కార్యక్రమాలు

"యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ దేనిని సూచిస్తుంది అంటే, స్వీయ-సాక్షాత్కారం ద్వారా దేవునితో సహవాసం మరియు సత్యాన్వేషణ చేసే ఆత్మలందరితో స్నేహం."

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు భారతదేశం మరియు నేపాల్ అంతటా 200 కంటే ఎక్కువ ధ్యాన కేంద్రాలు, ఆశ్రమాలు, ఏకాంత ధ్యాన మందిరాలు ఉన్నాయి — ఆసక్తిగల సాధకులందరికీ సమూహ ధ్యానాలు, నిర్ధిష్ట ఏకాంత ధ్యాన కార్యక్రమాలు, స్ఫూర్తిదాయక సేవల మరియు ఆధ్యాత్మిక సాంగత్యములలో పాలు పంచుకొనే అవకాశాన్ని అందిస్తుంది.

ఏడాది పొడవునా, మేము శ్రీ పరమహంస యోగానందగారి, ‘జీవించడం ఎలా’ అనే బోధనలపై దృష్టి కేంద్రీకరించే వార్షిక శరద్ సంగంతో పాటు అనేక ప్రత్యేక వేడుకలు మరియు స్ఫూర్తిదాయక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాము; దేశవ్యాప్తంగా మా ధ్యాన కేంద్రాలు మరియు ధ్యానుల సముదాయములకు సమీప ప్రాంతాలలో, వారాంతపు ఏకాంత ధ్యాన కార్యక్రమాలు; డజన్ల కొద్దీ నగరాలలో ప్రతి సంవత్సరం ఉపన్యాస ధారావాహికలు మరియు ధ్యాన తరగతులు (క్రియాయోగ దీక్షతో సహా) జరుపుతాము.

ఇతరులతో షేర్ చేయండి