వై.ఎస్.ఎస్. గురు పరంపర

భగవాన్ శ్రీకృష్ణుడు

భగవాన్ కృష్ణుడు యోగమునకు తూర్పు దేశాలలో దివ్య దృష్టాంతంగా నిలుస్తాడు. శ్రీకృష్ణుడిని భారతదేశంలో అవతార పురుషుడుగా (భగవంతుని అవతారంగా) భావిస్తారు, పూజిస్తారు. శ్రీకృష్ణుని ఉదాత్త బోధనలు భగవద్గీతలో నిక్షిప్తమై ఉన్నాయి.

ఏసుక్రీస్తు

పరమహంస యోగానందగారి ముఖ్యమైన లక్ష్యాలలో ఒకటి ఏమిటంటే “భగవాన్ కృష్ణుడు బోధించిన అసలైన యోగములోను మరియు ఏసుక్రీస్తు బోధించిన అసలైన క్రైస్తవంలోను ఉన్న సంపూర్ణ సామరస్యాన్ని మరియు ప్రాథమిక ఏకత్వాన్ని వెల్లడించడం; మరియు ఈ సత్యసూత్రాలు అన్నీ, నిజమైన మతాలకు సాధారణ శాస్త్రీయ పునాదులని చూపించడం.”

మహావతార్ బాబాజీ

మహావతార్ బాబాజీగారు అంధయుగాల్లో మరుగున పడిపోయిన శాస్త్రీయమైన క్రియాయోగ ప్రక్రియను ఈ యుగంలో పునరుద్ధరించారు.

లాహిరీ మహాశయ

మహావతార్ బాబాజీ లాహిరీ మహాశయులకి (ఆయన శిష్యులు ఆయనను ప్రముఖంగా యోగావతార్‌గా సంబోధించేవారు) క్రియాయోగ శాస్త్రంలో దీక్ష ఇచ్చారు, మరియు నిజాయితీ గల సాధకులందరికీ పవిత్రమైన ఈ క్రియా ప్రక్రియను ప్రసాదించమని ఆదేశించారు.

స్వామి శ్రీయుక్తేశ్వర్

శ్రీయుక్తేశ్వర్ గారు లాహిరీ మహాశయుల వారి శిష్యులు మరియు జ్ఞానావతార్ లేదా జ్ఞానం యొక్క అవతారం అనే ఆధ్యాత్మిక స్థాయిని సాధించారు.

శ్రీ శ్రీ పరమహంస యోగానంద

పరమహంస యోగానందగారు క్రియాయోగమును ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమనే కార్యాన్ని కొనసాగించడానికి తన ఆధ్యాత్మిక పరంపరలోని ముగ్గురు పరమగురువులు – మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు మరియు స్వామి శ్రీయుక్తేశ్వర్ గారితో వ్యక్తిగతంగా దీవించబడ్డారు.