జ్ఞానంతో జీవించడం ఎలా

అందరికీ ప్రేమను అందించడం, భగవంతుని ప్రేమను అనుభవించడం, అందరిలో ఆయన ఉనికిని చూడడం మరియు మీ చైతన్య మందిరంలో ఆయన సాన్నిధ్యం కోసం — ఒకే ఒక్క కోరికను కలిగి ఉండడం — అదే ఈ ప్రపంచంలో జీవించే మార్గం.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

దైనందిన జీవితంలో మార్గదర్శకత్వం మరియు ప్రేరణ

మార్గదర్శకత్వపు అవసరాన్ని సూచిస్తున్న పిల్లి.

యుగయుగాలుగా, ఆధ్యాత్మికవేత్తలు, సాధువులు, ఋషులు మరియు యోగులు అందరూ మనకు ఒకే సమాధానం ఇచ్చారు: పరమాత్మతో మన వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడం — మన దైనందిన జీవితంలో ఆయనతో అనుసంధానంలో ఉంచుతుంది. ఆధ్యాత్మిక జీవనం అనేది ఆ సంబంధాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ఆచరణాత్మక విధానం.

ధ్యానిస్తున్న చిన్నారులు.

ప్రతి విషయం గురించి ఆచరణాత్మక బోధనతో పాటు, ప్రతి విభాగంలో అందించబడిన ధృవీకరణల ప్రయోజనాన్ని తప్పకుండా అందుకోండి. ప్రతి విభాగంలో చర్చించబడిన ఆనందం, స్వస్థత, శాంతి మరియు ఇతర ఆధ్యాత్మిక ప్రయోజనాలను అనుభవించే దిశలో మీ వ్యక్తిగత ప్రయాణాన్ని ప్రారంభించడానికి మీరు ఇప్పుడే వీటిని సాధన చేయవచ్చు.

అదనంగా, మరింత లోతైన అన్వేషణ కోసం వనరులకు లింక్‌లు కలిగి ఉంటాయి. అలాగే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురించిన అనేక పుస్తకాలు, రికార్డింగ్‌లు మరియు ఇతర అంశాలలో ఆ విషయంపై మరింతగా ఎక్కడ కనుగొనాలనే దాని కోసం, సహాయక సూచనలను ప్రతి అంశము కలిగి ఉంటుంది.

అంశాలు

ఇతరులతో షేర్ చేయండి