యోగం అంటే నిజంగా ఏమిటి?

హంసతో ఉన్న స్త్రీ

మనలో చాలా మంది నెరవేర్చుకోవడం కోసం బయట చూడటం అలవాటు పడ్డాము. బయటి సాఫల్యాలు మనకు కావాల్సినవి ఇస్తాయని విశ్వసించే పరిస్థితులలో మనం జీవిస్తున్నాము. “ఇంకా ఏవో వాటి కోసం” లోపల ఉన్న లోతైన కోరికను బాహ్యంగా ఏదీ పూర్తిగా తీర్చలేదని మన అనుభవాలు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాయి.

అయితే, చాలా సమయాలలో, మనం ఎల్లప్పుడూ మన పరిధికి మించిన వాటి కోసం ప్రయత్నిస్తున్నట్లు గమనిస్తాం. ఉండటం కంటే చేయడంలో, అవగాహన కంటే చర్యల్లోను మనం చిక్కుకున్నాము. ఆలోచనలు మరియు భావాలు శాశ్వత కదలికలో నాట్యం చేయడం మానేసే పూర్తి ప్రశాంతత మరియు విశ్రాంత స్థితిని చిత్రీకరించుకోవడం మనకు కష్టం. అయినప్పటికీ, అటువంటి నిశ్శబ్ద స్థితి ద్వారా మనం వేరే వాటి ద్వారా సాధ్యంకాని స్థాయిలో ఆనందాన్ని మరియు అవగాహనను పొందగలము.

బైబిల్లో ఇలా చెప్పబడింది: “నిశ్చలంగా ఉండి నేనే దేవుడని తెలుసుకో.” ఈ కొన్ని పదాలలో యోగ శాస్త్రము యొక్క కీలకం ఉంది. ఈ పురాతన ఆధ్యాత్మిక శాస్త్రం ఆలోచనల యొక్క సహజమైన కల్లోలాన్ని మరియు శరీరం యొక్క చంచలతను నిశ్చలపరిచి మనం నిజంగా ఏమిటో తెలుసుకోకుండా నిరోధించే ప్రత్యక్ష మార్గాలను అందిస్తుంది.

సాధారణంగా మన అవగాహన మరియు శక్తులు మన ఐదు ఇంద్రియాల యొక్క పరిమిత సాధనాల ద్వారా మనం గ్రహించే ఈ ప్రపంచంలోని విషయాల వైపు మళ్ళించబడతాయి. మానవ హేతువు భౌతిక ఇంద్రియాల ద్వారా అందించబడిన పాక్షిక మరియు తరచుగా మోసపూరిత సమాచారంపై ఆధారపడవలసి ఉంటుంది కాబట్టి, మనం జీవితంలోని చిక్కులను పరిష్కరించాలంటే, అవగాహన యొక్క లోతైన మరియు మరింత సూక్ష్మ స్థాయిలను స్పృశించడం నేర్చుకోవాలి – నేను ఎవరు? ఇక్కడ నేను ఎందుకున్నాను? నేను సత్యాన్ని ఎలా గ్రహించగలను?

యోగం అనేది శక్తి మరియు చైతన్యం యొక్క సాధారణ బాహ్య ప్రవాహాన్ని తిప్పికొట్టే ఒక సాధారణ పద్ధతి, తద్వారా మనస్సు ప్రత్యక్ష అవగాహన యొక్క చురుకైన కేంద్రంగా మారుతుంది, ఇది తప్పుగా భావించే ఇంద్రియాలపై ఆధారపడదు, కానీ వాస్తవానికి సత్యాన్ని అనుభవించగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

ధ్యానిస్తున్న కృష్ణ భగవానుడు

యోగము యొక్క దశలవారీ పద్ధతులను అభ్యసించడం ద్వారా భావోద్వేగ కారణాలతో లేదా గుడ్డి విశ్వాసం ద్వారా ఏమీ తీసుకోకుండా, అందరికీ జీవితాన్ని ఇచ్చే మరియు మన స్వంత సారమయిన అనంతమైన మేధస్సు, శక్తి మరియు ఆనందంతో మన ఏకత్వాన్ని తెలుసుకుంటాము.

గత శతాబ్దాలలో, విశ్వాన్ని నడిపే శక్తుల గురించి మానవాళికి ఉన్న పరిమిత జ్ఞానం కారణంగా, యోగము యొక్క అనేక ఉన్నత పద్ధతులు చాలా తక్కువగా అర్థం చేసుకోబడ్డాయి లేదా ఆచరించబడ్డాయి. కానీ నేటి శాస్త్రీయ పరిశోధన మనల్ని మరియు ప్రపంచాన్ని చూసే విధానాన్ని వేగంగా మారుస్తోంది. పదార్థం మరియు శక్తి తప్పనిసరిగా ఒకటి అనే ఆవిష్కరణతో జీవితం యొక్క సాంప్రదాయ భౌతిక భావన అదృశ్యమైంది: ఇప్పటికే ఉన్న ప్రతి పదార్థాన్ని ఒక నమూనా లేదా శక్తి రూపంగా తగ్గించవచ్చు, ఇది ఇతర రూపాలతో పరస్పరం సంకర్షణ చెందుతుంది మరియు పరస్పరం అనుసంధానిస్తుంది. నేటి అత్యంత ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్తలలో కొందరు ఒక అడుగు ముందుకు వేసి, చైతన్యాన్ని అన్ని జీవులకు ప్రాథమిక ఆధారంగా గుర్తించారు. ఈ విధంగా ఆధునిక విజ్ఞానం యోగము యొక్క పురాతన సూత్రాలను ధృవీకరించి విశ్వంలోని ఏకత్వాన్ని వెల్లడిస్తోంది.

యోగము అనే పదానికి విశ్వచైతన్యంతో లేదా పరమాత్మతో వ్యక్తిగత చైతన్యం లేదా ఆత్మ యొక్క “కలయిక” అని అర్థం. చాలా మంది ప్రజలు యోగమును శారీరక వ్యాయామాలుగా మాత్రమే భావించినప్పటికీ – ఇటీవలి దశాబ్దాలలో విస్తృతంగా ప్రజాదరణ పొందిన ఆసనాలు లేదా భంగిమలు – ఇవి వాస్తవానికి మానవ మనస్సు మరియు ఆత్మ యొక్క అనంతమైన సామర్థ్యాలను విప్పే ఈ లోతైన శాస్త్రం యొక్క అత్యంత ఉపరితల అంశం మాత్రమే.

మంత్ర యోగానికి జప మాల

ఈ లక్ష్యానికి దారితీసే యోగమునకు వివిధ మార్గాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఒక విస్తారమైన పద్ధతుల యొక్క ఒక ప్రత్యేక శాఖ:

హఠ యోగం — శారీరక భంగిమలు లేదా ఆసనాల వ్యవస్థ, దీని ఉన్నత ఉద్దేశ్యం శరీరాన్ని శుద్ధి చేయడము, దాని అంతర్గత స్థితిపై అవగాహన మరియు నియంత్రణను కలిగించడం మరియు ధ్యానానికి సరిపోయేలా చేయడం.

కర్మ యోగం —  ఫలితాలతో అనుబంధం లేకుండా, ఒకరి విశాలమైన ఆత్మలో భాగంగా ఇతరులకు నిస్వార్థ సేవ; మరియు భగవంతుడే కర్త అనే వివేకముతో అన్ని పనులు నెరవేర్చడం.

మంత్ర యోగం —  జపం ద్వారా చైతన్యాన్ని లోపల కేంద్రీకరించడం లేదా పరమాత్మ యొక్క నిర్దిష్ట అంశాన్ని సూచించే కొన్ని సార్వత్రిక మూల-పద శబ్దాల పునశ్చరణ.

భక్తి యోగం — సర్వశ్య శరణాగతి భక్తి ద్వారా ప్రతి జీవిలో మరియు ప్రతిదానిలో దైవత్వాన్ని చూడడానికి మరియు ప్రేమించడానికి ప్రయత్నస్తుండడం, తద్వారా ఎడతెగని ఆరాధనను కొనసాగించడం.

జ్ఞాన యోగం — జ్ఞానం యొక్క మార్గం. ఆధ్యాత్మిక విముక్తి సాధించడానికి వివేకవంతమైన జ్ఞానాన్ని ఎలా వినియోగించాలో ఉద్ఘాటిస్తుంది.

రాజ యోగం — యోగములన్నిటిలో రాజు వంటిది లేదా ఉన్నతమైనది. భగవద్గీతలో భగవాన్ కృష్ణుడిచే అమరత్వం పొందబడింది మరియు క్రీ.పూ. రెండవ శతాబ్దంలో భారతీయ ఋషి పతంజలిచే అధికారికంగా క్రమబద్ధీకరించబడినది. ఇది అన్ని ఇతర మార్గాల సారాన్ని మిళితం చేస్తుంది.

పరమహంస యోగానందగారి భగవద్గీత వ్యాఖ్యానం

రాజయోగ వ్యవస్థ యొక్క అంతరంగంలో, ఈ వివిధ విధానాలను సమతుల్యం మరియు ఏకీకృతం చేస్తూ, ధ్యానం యొక్క ఖచ్చితమైన, శాస్త్రీయ పద్ధతుల అభ్యాసము ద్వారా ఒకరి ప్రయత్నాల ప్రారంభం నుండి, అంతిమ లక్ష్యాన్ని స్వల్పకాలం గ్రహించడానికి వీలు కల్పిస్తుంది – తరగని ఆనందస్వరూపమైన పరమాత్మతో చైతన్య కలయిక.

యోగము యొక్క లక్ష్యానికి వేగవంతమైన మరియు అత్యంత ప్రభావవంతమైన విధానం ఏదైనా శక్తి మరియు చైతన్యంతో నేరుగా వ్యవహరించే ధ్యాన పద్ధతులను ఉపయోగిస్తుంది. పరమహంస యోగానందగారు బోధించిన రాజయోగ ధ్యానం యొక్క ప్రత్యేక రూపమైన క్రియాయోగము పైన చెప్పిన ప్రత్యక్ష పద్ధతలను వినియోగిస్తుంది.

ఇతరులతో షేర్ చేయండి