సన్యాసుల పర్యటనలు మరియు క్రియాయోగ దీక్ష వేడుకలు

2025 సంవత్సరానికి ప్రణాళిక చేయబడిన, వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించే వివిధ కార్యక్రమాలు: ‘సంగమం’లు, ఏకాంత ధ్యాన వాసాలు మరియు పర్యటన కార్యక్రమాలను గురించి ఎంతో ఆనందంతో మేము మీకు తెలియజేస్తున్నాము. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.

యోగానందగారి బోధనల మీద సత్సంగంపరమహంస యోగానందగారి ఆత్మ-విముక్తి బోధనల పట్ల నిరంతరం పెరుగుతున్న ఆసక్తిని తీర్చడంలో సహాయం చేయడానికి, ప్రతి సంవత్సరం యోగదా సత్సంగ సొసైటీకి చెందిన సన్యాసులు దేశవ్యాప్తంగా ఉన్న నగరాలను సందర్శిస్తారు. వారాంతపు ఏకాంత ధ్యాన వాసాలు మరియు పరమహంస యోగానందగారి “జీవించడం ఎలా” బోధనలపై తరగతులు, వై.ఎస్.ఎస్. యోగ ప్రక్రియల సమీక్ష, సామూహిక ధ్యాన కార్యక్రమాలు, కీర్తనలు, దృశ్య, శ్రవణ సంబంధిత ప్రదర్శనలు మరియు క్రియాయోగ దీక్షా వేడుకలతో కూడిన వివిధ స్ఫూర్తివంతమైన కార్యక్రమాలను వారు నిర్వహిస్తారు.

ప్రసంగిస్తున్న స్వామి స్మరణానందపర్యటనలలో చేసే ప్రసంగాలు, పరమహంస యోగానందగారి బోధనలపై కొత్తవారికి పరిచయాన్ని మరియు పాఠాల విద్యార్థులకు వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియల్లో లోతైన మార్గదర్శకత్వాన్ని కలుగజేస్తాయి. సభ్యుల కార్యక్రమాలు మరియు ప్రాంతీయ ఏకాంత ధ్యాన వాసాలలో వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియలపై తరగతులు నిర్వహించబడతాయి మరియు సామూహిక ధ్యానానికి మరియు సత్సంగానికి అవకాశాలను కలిగిస్తాయి. ఈ కార్యక్రమాలలో పరమహంస యోగానందగారి బోధనలలోని అనేక ఇతర ముఖ్యమైన అంశాలు కూడా పొందుపరచబడి ఉంటాయి, అవి:

  • దైనందిన జీవితంలో ధ్యానం యొక్క ప్రాముఖ్యత
  • జీవితాన్ని మరింత సామరస్యంగా గడపడం ఎలా
  • అంతరంగ ఆవశ్యకతలను బాహ్యమైన అవసరాలతో సంతులనం చేసే విధానం నేర్చుకోవడం

అంతరంగంలో శాంతి మందిరాన్ని నిర్మించుకోవడానికి స్ఫూర్తినిస్తూ మన గురుదేవులు ఇలా అన్నారు: “మీ మనస్సు యొక్క ప్రధాన ద్వారం వెనుక ఉన్న నిశ్శబ్దంలో ఎంత ఆనందం నిరీక్షిస్తూ ఉందో ఏ మానవ జిహ్వ కూడా వర్ణించలేదు. కానీ మీరు ధ్యానం చేసి ఆ వాతావరణం సృష్టించుకోవాలి. గాఢంగా ధ్యానం చేసేవారు అద్భుతమైన అంతరంగ నిశ్శబ్దాన్ని అనుభవిస్తారు.” ఈ విధులు దైనందిన జీవితంలో నిరంతర కార్యకలాపాల నుండి తమ దృష్టిని ఉపసంహరించుకోవడానికి మరియు అంతరంగ నిశ్శబ్దంపై దృష్టిని కేంద్రీకరించడానికి, శ్రద్ధ కలిగిన సాధకులకు అద్భుతమైన అవకాశాన్ని కలుగజేస్తాయి. తద్ద్వారా భగవంతుని శాంతి మరియు ఆనందం యొక్క అమృతాన్ని గ్రోలడం సాధ్యమవుతుంది.

జనవరి – డిసెంబర్ 2025 మధ్య జరుగబోయే సన్యాసుల పర్యటనలు

జనవరి — డిసెంబర్ 2025 మధ్య జరిగే సన్యాసుల పర్యటనల వివరాల కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

రాష్ట్రం

తేదీ

ప్రాంతం

<pకార్యక్రమ స్వరూపంe

ఆంధ్రప్రదేశ్

నవంబర్ 26

బాపట్ల

ఒక-రోజు కార్యక్రమం

చండీఘర్

అక్టోబర్ 31-నవంబర్ 2

చండీఘర్

క్రియాయోగ దీక్షతో కూడి ఉంటుంది

గుజరాత్

నవంబర్ 28-30

సూరత్

క్రియాయోగ దీక్షతో కూడి ఉంటుంది

మధ్యప్రదేశ్

నవంబర్ 21-23

ఇండోర్

క్రియాయోగ దీక్షతో కూడి ఉంటుంది

మహారాష్ట్ర

నవంబర్ 20

సోలాపుర్

ఒక-రోజు కార్యక్రమం


నవంబర్ 23

మిరాజ్

ఒక-రోజు కార్యక్రమం

ఒడిశా

నవంబర్ 21-23

పూరీ

ఏకాంత ధ్యాన వాసం (ఒడియా)

నవంబర్ 28-30

పూరీ

ఏకాంత ధ్యాన వాసం (ఇంగ్లీష్)

ఉత్తర్ ప్రదేశ్

నవంబర్ 13

సంత్ కబీర్ నగర్

ఒక-రోజు కార్యక్రమం

నవంబర్ 16

కాన్పూర్

ఒక-రోజు కార్యక్రమం

ఉత్తరాఖండ్

నవంబర్ 14-16

ద్వారహాట్

ఏకాంత ధ్యాన వాసం (ఇంగ్లీష్)

రాబోవు కార్యక్రమాలు

ఇతరులతో పంచుకోండి