గీతా జయంతి సందర్భంగా (ఈ సంవత్సరం రాబోయే డిసెంబర్1న), వై.ఎస్.ఎస్. సన్యాసి స్వామి స్మరణానంద తెలుగులో నిర్వహించే “జీవన సమరంలో విజయం సాధించడం (నా లోపలి కురుక్షేత్రం)” అనే గీతా ప్రసంగంలో పాల్గొనేందుకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి భగవద్ప్రేరితమైన భగవద్గీత అనువాదం మరియు విస్కృత వ్యాఖ్యానమైన God Talks With Arjuna లో ఆ మహాగురువులు వివరించిన భగవద్గీత యొక్క జ్ఞానం ఆధారంగా, వై.ఎస్.ఎస్. సన్యాసి అయిన సామి స్మరణానంద గిరి గారి తెలుగు ప్రసంగాల శ్రేణిలో ఇది మొదటిది.
ఈ స్ఫూర్తిదాయక ప్రసంగంలో, కురుక్షేత్ర యుద్దం యొక్క ప్రతీకాత్మక ప్రాముఖ్యత గురించి స్వామి స్మరణానంద మాట్లాడతారు. I వ అధ్యాయంలోని 1వ శ్లోకం నుండి 9వ శ్లోకం వరకు పరమహంసగారి వ్యాఖ్యానం ఆధారంగా, కురుక్షేత్రం అనే మన అంతర్గత యుద్ధంలో, మనలోని కౌరవుల (చెడు ధోరణులు) ఉనికి మన ఆధ్యాత్మిక పురోగతికి ఎలా ఆటంకం కలిగిస్తుందో, మరియు మనలోని పాండవులను (మంచి ధోరణులు) పెంపొందించుకోవడం వల్ల మన ఆంతరంగిక కురుక్షేత్ర యుద్ధంలో చివరికి ఆ కౌరవుల ఓటమి ఎలా సంభవించి, తద్ద్వారా ఆత్మసాక్షాత్కారం యొక్క అంతిమ లక్ష్యం సాధించేందుకు దారి తీస్తుందో, ఉపమానాలు మరియు ఉపాఖ్యానాల ద్వారా ఆయన వివరిస్తారు.
ఈ ప్రసంగం, తరువాత కూడా వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.
దయచేసి గమనించండి: ఇందులో పాల్గొనడానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం, కార్యక్రమానికి సమీప తేదీలో ఈ వెబ్ పేజీని సందర్శించండి.
భగవద్గీతపై ఇతర ప్రసంగాలు
స్వామి స్మరణానంద గిరి గారి ఆంగ్ల ప్రసంగాల మరొక శ్రేణి, ప్రతీదీ బహుళ భాగాలతో కూడినది, వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పవిత్ర గ్రంథంపై వ్యాఖ్యానం గురించి
ఆధ్యాత్మిక మహాకావ్యమైన ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానందగారు భగవద్గీత పై తమ దివ్య అంతర్దృష్టితో వ్యాఖ్యానించారు. తమ వ్యాఖ్యానంలో, దాని మానసిక, ఆధ్యాత్మిక మరియు ఆధిభౌతిక లోతులను అన్వేషిస్తూ — రోజువారీ ఆలోచనలు మరియు చర్యల యొక్క సూక్ష్మ కారణాల నుండి విశ్వక్రమం యొక్క గొప్ప రూపకల్పన వరకు — జ్ఞానోదయం వైపు ఆత్మ చేసే ప్రయాణం యొక్క విస్తృత వృత్తాంతాన్ని యోగానందగారు పరిశోధిస్తారు.
గీత యొక్క సంతులిత ధ్యానమార్గం మరియు సరైన కార్యాచరణను స్పష్టంగా వివరిస్తూ, ఆధ్యాత్మిక సమగ్రత, ప్రశాంతత, సరళత మరియు ఆనందంతో కూడిన జీవితాన్ని మనం ఎలా సృష్టించుకోవచ్చో పరమహంసగారు చూపిస్తారు. మన జాగృత సహజావబోధం ద్వారా జీవిత మార్గంలోని ప్రతి కూడలిలో తీసుకోవాల్సిన సరైన మార్గాన్ని మనం తెలుసుకొంటాము. ఏ లోపాలు మనల్ని వెనక్కి నెట్టివేస్తున్నాయో, ఏ సానుకూల లక్షణాలు మనల్ని ముందుకు నడిపిస్తున్నాయో గుర్తించగలము, మరియు మార్గంలో ఉన్న ఆపదలను గుర్తించి నివారించగలము.





















