకొలుపుగా ఉండే కళ; మరియు రోజువారీ జీవనంలో దేవుణ్ణి గ్రహించడం.

పరమహంస యోగానందగారి ఇతర పుస్తకాలు

Inner Peace: How to Be Calmly Active and Actively Calm.

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి “ఇన్నర్ పీస్: హౌ టు బీ కామ్లి ఆక్టివ్ అండ్ ఆక్టివ్లీ కామ్ (Inner Peace: How to Be Calmly Active and Actively Calm)”

యోగానందులవారి రచనల నుండి ఈ ప్రేరణ కలిగించే ఎంపికలు, జీవన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ప్రశాంతంగా, సంతోషంగా మరియు సమచిత్తముగా ఉండటానికి ఆచరణాత్మక అనువర్తనాలను ఇస్తాయి. ఆందోళన మరియు ఒత్తిడిని, ఆనందం మరియు శాంతిగా మార్చడానికి పాఠకుడికి శక్తినిచ్చే ఈ చిన్న పుస్తకం మన వేగవంతమైన ప్రపంచానికి శక్తివంతమైన విరుగుడిని అందిస్తుంది.

The Law of Success: Topics include: creativity and initiative, positive thinking, dynamic will, self-analysis, the power of meditation etc.

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి “సఫలతా నియమం”

ఈ శక్తివంతమైన చిన్న పుస్తకం సాఫల్యము యొక్క మూలంతో చేరడం, విలువైన లక్ష్యాలను ఎన్నుకోవడం, అడ్డంకులు మరియు భయాలను అధిగమించడం మరియు మన జీవితాల్లో సాఫల్యాన్ని ఆహ్వానించే దైవిక నియమాలను ఎలా నిర్వహించాలో వివరిస్తుంది. చేర్చబడిన విషయాలు: సృజనాత్మకత మరియు చొరవ, సానుకూల ఆలోచన, డైనమిక్ సంకల్పం, స్వీయ విశ్లేషణ, ధ్యానం యొక్క శక్తి, మరియు మరెన్నో.

ఆధ్యాత్మిక ధ్యాన తరంగిణి: 300 పైగా ధ్యానాలు, ప్రార్థనలు, దివ్యసంకల్పాలు మరియు మానసిక చిత్రణలు కలిగి ఉన్నది.

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి “ఆధ్యాత్మిక ధ్యాన తరంగిణి”

ఈ జేబు-పరిమాణ పుస్తకం 300 కంటే ఎక్కువ ధ్యానాలు, ప్రార్థనలు, ధృవీకరణలు మరియు మానసిక చిత్రణంతో (విజువలైజేషన్లతో) పాటు ధ్యానం ఎలా చేయాలో పరిచయ సూచనలను అందిస్తుంది. కొత్తవారు మరియు అనుభవజ్ఞులైన ధ్యానం చేసేవారు ఈ చిన్న సంపుటమును, అనంతమైన ఆనందం, శాంతి మరియు ఆత్మ యొక్క అంతర్గత స్వేచ్ఛను మేలుకొలపడానికి ఉపయోగకరమైన సాధనంగా గుర్తించవచ్చు.

మీరు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి బోధనలను లోతుగా పరిశోధించాలనుకుంటే, దయచేసి వై.ఎస్.ఎస్. పుస్తక కోశంలో మా పూర్తి పుస్తకాలు మరియు రికార్డింగ్ల జాబితాను చూడండి.

యోగ సంప్రదాయం యొక్క భావనలు మరియు పరిభాష గురించి తెలియని వారు మా వెబ్‌సైట్‌లో ఉపయోగించిన పదాల సంక్షిప్త ఉపయోగకరమైన వివరణలను మా ఆన్‌లైన్ పదకోశంలో కనుగొనగలరు.

ఇతరులతో పంచుకోండి