సాధనా సంగమాలు 2025

(రాంచీ, నోయిడా, దక్షిణేశ్వర్, చెన్నై, మరియు ఇగత్‌పురి)

అక్టోబర్ నుండి డిసెంబర్ 2025 వరకు జరిగే సంగమాల నమోదు ప్రారంభమయ్యింది!

కార్యక్రమం గురించి

మీరు ధ్యానాన్ని అభ్యసిస్తున్న కొలదీ రోజురోజుకూ, ఒక నూతన జాగృతి కలుగుతుంది; భగవంతునితో ఒక కొత్త సజీవ సంబంధం మీలో కదలాడుతుంది.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

అక్టోబర్ నుండి డిసెంబర్ 2025 వరకు జరిగే సాధనా సంగమాలలో పాల్గొనేందుకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులందరినీ మేము ఆహ్వానిస్తున్నాం.

ఈ సంగమాలు ఏకకాలంలో ఈ క్రింది అన్ని ప్రదేశాల్లోగాని, కొన్నింటిలోగాని, ఒకే సమయంలో నిర్వహించబడతాయి: వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమం; వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమం; వై.ఎస్.ఎస్. దక్షిణేశ్వర్ ఆశ్రమం; వై.ఎస్.ఎస్. చెన్నై ఆశ్రమం; పరమహంస యోగానంద సాధనాలయం, ఇగత్ పురి. భక్తులు తమకు అనుకూలమైన ప్రదేశాన్ని హాజరయ్యేందుకు ఎంచుకొని, ఏదైనా ఒక సంగమానికి హాజరు కావచ్చును.

గతంలో ప్రతి సంవత్సరం నిర్వహించబడిన శరద్ సంగమాల వలెనే, ఈ కార్యక్రమాలు కూడా, తమని తాము ఆధ్యాత్మికంగా పునరుజ్జీవనం చేసుకొనేందుకు, గురుదేవుల బోధనల గురించి గాఢమైన అవగాహన పొందేందుకు, తమ ధ్యానప్రక్రియల అభ్యాసాన్ని మెరుగుపరుచుకొనేందుకు భక్తులకు అవకాశాన్ని కల్పిస్తాయి. అందుబాటులో ఉన్న సౌకర్యాలను బట్టి, ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారి సంఖ్య పరిమితం చేయబడుతుంది, కావున భక్తులు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో మరింత గాఢమైన, వ్యక్తిగతమైన సహాయాన్ని అనుభవించవచ్చు. భక్తులు సంగమంలో మరింత లీనమయ్యే అనుభవాన్ని కల్పించడం కోసం, 2025 సంవత్సరంలో ప్రతి సంగమం యొక్క వ్యవధి, 4 రోజుల నుండి 5 రోజులకు పెంచడం జరుగుతోంది. మొత్తం మీద, సాధనా సంగమాలలో పాల్గొనేవారందరికీ ఇవి మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని కలుగజేస్తాయి.

ఈ కార్యక్రమాల కోసం వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. భక్తుల నమోదు ప్రక్రియ ప్రారంభమయ్యింది.

ముందుగా వచ్చినవారికి ముందుగా కేటాయింపు ప్రాతిపదికపై నమోదు ఉంటుంది. ఒక భక్తుడు/భక్తురాలు ఒక్క సంగమంలో పాల్గొనడానికి మాత్రమే అనుమతించబడతారు.

మీ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పునరుజ్జీవింపజేయడానికి మాత్రమే కాకుండా ఇతర ఆసక్తి గల అన్వేషకులతో ధ్యానం చేయడం మరియు వారితో కలిసి ఉండటం వల్ల కలిగే ఆనందం మరియు ఆశీర్వాదాలను అనుభవించడానికి ఈ అపూర్వ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.

దయచేసి గమనించండి:

  • సంగమానికి వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు మాత్రమే పాల్గొనగలరు.
  • 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అనుమతించబడరు.
  • ఈ సంగమాల్లో పాల్గొనేందుకు ఎస్.ఆర్.ఎఫ్. భక్తులకు ఆహ్వానం ఉన్నప్పటికీ, వారు సమీపంలోని హోటళ్ళలో తమ స్వంత వసతిని ఏర్పాటు చేసుకోవాలి. అటువంటి హోటళ్ళ జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది.
  • కార్యక్రమాల షెడ్యూల్ తీవ్రంగా ఉంటుంది కాబట్టి, బలహీనమైన ఆరోగ్యం లేదా ప్రత్యేక అవసరాలు ఉన్న భక్తులు దరఖాస్తు చేయవద్దని సూచన.
రాంచీ ఆశ్రమ ప్రధాన భవనం
వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమం
వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమం
వై.ఎస్.ఎస్. దక్షిణేశ్వర్ ఆశ్రమం
వై.ఎస్.ఎస్.-చెన్నై-రిట్రీట్-ప్రధాన-భవనం
వై.ఎస్.ఎస్. చెన్నై ఆశ్రమం
వై.ఎస్.ఎస్. ఇగత్‌పురి సాధనాలయ

సాధనా సంగమాల వివరాలు

(అక్టోబర్-డిసెంబర్ 2025)

దయచేసి గమనించండి: ఈ సంగమాలలో ధ్యానప్రక్రియలపై తరగతులు ఏ భాషలో నిర్వహించబడతాయో, ఆ ప్రతి కార్యక్రమం యొక్క వివరాలు క్రింది పట్టికలో పేర్కొనబడ్డాయి; అయినప్పటికీ, ఆధ్యాత్మిక ప్రసంగాలు ఆయా ప్రాంతాలను బట్టి ఆంగ్లం, హిందీ, బెంగాలీ, తెలుగు లేదా తమిళంలో ఉండవచ్చు.

ప్రక్రియ తరగతుల భాష


రాంచీ

నోయిడా

దక్షిణేశ్వర్

చెన్నై

ఇగత్‌పురి

అక్టోబర్ 8-12

ఆంగ్లం

(క్రియాయోగ దీక్ష)

ఆంగ్లం

(క్రియాయోగ దీక్ష)

బెంగాలీ

తమిళం

హిందీ/ఆంగ్లం

నవంబర్ 5-9

ఆంగ్లం

(క్రియాయోగ దీక్ష)

సంగం లేదు

ఆంగ్లం

(క్రియాయోగ దీక్ష)

సంగం లేదు

హిందీ/ఆంగ్లం

డిసెంబర్ 3-7

హిందీ

(క్రియాయోగ దీక్ష)

హిందీ

(క్రియాయోగ దీక్ష)

హిందీ

సంగం లేదు

సంగం లేదు

వివరాలు

కార్యక్రమాల వివరాలు మౌలికంగా క్రింద చూపిన విధంగా ఉంటాయి:

బుధవారం

ఉదయం 07:00 నుండి ఉదయం 08:30 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఉదయం 10:00 నుండి ఉదయం 11:30 వరకు

కీర్తన, మరియు ప్రారంభ సత్సంగము

మధ్యాహ్నం 02:30 నుండి సాయంత్రం 04:00 వరకు

శక్తిపూరణ వ్యాయామాల సమీక్ష

సాయంత్రం 05:30 నుండి రాత్రి 07:30 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

రాత్రి 08:15 నుండి రాత్రి 09:15 వరకు

వీడియో ప్రదర్శన

గురువారం

ఉదయం 07:00 నుండి ఉదయం 08:30 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఉదయం 09:30 నుండి ఉదయం 10:30 వరకు

హాంగ్-సా ప్రక్రియ యొక్క సమీక్ష

ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు

ఆధ్యాత్మిక ప్రసంగం

మధ్యాహ్నం 03:00 నుండి సాయంత్రం 04:00 వరకు

ఓం ప్రక్రియ యొక్క సమీక్ష

సాయంత్రం 05:30 నుండి రాత్రి 08:30 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

శుక్రవారం

ఉదయం 07:00 నుండి ఉదయం 08:30 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఉదయం 09:30 నుండి ఉదయం 10:30 వరకు

ఆధ్యాత్మిక ప్రసంగం

ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు

ఆధ్యాత్మిక ప్రసంగం / ప్రశ్నలు-జవాబులు కార్యక్రమం

మధ్యాహ్నం 03:00 నుండి మధ్యాహ్నం 04:00 వరకు

విశ్వగీతాలాపన

సాయంత్రం 05:30 నుండి రాత్రి 08:00 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

శనివారం

ఉదయం 07:00 నుండి ఉదయం 08:30 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు

క్రియాయోగ సమీక్ష మరియు పరిశీలన & క్రియాబాన్లు కాని వారి కోసం సత్సంగం

మధ్యాహ్నం 03:00 నుండి సాయంత్రం 04:00 వరకు

ఆధ్యాత్మిక ప్రసంగం

సాయంత్రం 05:30 నుండి రాత్రి 07:30 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

దయచేసి గమనించండి: క్రియాయోగ దీక్షతో కూడిన కార్యక్రమాల కోసం, దయచేసి శనివారం వివరాలలో ఈ క్రింది మార్పును గమనించండి:

ఉదయం 08:30 నుండి ఉదయం 11:30 వరకు

క్రియాయోగ దీక్ష

ఉదయం 10:00 నుండి ఉదయం 11:30 వరకు

క్రియాబాన్ కాని వారి కోసం సత్సంగం

మధ్యాహ్నం 02:30 నుండి సాయంత్రం 04:00 వరకు

క్రియాయోగ సమీక్ష మరియు పరిశీలన

సాయంత్రం 05:30 నుండి రాత్రి 07:30 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఆదివారం

ఉదయం 07:00 నుండి ఉదయం 08:30 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఉదయం 10:30 నుండి ఉదయం 11:00 వరకు

కీర్తన మరియు ధ్యానం

ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు

ముగింపు సత్సంగం

మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 12:15 వరకు

ముగింపు ప్రసంగం, ప్రసాద వితరణ

సాయంత్రం 04:00 నుండి రాత్రి 07:30 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ధ్యాన ప్రక్రియ తరగతులు మరియు ఉపన్యాసాలు:

  • వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియలు — శక్తిపూరణ వ్యాయామాలు, హాంగ్-సా ప్రక్రియ మరియు ఓం ప్రక్రియ — వివరించబడతాయి మరియు ప్రదర్శించబడతాయి. పైన పేర్కొన్న సాధనా సంగం జాబితాలో సూచించిన విధంగా ఈ తరగతులు వివిధ భాషలలో నిర్వహించబడతాయి.
  • గురుదేవుల “జీవించడం ఎలా” సూత్రాలపై ఉపన్యాసాలు కూడా కార్యక్రమాల్లో భాగంగా ఉంటాయి. ఈ ఉపన్యాసాలు ఆంగ్లం, హిందీ, బెంగాలీ, తెలుగు మరియు తమిళ భాషల్లో నిర్వహించబడవచ్చు.
నమోదు

కార్యక్రమం:

  • ప్రతి ప్రదేశంలోను, సంగమ కార్యక్రమం, బుధవారం ఉదయం ప్రారంభమై, ఆదివారం సాయంత్రం ముగుస్తుంది.
  • భక్తులందరు అదనంగా నాలుగు రోజులు బస చేసే అవకాశం ఉంటుంది – వారు కార్యక్రమానికి రెండు రోజులు ముందుగా (అనగా సోమవారం ఉదయం) వచ్చి, కార్యక్రమం ముగిసిన రెండు రోజుల తరువాత వరకు (మరుసటి మంగళవారం రాత్రి వరకు) ఉండవచ్చు.
  • గురుదేవుల ఆశ్రమం/ఏకాంత ధ్యాన వాసంలో ఎనిమిది రోజులు నిరంతరాయంగా గడపడం ద్వారా, భక్తులు విశ్రాంతి, విరామం మరియు ఆధ్యాత్మిక పునరుత్తేజం కోసం తగిన సమయం పొందుతారు. మీ రాక మరియు నిష్క్రమణమునకు తదనుగుణంగా మీరు ఏర్పాట్లు చేసుకోగలరు.

వసతి:

  • భాగస్వామ్య/డార్మిటరీ తరహా వసతి స్త్రీలు మరియు పురుషులకు విడివిడిగా అందించబడుతుంది. కుటుంబ సభ్యులు దయచేసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకొని తమ వస్తువులను సర్దుకొని రావలసి ఉంటుంది.
  • వసతి లేదా ఆహారం కోసం ప్రత్యేక అవసరాలు ఉన్న భక్తులు దయచేసి వారి స్వంత ఏర్పాట్లు చేసుకొనవలసి ఉంటుంది. సమీపంలోని హోటళ్ళ జాబితా క్రింద ఇవ్వబడింది.

ముందుగా నమోదు చేసుకొన్నవారికి మొదట అందించబడే పద్ధతి:

  • మొత్తం ఐదు ప్రదేశాలలో పరిమిత వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నందున, ముందుగా వచ్చిన వారికి ముందుగా అందించబడే ప్రాతిపదికన నమోదు నిర్ధారించబడతుంది.
  • మీ నమోదు ధృవీకరించబడినప్పటికీ మీరు హాజరు కాలేకపోతే, నమోదు రుసుము తిరిగి చేయబడదని లేదా మరొక వ్యక్తికి బదిలీ చేయబడదని దయచేసి గమనించండి.

చెల్లింపులు: నమోదు ఫీజు ఒక్కొక్కరికి ₹ 2500. ఈ రుసుము భోజన ఛార్జీలతో కలిపి ఉంటుంది. నమోదు రుసుమును చెల్లించడం మీకు కష్టంగా అనిపిస్తే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

నమోదు సమాచారం

అక్టోబర్ నుండి డిసెంబర్ 2025 వరకు జరిగే సంగమాల నమోదు ప్రారంభమయ్యింది!

నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరణాత్మక సమాచారం ఈ క్రింది విధంగా ఉంది:

డివోటీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ నమోదు:

త్వరగా మరియు తేలికగా నమోదు చేయడానికి, దయచేసి క్రింద ఉన్న బటన్ మీద క్లిక్ చేసి ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోండి:

సహాయ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా నమోదు:

దయచేసి (0651 6655 555) కాల్ చేయండి లేదా రాంచీ ఆశ్రమం సహాయ కేంద్రానికి ఈ-మెయిల్ ద్వారా క్రింది వివరాలను అందించండి:

  • మీ పూర్తి పేరు
  • వయస్సు
  • చిరునామా
  • ఈ-మెయిల్, మరియు టెలిఫోన్ నంబర్
  • వై.ఎస్.ఎస్. పాఠాల నమోదు సంఖ్య (లేదా ఎస్.ఆర్.ఎఫ్. సభ్యత్వ సంఖ్య)
  • మీరు ప్రతిపాదించిన రాక మరియు నిష్క్రమించే తేదీలు.

మీరు మీ మొబైల్ లేదా ఈ-మెయిల్ చిరునామాకు పంపబడే చెల్లింపు లింక్‌ ద్వారా పైకం మొత్తాన్ని చెల్లించవచ్చు.

ఎస్.ఆర్.ఎఫ్. భక్తుల నమోదు కోసం:

  • ఆసక్తిగల ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రాన్ని ఈ-మెయిల్ ద్వారా సంప్రదించి, పైన పేర్కొన్న భక్తుని వివరాలన్నింటినీ అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాము.
  • ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎస్.ఆర్.ఎఫ్. భక్తులకు ఆహ్వానం ఉన్నప్పటికీ, సమీపంలోని ఏదైనా హోటళ్ళలో తమ స్వంత వసతి ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాము. కాని కార్యక్రమం జరిగే ప్రదేశంలోనే వారు భోజనం చేయవచ్చును.

దయచేసి గమనించండి:

  • ఒక భక్తుడు/భక్తురాలు ఒక్క సంగమంలో పాల్గొనడానికి మాత్రమే అనుమతించబడతారు.
  • నమోదు కోసం అభ్యర్థనలు గరిష్ట పరిమితిని చేరుకున్నట్లయితే నిర్దిష్ట ప్రదేశానికి సంబంధించిన నమోదును ముందుగానే మూసివేయవచ్చు.
  • మీ నమోదు సఫలమైన మీదట, మీరు ఈమెయిల్, లేదా వాట్సప్ లేదా ఎస్.ఎం.ఎస్. ద్వారా నిర్ధారణను అందుకుంటారు. మీకు అలాంటి నోటిఫికేషన్ రాకుంటే, దయచేసి కాల్ (0651 6655 555) ద్వారా లేదా ఈ-మెయిల్ ([email protected]) ద్వారా వై.ఎస్.ఎస్. రాంచీ సహాయ కేంద్రాన్ని సంప్రదించండి.
  • సంగమానికి కేవలం వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు మాత్రమే హాజరుకాగలరు.
  • 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అనుమతించబడరు.
క్రియాయోగాన్ని స్వీకరించడానికి అర్హత

ఈ సంగమాలకు హాజరయ్యే క్రియాబానులందరూ క్రియాయోగ దీక్షను స్వీకరించే కొత్త భక్తులతో పాటు క్రియాయోగ దీక్షా కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది.

క్రియాయోగాన్ని స్వీకరించడానికి అర్హత

  • క్రియాయోగ దీక్షను స్వీకరించడానికి అర్హత, వై.ఎస్.ఎస్. పాఠాలతో జత చేయబడిన ప్రశ్నావళికి సంతృప్తికరమైన సమాధానాలను సమర్పించడంపై ఆధారపడి ఉంటుంది.
  • మీరు ప్రశ్నాపత్రంలో గమనించినట్లుగా, క్రియాయోగాన్ని స్వీకరించడానికి అర్హత పొందాలంటే, భక్తుడు తప్పనిసరిగా మొదటి మూడు ప్రాథమిక యోగదా పద్ధతులను చాలా నెలలుగా సాధన చేస్తూ ఉండాలి.
  • మీరు వై.ఎస్.ఎస్. గురు పరంపరకు మరియు యోగదా సత్సంగ మార్గం పట్ల భక్తి మరియు విధేయతతో కూడిన క్రియాయోగ ప్రతిజ్ఞను కూడా సంతకం చేసి సమర్పించవలసి ఉంటుంది.

దయచేసి గమనించండి: మీరు క్రియాయోగ దీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, మరియు ప్రశ్నాపత్రానికి మీ సమాధానాలను ఇంకా పంపకపోతే, వాటిని సన్యాసులు పరిశీలించడానికి మీరు కార్యక్రమాలకు హాజరయ్యే ప్రదేశంలో సమర్పించవచ్చు.

 

క్రియాయోగ దీక్షా వేడుకలో పాల్గొనడం:

  • వేడుకలో క్రియాయోగ దీక్షను స్వీకరించాలనుకునే వారందరూ, క్రియాయోగ పాఠాలను స్వీకరించి వేడుకలో పాల్గొనని వారితో సహా; అలాగే, అధికారిక దీక్షను స్వీకరించి వేడుకకు హాజరు కావాలనుకునే క్రియాబాన్‌లు కనీసం ఒక రోజు ముందుగా సంబంధిత ప్రదేశంలో నమోదు చేసుకోవాలి, మరియు వేడుకకు అవసరమైన ప్రవేశ పత్రాన్ని (కార్డుని) తీసుకురావాలసి ఉంటుంది.
  • క్రియాయోగ దీక్ష కోసం మిమ్మల్ని మీరు నమోదు చేసుకొనేటప్పుడు మరియు సమీక్షకు హాజరైనప్పుడు దయచేసి మీ క్రియాబాన్ గుర్తింపు కార్డును తీసుకువచ్చి చూపించండి.
స్వచ్ఛంద సేవకులు

ఎప్పటిలాగే, నమోదు కేంద్రం, వసతి, ఆడియో-విజువల్స్, భోజనశాల, పారిశుధ్యం, అషరింగ్ మరియు ఇతర విభాగాలలో వివిధ ప్రాంతాలలో సేవ చేయడానికి భక్తులు-స్వచ్ఛంద సేవకులు అవసరం. ఈ ప్రాంతాలలోని కొన్నింటిలో, కార్యక్రమం ప్రారంభం కావడానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు కొంతమంది స్వచ్ఛంద సేవకులు అవసరం. మీరు స్వచ్ఛంద సేవకులుగా ఉండాలనుకుంటే, దయచేసి నమోదు ఫారంలో తదనుగుణంగా సూచించండి.

మీ విరాళాల ఆవశ్యకత

ఈ కార్యక్రమాలను నిర్వహించడానికయ్యే వివిధ ఖర్చులను భరించడానికి మేము మీ సహకారాన్ని అభ్యర్థిస్తున్నాము. పరిమిత స్థోమత ఉన్న భక్తులు కూడా పాల్గొనేందుకు వీలుగా నమోదు రుసుము రాయితీతో ఉంటుంది. ఈ రాయితీని అందించడానికి మరియు తద్ద్వారా గురుదేవుల ఆతిథ్యాన్ని నిజాయితీగా కోరుకునే వారందరికీ విస్తరింపజేసేందుకు మాకు వీలు కల్పించడానికి పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వగలిగిన వారందరికీ మా కృతజ్ఞతలు.

నమోదు మరియు విచారణల కోసం సంప్రదించాల్సిన వివరాలు

యోగదా సత్సంగ శాఖా మఠం — రాంచీ
పరమహంస యోగానంద పథ్
రాంచీ 834 001

ఫోన్: (0651) 6655 555 (సోమ-శని, ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:30 వరకు)
ఈ-మెయిల్: [email protected]

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి