ప్రార్థిస్తున్న పరమహంసగారు

“ప్రార్థన అనేది ఆత్మ యొక్క స్వాధికారం. దేవుడు మనలను బిచ్చగాళ్ళను చేయలేదు; ఆయన మనలను తన స్వరూపంలో సృష్టించాడు….ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళి భిక్ష అడిగే బిచ్చగాడు బిచ్చగాడి వాటాను మాత్రమే పొందుతాడు; కానీ కొడుకు తన ధనికుడైన తండ్రి నుండి ఏదైనా అడగవచ్చు…

“కాబట్టి మనం బిచ్చగాళ్ళలా ప్రవర్తించకూడదు. క్రీస్తు, కృష్ణుడు, బుద్ధుడు వంటి మహాత్ములు మనం దేవుని స్వరూపంలో తయారయ్యామని చెప్పినప్పుడు అసత్యం చెప్పలేదు.”

—పరమహంస యోగానంద

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి రచనల నుండి సారాంశాలు

శాస్త్రవేత్తల వంటి భారతదేశపు ప్రాచీన ఋషులు ప్రేమమయుడైన దేవుని నుంచి ఆనందాన్ని ఎలా పొందాలో కనుగొన్నారు. పరమహంస యోగానందగారు ధ్యాన యోగ శాస్త్రం మరియు సరికొత్త ప్రార్థనా మార్గం ద్వారా మనం ప్రత్యక్షంగా దివ్య అనుభవాన్ని ఎలా పొందగలమో బోధిస్తున్నారు. ఆయన ఇలా వ్రాశారు:

“నేను ‘హక్కుగా అడగటం’ అనే పదాన్ని ఎంచుకుంటాను ‘ప్రార్థన’ కంటే, ఎందుకంటే మొదటి పదం మనం యాచకులుగా మనం వేడుకోవాల్సిన మరియు పొగడాల్సిన – ఆదిమ మరియు మధ్యయుగపు రాజరిక నిరంకుశ దేవుని యొక్క భావనకు భిన్నంగా ఉంది. సాధారణ ప్రార్థనలో యాచన మరియు అజ్ఞానం ఎక్కువగా ఉంటాయి…కొంతమందికి మాత్రమే ఎలా ప్రార్థించాలో మరియు వారి ప్రార్థనలతో దేవునితో అనుసంధానం ఎలా కావాలో తెలుసు.”

“దేవుని నుండి కోరడానికి మీకు దివ్య హక్కు ఉంది; మరియు మీరు అతని స్వంతం కాబట్టి అతను మీకు ప్రతిస్పందిస్తాడు. మీరు నిరంతరం ఆయనను పిలిస్తే, ఆయన మీ భక్తి అనే వల నుండి తప్పించుకోలేడు. ఆకాశం మీ ప్రార్థన యొక్క కాంతితో చిలకబడే వరకు మీరు ప్రార్థిస్తే, మీరు దేవుణ్ణి కనుగొంటారు.”

నా ప్రార్థనలు ఇతరులకు ఎలా సహాయపడగలవు?
శ్రీ దయామాత
సమయం: 4:26 నిమిషాలు

ఈ విపత్కర సమయాల్లో, ప్రార్థనా శక్తి ద్వారా మనం చేయగలిగేది చాలా ఉంది – మన కోసం మాత్రమే కాకుండా మన కుటుంబాలకు, మన స్నేహితులకు, మన పొరుగువారికి మరియు ప్రపంచానికి సేవ చేయడం.

మీరు యోగం యొక్క ప్రభావవంతమైన ప్రార్థన పద్ధతులను యోగదా సత్సంగ పాఠాల ద్వారా నేర్చుకోవచ్చు మరియు దేవునితో మీ స్వంత వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవచ్చు.

ఈ ఆన్‌లైన్ వనరులను అన్వేషించండి:

ఇతర ప్రార్థన వనరులు:

ఇన్ ద శాంక్చుయరీ ఆఫ్ ద సోల్

In the Sanctuary of the Soul

దేవుడితో మాట్లాడ్డం ఎలా

దేవుడితో మాట్లాడ్డం ఎలా

ఫలించిన ప్రార్థనలు

ఫలించిన ప్రార్థనలు

ఇతరులతో పంచుకోండి