ఆదివారం సత్సంగం

ధ్యాన మందిరంలో యోగానందగారి బోధనలపై తరగతి
మీకు దగ్గరలో, అందుబాటులో ఉన్న ఆదివారం సత్సంగం జాబితా కోసం మీ స్థానిక ఆశ్రమం, కేంద్రం లేదా ధ్యాన బృందాన్ని సంప్రదించండి.

దేశవ్యాప్తంగా ఉన్న మా ఆశ్రమాలు మరియు ధ్యాన కేంద్రాలలో, ప్రతివారం స్ఫూర్తిదాయకమైన సేవలలో భాగంగా భాగ్యవంతునితో సహవాసం ఎలా పెంపొందించుకోవాలి, ఇతర సత్యాన్వేషకులతో ఆధ్యాత్మిక సహవాసాన్ని పంచుకోవడానికి అవకాశాన్ని కలిపిస్తాయి. ఈ సేవల్లో పరమహంస యోగానందగారి రచనల నుండి స్ఫూర్తిదాయక పఠనాలు, భక్తి గీతాలాపనలు, నిశ్శబ్ద ధ్యానం మరియు ప్రార్థనలు ఉంటాయి. యోగదా సత్సంగ ఆశ్రమానికి చెందిన సన్యాసులు క్రమం తప్పకుండా మా ఆశ్రమాలలో సేవలను అందిస్తారు మరియు వై.ఎస్.ఎస్. సభ్యులు ధ్యాన కేంద్రాలలో ఏర్పాటు చేయబడే సేవలకు నాయకత్వం వహిస్తారు.

పరమహంస యోగానందగారి “జీవించడం ఎలా” అన్న ఆధ్యాత్మిక సూత్రాల ఆధారితంగా, 3-12 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం, మా అన్ని ఆశ్రమాలు మరియు అనేక ధ్యాన కేంద్రాలు సండే స్కూల్ తరగతులను నిర్వహిస్తాయి.

ఇతరులతో షేర్ చేయండి