సేవా అవకాశాలు

పూర్తి సమయం ఉద్యోగ అవకాశాలు
సేవక్ అవకాశాలు
స్వచ్ఛంద సేవా అవకాశాలు

YSS-Service-Opportunities-Featured-Image

మీరు ఇతరులకు సేవ చేయడంలో మిమ్మల్ని మీరు మరచిపోయినప్పుడు, మీరు దానిని కోరకుండానే మీ స్వీయ ఆనందమనే పాత్ర నిండిపోయిందని మీరు కనుగొంటారు.

— పరమహంస యోగానంద

జూలై 2026

భగవంతుడు మరియు మహాగురువుల దయ వలన, పరివర్తనకారక మరియు విముక్తిదాయక మార్గమైన క్రియాయోగంలోకి మరింత ఎక్కువమంది సత్యాన్వేషకులను తీసుకువస్తూ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) భారత ఉపఖండమంతటా వేగంగా విస్తరిస్తున్నది.

ఈ వృద్ధికి మద్దతు ఇవ్వడానికి, బృందాలకు నేతృత్వం వహించడం, పర్యవేక్షించడం, సమన్వయం చేయడం, ప్రాజెక్ట్‌లు మరియు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం వంటి వివిధ పాత్రల్లో సేవలందించేందుకు అంకితమైన మరియు సమర్థులైన వ్యక్తులను మేము క్రియాశీలంగా అన్వేషిస్తున్నాము.

సేవ చేయడంలో ఆసక్తి ఉన్నవారిని ఉద్యోగులుగా, మా ఆశ్రమాలలో నివాస సేవకులుగా లేదా సమీప వాలంటీర్లుగా వివిధ హోదాల్లో సేవ చేయమని మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దయచేసి మా వద్ద ఉన్న ఈ అవకాశాలను పరిశీలించండి.

అందుబాటులో ఉన్న ప్రస్తుత స్థానము(లు)

మేము క్రింద పేర్కొన్న విభాగాలలో నిపుణుల కోసం చూస్తున్నాము:

పూర్తి సమయం ఉద్యోగ అవకాశాలు

వై.ఎస్.ఎస్. లో ప్రతి ఉద్యోగ స్థానం, ఆదాయం మరియు ప్రయోజనాలు కలిగిన ఆకర్షణీయమైన పారితోషికంతో కూడి ఉంటుంది.

వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలోని ఉద్యోగులు ఆశ్రమం యొక్క పవిత్ర ప్రాంగణంలో పని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆనందించవచ్చు, దానితో పాటు సాధన మరియు సేవ యొక్క సమతుల్య జీవితాన్ని గడపవచ్చు. వారు సమూహ ధ్యానాలు మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలలో చేరే అవకాశాన్ని కూడా పొందవచ్చు, సామరస్య పూర్వక వాతావరణంలో పని చేయవచ్చు మరియు గురుదేవుల యొక్క దివ్య ఉనికితో నిండిన పావన ఆశ్రమ మైదానాలను ఆస్వాదించవచ్చు.

para-ornament

ఆర్థిక మరియు ఖాతా లెక్కల విభాగాధికారి, రాంచీ

ఉద్యోగ కోడ్: J20
స్థానం: రాంచీ
విభాగం:
ఆర్థిక మరియు ఖాతా లెక్కల విభాగం
అవకాశం ఉన్న స్థానాల సంఖ్య: 1
పాత్ర: పూర్తి సమయం

పాత్ర యొక్క సారాంశం:
ఆర్థిక మరియు ఖాతా లెక్కల విభాగాధికారి (ఫైనాన్స్ మరియు అకౌంట్స్ హెడ్), యోగదా సత్సంగ సొసైటీకి చెందిన ఆశ్రమాలు మరియు కేంద్రాల యొక్క ఆర్థిక పరిపాలన (ఫైనాన్సియల్ గవర్నెన్స్), నిబంధనా పాలన (కంప్లయన్స్), అంతర్గత నియంత్రణలు (ఇంటర్నల్ కంట్రోల్స్), ఆర్థిక ప్రణాళికలు మరియు వనరుల నిర్వహణలపై నాయకత్వం మరియు పర్యవేక్షణలను అందిస్తారు.

ఈ పాత్రకు ఉన్నతస్థాయి యాజమాన్య స్ఫూర్తి, నిజాయితీ, విశ్లేషణాత్మకమైన ఆలోచన మరియు సహకారస్ఫూర్తి అవసరం. వీటితో పాటు, పరిణామం చెందుతున్న చట్టబద్ధమైన మరియు సంస్థాగతమైన అవసరాలను నెరవేర్చే విధంగా బృందాలకు నాయకత్వం వహించడానికి, పటిష్టమైన వ్యవస్థలను స్థాపించడానికి మరియు ప్రక్రియాభివృద్ధిని ముందుకు నడపడానికి అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.

అధికార క్రమం (రిపోర్టింగ్ విధానం):
ఈ పాత్రకు నియమితులైన వ్యక్తి, కోశాధికారి కార్యాలయం (ట్రెజరర్ ఆఫీస్) లోని సీనియర్ సన్యాసులకు రిపోర్టు చెయ్యాలి; అలాగే, 18-20 మంది ఆర్థిక మరియు ఖాతా లెక్కల (అకౌంటింగ్) నిపుణుల బృందానికి ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో నాయకత్వం వహించాలి.


పాత్ర యొక్క ప్రధాన విధులు:

  • ఆర్థిక కార్యాచరణ పర్యవేక్షణ:
    • వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో అకౌంటింగ్ కార్యాచరణను పర్యవేక్షించడం; ఇతర వై.ఎస్.ఎస్. ఆశ్రమాలకు, కేంద్రాలకు ఈ విభాగంలో మార్గనిర్దేశాన్ని మరియు సహకారాన్ని అందజేయడం
    • ఆర్థిక మరియు ఖాతా లెక్కల కార్యాచరణకు సంబంధించిన ప్రామాణిక నిర్వహణ విధానాలను (SOP – స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్) స్థాపించి, వాటిని పునస్సమీక్షించడం (రివ్యూ)
    • ప్రక్రియలను మెరుగుపరచడం మరియు వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా కార్యాచరణ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం
  • లెక్కల తనిఖీ మరియు అంతర్గత నియంత్రణలు:
    • వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు మరియు కేంద్రాలు అన్నింటిలోను, అంతర్గత నియంత్రణా వ్యవస్థలను స్థాపించడం, వాటిని బలోపేతం చేయడం మరియు వాటిని పర్యవేక్షించడం
    • అంతర్గత లెక్కల తనిఖీ (ఇంటర్నల్ ఆడిట్) బృందానికి నాయకత్వం వహిస్తూ, అంతర్గత లెక్కల తనిఖీ ప్రక్రియను క్రమబద్ధం చెయ్యాలి
    • చట్టబద్ధమైన లెక్కల తనిఖీ (స్టాట్యూటరీ ఆడిట్) నిమిత్తం ఖాతా లెక్కలను సిద్ధంగా ఉంచడం మరియు చట్టబద్ధమైన లెక్కల తనిఖీ ప్రక్రియను పర్యవేక్షించడం
  • చట్టబద్ధమైన మరియు నియంత్రణ పాలన:
    • ఈ క్రింది విషయాలతో సహా, అన్ని చట్టబద్ధమైన నిబంధనలు సకాలంలో, ఖచ్చితంగా పాటించబడుతున్నాయని చూసుకోవడం:
      • ఆదాయం పన్ను దాఖలు
      • ఎఫ్.సి.ఆర్.ఏ. (విదేశీ సహకార నియంత్రణ చట్టం) కు సంబంధించిన నిబంధనల పాలన
      • జీ.ఎస్.టీ. మరియు వై.ఎస్.ఎస్. కు వర్తించే ఇతర చట్టాలు
    • నిబంధన పాలనా ప్రక్రియలను (కంప్లయన్స్ ప్రాసెసీస్) సులభం మరియు బలోపేతం చేసే వ్యవస్థలను, ఎం.ఐ.ఎస్. (MIS – నిర్వహణ సమాచార వ్యవస్థ) మరియు నివేదికలను (టాలీ మరియు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ల వినియోగం ద్వారా) రూపొందించి, అమలు చేయడం
  • ఆర్థిక ప్రణాళికలు, నివేదికలు మరియు నిధుల నిర్వహణ:
    • స్వల్పకాలిక మిగులు నిధులు (షార్ట్-టర్మ్ సర్ప్లస్ ఫండ్స్) సముచితంగా వినియోగించబడేలా కార్యాచరణ మూలధన నిర్వహణను (వర్కింగ్ కేపిటల్ మేనేజిమెంట్) బలపరచడం
    • సీనియర్ మేనేజిమెంటుకు ఆర్ధిక అవగాహనలను మరియు విశ్లేషణలను అందించడం
  • మూలధన (కేపిటల్) పథకాలు మరియు ప్రత్యేక విధులు:
    • మూలధన పథకాలకు సంబంధించిన ఖాతా లెక్కలు మరియు నివేదికల కోసం నియంత్రణలను మరియు ప్రామాణిక కార్యాచరణ విధానాలను (SOP) స్థాపించడం


అర్హతలు మరియు పూర్వానుభవం:

  • చార్టర్డ్ అకౌంటెంట్ (సీ.ఏ.); 15+ సంవత్సరాల సంబంధిత ఉద్యోగానుభవం – ఆర్థిక విభాగం, లెక్కల తనిఖీ (ఆడిట్), సంస్థాగత నాయకత్వం మరియు సంబంధిత విషయాలలో అనుభవం ఉండాలి
  • ఈ క్రింది విషయాలలో ఉత్తమ పరిజ్ఞానం ఉండాలి:
    • భారతీయ ఖాతా లెక్కల ప్రమాణాలు (ఇండియన్ అకౌంటింగ్ స్టేండర్డ్స్)
    • చట్టబద్ధమైన నిబంధన పాలన (IT – ఆదాయపు పన్ను, FCRA – విదేశీ సహకార నియంత్రణ చట్టం, GST, మొదలగు విషయాలలో)
    • అంతర్గత నియంత్రణలు (ఇంటర్నల్ కంట్రోల్స్) మరియు లెక్కల తనిఖీ (ఆడిట్) పద్ధతులు
  • టాలీ, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మరియు ఆర్థిక నివేదికా వ్యవస్థలపై స్వయంగా పని చేసిన అనుభవం
  • పెద్ద సంస్థల (ఎంటర్ప్రైజ్ స్థాయి) ఆర్థిక పరిపాలనా వ్యవస్థలలో అనుభవం ఉంటే మంచిది


నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు:

  • ఉత్తమస్థాయి నిజాయితీ, యాజమాన్యస్ఫూర్తి మరియు విశ్వసనీయత
  • ఉత్తమ విశ్లేషణాత్మక మరియు సమస్య-పరిష్కార నైపుణ్యాలు
  • స్వతంత్రంగా పని చేయడం మరియు బృందాలకు నాయకత్వం వహించడం, రెండింటిలోనూ నిరూపిత సామర్థ్యం ఉండాలి
  • అత్యుత్తమ భావ ప్రకటన (కమ్యూనికేషన్) నైపుణ్యం
  • ప్రక్రియ-కేంద్రిత ఆలోచనా విధానం మరియు వివరాలపై శ్రద్ధ వహించే వైఖరి


పారితోషికం:

  • ఈ పాత్ర యొక్క పారితోషికం ఉద్యోగానుభవం, బాధ్యతలు మరియు సంస్థ యొక్క లక్ష్యంతో ఏకీభావాలకు అనుగుణంగా ఉంటుంది
  • గృహవసతి సదుపాయం అందించబడుతుంది; ఈ పాత్ర స్థానం రాంచీలో ఉన్నప్పటికీ, పాక్షికంగా దూరప్రాంతం (రిమోట్ స్థానం) నుంచి పని చేసే ఏర్పాట్లను పరిగణించవచ్చు

ప్రాజెక్టు నిర్వహణ సహాయ అధికారి (అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్) — వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రం, రాంచీ

ఉద్యోగ కోడ్: J22
స్థానం: రాంచీ
విభాగం:
వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రం
అవకాశం ఉన్న స్థానాల సంఖ్య: 1
పాత్ర: పూర్తి సమయం

పాత్ర యొక్క సారాంశం:
ప్రాజెక్ట్ నిర్వహణ సహాయ అధికారి, సహాయ కేంద్రానికి చెందిన స్వచ్ఛంద సేవకులను, ప్రక్రియలను మరియు వ్యవస్థలను సామరస్యంతో నిర్వహించడం ద్వారా, “సకాలంలో ప్రేమపూర్వకమైన సేవను మరియు సరియైన పరిష్కారాలను,” అందించే బాధ్యతను వహిస్తారు. అతడు/ఆమె సహాయ కేంద్రం యొక్క ప్రక్రియలు మరియు వ్యవస్థలపై అవసరమైన అవగాహనను కలిగియుండాలి (వీటిపై శిక్షణ ఇవ్వబడుతుంది); అలాగే, సమస్యా పరిష్కారం పట్ల మరియు సేవలను మెరుగుపరచడం, వాటిని మరింత సమర్థవంతంగా చేసే అవకాశాలను గుర్తించడం పట్ల తగిన అవగాహనను కలిగి ఉండాలి.

సహాయ కేంద్రం అందించే సేవలను, స్వచ్ఛంద సేవకులను, వినియోగంలో ఉన్న ప్రక్రియలను, సహాయ కేంద్రం యొక్క ప్రాధాన్యతలు/సమస్యలను, కీలక సంబంధిత పక్షాలను అర్థం చేసుకోవడానికి ఆదర్శ అభ్యర్ధి తగిన సమయం తీసుకుంటారు. భక్తులకు అందించే సేవల నాణ్యతను నిరంతం మెరుగుపరచడానికి అతడు/ఆమె ఇతర స్వచ్ఛంద సేవకులతో పారదర్శకంగానూ, సహకారంతోనూ పని చేస్తారు.


పాత్ర యొక్క ప్రధాన విధులు:

  • విభాగాధికారితో సహకరించి, స్థానిక మరియు సమీప ప్రాంత స్వచ్ఛంద సేవకుల యొక్క నియామకాలను మరియు సేవానాణ్యతల ప్రమాణాలను నిశ్చయించడం
  • కోరిన లక్షణాలు కలిగిన స్వచ్ఛంద సేవకుల ఎంపికను మరియు నియామకాలను పర్యవేక్షించడం
  • స్వచ్ఛంద సేవకులు భక్తులకు “సకాలంలో ప్రేమపూర్వకమైన సేవను మరియు సరియైన పరిష్కారాలను,” అందజేసేందుకు వారిని సన్నద్ధులను చేయగలిగే ఆకర్షణీయమైన, అనుభవపూర్వకమైన శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించి, సమన్వయం చేయడం
  • టెలిఫోన్ మరియు ఈ-మెయిల్ ప్లాట్-ఫారాలపై సేవానాణ్యతను పర్యవేక్షించి, సేవలను మెరుగుపరిచే నిర్దిష్టమైన అవకాశాలను గుర్తించడం
  • టెలిఫోన్ మరియు ఈ-మెయిల్ వ్యవహారాల (ట్రాన్సాక్షన్) డేటాను విశ్లేషించి, సమర్థవంతమైన సేవలు సకాలంలో అందేలా చేయడం
  • నాణ్యత, సామర్థ్యం మరియు సేవాప్రమాణాలను సమగ్రంగా మెరుగుపరిచే వ్యూహాత్మకమైన ప్రయత్నాలను ప్రారంభించడం
  • సన్యాసులతోనూ మరియు ఇతర ఆశ్రమ విభాగాలతోనూ సమన్వయంతో పని చేసి, భక్తులకు అత్యుత్తమ సేవలందేలా చూడడం మరియు సమస్యలు తగిన విధంగా వెలుగులోకి వచ్చేటట్లు చేయడం
  • “ప్రేమపూర్వకమైన సేవను మరియు సరియైన పరిష్కారాలను సకాలంలో అందించడం” అన్న లక్ష్యాన్ని సాధించే నిమిత్తం – నియామకాలు, ఉద్యోగ శిక్షణ, కాలపట్టిక తయారీ (షెడ్యూలింగ్) మరియు పర్యవేక్షణ మొదలైన అంతర్గత కార్యాచరణ విభాగాలను పర్యవేక్షించే కార్యాచరణ నిపుణులను (ఫంక్షనల్ స్పెషలిస్టులు) నిర్వహించడం
  • వివిధ విభాగాల అధికారులు తమ విభాగాలను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి, వారికి సలహాలను, సహకారాన్ని మరియు శిక్షణను అందించడం
  • వ్యక్తిగత మరియు సామూహిక సమావేశాల ద్వారా చురుకైన, కార్యనిమగ్నులైన, అంకితభావం గల స్వచ్ఛంద సేవక బృందాన్ని తయారు చేయడం, మరింత ఎక్కువ బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులను గుర్తించడం
  • సహాయ కేంద్రంలో కీలక నిర్ణయాలను తీసుకొనే అధికారిగా వ్యవహరిస్తూ, క్లిష్ట సమస్యలు మరియు తీవ్రత పెరుగుతున్న సమస్యలు, మొదలైనవాటిని పరిష్కరించడం


అర్హతలు:

  • విద్యార్హతలు మరియు పూర్వానుభవం:
    • మాస్టర్స్ (పోస్ట్-గ్రాడ్యుయేట్) డిగ్రీ
    • సమీప బృందాలను పర్యవేక్షించడంలో నిరూపిత అనుభవం; వై.ఎస్.ఎస్. లో అట్టి అనుభవానికి అదనపు ప్రాధాన్యత (బృంద పర్యవేక్షణానుభవం, వ్యక్తిగతంగా పనిచేయడం కాదు)
    • ప్రపంచస్థాయి సేవలను అందించడంలో పేరుగాంచిన సంస్థలలో వినియోగదారుల సేవ (కస్టమర్ సర్వీస్), సాంకేతిక సహకారం (టెక్నికల్ సపోర్ట్), కాల్ సెంటర్ ఆపరేషన్స్ మొదలైన పాత్రలలో అనుభవం (విక్రయాల అనుభవం – సేల్స్ ఎక్స్పీరియన్స్ – కూడా గణనలోకి తీసుకోబడుతుంది)
    • సేవానాణ్యతలో (ప్రమాణాలను రూపొందించడం, శిక్షణ (ట్రైనింగ్), రోజువారీ పనిలో శిక్షణ (ఆన్-ది-జాబ్ కోచింగ్), పనితీరు పర్యవేక్షణ (పెర్ఫార్మన్స్ మానిటరింగ్) లతో సహా నిరూపించబడిన జవాబుదారీతనం
    • వ్యక్తిగత మరియు సామాజిక మృదు నైపుణ్యాలు (సాఫ్ట్ స్కిల్స్) మరియు సాంకేతిక రంగాలలో ఇతరులకు శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలో పూర్వానుభవం
    • ప్రామాణిక నిర్వహణ విధానాలను (SOP – స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్) మరియు ప్రమాణపత్రాల నిర్వహణ ప్రక్రియలను (ప్రాసెస్ డాక్యుమెంటేషన్) రూపొందించడంలో నిరూపిత సామర్థ్యం
    • బలమైన ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలు – ఆశించిన ఫలితాలను అందించే విధంగా ప్రాజెక్టు ప్రతిపాదనలను చేయడం, ప్రణాళికల తయారీ, అమలు చేయడం, పర్యవేక్షించడం, కార్యాచరణను నిరంతరం మెరుగుపరచడానికి అవసరమైన సామర్ధ్యం
  • నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు:
    • భక్తి మరియు వృత్తిపరమైన నైపుణ్యాల సామరస్యపూర్ణమైన సమతుల్యతను కలిగి ఉండాలి, తూర్పు మరియు పశ్చిమ దేశాల యొక్క ఉత్తమ లక్షణాలను ప్రతిబింబిస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని బలమైన మృదు నైపుణ్యాలతో (సాఫ్ట్ స్కిల్స్) మిళితం చేయగలగాలి
    • చక్కగా రూపొందించబడిన, సమర్థవంతమైన ప్రక్రియల ద్వారా భక్తులకు అత్యుత్తమమైన సేవా నాణ్యతను అందించడంపై నిమగ్నమై, సేవాశ్రేష్ఠతకు, ప్రక్రియాశ్రేష్ఠతకు కట్టుబడి ఉండాలి (పరిపూర్ణతను సాధించడం కంటే భక్తులకు పరిష్కారాలను అందించడంపై కేంద్రీకృతమై ఉండాలి)
    • బలమైన విశ్లేషణాత్మకమైన మరియు సమస్య-పరిష్కార దృక్పథం ఉండాలి – తమంతట తాము తక్షణం ఆలోచించడం, వ్యవస్థలలోనూ మరియు మానవ వ్యవహారాలలోనూ కార్యకారణ సంబంధాలను గుర్తించడం, మూలకారణాలను నిర్ణయించడం వంటి సామర్థ్యాలు కలిగి ఉండాలి
    • సాంకేతిక సామర్థ్యం కలిగి ఉండాలి, అలాగే డిజిటల్ సాధనాలు మరియు ప్లాట్-ఫారాలపై (ఉదాహరణకు జూమ్, గూగుల్ వర్క్-స్పేస్) పని చేయడంలో సామర్థ్యం; ఇటువంటి ప్లాట్-ఫారాలపై ఎవరు ప్రవేశించగలరో, ఎవరు ఏ పని చేయగలరో నియంత్రించే వ్యవస్థలను (ఆక్సిస్ కంట్రోల్ సెట్టింగులను), సమగ్రస్థాయి వ్యవస్థలను (గ్లోబల్ సెట్టింగులను) నిర్వహించే అనుభవం కలిగి ఉండాలి
    • EPABX వంటి టెలిఫోన్ మరియు ఈ-మెయిల్ వ్యవస్థలతో పరిచయం కలిగి ఉండాలి (టికెటింగ్ వ్యవస్థలతో పరిచయం తప్పనిసరి కాకపోయినా, ఉంటే మంచిది) వ్యక్తుల మధ్య సంబంధాలను సామరస్యపూర్వకంగా నిర్వహించడంలోను, ఇతరులకు ప్రేరణను కలిగించడంలోను, విభేదాలను హుందాగా పరిష్కరించడంలోను ప్రావీణ్యత కలిగి ఉండాలి
    • మంచి భావ ప్రకటనా చాతుర్యం కలిగి ఉండాలి – శ్రద్ధగా విని, స్పష్టంగా సమాధానాలను ఇవ్వగలగాలి; ఇంగ్లీషు మరియు హిందీ భాషలలో బాగా మాట్లాడడం మరియు వ్రాయగలిగే ప్రావీణ్యత కలిగి ఉండాలి
    • వ్యక్తుల సామర్థ్యాలను గుర్తించి, ఇతరులలోని సామర్థ్యాలను వెలికి తీసి, ఇతరుల అభివృద్ధికి తగిన మార్గనిర్దేశం చేసే సామర్థ్యం కలిగి ఉండాలి
    • “ఉదాత్త నూతనత్వ” వైఖరి (“నోబుల్ న్యూ” మైండ్-సెట్) కలిగి ఉండాలి – క్రొత్త విషయాలను నేర్చుకునే సంసిద్ధత, క్రొత్త సవాళ్లను స్వీకరించడానికి సంసిద్ధత, మరియు సమకాలీన ఆలోచనలను, వ్యవస్థలను వినియోగించి నవీకరణలను (ఇన్నోవేషన్స్) చేయడానికి సంసిద్ధత

ప్రచురణల పంపిణీ అధికారి

ఉద్యోగ కోడ్: J19
స్థానం: రాంచీ
విభాగం:
పుస్తకాలు
అవకాశం ఉన్న స్థానాల సంఖ్య: 1
పాత్ర: పూర్తి సమయం

పాత్ర యొక్క సారాంశం:
ప్రచురణల పంపిణీ అధికారి (పబ్లికేషన్స్ డిస్ట్రిబ్యూషన్ హెడ్), పుస్తకాల విభాగంలో పని చేస్తూ, వై.ఎస్.ఎస్. ప్రచురణల అమ్మకాలు మరియు వ్యాపార ప్రచారాలకు (సేల్స్ అండ్ మార్కెటింగ్) నేతృత్వాన్ని వహిస్తారు. ఈ పాత్ర, సమగ్ర వై.ఎస్.ఎస్. సంస్కృతి మరియు విలువలకు అనుగుణంగా పనిచేస్తూ, వై.ఎస్.ఎస్. పుస్తకాల విస్తరణను పెంచడానికి, మార్కెట్లో ఉనికిని బలపరచడానికి, స్థిరమైన పెరుగుదలను నిశ్చయపరచడానికి తగిన వ్యూహాలు (మార్కెట్ స్ట్రేటజీలను) అమలు చేయడాన్ని కూడి ఉంటుంది.


పాత్ర యొక్క ప్రధాన విధులు:

  • కార్యాచరణ పర్యవేక్షణ మరియు బృందం యొక్క నిర్వహణ:
    • అన్ని ఉప-విభాగాలు మరియు సిబ్బంది అందరినీ, కలిసి సమన్వయంతోను, సమర్థవంతంగాను పనిచేసేటట్లుగా రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడం
    • గిడ్డంగి (గోడౌను) నిర్వహణ
    • ఉత్తమమైన పనితీరు, సామర్థ్యం కలిగిన బృందాన్ని సమీకరించి, దానికి నేతృత్వం వహించడం; ఆ బృందంలో పరస్పర సహకారం మరియు పని శ్రేష్ఠతల సంస్కృతిని పెంపొందించడం
    • కార్యకలాపాలు చట్టపరమైన మరియు నియంత్రణాపరమైన (రెగ్యులేటరీ) ఆవశ్యకతలు అన్నింటికీ నిబద్ధంగా నడుస్తున్నాయని చూసుకోవడం
  • ఈ-కామర్స్ వేదికలపై డిజిటల్ ఉనికిని ఆప్టిమైజ్ చేయడం:
    • క్రొత్త మరియు పాత పుస్తకాల అమ్మకాల కోసం మల్టీ-ఛానల్ వ్యాపార ప్రచార ప్రణాళికలను నిర్మించడంలోను, అమలు చేయడంలోను సహాయపడడం
    • అమెజాన్ (Amazon), ఫ్లిప్-కార్ట్ (Flipkart) మరియు ఇతర ఈ-కామర్స్ వేదికలపై పుస్తకాల నమోదును ఆప్టిమైజ్ చేయడం ద్వారా వై.ఎస్.ఎస్. యొక్క ఆన్లైన్ ఉనికిని బలోపేతం చేయడం
    • డిజిటల్ అమ్మకాల భాగస్వాములు మరియు అగ్రిగేటర్స్ తో సహకరించి, ఎలక్ట్రానిక్ పుస్తకాల (ఈ-బుక్) మరియు ఆడియో పుస్తకాల పంపిణీని విస్తరించడం
  • ఆర్థిక వ్యవహారాల నిర్వహణ:
    • వై.ఎస్.ఎస్. ప్రచురణల యొక్క వ్యాప్తి పెరుగుదలను, ఆర్థిక శ్రేయస్సును, స్థిరత్వాన్ని బలపరిచే విధంగా అమ్మకాల వార్షిక సూచనలను తయారు చేసి, నిర్వహించడం
    • పనితీరును అంచనా వేయడానికి సహాయపడే కీలక కార్యాచరణ సూచికలను (కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్ – KPI) మరియు ఆర్థిక కొలమానాలను (ఫైనాన్సియల్ మెట్రిక్స్) ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం
  • వ్యాపార మరియు పరిశ్రమ వర్గాల నిర్వహణ:
    • పంపిణీదారులతోనూ, పుస్తకశాలలతోనూ (స్వతంత్ర మరియు చైన్ విక్రయశాలలు), ఆన్లైన్ విక్రయదారులతోనూ (ఆన్లైన్ రిటైలర్లు), టోకు వ్యాపారులతోనూ (హోల్ సేలర్స్), వై.ఎస్.ఎస్. కేంద్రాలతోనూ బలమైన సంబంధాలను నిర్మించి, నిర్వహించడం
    • పుస్తక ప్రదర్శనలు, సమావేశాలు మరియు పరిశ్రమ కార్యక్రమాలలో వై.ఎస్.ఎస్. ప్రచురణలకు ప్రాతినిధ్యం వహించడం
  • ఐ.టీ. సిస్టమ్స్ సదుపాయాలు (ఇన్ఫ్రా-స్ట్రక్చర్) మరియు డేటా అంతర్దృష్టి నిర్వహణ:
    • పుస్తక క్రయ సాఫ్ట్-వేర్ మరియు సమాచార వ్యవస్థలను (ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) అమలు చేయడం, నిర్వహించి కొనసాగించడం, మరియు అభివృద్ధి చేయడం
    • సమాచారం (డేటా) ఆధారంగా ఉన్నతాధికారులు నిర్ణయాలు చేసే ప్రక్రియలను ఏర్పాటు చేయడం


అర్హతలు:

  • విద్య మరియు అనుభవం:
    • బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్-మెంట్, లేక ఇతర సంబంధిత రంగంలో మాస్టర్స్ డిగ్రీ ఉంటే మంచిది
    • ప్రచురణ పరిశ్రమలో (పబ్లిషింగ్ ఇండస్ట్రీ) 7-10 సంవత్సరాల సంబంధిత నాయకత్వ అనుభవం
  • నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు:
    • అమ్మకాలను అభివృద్ధి చేయడంలోనూ (బిజినెస్ డెవలప్మెంట్) మరియు వ్యూహాత్మకంగా ప్రణాళికలను తయారు చేయడంలోనూ (స్ట్రాటెజిక్ ప్లానింగ్) నిరూపిత అనుభవం
    • ప్రచురణ పరిశ్రమ యొక్క వ్యవహారాలపై బలమైన అవగాహన
    • ఆర్థిక వ్యవహారాలలో చతురత, ప్రత్యేకంగా బడ్జెట్ తయారీ, నిర్వహణ మరియు కార్యాచరణ నిర్వహణ అనుభవం ఉండాలి
    • ఉత్తమమైన నాయకత్వ, భావ ప్రకటన (కమ్యూనికేషన్) మరియు బృంద-సమీకరణ (టీమ్ బిల్డింగ్) సామర్థ్యాలు ఉండాలి
    • నవీకరణ కోసం తపన ఉన్న వ్యూహాత్మకమైన ఆలోచనాపరత్వం

వైద్యశాల నిర్వహణాధికారి

ఉద్యోగ కోడ్: J24
స్థానం: రాంచీ
విభాగం:
వైద్య విభాగం — వైద్యశాల మరియు ఔషధశాల
అవకాశం ఉన్న స్థానాల సంఖ్య: 1
పాత్ర: పూర్తి సమయం

పాత్ర యొక్క సారాంశం:

వైద్యశాల నిర్వహణాధికారి, సేవాశ్రమం, అనగా వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలోని ఆసుపత్రి, యొక్క రోజువారీ కార్యకలాపాలకు బాధ్యత వహించి, అది రోగులకు అతి శ్రేష్ఠమైన ఆరోగ్య-సంరక్షణా సేవలను సమర్థవంతంగా అందించేటట్లు చూసుకుంటారు. ఈ పాత్ర, ఆసుపత్రి సిబ్బంది మరియు రోగ చికిత్సా సేవల యొక్క నిర్వహణ, ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ, పరిసరాలలో సామాజిక ప్రచార కార్యక్రమాల నిర్వహణ, మరియు ఆసుపత్రి సేవలకు సంబంధించిన ఆరోగ్య-సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా ఉండేటట్లు చూసుకోవడం వంటి పనులకు బాధ్యత వహిస్తుంది.


పాత్ర యొక్క ప్రధాన విధులు:

  • కార్యకలాపాల నిర్వహణ:
    • రోగులకు ఉత్తమ ఆరోగ్య-సంరక్షణా సేవలను అందజేసే నిమిత్తం, చికిత్సా సిబ్బందితోనూ, ఇతర సిబ్బందితోనూ సమన్వయం చేయడం
    • ఆసుపత్రి యొక్క అన్ని విభాగాలు సజావుగా పనిచేసే విధంగా, ఆసుపత్రి యొక్క రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడం
    • కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించే నిర్వాహకసూత్రాలను మరియు పద్ధతులను తయారు చేసి, అమలు చేయడం
  • ఆర్థిక వ్యవహారరాల నిర్వహణ:
    • వనరులను అనుకూలమైన విధంగా కేటాయించేలా ఆసుపత్రి బడ్జెట్ ను తయారు చేసి, దానిని అమలు చేయడం
    • ఖర్చులను పర్యవేక్షించడం, చికిత్సా సేవలలో రాజీ పడకుండా వ్యయాన్ని ఆదా చేసే మార్గాలను గుర్తించడం
    • నిధి ప్రదానాల దరఖాస్తు తయారీ (గ్రాంట్ రైటింగ్), దాతలతో సంబంధాల నిర్వహణతో పాటు నిధుల సేకరణకు సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షించడం
  • సిబ్బంది నిర్వహణ:
    • వైద్యులు, నర్సులు మరియు పరిపాలనా సిబ్బందితో సహా, ఔషధశాల (డిస్పెన్సరీ) సిబ్బంది యొక్క నియామకాలు, శిక్షణ మరియు పర్యవేక్షణ
    • కలసికట్టుగా పనిచేయడాన్ని, వృత్తిపరమైన అభివృద్ధిని, సిబ్బంది ఉద్యోగాలను వదలిపెట్టకుండా ఇక్కడే పని చేయడాన్ని ప్రోత్సహించే సానుకూలమైన కార్యాచరణ వాతావరణాన్ని అభివృద్ధి చేయడం
    • క్రమం తప్పకుండా సిబ్బంది యొక్క కార్యాచరణను అంచనా వేసి (పెర్ఫార్మన్స్ ఎవాల్యుయేషన్), ఏవైనా సమస్యలు లేక విభేదాలు ఉంటే, వాటిని పరిష్కరించడం
  • రోగుల సంరక్షణా సేవలు:
    • ఆసుపత్రి ఆశయాలకు అనుగుణంగా, రోగులకు శ్రేష్ఠమైన, కరుణాపూరితమైన సేవలు అందేలా చూసుకోవడం
    • రోగులకు ఆందోళన కలిగించే విషయాలను, వారి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించి, అవసరమైన దిద్దిబాటు చర్యలను అమలు చేయడం
    • రోగుల యొక్క వైద్య సంబంధిత సమాచారం నిర్వహణను మరియు గోప్యతను (కాన్ఫిడెన్షియాలిటీ) పర్యవేక్షించి, అవి చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం
    • రాంచీ ఆశ్రమంలోని సన్యాసులు, సేవకులు మరియు సిబ్బంది యొక్క వైద్య సంబంధమైన అవసరాలను చూసుకోవడం
  • పరిసర ప్రాంతాలలో సామాజిక ప్రచారం (కమ్యూనిటీ ఔట్రీచ్) మరియు పౌర సంబంధాలు (పబ్లిక్ రిలేషన్స్):
    • సామాజిక సంస్థలతోనూ, స్థానిక ప్రభుత్వంతోనూ, ఇతర సంబంధిత సంస్థలు, వ్యక్తులతోను మంచి సంబంధాలను ఏర్పరచుకుని, నిలుపుకోవడం
    • సామాజిక ప్రచార కార్యక్రమాలు మరియు ప్రజారోగ్య శిక్షణా కార్యక్రమాల ద్వారా ఆసుపత్రి యొక్క సేవల గురించి ప్రచారం చేయడం
    • సామాజిక కార్యక్రమాలు, ఆరోగ్య సమావేశాలు, ఇతర సంబంధిత సభలు, చర్చాస్థలాలలో ఆసుపత్రికి ప్రతినిధిత్వం వహించడం
  • నియంత్రణా నిబద్ధత (రెగ్యులటరీ కంప్లయన్స్):
    • ఆసుపత్రి యొక్క కార్యాచరణ, స్థానిక మరియు రాష్ట్ర ఆరోగ్య సురక్షా నిబంధనలు అన్నింటికీ అనుగుణంగా ఉండేలా చూసుకోవడం
    • ఆరోగ్య సంరక్షణా చట్టాలు మరియు ప్రమాణాలకు సంబంధించిన ప్రస్తుత పరిజ్ఞానాన్ని ఎల్లప్పుడూ నిలుపుకొని, అవసరమైన మార్పులను ఎప్పటికప్పుడు అమలు చేయడం
    • నియంత్రణా సంస్థల యొక్క పరిశీలన మరియు తనిఖీలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి, వాటిని నిర్వహించడం
  • సేవా నాణ్యత యొక్క అభివృద్ధి:
    • రోగుల ఆరోగ్య సంరక్షణా సేవలు నిరంతరం మెరుగయ్యే విధంగా, నాణ్యతా నిర్ధారణ కార్యక్రమాలను (క్వాలిటీ అస్సూరెన్సు ప్రోగ్రామ్స్) అమలు పరచడం మరియు పర్యవేక్షించడం
    • రోగుల యొక్క చికిత్సా ఫలితాలు, సేవల పట్ల వారి సంతృప్తి, మరియు కార్యాచరణ సఫలతలపై సమాచారం (డేటా) యొక్క సేకరణ మరియు విశ్లేషణ
    • ఆరోగ్య సేవా నిర్వహణ మరియు రోగుల సంతృప్తులను మెరుగుపరచే కార్యక్రమాలను ఆరంభించడం


అర్హతలు:

  • విద్య మరియు అనుభవం:
    • వైద్యుడిగా పని (ప్రాక్టీసు) చేస్తున్నవారు అయితే మంచిది
    • ఆరోగ్య సంరక్షణా పరిపాలన (హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్), ప్రజారోగ్య రంగం (పబ్లిక్ హెల్త్), లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్స్ డిగ్రీ (మాస్టర్స్ డిగ్రీ ఉంటే మరింత మంచిది)
    • ఆరోగ్య సంరక్షణా పరిపాలన (హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్) లో, లేక దానికి సమానమైన ఇతర ఉద్యోగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం
    • ఉత్తమ నాయకత్వ మరియు కార్యనిర్వహణా ప్రావీణ్యం ఉండాలి, వైవిధ్యం ఉన్న సిబ్బందిని ప్రోత్సహించి, పర్యవేక్షించే సామర్థ్యం ఉండాలి
    • అత్యుత్తమమైన భావప్రకటనా (కమ్యూనికేషన్) నైపుణ్యం మరియు ఇతరులతో సమర్థవంతంగా పనిచేసే నేర్పు
    • ఆరోగ్య సంరక్షణా నిబంధనలు, ఆర్థిక విషయాల నిర్వహణ మరియు నిధుల సేకరణ రంగాల గురించి బాగా తెలిసి ఉండాలి
    • పేదలకు మరియు సేవలు అందుబాటులో లేని వారికి ఆరోగ్య సంరక్షణా సేవలను అందుబాటులో ఉంచాలన్న ఆశయానికి కట్టుబడి ఉండాలి
  • నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు:
    • ధార్మిక (చారిటబుల్) లేక లాభాపేక్ష లేని (నాన్-ప్రాఫిట్) సంస్థలో పనిచేసిన అనుభవం
    • స్థానిక ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అవసరాలు మరియు సామాజిక వనరులను గురించిన అవగాహన
స్వచ్ఛంద సేవ అవకాశాలు

వివిధ హోదాల్లో వాలంటీర్లుగా సమీప ప్రాంతంలో (Remote) సేవలందించేందుకు సిద్ధంగా ఉన్న ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన భక్తులను వై.ఎస్.ఎస్. అన్వేషిస్తున్నది.

para-ornament

Data Analyst

Location: Remote
Department:
Helpdesk
No. of open position(s): 1
Role: Volunteer

Position Summary:
The YSS Helpdesk team is looking for a Data Analyst to support the team in making data-driven decisions. The ideal candidate will take the time to understand the problems being addressed, and identify relevant data metrics and analyzes that can yield valuable insights. Key responsibilities include studying data structures and classifying data, cleaning and manipulating data for analysis, analyzing data to derive meaningful metrics, and creating graphs, as needed. The Data Analyst will also develop simple reports and, if possible, summary dashboards. This volunteer will collaborate and communicate effectively with team members, work in alignment with the team’s direction, and proactively propose solutions to key questions.

Main Functions of the Role:

  • Actively listening to understand the problem
  • Collaborate with team members to identify data needs and project objectives
  • Analyze data to summarize findings and support decision-making processes
  • Clean and manipulate data to ensure accuracy and reliability
  • Create graphs and visualizations to present data insights clearly
  • Develop and maintain simple reports and dashboards to track key metrics
  • Propose data-driven options and solutions based on analysis


Qualifications:

  • Education and Experience:
    • An MBA, Degree in Statistics or experience with data analysis is preferred
    • This role does not require advanced skills in Data Science. We warmly welcome all individuals who are willing to contribute through intermediate-level analysis.
  • Skills and Competencies:
    • Proficiency in advanced MS Excel functions, including lookups, pivot tables, and IF statements
    • Manipulating and classifying data to make analysis easier
    • Building different and appropriate types of graphs to effectively communicate a data-insight
    • Must be proficient with Google Sheets
    • Preferred but not mandatory skills:
      • Writing short summaries to help the audience understand the data: computation methodology and the implications of the graphs/metric derived
      • Building dashboards
      • A ‘Noble New’ mindset, with a willingness to learn and solve new problems, in novel ways

వెబ్-సైట్ కంటెంట్ నిర్వహణా నిపుణుడు (మేనేజ్మెంట్ స్పెషలిస్ట్)

స్థలం: సమీప ప్రాంతం (Remote)
విభాగం:
ఐ.టి
అవకాశం ఉన్న స్థానాల సంఖ్య: 1
పాత్ర: వాలంటీర్, వారానికి 12 గంటలు

పాత్ర యొక్క సారాంశం:
వెబ్-సైట్ నిర్వహణకు మరియు ఇతర డిజిటల్ ప్రాజెక్టులకు ఆచరణాత్మకమైన సహాయాన్ని అందించే స్వచ్ఛంద సేవకుడి (వాలంటీర్) కోసం వై.ఎస్.ఎస్. అన్వేషిస్తోంది. కంటెంట్ మేనేజ్-మెంట్ (వర్డ్-ప్రెస్ లేదా సమానమైన సాధనాలను ఉపయోగించి) లేక ఇతర డిజిటల్ మార్కెటింగ్ రంగాలలో అనుభవమే కాకుండా, వై.ఎస్.ఎస్. నియమాలు, పద్ధతులు మరియు ప్రమాణాల గురించి మంచి అవగాహన ఉండాలి.


పాత్ర యొక్క ప్రధాన విధులు:

  • వై.ఎస్.ఎస్. వెబ్ సైట్ విషయాలను నవీకరించడం మరియు నిర్వహించడం
  • అనువాదాలను అప్ లోడ్ చేయడం/సవరించడం
  • విశ్లేషణలను ట్రాక్ చేయడం, ట్రెండ్లను పర్యవేక్షించడం, చర్యలు తీసుకోదగిన అంతర్దృష్టులు/సిఫార్సులు పంచుకోవడం

 

అర్హతలు:

  • విద్య మరియు అనుభవం:
    • కంప్యూటర్ సైన్స్‌లో B.Sc మరియు మార్కెటింగ్‌లో MBAకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, కాని అది తప్పనిసరి కాదు
    • కంటెంట్ మేనేజ్-మెంట్ లేదా ఇతర డిజిటల్ మార్కెటింగ్ లేక వెబ్ టెక్నాలజీలలో పనిచేసిన పూర్వానుభవం
    • ప్రాథమిక HTML/CSS పరిజ్ఞానం కలిగి ఉండాలి
  • నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు:
    • అద్భుతమైన ఆంగ్ల వ్రాత మరియు మౌఖికంగా భావవ్యక్తీకరణ నైపుణ్యాలు కలిగి ఉండాలి
    • కొత్త ప్లాట్‌ఫారాలు మరియు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలను నేర్చుకునే సామర్థ్యం కలిగి ఉండాలి
    • నేర్చుకోవాలనే సంకల్పం బలంగా ఉండాలి

సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్

స్థలం: సమీప ప్రాంతం (Remote)
విభాగం:
ఐ.టి
అవకాశం ఉన్న స్థానాల సంఖ్య: 1
పాత్ర: వాలంటీర్, వారానికి 12 గంటలు

పాత్ర యొక్క సారాంశం:
సైబర్ ముప్పు పొంచి ఉన్న క్షేత్రాలను గుర్తించడానికి మరియు సైబర్ బెదిరింపుల నుండి వెబ్‌సైట్‌లు మరియు ఇతర IT మౌలిక సదుపాయాలను రక్షించడం కోసం వాలంటీర్‌లను వై.ఎస్.ఎస్. అన్వేషిస్తోంది.

పాత్ర యొక్క ప్రధాన విధులు:

  • సిస్టమ్‌లు, డేటా, నెట్‌వర్క్‌లు మరియు ప్రోగ్రామ్‌లను రక్షించడానికి సాంకేతిక విధానాలు, ప్రక్రియలు మరియు నియంత్రణలు చేయగలిగి ఉండాలి
  • వినియోగదారుల డేటాను రక్షించడం సైబర్ దాడుల ప్రమాదాన్ని తగ్గించడం మరియు మా IT సిస్టమ్‌లు మరియు అప్లికేషన్‌లను యాక్సెస్ చేయడం, హాని చేయడం లేదా అంతరాయం కలిగించడం వంటివి తలపెట్టే అనధికార వినియోగదారులను నిరోధించగలగాలి


అర్హతలు:

  • విద్య మరియు అనుభవం:
    • వెబ్/వర్డ్‌ప్రెస్ సైట్‌లలో సైబర్ సెక్యూరిటీ అనుభవం కలిగి ఉండాలి
    • వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. క్రియాబాన్
  • నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు:
    • ప్రస్తుతం ఉనికిలో ఉన్న సైబర్ సెక్యూరిటీ బెదిరింపులు మరియు ప్రమాదాలను తగ్గించే మార్గాల గురించి అవగాహన కలిగి ఉండాలి

ఈ-మెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్

స్థలం: సమీప ప్రాంతం (Remote)
విభాగం:
ఐ.టి
అవకాశం ఉన్న స్థానాల సంఖ్య: 1
పాత్ర: వాలంటీర్, వారానికి 12 గంటలు

పాత్ర యొక్క సారాంశం:
బహుళ-మోడల్ డిజిటల్ ప్రచారాలను తీర్చిదిద్దడానికి మరియు నిర్వహించడానికి వై.ఎస్.ఎస్. ఒక వాలంటీర్‌ను అన్వేషిస్తున్నది. ఆటోమేషన్ విధానాలు మరియు వ్యక్తిగతీకరణను సృష్టించడం మరియు నిర్వహించడంలో అనుభవం ఉండాలి.

పాత్ర యొక్క ప్రధాన విధులు:

  • వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌లు, ఈ-మెయిల్, ఎస్.ఎం.ఎస్, వాట్సప్ మరియు ఇతర ప్లాట్‌ఫారాలలో మార్కెటింగ్ ఆటోమేషన్ యొక్క ఆలోచన, ప్రణాళిక మరియు సెటప్‌కు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది
  • డిజిటల్ ప్రచారాల యొక్క ఉత్పత్తి మరియు వినియోగాలను మొదటి నుంచి చివరి వరకు నిర్వహించడం
  • వై.ఎస్.ఎస్. కార్యక్రమాలకు అవసరమైన ప్రేక్షకుల విభాగాలు/జాబితాలను సృష్టించడం మరియు నిర్వహణ చేయవలసి ఉంటుంది
  • మార్కెటింగ్ ఆటోమేషన్ ప్లాట్‌ఫారాలను ఉపయోగించి లీడ్ జనరేషన్, నమోదు, స్వాగతం మరియు డ్రిప్ ప్రచారాల కోసం ఆటోమేషన్‌లను అమలు చేయాల్సి ఉంటుంది
  • పనితీరును ట్రాక్ చేయాలి, ప్రస్తుతం అమలు కాబడుతున్న ధోరణులను పర్యవేక్షించాలి, చర్య తీసుకోదగిన పరిజ్ఞానాన్ని అవసరమైన వారితో పంచుకొని, ఫలితాల ఆధారంగా సిఫార్సులను చేయవలసి ఉంటుంది


అర్హతలు:

  • విద్య మరియు అనుభవం:
    • క్రింది అంశాలలో దేనిలోనైనా ముఖ్యమైన అనుభవం కలిగి ఉండాలి: ఈ-మెయిల్ మార్కెటింగ్, మార్కెటింగ్ ఆటోమేషన్, లీడ్ జనరేషన్ లేదా పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్
  • నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు:
    • ActiveCampaign, HubSpot, Zoho లేదా ఇలాంటి వెబ్ CRM/మార్కెటింగ్ ఆటోమేషన్ ప్లాట్‌ ఫారాలలో మంచి నైపుణ్యం కలిగి ఉండాలి
    • ఈ-మెయిల్ డిజైన్ సాధనాలు మరియు ప్రాథమిక HTML/CSS గురించిన పరిజ్ఞానం కలిగి ఉండాలి
    • క్రొత్త ప్లాట్‌ఫారాలు మరియు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలను నేర్చుకునే సామర్థ్యం కలిగి ఉండాలి
    • అద్భుతమైన ఆంగ్ల వ్రాత మరియు మౌఖిక భావప్రకటన నైపుణ్యాలు కలిగి ఉండాలి

వెబ్ ఎనలిటిక్స్ స్పెషలిస్ట్

స్థలం: సమీప ప్రాంతం (Remote)
విభాగం:
ఐ.టి
అవకాశం ఉన్న స్థానాల సంఖ్య: 1
పాత్ర: వాలంటీర్, వారానికి 10 గంటలు

పాత్ర యొక్క సారాంశం:
వివిధ వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌ల కోసం వెబ్ విశ్లేషణలను ట్రాక్ చేయడం మరియు సమీక్షించడంలో మాకు సహాయపడగల వాలంటీర్‌లను వై.ఎస్.ఎస్. అన్వేషిస్తోంది.

పాత్ర యొక్క ప్రధాన విధులు:

  • వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌ల వినియోగాన్ని అర్థం చేసుకోవడం మరియు అత్యంత సమర్థవంతమైన వినియోగం లక్ష్యంగా వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్ డేటా ఏర్పాటు, సేకరించడం, విశ్లేషించడం మరియు నివేదించడం చేయగలగాలి
  • సహజావబోధమైన శోధన లక్షణాలను అందించడానికి మెరుగుదల చర్యలను సిఫార్సు చేయడం మరియు పెరిగిన వెబ్‌సైట్ ట్రాఫిక్‌కు మద్దతు ఇవ్వడం వంటివి చేయగలగాలి


అర్హతలు:

  • విద్య మరియు అనుభవం:
    • గూగుల్ ఎనలిటిక్స్ లో విశేషమైన అనుభవం అవసరం
    • వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. క్రియాబాన్
  • నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు:
    • గూగుల్ డేటా స్టూడియో, మైక్రోసాఫ్ట్ క్లారిటీ మొదలైన సాంకేతికతలను సులభతరంగా ఉపయోగించగలగడం అదనపు సహాయకారి
    • డేటా విశ్లేషణ మరియు మానసిక చిత్రణ నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది

సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO) నిపుణుడు

స్థలం: సమీపప్రాంతం (Remote)
విభాగం:
ఐ.టి
అవకాశం ఉన్న స్థానాల సంఖ్య: 1
పాత్ర: వాలంటీర్, వారానికి 12 గంటలు

పాత్ర యొక్క సారాంశం:
వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌ల కోసం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO) కార్యకలాపాలను నిర్వహించడానికి ఆసక్తి ఉన్న వాలంటీర్‌లను వై.ఎస్.ఎస్. అన్వేషిస్తోంది.

పాత్ర యొక్క ప్రధాన విధులు:

  • సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజీలలో దృశ్యమానతను మెరుగుపరచడానికి వ్యూహాలను గుర్తించడం మరియు అమలు చేయడం మరియు వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌లకు ఆర్గానిక్ సెర్చ్ ట్రాఫిక్‌ను పెంచగలగాలి

అర్హతలు:

  • విద్య మరియు అనుభవం:
    • ఆన్-పేజీ SEOతో అపారమైన అనుభవం కలిగి ఉండాలి
    • వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. క్రియాబాన్
  • నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు:
    • సమాచారాన్ని నివేదించడంలో నైపుణ్యం మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
    • గూగుల్ సెర్చ్ కన్సోల్ మరియు యోస్ట్ ప్లగిన్‌లో నైపుణ్యం అవసరం
    • ఇతర SEO సాధనాల వాడకం తెలియడం తప్పనిసరి కానప్పటికీ సహాయకారిగా ఉంటుంది
సలహాదారు (కన్సల్టెంట్) అవకాశాలు

న్యాయ సలహాదారు, న్యాయ సంబంధిత అంశాలు, ఉత్తరాఖండ్

స్థానం: సమీప ప్రాంతం
విభాగం:
న్యాయ మరియు ఆస్తుల విభాగం
అవకాశం ఉన్న స్థానాల సంఖ్య: 1
పాత్ర: సలహాదారు

పాత్ర సారాంశం:
వై.ఎస్.ఎస్., ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, పలు న్యాయ సంబంధిత అంశాలపై నైపుణ్యం గల న్యాయ సలహాలను అందించే అనుభవజ్ఞులైన న్యాయ సలహాదారుని అన్వేషిస్తోంది; అంశాలు ముఖ్యంగా ఆస్తి-సంబంధిత (ప్రాపర్టీ రిలేటెడ్) విషయాలై ఉంటాయి. ఈ పాత్ర, పత్యేక సందర్భం మరియు కేసు ప్రకారం (కేస్-బై-కేస్), హేతుబద్ధమైన మార్గనిర్దేశాన్ని మరియు చట్టపరమైన అభిప్రాయాలను అందించడాన్ని కూడి ఉంటుంది.

ఆదర్శ అభ్యర్థి, బలమైన న్యాయపరమైన నేపథ్యం కలిగి ఉంటారు – ప్రత్యేకంగా, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వర్తించే ఆస్తి చట్టాలలో మరియు స్పష్టమైన, ఆచరణాత్మకమైన మరియు ఆచరణయోగ్యమైన సలహాలను అందించడంలో ప్రావీణ్యతను కలిగి ఉండాలి. ఇది ఒక సలహాదారు (కన్సల్టెంట్) పాత్ర; వేతనం దానికి అనుగుణంగా ఉంటుంది.


అర్హతలు:

  • విద్యార్హతలు మరియు పూర్వానుభవం: లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి; ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, చట్ట-సంబంధిత వ్యవహారాలను – ప్రత్యేకంగా భూమి మరియు ఆస్తులకు సంబంధించిన న్యాయ వ్యవహారాలను – నిర్వహించడంలో కనీసం 10 సంవత్సరాల పూర్వానుభవం కలిగి ఉండాలి.
  • నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు:
    • బలమైన విశ్లేషణ మరియు పరిశోధనా నైపుణ్యాలు (ఎనలిటికల్ అండ్ రీసెర్చ్ స్కిల్స్); మరియు సూక్షమైన వివరాలను నిశిత దృష్టితో చూసే సామర్థ్యం
    • నాయపరమైన నేపథ్యం లేని సంబంధిత పక్షాల (నాన్-లీగల్ స్టేక్-హోల్డర్స్) వారు కూడా అర్థం చేసుకుందుకు అనుగుణంగా, స్పష్టమైన, సంక్షిప్తమైన, ఆచరణాత్మకమైన సలహాలను అందించగలిగే సామర్థ్యం
    • అత్యుత్తమ భావప్రకటన (కమ్యూనికేషన్) మరియు నివేదన (ప్రెజెంటేషన్) నైపుణ్యాలు; చట్టపరమైన నేపథ్యం లేని వారికి చట్టానికి సంబంధించిన విషయాలను వివరించే సామర్థ్యం ఉండాలి
para-ornament

ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

పైన పేర్కొన్న అవకాశాలలో మీకు ఆసక్తి ఉన్నా లేదా మీరు వాటి గురించి మరింత తెలుసుకోవాలనుకున్నా, దిగువ ఇచ్చిన ఫారములో మీ వివరాలను పూరించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

para-ornament

గురుదేవుల ఆధ్యాత్మిక బృహత్కార్యంలో కలిసి సేవ చేయడంలో ఆనందాన్ని పంచుకోవడానికి మరియు మీ ప్రతిస్పందన తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నాము.

ఇతరులతో పంచుకోండి