ప్రపంచం నలుమూలల నుండి సందేశాలు

జ్ఞాపకార్థం: శ్రీ దయామాత

(జనవరి 31, 1914 – నవంబర్ 30, 2010)

మార్చి 15, 2011

ప్రపంచం నలుమూలల నుండి శ్రీ దయామాతకు నివాళులు

శ్రీ దయామాతగారు పరమపదించిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషులు మరియు స్నేహితుల నుండి మదర్ సెంటర్‌కు వేలాది సందేశాలు — ఇమెయిల్‌లు, ఉత్తరాలు మరియు ఫోన్ కాల్‌లు వచ్చాయి. కొంతమంది భక్తులు సంవత్సరాలుగా మాతో జరిగిన సమావేశాల నుండి స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు, అయితే ఆమెను వ్యక్తిగతంగా ఎన్నడూ కలవని చాలా మంది కూడా, అంతర్గత కమ్యూనియన్ ద్వారా ఆమెతో సన్నిహిత సంబంధాన్ని అనుభవించారు.

ఇక్కడ సమర్పించబడిన సారాంశాలు, ఈ ప్రియమైన ఆధ్యాత్మిక నాయకురాలితో ప్రజల వ్యక్తిగత అనుభవాల యొక్క గొప్ప పరిధిని అందిస్తాయి, అంతేకాకుండా అన్నీ కూడ శ్రీ దయామాతగారి స్వభావమైన బేషరతైన ప్రేమ మరియు కరుణ యొక్క ఏకీకృత ఇతివృత్తాన్ని ప్రతిబింబిస్తాయి.

“మన ప్రియమైన దయామాతగారి యొక్క నిష్క్రమణలో మన యొక్క గాఢమైన ధ్యానాలు మరియు ప్రేమతో కూడిన అంతర్ దృష్టి మన హృదయాలకు నేరుగా దయామాత యొక్క సున్నితమైన స్వరంలో ఆశీర్వదింపబడ్డామని నేను కనుగొన్నాను, అలాగే చాలా మంది భక్తులు కూడా ఆశీర్వదించబడి ఉంటారని అనుకుంటున్నాను. ఈ సంతోషకరమైన స్మారక దినాలలో ఉన్నంత అపారమైన ప్రేమను నేను ఎప్పుడూ అనుభవించలేదు. మన ప్రియమైన మా, తన ఆరోహణంలో కూడా మనని ఆశీర్వదిస్తూనే ఉంటారు మరియు నాకు ఖచ్చితంగా తెలుసు ఇక మనము ఎప్పటికీ ఇదివరకులా ఉండమనీ.”

“ఆమె పరమపదించుట, చాలా సంవత్సరాలుగా ఆమె అందించిన విపరీతమైన క్లిష్టమైన మరియు ముఖ్యమైన సేవను గురించి గొప్ప అవగాహనను తెచ్చింది — మనందరికీ మాత్రమే కాదు, యావత్ప్రపంచానికి.”

“ఒక గొప్ప సాధువు మరియు భగవంతుని అభిమాని ఇకపై ఈ భూమిపై నడవకపోవడం అనేది భక్తులమైన మనకే కాదు, ప్రపంచం మంతటికి తీరని నష్టం. ఆమె జీవితం, ఆమె సందేశం మరియు పరిపూర్ణ శిష్యత్వానికి ఆమె ఉదాహరణ దశాబ్దాలుగా మనందరికీ స్ఫూర్తినిచ్చాయి. నా విషయానికొస్తే, నేను ఆమె పుస్తకాలు చదివాను మరియు ఆమె టేపులను చాలాసార్లు విన్నాను, ఆమె గొంతు నా మనస్సులో శాశ్వతంగా నమోదు చేయబడింది మరియు ఆమె మాటలు నా హృదయంలో శాశ్వతంగా ముద్రించబడ్డాయని నేను చెప్పగలను. నా సాధనలో ఆమె ఎప్పటికీ స్ఫూర్తికి అఘదమైన మూలం. ఇంత కాలం తనను మనతో ఉండమని కోరినందుకు నేను జగన్మాతకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ నష్టానికి చింతిస్తున్నప్పటికీ, దయామాతగారు జగన్మాత యొక్క అనంతమైన బ్రహ్మానంద సముద్రంలో ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నందున నేను తన కొరకు సంతోషంగా ఉన్నాను. ఆమె ఇప్పుడు ఉన్న, గురుదేవుల సన్నిధి నుండి, మనకు మార్గనిర్దేశం చేయడం మరియు మన కోసం ప్రార్థించడం కొనసాగిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.”

“నేను ఆమెకు చాలాసార్లు వ్రాసాను మనలో ప్రతి ఒక్కరి పట్ల ఆమెకున్న వ్యక్తిగత ఆసక్తిని చూసి నేను ఆశ్చర్యపోయాను, ఎల్లప్పుడూ ప్రేమ మరియు జ్ఞానంతో కూడిన ఆలోచనలతో సమాధానమిచ్చేవారు, మరియు ఆమె చేసినట్లుగా సాధనను ఓర్పు మరియు ప్రేమతో అనుసరించడానికి ఆచరణాత్మక సూచనలు ఇచ్చేవారు.

“ఆమె జగన్మాత ప్రేమ యొక్క స్పష్టమైన వ్యక్తీకరణ — ప్రేమ యొక్క స్వరూపం, మన గురుదేవుల ప్రేమ మరియు దైవ ప్రేమ!”

“పరమహంస యోగానందగారు తాను శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, ‘ప్రేమ మాత్రమే నా స్థానాన్ని తీసుకోగలదు’ అని అన్నారు. మనం 'ద హోలీ సైన్స్' పుస్తకము నుండి తెలుసుకొన్నాము ప్రేమ అనేది అత్యంత శక్తివంతమైన సార్వత్రిక ఆకర్షణ శక్తి అని, అది సృష్టిని తిరిగి సృష్టికర్త వైపు ఎప్పటికీ లాగుతుంది. ఈ ప్రపంచంలో ఎవరూ ‘ప్రేమను ఇవ్వలేరు’; దైవిక ప్రేమ మనలో ప్రవహించడానికి మరియు ప్రసరించడానికి మనల్ని మనం కేవలం శుద్ధి చేసుకోగలము. ఇదే శ్రీ దయామాతగారు అందంగా మరియు సంపూర్ణంగా చేశారు. ఆమె ఎక్కడికి వెళ్ళినా, ఆమె నుండి దైవిక ప్రేమ ప్రసరించేది. వార్షిక ఎస్‌.ఆర్‌.ఎఫ్. కాన్వకేషన్‌లో ఆమె మాట్లాడినప్పుడు, ఆమె ప్రేమ ప్రకంపనలు బోనవెంచర్ హోటల్‌లోని పూర్తి కాలిఫోర్నియా బాల్‌రూమ్‌ను నింపెసేవి మరియు ప్రతి ఒక్కరూ, ఎస్‌.ఆర్‌.ఎఫ్. భక్తులు కానివారు కూడా దానిని గ్రహించేవారు. అంతేకాకుండా, ఆమె ప్రేమ నిజమైన, అమాయకపు వినయంతో పరిమళించబడి అలంకరించబడింది. మానవజాతి చరిత్రలో అరవై ఏళ్ళుగా ఒక ప్రధాన సంస్థకు నాయకత్వం వహించిన వ్యక్తి, సంస్థ యొక్క విజయానికి గుర్తింపు తీసుకోవడానికి కనీసం ఒక్కసారైనా ప్రయత్నించని మరొక ఉదాహరణ నాకు తెలియదు. శ్రీ దయామాతగారు అలా ఎప్పుడూ చేయలేదు; ఆమె రచనలు మరియు ప్రసంగాలలో గుర్తింపు నిజంగా ఎక్కడ చెందుతుందో అక్కడే ఇచ్చారు — మన గురువుకు మరియు దేవునికి ఎల్లప్పుడూ క్రెడిట్ (గుర్తింపును) ఇచ్చారు. భవిష్యత్ తరాల ఎస్‌.ఆర్‌.ఎఫ్. సన్యాసులు మరియు సామాన్య శిష్యులు తమ స్వంత జీవితాలను దయతో మరియు ప్రేమపూర్వకంగా జీవించడానికి శ్రీ దయామాత యొక్క ఆదర్శప్రాయమైన జీవితం నుండి ప్రేరణ పొందుతారు.”

“గొప్ప గురువులు ఉన్నారు: వారు మన ప్రపంచంలోని గందరగోళపు చీకటిలో మరియు నిరాశలో మానవజాతిని నడిపించే కాంతి కిరణాల వంటివారు; ఆపై మరింత ముఖ్యమైన పనిని కలిగి ఉన్న శిష్యులు ఉన్నారు: వారి పని, ఆ కాంతిని నిర్వహించడం మరియు పోషించడం, తద్ద్వారా అది ఎప్పటికీ ఆరిపోకుండా లేదా మసకబారకుండా ఉంటుంది, తద్ద్వారా అది సమస్యాత్మక సమయాల్లో మనకు మార్గనిర్దేశం చేస్తుంది. మన పూజ్య శ్రీ దయామాతగారి లక్ష్యం అలాంటిదే. ఆమె మన గురుదేవుల బోధనలు మరియు కార్యానికి లైట్ కీపర్ (దీప కాపరి) లాంటివారు.”

“మనకు అత్యంత ప్రియమైన శ్రీ దయామాతగారు వంటి ఆత్మ యొక్క పరివర్తనతో ముడిపడి ఉన్న భావాల ప్రవాహాన్ని మాటలతో వ్యక్తపరచడం కష్టం. ప్రస్తుత ద్వాపర యుగంలో ఆమె గురుదేవుల ఆజ్ఞలను మరియు స్వచ్ఛతను ఎంతో తీవ్రతతో చాలా జాగ్రత్తగా సంరక్షించిన విధానము సరిపోల్చలేనిది.

“ఆమె దోషరహితమైన నిస్వార్థత, ఆమె అచంచలమైన అంకితభావం, ఆమె ఆశ్చర్యపరిచే విధేయత, ఆమె అత్యంత చైతన్యవంతమైన ఆధ్యాత్మికత మరియు ఆమె అబ్బురపరిచే సరళత నేటి ప్రపంచంలో చాలా లోపించిన మరియు కనుమరుగైన లక్షణాలు; అయినప్పటికీ, ఏదో ఒక రోజు మనమందరము, ముఖాముఖికి కావలసిన వ్యక్తి (భగవంతుడు) పట్ల ఆమె పూర్తి ప్రేమ మరియు భక్తితో కొనసాగారు — పరిపూర్ణమైన మరియు సాటిలేని ఉదాహరణను అందించడమే కాకుండా, త్వరలో పునరావృతమయ్యే అవకాశం లేని వారసత్వాన్ని ఆమె వదిలి వెళ్ళారు.

“దయామాతగారి జీవిత పరిధి సులువుగా మానవ మనస్తత్వం నుండి తప్పించుకుంటుంది. మాటలు చెప్పవచ్చు, పుస్తకాలు వ్రాయవచ్చు, కానీ దేవుడు మరియు గురుదేవుల కార్యక్రమాలతో ఆమె కున్న ఆదర్శప్రాయమైన అనుశ్రుతి ఎప్పటికీ జీవిస్తుంది, మినహాయింపు లేకుండా మనమందరం మన జీవితంలో ఆ అనుశ్రుతిని అనుకరించడానికి మరియు అమలు చేయడానికి చూడాలి.

“ఆమె నిజమైన ప్రమాణ — వాహకురాలు, నిజమైన యోధుని యొక్క శౌర్యంతో భగవంతుని మరియు గురుదేవుల ప్రేమ జ్వాలను మోసుకెళ్ళారు, ఆ ఉద్దేశ్యము కొరకు మరియు ఆమె రాజు (భగవంతుడు, గురుదేవులు) కోసం అన్నింటినీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.”

“ప్రేమ మరియు కరుణ మా హృదయాలను తాకి, వాటిలో దైవిక ఉత్సాహాన్ని నింపిన మాతాజీకి శ్రద్ధను తెలియజేసుకొంటున్నాను.”

“దయామాతను వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం నాకు కలగలేదు, కానీ సంవత్సరాల నా సాధనలో ఆమె చాలా సార్లు నా కలల్లోకి వచ్చారు. ఒకసారి ఓ ప్రియమైన స్నేహితుడు చనిపోవడానికి కొన్ని వారాల ముందు అతడి కోసం తీవ్రమైన ప్రార్థన సమయంలో, మా వచ్చి ఆశీర్వాద రూపంగా తన నుదిటిని నా నుడిటికి నొక్కి, ప్రార్థన సమయంలో నా స్నేహితుడికి అదే విధంగా మానసిక చిత్రణం చేయడానికి శక్తివంతమైన మార్గాన్ని నాకు అంతర్దృష్టితో చూపించారు. మీరు చూశారుగా, మా జీవితంలో ఆమెను నేను ఎన్నడూ కలవనప్పటికీ, నా జీవితంలో దయామాత ఉనికి చాలా నిజమైన మరియు స్పష్టమైన రీతిలో ఉంది.”

“నేను కథను చెప్పదలచుకోలేదు; ఆమె నా హృదయంలో ఉందని మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఆమె నా ఆరాధ్యవ్యక్తి. నేను ఆమెలా ఉండాలనుకుంటున్నాను.”

“2003లో, నా తల్లికి మరియు నా భర్తకు ఆరు నెలల వ్యవధిలో మెటాస్టాటిక్ క్యాన్సర్‌ వ్యాధి అని నిర్ధారించబడింది, ఇద్దరికీ జీవించడానికి తక్కువ సమయం ఇచ్చారు. ఒకే సమయంలో ఇరువురూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నేను ఈస్ట్ కోస్ట్‌కి చివరి యాత్ర చేయగలిగాను మరియు నా చేతుల్లో నా తల్లి శాంతియుతంగా మరణించగలిగే బహుమతి నాకు ఇవ్వబడింది. ఆమె మరణించిన రెండు రోజుల తర్వాత, నా భర్త పరిస్థితి క్షీణించడంతో ఇంటికి తిరిగి రావాలని నాకు కాల్ వచ్చింది. నేను ఇంటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత, ఆయన ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నాడు మరియు జీవించగలడని ఆశలేదు. ఆ రాత్రి నేను జగన్మతకు అఘాదంగా ప్రార్థించాను, ఆమె ఎప్పుడూ నాతో ఉందని నాకు తెలుసు, దయచేసి దాన్ని ధృవీకరించడానికి నాకు ఒక మానవ సంకేతం ఇవ్వమని. నేను నా అంతరంగాన్ని నిలబెట్టుకోవాడానికి కష్టపడుతున్నాను మరియు కొన్నిసార్లు దుఃఖం చాలా అధికంగా ఉండేది.

“మరుసటి రోజు నాకు మదర్ సెంటర్ నుండి కాల్ వచ్చింది. నేను మదర్ సెంటర్‌కి కాల్ చేయలేదు లేదా వ్రాయలేదు కాబట్టి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఓ అందమైన స్వరం ఇలా చెప్పింది, 'దయామాత నుండి మీ కోసం ఒక సందేశం ఉన్నందున, మీరు సన్యాసినితో మాట్లాడటానికి నేను అపాయింట్‌మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను, కానీ అది చేసేముందు, జగన్మాత మీతో ఉన్నారని మీకు నేరుగా చెప్పమని ఆమె నన్ను కోరారు..' ఆ మాటలు విని నేను మోకాళ్ళపై పడిపోయాను, మాటలకు అందని కృతజ్ఞతతో ఏడ్చాను. కొన్ని క్షణాల తర్వాత ఒక సన్యాసిని ఫోన్‌ దగ్గరకు వచ్చి, ప్రియమైన మాతాగారి సందేశాన్ని చదివి, నా ఆత్మను ఓదార్చారు. ప్రియమైన మాతాగారికి భగవంతుడు మరియు గురుదేవులతో పరిపూర్ణమైన అనుశ్రుతి మరియు అందరి పట్ల ఆమెకున్న గొప్ప కరుణ మరియు ప్రేమకు ఇది ఒక గొప్ప ఉదాహరణ. ప్రియమైన మాతాగారిని ఆమె భౌతిక రూపంలో కలుసుకునే అవకాశం నాకు ఎప్పుడూ కలగలేదు, కానీ ఆమె ప్రేమ మరియు కరుణ నా హృదయం మరియు ఆత్మపై చెక్కబడి ఉన్నాయి.”

“ఆమె సమక్షంలో ఉండడం నేను ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. మేము ఆమె ప్రేమ తరంగాలలో మునిగిపోయాము, అది మాకు ఆనందభాష్పాలు తెప్పించాయి.”

“మన ప్రియమైన దయామాత మరియు ఎస్‌.ఆర్‌.ఎఫ్. బోధనలతో అక్షరాలా 'పెరిగిన' మనలోని వారికి, ఆమె మాతో ఉండటం మరియు ఆమె ప్రేమను గతంలో కంటే మరింత స్పష్టంగా అనుభూతి చెందడం అద్భుతంగా ఉంది. ఇన్నాళ్లూ నేను సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నానని, మరియు ఆమె నాతో పాటు పరుగెత్తుతోంది అని నాకు అనిపిస్తుంది — నేను ఎక్కువ తడబడితే నన్ను నిలబెట్టడానికి ఆమె సిద్ధంగా ఉంది. ఏదో ఒకవిధంగా నేను బాగానే ఉంటానని నాకు తెలుసు; ఆమె తన ఉదాహరణ ద్వారా నేను నేర్చుకోవలసినది నాకు నేర్పింది — గురు-శిష్యుల సంబంధం పట్ల మరియు పరమహంస యోగానందగారు మనకు అందించిన బోధనలు పట్ల అచంచలమైన అంకితభావం మరియు ప్రశంసలు — మరియు మనం ఎప్పటికీ ప్రేమించబడతాము. ఇప్పుడు ఆ ప్రేమను అందరికి అందించడానికి అనుమతించండి.”

“మన ప్రియమైన శ్రీ దయామాత పరమపదించిన వార్త వినగానే నాకు బాధ కలిగింది. ముప్పై సంవత్సరాలకు పైగా ఈ మార్గంలో నా ఆధ్యాత్మిక జీవితమంతా మా ప్రియమైన మా యొక్క అధ్యక్షత మరియు ఆధ్యాత్మిక నాయకత్వంతో కూడి ఉంది. నేను 'ఫైండింగ్ ద జోయ్ వితిన్ యూ' అనే పుస్తకాన్ని తీసుకొని, 1948లో ఆమె మృత్యువుకు-సమీపిమైన అనుభవాన్ని గురించి చదివాను. ఇది నాకు ఓదార్పునిచ్చింది మరియు మన ఆధ్యాత్మిక కుటుంబానికి మరియు ఎస్‌.ఆర్‌.ఎఫ్. సంస్థకు పునాదిగా ఉండేందుకు మానవ ఊహకు అందని ఈ పనిని అరవై రెండు సంవత్సరాలకు! పైగా ఆమె చేపట్టినందుకు కృతజ్ఞతతో నిండిపోయింది. అప్పుడు ఆమె అనుభవించిన అద్భుతమైన ప్రేమలో ఆమె ఇప్పుడు పూర్తిగా లీనమయ్యారని నేను నమ్ముతున్నాను.”

“నేను ఆమెకు వ్రాసిన ప్రతీసారి, ఆమె నాకు తప్పకుండ సమాధానం ఇచ్చేవారు; ఆమె సమాధానం ఇవ్వనవసరం లేదని నేను చెప్పినప్పటికీ, ఆమె సమాదానం వ్రాసేవారు. ఆమె ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని తన రెక్కల కిందకు తీసుకుని, తన జీవితంలోని ప్రతిరోజు వారికి వ్రాస్తూ, సలహాలిస్తూ, ప్రార్థించేవారు! దయామాత నిజమైన సాధువు. నేను కలుసుకున్న వారందరిలో అత్యంత అందమైన ఆత్మ. ఆమె ఉదాహరణ మరియు ఆమె బేషరతైన ప్రేమ కారణంగా నా జీవితం చాలా మారిపోయింది.”

“నేను 2001లో నా స్వంత వ్యాపారసంస్థను ప్రారంభించాను. నేను దయామా ఆశీస్సులు కోరుతూ ఆమెకు లేఖ రాశాను, కానీ ఆమె అపారమైన బాధ్యతలు మరియు ఆమె సమయంపై ఉన్న అనేక డిమాండ్‌లను తెలుసుకుని, సమాధానం ఆశించలేదు. నేను ఆశ్చర్యపోయాను, ఆ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ మరియు వివరణాత్మక సలహాను అందిస్తూ, కొద్ది సమయంలోనే సమాధానం వచ్చింది. అందులో స్వరము వెచ్చగా మరియు సన్నిహితంగా ఉంది, ఆమెకు నేను చాలా కాలంగా తెలిసినట్లుగా, కాకపోతే మేము ఎప్పుడూ కలవలేదు.

“ఇది నిజంగా, ఇప్పటివరకు నా అదృష్ట ఆకర్షణము — నేను దయామాత లేఖను ఫ్రేమ్ చేసి, ఇన్నాళ్లూ నా ఆఫీసు గదిలో ఉంచుకున్నాను. ఆమె ఉత్తరం వచ్చినప్పుడు నేను దానిని మంచి శకునంగా చూశాను, ఎందుకంటే నేను సమాధానము వస్తుందని ఊహించలేదు కాబట్టి. దయామాత యొక్క శుద్ధతత్వమైన ప్రవర్తన మరియు సేవా స్వభావం కార్పొరేట్ 'అడవి'లో నాలాంటి వారికి సంకేతదీపాలు. 'ప్రేమించండి, సేవ చేయండి మరియు మిగిలిన వాటిని దేవుడికి వదిలివేయండి,' అనే ఆమె సూత్రము నా వ్యాపార ప్రయాణంలో చాలా స్ఫూర్తిదాయకంగా ఉండింది. ఎనిమిది దశాబ్దాల పాటు ఎలాంటి మచ్చలేని రీతిలో గురుదేవుల ఆదర్శాలను మా నిలబెట్టినందుకు ఆమెపై గర్వపడుతునాను!”

“నేను దయామాతగారిని వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు, కానీ నాకు ఆమె ఎప్పటినుండో తెలిసినట్లుగానే ఆమె శరీరాన్ని విడిచిపెట్టినట్లు నేను భావిస్తున్నాను. నాకు ఆమె శక్తి మరియు భద్రత యొక్క పర్వతంలా అనిపిచ్చేవారు — కేవలం ఆమె ఉన్నారని తెలుసుకోవడమే నాకు ఓదార్పునిచ్చేది….ఆమె జ్ఞానం, దయ మరియు ప్రేమ యొక్క సారాంశం – అన్నీ ఒక మనిషి రూపంలో.”

“నా జీవితంపై ఆమె ప్రభావాన్ని నేను పూర్తిగా వర్ణించలేను: ఆమె నాకు స్త్రీ దైవిక సౌందర్యం మరియు ప్రేమ యొక్క ఆదర్శంగా నిలిచారు.”

“ప్రియమైన శ్రీ దయామా.... సంవత్సరాలుగా మీ ఉత్తరాలకు నేను చాలా కృతజ్ఞుడను. గురుదేవులు మరియు మీరు నా జీవితాన్ని మార్చారు. మీ సలహా, బేషరతైన ప్రేమ మరియు ఎడతెగని ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ సహాయపడుతునే ఉన్నాయి. ఓ మా, నేను మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తునే ఉంటాను. మీ ఆశీర్వాదాల కోసం నేను ఇప్పటికీ నా హృదయాన్ని, మనస్సును మరియు ఆత్మను తెరచి ఉంచుతాను. మీ పవిత్ర గ్రంథం 'ఎంటర్ ద క్వైట్ హార్ట్ (డై స్టిమ్మె డెస్ హెర్జెన్స్)' నా రోజువారీ బైబిల్!”

“1970వ దశకం చివరిలో శ్రీ దయామాతగారు కాన్వకేషన్ తర్వాత భక్తుల కోసం నిర్వహించిన సత్సంగానికి హాజరయ్యే అవకాశం నాకు లభించింది. ఆమె ప్రసంగం తర్వాత ప్రార్థనా మందిరం నుండి బయలుదేరుతున్న ప్రతి భక్తుడిని ఆమె పలకరించారు. నేను ఆమెకు ప్రణామం చేసినప్పుడు, నేను ఆమె కళ్ళలోకి చూశాను. అనంతంలోకి, భగవంతుని దృష్టిలోకి చూస్తున్నట్లుగా ఉండింది. అవి అంతులేని లోతులు. నేను ఇలా ఎప్పుడూ అనుభవించలేదు. ఆమె చిరునవ్వుతో నన్ను మదర్ సెంటర్‌కు స్వాగతించారు, మరియు నేను విభ్రాంతిలో ప్రార్థనా మందిరం నుండి బయలుదేరాను. ఈ అనుభవాన్ని నేనెప్పుడూ మర్చిపోలేదు....

“గురుదేవులను గురించి తెలియని వారికి, ఆయన బోధించిన వాటి అన్నింటికీ ఆమె సజీవ ఉదాహరణ.”

“చాలా సంవత్సరాల క్రితం, మదర్ సెంటర్‌లో శ్రీ దయామాతగారిని కలవడానికి భక్తుల బృందంతో పాటు నన్ను ఆహ్వానించారు. మేము లైబ్రరీలో కూర్చున్నప్పుడు, ఆమె మాకు అనధికారిక సత్సంగాన్ని నిర్వహించారు. దయామాత కళ్ళతో నేను పూర్తిగా నిశ్చేష్టితుడనైపోయాను. నేను 'సముద్రపు దృష్టి' అనే పదబంధాన్ని విన్నాను, కానీ నేను ఇంతకు ముందెన్నడూ ఎవరి కళ్ళలోకి చూస్తూ ఇంత విపరీతమైన లోతు, శక్తి మరియు అందాన్ని చూడలేదు. మన ప్రియతమ దయామా ఈ భూమిపై నడిచిన అదే సమయంలో నేను ఉండటం గౌరవంగా భావిస్తున్నాను.”

“దయామా నేను వర్ణించలేనంతగా నా జీవితాన్ని ప్రభావితం చేశారు. దాదాపు పదిహేనేళ్లుగా, ఆమె ప్రసంగాలు వినడం లేదా ఆమె మాటలు చదవడం నా దినచర్యలో భాగమైంది, అవి నా జీవితాన్ని నిజంగా తీర్చిదిద్దాయి. తప్పకుండా ఆమె నన్ను ఉత్సాహంతో, ఆధ్యాత్మిక దృఢ సంకల్పంతో, భగవంతుని కోసం ఆరాటపడేలా చేసింది. కానీ అన్నింటికీ మించి దైవిక ప్రియతమునితో ఎంతో సన్నిహితమైన, మధురమైన, ప్రేమగల, నమ్మకమైన మరియు మైమరిపించే స్నేహాన్ని పెంపొందించుకోవడానికి ఆమె నాకు సహాయం చేసారు.

“నా ధ్యానాలను నిజమైన కమ్యూనియన్‌గా మార్చడంలో దయామా నాకు సహాయం చేశారు. మరియు ఆమె నా విధులను నా దేవుని సన్నిధిలో ప్రేమతో చేయు కృతులుగా మార్చడంలో నాకు సహాయపడ్డారు. శిష్యుడిగా ఉండటం అంటే ఏమిటో, స్నేహితుడిగా ఉండటమంటే ఏమిటో, వినయపూర్వకమైన సేవకుడిగా ఉండటమంటే ఏమిటో, నాయకుడిగా ఉండటమంటే ఏమిటో దయామా నాకు చూపించారు — కానీ అన్నింటికంటే ఆమె ప్రేమికుడు అంటే ఏమిటో నాకు చూపించారు. భగవంతుని భక్తి అనే మధువుని తాగి మత్తులో ఉన్న ప్రేమికుడు.”

“ఆమె ఉనికి, విజయాలు, ఉదాహరణ, అనేక తరాల వరకు నక్షత్రంలా ప్రకాశిస్తుంది. భారతదేశము యొక్క గొప్పతనము, ఔనత్యము శ్రీ శ్రీ దయామాత రూపంలో లాస్ ఏంజిలిస్ లో నివసించింది.”

“ఆమె జీవిత కథ నాతో గొప్పగా మాట్లాడింది.. గురుదేవులపట్ల ఆమె భక్తి అమోఘమైనది మరియు ఎస్‌.ఆర్‌.ఎఫ్. యొక్క ఆమె నాయకత్వం అద్భుతమైనది. దేవునిలో అఘాదమైన ఐక్యము ద్వారా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా గడపాలనే దానిపై ఆమె నాకు నిరంతర ప్రేరణన ఇచ్చారు. నా జీవితాంతం నాపై ఆమె ఎంత ప్రభావం చూపించారో మరియు ఇంకా ఎంతగా ప్రభావం చూపిస్తూ ఉంటారో పదాలు వర్ణించలేవు.”

“కేవలం ఆమెను చూడడం ద్వారా, ఏ సంశయము లేకుండా శ్రీ దయామాత కాంతి, ప్రేమ మరియు మంచితనం యొక్క అస్తిత్వం అని మీకు తెలిసిపోతుంది. మా కుటుంబానికి, శ్రీ దయామాతగారు ఒక తరగని ప్రేరణా మూలం అలాగే పరమహంస యోగానందగారి నిజమైన శిష్యుడు ఎలా ఉండాలనే దానికి ఉదాహరణ.”

“నేను దయామా గురించి ఆలోచించిన ప్రతీసారి నేను ప్రేమను అనుభవించాను.”

“విశాలమైన పసిఫిక్ మహాసముద్రం శ్రీ దయామాతగారి ఆకర్షణీయ సాన్నిధ్యం నుండి నన్ను వేరు చేయలేదు. మన ప్రియతమ అధ్యక్షురాలు, నాయకురాలు, బోధకురాలు, స్నేహితురాలు తన గురువు దగ్గరకు కాంతి లోకంలోకి వెళ్ళిపోయారు. ఆనంద తరంగాలు ఆమె మధురమైన ఆనందంతో మన హృదయాలను ముంచెత్తుతున్నాయి. మనము ఒడ్డున నిరాధారంగా మిగిలిపోయినప్పటికీ, ఆమె గురుదేవుల పక్కన ఉన్నందున విచారించవలసిన అవసరం లేదు. గురువు మరియు శిష్యురాలు — వారి ప్రేమ కిరణాలు ప్రపంచవ్యాప్తంగా చేరుకొంటున్నాయి. దయగల తల్లి, అనుగ్రహముతో కూడిన మీ జీవితానికి ధన్యవాదాలు.”

“భూమిపైనా లేక స్వర్గంలో ఉన్నా, శ్రీ దయామాతగారు నా మార్గాన్ని కాంతితో నింపుతారు”

ఇతరులతో షేర్ చేయండి