యోగాదా సత్సంగ శాఖా ఆశ్రమం — నోయిడా

ఉత్తర్ ప్రదేశ్

యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం – నోయిడా మొదటి దశ నిర్మాణం పూర్తయిన తర్వాత జనవరి 2010లో ప్రారంభించబడింది. ఢిల్లీ-యు.పి. సరిహద్దు నుండి కేవలం 4 కి.మీ. దూరంలో, 5 ఎకరాల స్థలంలో నిర్మించబడిన ఈ ప్రాంతంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ మరియు రెండు రిట్రీట్ బ్లాక్‌లు ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అనేది పూర్తిస్థాయి బేస్‌మెంట్‌తో కూడిన 3 అంతస్థుల భవనం. ఇందులో ధ్యాన మందిరం, రిసెప్షన్, పుస్తకాలు/లైబ్రరీ, కౌన్సిలింగ్ గదులు, కిచెన్/డైనింగ్, ఆఫీసులు, సన్యాసుల మరియు జాతీయ రాజధాని ప్రాంతం గుండా వెళ్తున్న భక్తుల కోసం గదులు (3 రోజుల వరకు – ముందస్తు బుకింగ్‌ అవసరం) ఉన్నాయి.

రెండు రిట్రీట్ బ్లాక్స్, పురుషులు మరియు మహిళలకు విడివిడిగా, మరియు ఒక్కొక్కటీ 30 సింగిల్ గదులు కలిగిన, వ్యక్తిగత మరియు నిర్వహించబడిన ఆధ్యాత్మిక రిట్రీట్స్ మీద దృష్టితో నిర్మించబడిన ఈ ఆశ్రమం యొక్క ప్రత్యేకత. భక్తులు మౌనం, అధ్యయనం మరియు సాధనతో, అలాగే నివాస సన్యాసులచే కౌన్సెలింగ్‌ తో కూడిన వ్యక్తిగత రిట్రీట్స్ కు 3-5 రోజుల పాటు ఉండటానికి ఆహ్వానితులు. అదనంగా, చాలా వరకు వారాంతాల్లో సన్యాసులచే నిర్వహించబడే రెగ్యులర్ రిట్రీట్స్ ఉన్నాయి. ఇవి 3-5 రోజుల వ్యవధి కలిగి ఉంటాయి. మరియు మన దివ్య గురువుల బోధనలు, జీవించటం ఎలా అనే సూత్రాలు మరియు ఏకాగ్రత మరియు ధ్యానం యొక్క ప్రక్రియలు వంటి నిర్దిష్ట అంశాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. రెండు సందర్భాల్లోనూ ముందస్తు బుకింగ్‌ అవసరం.

ఆశ్రమంలో పెద్ద మరియు చిన్న సంగమాలు కూడా నిర్వహించబడుతున్నాయి.

వై.ఎస్.ఎస్. కు క్రొత్తవారా? వై.ఎస్.ఎస్. పాఠాలు ఎలా మీ జీవితాలలో పరివర్తన చేకూర్చి సమతుల్యతను తీసుకువస్తాయో మరింతగా నేర్చుకోండి.

ప్రతి వారం కార్యక్రమాలు

సామూహిక ధ్యానం

అందరూ పాల్గొనేలా ధ్యానం మరియు సత్సంగాలను ప్రతిదినం మేము అందిస్తున్నాం. ఈ సమావేశాలు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానం, భక్తి గీతాలాపన మరియు స్ఫూర్తిదాయక పఠనంతో కూడి ఉంటాయి.

ఆదివారం
ఉదయం 10:00 – ఉదయం 11:30
ఆదివారం సత్సంగం (ఒక సంక్షిప్త ధ్యానంతో కూడి ఉంటుంది)
సాయంత్రం 4:45 – రాత్రి 8:00
సాయంత్రపు ధ్యానం
గురువారం
ఉదయం 7:00 – ఉదయం 8:00
ఉదయపు ధ్యానం
సాయంత్రం 4:45 – రాత్రి 8:00
సాయంత్రపు ధ్యానం
ఇతర రోజులు
ఉదయం 7:00 – ఉదయం 8:00
ఉదయపు ధ్యానం
సాయంత్రం 5:30 – రాత్రి 7:00
సాయంత్రపు ధ్యానం
బాలల సత్సంగం

ఈ సమావేశాలలో 6 నుండి 12 సంవత్సరాల పిల్లలు, ఆసక్తికరమైన కార్యక్రమాల ద్వారా వై.ఎస్.ఎస్. బోధనలు మరియు జీవన విధానం గురించి నేర్చుకునే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాలలో కథ చెప్పడం, సంక్షిప్త నిర్దేశిత ధ్యానాలు మరియు ఇతర పారస్పరిక (interactive) బోధనా పద్ధతులు ఉంటాయి. మరింతగా తెలుసుకోండి.

ఆదివారం
ఉదయం 10:00 – ఉదయం 11:30

రాబోయే ప్రత్యేక కార్యక్రమాలు మరియు దీర్ఘ ధ్యానాలు

శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల ఆవిర్భావ దినోత్సవం
సెప్టెంబర్ 30, 2026, బుధవారం
సాయంత్రం 5:00 – రాత్రి 7:30
సాయంత్రపు ధ్యానం
యువ సాధకుల సంగమం

మరింతగా తెలుసుకోండి

అక్టోబర్ 7, 2026, బుధవారం – అక్టోబర్ 11, 2026, ఆదివారం
నెలవారీ దీర్ఘ ధ్యానం
అక్టోబర్ 25, 2026, ఆదివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం

వార్తలు & ఫోటో గ్యాలరీ

మీ సందర్శనకు ఏర్పాట్లు చేసుకోండి

వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. పాఠాల విద్యార్థులు ఆశ్రమంలో అయిదు రోజుల వరకు ఉండేందుకు స్వాగతం. పునరుత్తేజం మరియు పునరుజ్జీవనం పొందేందుకు భక్తులు ఒక వ్యక్తిగత ఏకాంత ధ్యాన వాసం లేక నిర్వహించబడే ఏదో ఒక ఏకాంత ధ్యాన వాసంలో మాతో కలిసి పాల్గొనమని మేము ప్రోత్సహిస్తున్నాం. ఈ ఏకాంత ధ్యాన వాసాల సందర్భంగా, వై.ఎస్.ఎస్. సన్యాసులు ప్రతి రోజు రెండుసార్లు నిర్వహించే సామూహిక ధ్యానాలలో మీరు పాల్గొని, యోగదా సత్సంగ బోధనల అభ్యాసం మరియు అధ్యయనంలో ఆధ్యాత్మిక సలహా మరియు మార్గనిర్దేశం పొందవచ్చు.

ఆశ్రమంలో వసతిని అభ్యర్థించడానికి క్రింద ఉన్న బటన్ మీద దయచేసి క్లిక్ చేయండి.

మమ్మల్ని సంప్రదించండి

యోగాదా సత్సంగ శాఖా ఆశ్రమం – నోయిడా
Paramahansa Yogananda Marg
B-4, Sector 62
Noida - 201307
Gautam Buddha Nagar
Uttar Pradesh

ఎలా చేరుకోవాలి

నోయిడా సెక్టార్ 62లో ఉన్న వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమం, విమాన, రైలు మరియు రోడ్డు రవాణా ద్వారా దేశవ్యాప్తంగా అద్భుతమైన అనుసంధానతను కలిగి ఉంది, అలాగే ఢిల్లీ-ఎన్.సి.ఆర్. లోపల నడుస్తున్న విస్కృతమైన మెట్రో నెట్‌వర్క్ కు కూడా అందుబాటులో ఉంది. మీ సందర్శనకు అత్యంత అనుకూలమైన ప్రయాణ విధానాన్ని తెలుసుకోవడానికి దయచేసి క్రింది వివరాలను చదవండి.

విమానం ద్వారా

ఢిల్లీ-ఎన్.సి.ఆర్. మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు సేవలందిస్తున్న మూడు విమానాశ్రయాల నుండి వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమానికి చేరుకోవచ్చు. మూడు విమానాశ్రయాల నుండి ప్రీ-పెయిడ్ టాక్సీలు మరియు ఓలా, ఊబర్ వంటి యాప్ ఆధారిత క్యాబ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (DEL), న్యూ ఢిల్లీ:
సుమారు 32 కి.మీ. దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం, ఆశ్రమానికి సమీపంలో ఉన్న ప్రధాన అంతర్జాతీయ మరియు దేశీయ విమానాశ్రయం. ఇది భారతదేశంలోని ప్రధాన నగరాలకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గమ్యస్థానాలకు విస్తృతమైన అనుసంధానతను కలిగి ఉంది. ఇక్కడి నుండి ఆశ్రమానికి రోడ్డు మార్గంలో ప్రయాణం సాధారణంగా సుమారు 1 గంట పడుతుంది.

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (DXN), జేవర్, ఉత్తరప్రదేశ్:
ఆశ్రమం నుండి సుమారు 70 కి.మీ. దూరంలో ఉన్న ఈ కొత్త విమానాశ్రయం ప్రస్తుతం దేశీయ మార్గాలకు మాత్రమే సేవలు అందిస్తోంది. దీని నెట్‌వర్క్ లో బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, లక్నో, ముంబై, శ్రీనగర్ మరియు అమృత్‌సర్ వంటి నగరాలు ఉన్నాయి, అదనపు మార్గాలు క్రమంగా ప్రవేశపెట్టబడుతున్నాయి. ఈ విమానాశ్రయం నుండి, యమునా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా వెళ్లే మార్గం తిన్నగా నోయిడా వైపు తీసుకుని వెళుతుంది; దీనిపై ట్రాఫిక్‌ను బట్టి ఆశ్రమానికి ప్రయాణం సుమారు 1.5–2 గంటలు పడుతుంది.

హిండన్ విమానాశ్రయం (HDO), ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్:
ఆశ్రమం నుండి సుమారు 16 కి.మీ. దూరంలో ఉన్న హిండన్ విమానాశ్రయం, భారతదేశంలోని కొన్ని నగరాల నుండి వచ్చే సందర్శకులకు, పైన పేర్కొన్న విమానాశ్రయాలకు అనుకూలతతో ప్రత్యామ్నాయంగా పనిచేసే దేశీయ విమానాశ్రయం. ఇక్కడి నుండి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గోవా, ఇందోర్, కోల్‌కతా, ముంబై, పాట్నా మరియు వారణాసిలతో పాటు చిన్న ప్రాంతీయ పట్టణాలకు కూడా విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుండి ఆశ్రమానికి రోడ్డు ప్రయాణం సుమారు 30–35 నిమిషాలు పడుతుంది.

విమాన మార్గాలు మరియు సమయాలు మారవచ్చు కాబట్టి, మీ ప్రయాణ ఏర్పాట్లు చేసుకునే ముందు దయచేసి తాజా విమాన షెడ్యూల్‌ను మరియు విమానాశ్రయ సమాచారాన్ని చూడండి.

రైలు ద్వారా

నోయిడాలోని వై.ఎస్.ఎస్. ఆశ్రమం చేరుకోవడానికి, సందర్శకులు ఢిల్లీ-ఎన్‌.సి.ఆర్‌. లోని క్రింది రైల్వే స్టేషన్లలో ఒకదానికి రైలులో ప్రయాణించవచ్చు — దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక దూర ప్రయాణ ఎక్స్-ప్రెస్ మరియు సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఇక్కడికి సేవలు అందిస్తాయి. ఈ స్టేషన్లలో దేని నుండైనా, సందర్శకులు టాక్సీ, యాప్ ఆధారిత క్యాబ్ లేదా ఆటో-రిక్షా ద్వారా ఆశ్రమానికి వెళ్లవచ్చు. ఢిల్లీ మెట్రో ద్వారా ప్రయాణించడానికి సమాచారం కోసం, దయచేసి దిగువన ఉన్న “మెట్రో ద్వారా” విభాగాన్ని చూడండి.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (NDLS):
న్యూఢిల్లీ – ఉత్తర, పశ్చిమ, మధ్య, తూర్పు మరియు దక్షిణ భారతదేశం అంతటా విస్తృతమైన అనుసంధానాలతో కూడిన ప్రధాన రైల్వే కేంద్రం. ఇందులో ముంబై, అహ్మదాబాద్, కోల్‌కతా, రాంచీ, భువనేశ్వర్, దిబ్రూగఢ్ మరియు జమ్మూ వంటి నగరాల నుండి రాజధాని మరియు దురంతో ఎక్స్-ప్రెస్ రైళ్లు, అలాగే జైపూర్, లక్నో, కాన్పూర్, పాట్నా, భోపాల్, చెన్నై, హైదరాబాద్ మరియు ఇతర ప్రధాన నగరాలను అనుసంధానించే ఇతర ప్రముఖ రైళ్లు ఉన్నాయి. ఆశ్రమం ఈ స్టేషన్ నుండి సుమారు 20 కి.మీ. దూరంలో ఉంది, రోడ్డు మార్గంలో చేరుకోవడానికి 40–45 నిమిషాలు పడుతుంది.

ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ (DLI):
ఢిల్లీ జంక్షన్ అని కూడా పిలువబడే ఇది, భారతదేశంలోని ఉత్తర, పశ్చిమ మరియు తూర్పు ప్రాంతాలకు విస్తృతమైన అనుసంధానతను కలిగి ఉంది. అమృత్‌సర్, జమ్మూ, జైపూర్, అజ్మీర్, హరిద్వార్, రిషికేశ్, లక్నో, గోరఖ్‌పూర్ మరియు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరాఖండ్ మరియు బీహార్‌లోని ఇతర నగరాలతో ముఖ్యమైన రైళ్లు ఈ స్టేషన్ ను అనుసంధానిస్తాయి. ఆశ్రమం స్టేషన్ నుండి సుమారు 22 కి.మీ. దూరంలో ఉంది, రోడ్డు మార్గంలో ప్రయాణానికి సుమారు 40–45 నిమిషాలు పడుతుంది.

హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ (NZM):
ఆశ్రమం నుండి సుమారు 18 కి.మీ. దూరంలో ఉన్న హజ్రత్ నిజాముద్దీన్, ఉత్తర, పశ్చిమ, మధ్య, దక్షిణ మరియు తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాలకు ప్రత్యక్ష అనుసంధానతతో కూడిన ప్రధాన సుదూర రైలు కేంద్రం. ప్రధాన సేవలలో ముంబై మరియు ఆగస్ట్ క్రాంతి రాజధాని, బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్ మరియు తిరువనంతపురం రాజధాని రైళ్లు, అలాగే ముంబై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, గోవా మరియు కొచ్చి వంటి నగరాలను అనుసంధానించే దురంతో మరియు సంపర్క్ క్రాంతి సేవలు ఉన్నాయి. ఆశ్రమానికి రోడ్డు ప్రయాణం సాధారణంగా 35–40 నిమిషాలు పడుతుంది.

ఘజియాబాద్ రైల్వే స్టేషన్ (GZB):
ఆశ్రమం నుండి సుమారు 10 కి.మీ. దూరంలో ఉన్న ఘజియాబాద్, ఢిల్లీ-ఎన్‌.సి.ఆర్‌.కు సేవలందిస్తున్న ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్; ప్రత్యేకంగా, ఇది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు సమీప ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక్కడి నుండి వెళ్ళే రైళ్లు మరియు దీని మీదుగా వెళ్ళే రైళ్లు లక్నో, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, వారణాసి, గోరఖ్‌పూర్, మొరాదాబాద్, బరేలీ, అలీఘర్ మరియు ఉత్తర, తూర్పు భారతదేశం అంతటా ఉన్న ఇతర కేంద్రాలతో దీనిని అనుసంధానిస్తాయి. ఆశ్రమానికి తదుపరి రోడ్డు ప్రయాణం సాధారణంగా 25–30 నిమిషాలు పడుతుంది.

ఆనంద్ విహార్ టెర్మినల్ (ANVT):
ఆనంద్ విహార్ ఢిల్లీలోని మరో ప్రధాన సుదూర రైల్వే టెర్మినల్. ఇది పాట్నా, వారణాసి, గోరఖ్‌పూర్, లక్నో, కాన్పూర్, దర్భంగా మరియు కోల్‌కతా వంటి ప్రధాన నగరాలకు అనుసంధానించే ఎక్స్-ప్రెస్ మరియు సూపర్‌ఫాస్ట్ రైలు సేవలు అందిస్తుంది. టెర్మినల్ నుండి ఆశ్రమం సుమారు 9 కి.మీ. దూరంలో ఉంది, రోడ్డు మార్గంలో చేరుకోవడానికి 25–30 నిమిషాలు పడుతుంది.

రైలు మార్గాలు, సమయాలు మరియు స్టేషన్లలో నిలుపుదలలు మారవచ్చు. మీ ప్రయాణ ఏర్పాట్లు చేసుకునే ముందు దయచేసి భారతీయ రైల్వే వెబ్‌సైట్‌లో తాజా షెడ్యూల్ మరియు లభ్యతను జాగ్రత్తగా చూడండి.

రోడ్డు ద్వారా

ISBT ఆనంద్ విహార్ మరియు కాశ్మీరీ గేట్‌తో సహా, నోయిడా మరియు నోయిడా సమీపంలోని బస్ టెర్మినల్స్ వరకు ఇంటర్-సిటీ బస్సులు నడుస్తాయి. ఈ ప్రదేశాల నుండి, ఆశ్రమానికి తదుపరి ప్రయాణం కోసం టాక్సీలు మరియు ఆటో-రిక్షాలు అందుబాటులో ఉంటాయి.

కారు లేదా ట్యాక్సీలో ప్రయాణించే సందర్శకులు మా గూగుల్ మ్యాప్స్ లింక్‌ను అనుసరించడం ద్వారా నోయిడా ఆశ్రమానికి చేరుకోవచ్చు.

ఢిల్లీ నుండి రోడ్డు మార్గం, సంబంధిత వివరాలు:

  • ఢిల్లీ నుండి, ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే (NE-3) తీసుకోండి.
  • మీకు ఎడమ వైపుగా అక్షరధామ్ ఆలయాన్ని దాటి, సుమారు 8.5 కి.మీ. నేరుగా కొనసాగండి.
  • సెక్టార్ 62/నోయిడా వైపు నిష్క్రమణ (ఎగ్జిట్) తీసుకోండి.
  • సెక్టార్ 62 పోలీస్ పోస్ట్ కూడలికి చేరుకుని కుడి వైపు తిరగండి.
  • పరమహంస యోగానంద మార్గంలోకి 3వ ఎడమ మలుపు తీసుకోండి.
  • పరమహంస యోగానంద మార్గంలో, 1వ కుడి మలుపు తీసుకోండి.
  • మలుపు తిరిగిన తర్వాత, మీ ఎడమ వైపున ఉన్న మొదటి భవనమే వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమం.

సమీపంలోని ముఖ్య ఆనవాళ్ళు:

  • ఒకాయా బిల్డింగ్ పక్కన
  • IIM లక్నో, నోయిడా క్యాంపస్ ఎదురుగా
  • ఫోర్టిస్ హాస్పిటల్, నోయిడా నుండి సుమారు 2-3 కి.మీ. దూరంలో
మెట్రో ద్వారా

ఆశ్రమానికి సమీప మెట్రో స్టేషన్ – ఢిల్లీ మెట్రో బ్లూ లైన్‌ పైన నోయిడా సెక్టార్ 62 మెట్రో స్టేషన్. స్టేషన్ నుండి ఆశ్రమం సుమారు 2.2 కి.మీ. దూరంలో ఉంది, క్యాబ్ లేదా ఆటో-రిక్షా ద్వారా చేరుకోవడానికి దాదాపు 10 నిమిషాలు పడుతుంది. విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్ టెర్మినల్ లేదా ఢిల్లీ-NCR లోని ఇతర ప్రదేశాల నుండి ఆశ్రమానికి ప్రయాణించే సందర్శకులకు మెట్రో సాధారణంగా మరింత పొదుపైన ఎంపిక.

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి (70-80 నిమిషాలు):
మెట్రో సేవలు టెర్మినల్ 1 మరియు టెర్మినల్ 3 రెండింటి నుండీ అందుబాటులో ఉన్నాయి.

  • టెర్మినల్ 1 – IGI విమానాశ్రయం నుండి, బొటానికల్ గార్డెన్ వరకు మెజెంతా లైన్ తీసుకోండి. అక్కడ బ్లూ లైన్‌కి (నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ వైపు) మారి, నోయిడా సెక్టార్ 62 మెట్రో స్టేషన్ వద్ద దిగండి.
  • టెర్మినల్ 3 – IGI విమానాశ్రయం నుండి, న్యూ ఢిల్లీ స్టేషన్ వరకు ఆరెంజ్ లైన్ (ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్) తీసుకోండి. అక్కడ యెల్లో లైన్‌కి (మిలీనియం సిటీ సెంటర్ గురుగ్రామ్ వైపు) మారి రాజీవ్ చౌక్ వద్ద దిగండి. అక్కడ బ్లూ లైన్‌కి (నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ వైపు) మారి నోయిడా సెక్టార్ 62 స్టేషన్ వద్ద దిగండి.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి (50-60 నిమిషాలు):
న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ నుండి, యెల్లో లైన్ (మిలీనియం సిటీ సెంటర్ గురుగ్రామ్ వైపు) తీసుకుని రాజీవ్ చౌక్ వద్ద దిగండి. అక్కడ బ్లూ లైన్‌కి (నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ వైపు) మారి నోయిడా సెక్టార్ 62 స్టేషన్ వద్ద దిగండి.

ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి (50-60 నిమిషాలు):
చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద యెల్లో లైన్ (మిలీనియం సిటీ సెంటర్ గురుగ్రామ్ వైపు) ఎక్కి రాజీవ్ చౌక్ వద్ద దిగండి. అక్కడ బ్లూ లైన్‌కి (నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ వైపు) మారి నోయిడా సెక్టార్ 62 స్టేషన్ వద్ద దిగండి.

ఆనంద్ విహార్ టెర్మినల్ నుండి (45-55 నిమిషాలు):
ఆనంద్ విహార్ ISBT మెట్రో స్టేషన్ నుండి, పింక్ లైన్ (ఐ.పి. ఎక్స్-టెన్షన్ వైపు) తీసుకుని మయూర్ విహార్ ఫేజ్-I వద్ద దిగండి. అక్కడ బ్లూ లైన్‌కి (నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ వైపు) మారి నోయిడా సెక్టార్ 62 స్టేషన్ వద్ద దిగండి.

ISBT కశ్మీరీ గేట్ నుండి (60-70 నిమిషాలు):
ISBT కశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్ నుండి, వయొలెట్ లైన్ (రాజా నహర్ సింగ్ వైపు) తీసుకుని మండి హౌస్ వద్ద దిగండి. అక్కడ బ్లూ లైన్‌కి (నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ వైపు) మారి నోయిడా సెక్టార్ 62 స్టేషన్ వద్ద దిగండి.

మెట్రో మార్గాలు, ఇంటర్‌ఛేంజ్ పాయింట్లు మరియు ప్రయాణ సమయాలు మారవచ్చు. ప్రయాణించే ముందు దయచేసి ఢిల్లీ మెట్రో యొక్క తాజా మార్గం మరియు సేవా సమాచారాన్ని జాగ్రత్తగా చూడండి.

ఇతరులతో పంచుకోండి