రాజకీయ మరియు ప్రభుత్వ ప్రముఖులు

“ఈ రోజు ఐక్యరాజ్యసమితిలో పరమహంస యోగానందగారి వంటి వ్యక్తి మనలో ఉంటే, బహుశా ప్రపంచం ఇప్పుడున్నదాని కంటే మెరుగైన ప్రదేశంగా ఉండేది.”

— డాక్టర్ బినయ్ ఆర్. సేన్, యు.ఎస్.లోని భారత మాజీ రాయబారి

“నేను ఆయన పట్ల అత్యున్నత గౌరవాన్ని కలిగి ఉన్నాను.... నేను యోగానందగారితో చాలా సంవత్సరాలుగా భారీగా ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించాను, వివిధ విషయాలపై అభిప్రాయాలను ఒకరితో ఒకరము మార్చుకున్నాము. ఆయన లేఖలు నాకు ఎంతో స్ఫూర్తిని మరియు సహాయాన్ని అందించాయి. ఆయన మరణం మానవాళికి తీరని లోటు.”

— హిజ్ ఎక్సలెన్సీ ఎమిలియో పోర్టెస్ గిల్, మెక్సికో మాజీ అధ్యక్షుడు

“ఆయన ఆప్యాయతతో కూడిన వ్యక్తిత్వం మరియు దయతో కూడిన అవగాహన పొందలేకపోయినందుకు, ఆయనను తెలుసుకునే అవకాశం పొందిన వారందరూ తీవ్రముగా చింతిస్తారు.”

— గుడ్విన్ జె. నైట్, కాలిఫోర్నియా మాజీ గవర్నర్

“ఆయన నిజంగా ఓ అద్భుతమైన వ్యక్తి, భూమిపై ప్రజల మధ్య శాంతి మరియు అవగాహన కోసం అంకిత భావాన్ని కలిగి ఉన్నవారు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్నందుకు దాన్ని విడిచిపెట్టినప్పుడు అది కొంచెం మెరుగు పడిందని నిజంగా చెప్పవచ్చు....”

— జడ్జి స్టాన్లీ మోస్క్, కాలిఫోర్నియా రాష్ట్రం సుప్రీం కోర్ట్

“పరమహంస యోగానందగారి శాస్త్రీయ బోధనలు మరియు చర్చలు, మానవ నాగరికత యొక్క ముందడుగులో మైలురాయి.”

— జి.ఎన్. వైద్య, హైకోర్టు న్యాయమూర్తి, బొంబాయి

“మీరు ఇటీవల పిట్స్‌బర్గ్‌లో ఉన్నప్పుడు మీ విద్యా ఉపన్యాసాల నుండి నేను పొందిన ప్రయోజనాల గురించి మీకు తెలియజేయడానికి నేను ఈ అవకాశాన్ని తీసుకుంటున్నాను. మీరు ఈ దేశంలో నిర్మాణాత్మక విద్య గురించిన గొప్ప కార్యాన్ని కొనసాగిస్తున్నారని నాకు తెలుసు, మీకు ప్రతి ఒక్క సహాయం మరియు ప్రోత్సాహం అందించబడాలి. ఈ దేశ ప్రజలు మీరు బోధించిన సిద్ధాంతాలకు అనుగుణంగా జీవించినట్లయితే, ధర్మ న్యాయస్థానం యొక్క అస్తిత్వము చాలా తక్కువగా ఉంటుంది లేదా అవసరమే ఉండదు.”

— ఏ.డి. బ్రాండన్, మోరల్స్ కోర్టు న్యాయమూర్తి, పిట్స్‌బర్గ్, పి‌ఏ

“వాషింగ్టన్ తన మనస్తత్వవేత్తల వాటాను కలిగి ఉంది. కానీ [మీ] తత్వశాస్త్రం మరియు వ్యవస్థ పూర్తిగా కొత్త అనుభవమని విశ్వవ్యాప్త సాక్ష్యంగా ఉంది....మీ ఉపన్యాసాలు మరియు తరగతులు, నా భార్యకు మరియు నాకు ఎంత ప్రయోజనం కలిగించాయో నేను మీకు వ్యక్తీకరించడానికి నా శక్తి చాలదు. నరాలు, ఆందోళన మరియు ఆధునిక అమెరికా జీవితాలలోని అనిశ్చితులు, అలాగే మా సాంప్రదాయ క్రైస్తవ విశ్వాసాన్ని ఆచరణాత్మక జీవితంలోని కఠినమైన వాస్తవాలతో వర్గీకరించగల ఆధ్యాత్మిక అవగాహన కోసం ఉన్న మా ఆకలి, మిమ్మల్ని వెదకడానికి మమ్మల్ని ప్రేరేపించాయి. మీ ఉదాత్తమైన మరియు ఆచరణాత్మకమైన తత్వాన్ని వినడం వల్ల మాకు శాంతి మరియు సౌఖ్యం లభించాయి.”

— లూయిస్ ఈ. వాన్ నార్మన్, ఎడిటర్, "ది నేషన్స్ బిజినెస్"; వాణిజ్య అనుబంధం, వాణిజ్య విభాగం

“ఆయన భౌతిక జీవితం యొక్క ఆకర్షణ మరియు సౌందర్యం మాత్రమే కాకుండా, ఆయన కలిగి ఉన్న ఆత్మ యొక్క సూచిక, పరమహంసగారి అగాధమైన వాత్సల్యము మరియు మానవత్వం పట్ల ప్రేమ — స్నేహపూర్వకంగా మరియు ఆయన విశ్వాసాన్ని పంచుకోవడానికి ఇష్టపడని వారితో సహా — అది ఆయనకు తోటి జీవుల ద్వారా ఒక స్థాయిని ఇచ్చింది, దానికి సమతుల్యము కావడం కష్టం.

“ఆయన పుట్టిన దేశం నుండి అమెరికాకు, ఆత్మ యొక్క ప్రశాంతతను, మానవ మరియు ఆధ్యాత్మిక జీవిత విలువల పట్ల అవగాహనను తీసుకువచ్చారు, ఇది ఆధునిక సమాజంలో మనశ్శాంతిని పొందడంలో చాలా మంది ఉన్నత మరియు దిగువ వ్యక్తులకు సహాయపడటమే కాకుండా భారతదేశం మరియు యు.ఎస్‌.ఏ ప్రజల మధ్య అవగాహనకు కూడా సహాయపడింది.

“శాంతి ప్రవక్తగా మరియు మానవ సోదరభావంలో విశ్వాసం ఉన్న వ్యక్తిగా, యోగానందగారు తూర్పు మరియు పశ్చిమాల మధ్య అవగాహన మరియు స్నేహం కోసం తన జీవితాన్ని, మొత్తం శక్తిని మరియు ఆయన దగ్గర ఉన్న సాధనాలన్నిటినీ అంకితం చేశారు.”

— ముల్క్ రాజ్ అహుజా, కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా

ఇతరులతో షేర్ చేయండి