శ్రీ దయామాత వర్ధంతి మీడియా కవరేజీ

30 నవంబర్, 2010న వై.ఎస్.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. సంఘమాత మరియు అధ్యక్షురాలు శ్రీ శ్రీ దయామాత మరణించారనే వార్త, ఆమె ఆదర్శప్రాయమైన జీవితానికి నివాళులు అర్పించిన ప్రపంచ ప్రముఖ వార్తా సంస్థల విస్తృత పత్రికా నివేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రజలకు చేరింది. శ్రీ దయామాతగారి వినయం, అంకితభావముతో ఇతరులకు సేవ మరియు దివ్య కరుణ, ఆ వార్తా పత్రికల అందరి ఇతివృత్తాలలో ఉన్న అంశము.

“ఒక మార్గదర్శక కాంతి…” —ది న్యూయార్క్ టైమ్స్

“యోగానందగారి బోధనలకు విశ్వాసపాత్రురాలైన వివరణకర్త…”లాస్ ఏంజిలిస్ టైమ్స్

శ్రీ దయామాతగారి మరణం గురించి నివేదించిన అనేక ఆన్‌లైన్, ప్రింట్ వార్తా సంస్థలు మరియు వైర్లలో—న్యూయార్క్ టైమ్స్, లాస్ ఏంజిలిస్ టైమ్స్, ఫోర్బ్స్, AARP, ది ఒరెగోనియన్, మిన్నియాపాలిస్ స్టార్ ట్రిబ్యూన్, ఫిలడెల్ఫియా ఇంక్వైరర్, కాన్సాస్ సిటీ స్టార్, సాల్ట్ లేక్ ట్రిబ్యూన్, శాన్ డియాగో యూనియన్-ట్రిబ్యూన్, సెయింట్ పీటర్స్‌బర్గ్ టైమ్స్ మరియు అసోసియేటెడ్ ప్రెస్ తదితరమైనవి కేవలం కొన్ని ఉదాహరణలు.

దేశవ్యాప్తంగా ఉన్న వార్తాపత్రికలకు అందించబడిన లాస్ ఏంజిలిస్ టైమ్స్ యొక్క కథనం దయామాతగారి పై, ప్రముఖ మత పండితుడు, అమెరికన్ మతాల అధ్యయన సంస్థ డైరెక్టర్ మరియు ఎన్సైక్లోపీడియా ఆఫ్ అమెరికన్ రిలిజియన్స్ రచయిత జె. గోర్డాన్ మెల్టన్ చేసిన ఈ వ్యాఖ్యలను కూడా కలిగి ఉంది. “[శ్రీ దయామాతగారు] తన గురుంచి కాకుండా తన గురువును కీర్తిస్తూ తన సమయాన్ని గడపాలని కోరుకున్నారు” — ఇది ఆమె వినయం మరియు మానవాళికి అంకితమైన ఆమె సేవకు బలమైన నిదర్శనం.

“ఎందరో జీవితాలను తాకిన ఒక స్ఫూర్తి …”హిందూ స్టేట్స్మన్ రాజన్ జెడ్

యు.ఎస్. మరియు విదేశాలలో ఉన్న భారతీయ ప్రింట్ మరియు ఆన్‌లైన్ వార్తా సంస్థలు, టైమ్స్ ఆఫ్ ఇండియా నుండి ఇండియా వెస్ట్ నుండి DailyIndia.com వరకు శ్రీ దయామాత పై కథనాలను కలిగి ఉన్నాయి. ప్రముఖ హిందూ రాజనీతిజ్ఞుడు రాజన్ జెడ్ శ్రీ దయామాతగారి గురించి వివరిస్తూ ఇలా ప్రస్తావించారు: “ఆధ్యాత్మిక ప్రయాణంలో అనేక మంది జీవితాలను స్పృశించిన పరిపూర్ణ దివ్య ప్రేమమయి మరియు ఒక చక్కని ప్రేరణ.”

ఎల్.ఏ. యోగా, హారిజోన్స్ మ్యాగజైన్, ప్రాణ జర్నల్, ఇంటిగ్రల్ యోగా మ్యాగజైన్, లైట్ ఆఫ్ కాన్షియస్‌నెస్ మ్యాగజైన్ మరియు విజ్డమ్ క్వార్టర్లీ: అమెరికన్ బౌద్ధ జర్నల్ లాంటి కొన్ని ఆధ్యాత్మిక ప్రచురణలు, వై.ఎస్.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. యొక్క దీర్ఘకాల నాయకురాలిని గురించి తెలియ చేసారు. శ్రీ దయామాతగారిని గౌరవించి అదనపు నివాళులు అర్పించటానికి, ఆధ్యాత్మికత మరియు యోగాన్ని గురించి ప్రచురించే వివిధ పత్రికల తమ భవిష్య సంచికల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

నేషనల్ పబ్లిక్ రేడియోకి సంబంధించిన KPCC-FM (లాస్ ఏంజిలిస్) శ్రీ దయామాతగారి జీవితం మరియు విజయాలపై, బ్రదర్ చిదానందగారిని ఇంటర్వ్యూ చేసింది మరియు Beliefnet.com లో ఇంటర్వ్యూ యొక్క ఆడియో రికార్డింగ్‌తో పాటు ప్రింట్ న్యూస్ సారాంశం మరియు ప్రత్యేక వీడియో ఇంటర్వ్యూను ప్రదర్శించింది. KPCC రిపోర్టర్ షిర్లీ జహాద్ మాట్లాడుతూ, “చాలా మంది ఆధ్యాత్మిక నాయకులు కోరుకునే కీర్తిని దయామాతగారు నిరాకరించటం గమనార్హం.” లయోలా మేరీమౌంట్ యూనివర్శిటీలోని ఇండిక్ మరియు కంపారిటివ్ థియాలజీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ చాప్ల్‌తో చేసిన ఒక రేడియో ఇంటర్వ్యూ ప్రసారంలో, వారు దయామాతగారి గురించి ఇలా చెప్పారు, “తమ జీవితంలో ఇతరులకు సేవ చేయాలని కోరుకునే వారికి ప్రేరణగా గుర్తుంచుకోబడతారు.”

“ఇతరుల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహిళ…”ట్విట్టర్ పోస్ట్.

ఈ చారిత్రాత్మక సందర్భానికి సంబంధించిన వార్తలు వెబ్‌సైట్‌లు, బ్లాగ్‌లు, ఆన్‌లైన్ ఫోరమ్‌లు మరియు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో కూడా విస్తృతంగా కవర్ చేయబడ్డాయి—ట్రయంఫ్ ఆఫ్ ది స్పిరిట్, ఓపెన్ టు హీలింగ్, BellaOnline మరియు Beliefnet.com వంటి సైట్‌లలో హృదయపూర్వక నివాళులు అర్పించబడ్డాయి.

వేద గణిత ఫోరమ్ లో ఒక ఆసక్తికరమైన బ్లాగ్, ఇది పరమపూజ్య పూరీ శంకరాచార్యగారి యొక్క అమెరికా చారిత్రాత్మక పర్యటనలో దయామాతగారి యొక్క సహకారాన్ని ప్రధానంగా పేర్కొంది (ఈయన అనేక విశిష్ట విజయాలలో ఒకటి, పురాతన భారతీయ గ్రంథాలలో ఉన్న అధునాతన గణితాన్ని వివరించే సంపుటి).

ప్రసార మాధ్యమాల స్మారక సేవల వార్తాసేకరణకి సంబంధించిన ట్వీట్‌లు మరియు స్మారక సేవల వివరాలతో కూడిన వందలాది రీట్వీట్లు, ట్విట్టర్ లో కనిపించాయి. అనేక మీడియా కేంద్రాలలో కనిపించిన ప్రసరాలపై నివేదికలను ఆన్‌లైన్ వార్తా సమాహారాలు పంచుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సభ్యులు, స్నేహితులు మరియు వై.ఎస్.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. కేంద్రాలచే సృష్టించబడిన పేస్ బుక్ సమూహాలు వై.ఎస్.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. యొక్క ప్రియతమ సంఘమాతకు నివాళులు అర్పించి, ఆమెను “మహోన్నతమైన దివ్యమాత” గా గుర్తించారు.

ఎస్‌.ఆర్‌.ఎఫ్. యొక్క పొరుగువారి నుండి అత్యంత ప్రియమైన నివాళి ఒకటి — రచయిత బి.జె. గల్లఘర్ — మౌంట్ వాషింగ్టన్ నివాసి — ఈయన సంస్థ సభ్యుడు కాడు మరియు శ్రీ దయామాతగారిని కలుసుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు, కానీ ఖచ్చితంగా ఆమె స్ఫూర్తిని పొంది, ది హఫింగ్టన్ పోస్ట్‌లో ఈ కథనం వ్రాశారు:

“మీ తరఫున మీ పని మాట్లాడుతున్నప్పుడు, అడ్డు చెప్పకండి,” అని తెలివైన వ్యక్తి ఒకసారి చెప్పాడు. గత యాభై ఐదు సంవత్సరాలుగా సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కి నాయకత్వం వహించిన శ్రీ దయామాతగారి జీవితానికి ఇది సముచితమైన వర్ణన అనిపిస్తుంది….

ఆమె [శ్రీ దయామాతగారు] జీవిత వాస్తవాలను ఇటీవల ఆమె మరణించిన తర్వాత ఎల్.ఏ. టైమ్స్‌లో చదివే వరకు నేను తెలుసుకోలేదు. కానీ ఆమె ఎవరో అర్థం చేసుకోవడానికి నేను ఆమె జీవిత వివరాలను తెలుసుకోవలసిన అవసరం లేదు. ఆమె పనిని బట్టి నాకు ముందే తెలుసు.

నా ఉషోదయ నడకలలో నన్ను అభినందించిన సన్యాసులు మరియు సన్యాసినుల సంతోషకరమైన, స్నేహపూర్వక ముఖాలలో ఆమె ఆత్మ నాకు తెలుసు. ఎస్‌.ఆర్‌.ఎఫ్. ప్రచురించే అందమైన పుస్తకాలు మరియు క్యాలెండర్‌లలో ఆమె గురించి నాకు తెలుసు. నేను, నా కుక్క ఎస్‌.ఆర్‌.ఎఫ్. మైదానం వీక్షించడానికి దాని చుట్టూ షికారు చేస్తున్న సమయాలలోనూ, మేమిద్దరం వారి మనోహరమైన పచ్చిక బయళ్లలో ఆడే సమయాలలోనూ ఆమె గురించి నాకు తెలుసు. ఎస్‌.ఆర్‌.ఎఫ్. తోటలో నా నిశ్శబ్ద క్షణాల ధ్యానంలో ఆమె గురించి నాకు తెలుసు, నేను ఆమె కనిపించని ఉనికిని కృతజ్ఞతాపూర్వక ప్రార్థనతో గుర్తించాను.

శ్రీ దయామాతగారు, మౌంట్ వాషింగ్టన్ పొరుగువారమైన మాకు మీరు పెద్దగా తెలియకపోయినప్పటికీ — మీరు తెలుసు. మీ సమితి యొక్క శాంతియుత, నిర్మలమైన స్ఫూర్తితో మరియు మేము మీ అనుచరుల చుట్టూ మరియు మీ తోటలలో ఉన్నప్పుడు మేము అనుభూతి చెందే ప్రత్యేక శక్తి ద్వారా మేము మిమ్మల్ని తెలుసుకున్నాము. మా పొరుగున ఉన్నందుకు ధన్యవాదాలు; మౌంట్ వాషింగ్టన్‌ను మీ ఇల్లుగా మార్చుకున్నందుకు ధన్యవాదాలు; ప్రపంచానికి మీ సహకారానికి ధన్యవాదాలు. మీ తరఫున మీ పని మాట్లాడుతుంది.

ఇతరులతో పంచుకోండి