“నేను ఎవరు?”

(వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించే
ధ్యానం మరియు సత్సంగం — తెలుగులో)

శనివారం, ఏప్రిల్ 13, 2024

సాయంత్రం 6:30 గంటల నుండి

– 8 గంటల వరకు

(భారతీయ కాలమానం ప్రకారం)

ఈ కార్యక్రమం గురించి

“మానవుడు, జీవించే ఆత్మే కాని నశించే శరీరం కాదని ప్రపంచంలోని పవిత్ర గ్రంథాలన్నీ ఉద్ఘోషిస్తాయి; ఈ పవిత్ర గ్రంథాలు చెప్పే ఉద్ఘోషను నిరూపించడానికి అతనికి క్రియాయోగంలో ఒక పద్ధతి దొరుకుతుంది.

— పరమహంస యోగానంద

ఒక అధ్యాత్మిక అన్వేషకుడు ఎదుర్కొనే లోతైన ప్రశ్న “నేను ఎవరు?” అనే విషయం గురించి స్వామి కేదారానంద గిరి గారు ఏప్రిల్ 13వ తేదీన తెలుగులో ఓక ఉత్తేజకరమైన ప్రసంగం చేసారు.

ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమం సామూహిక ధ్యానంతో ప్రారంభమై, సత్సంగంతో ముగిసింది. ఈ సత్సంగంలో ఆత్మకూ, ఆత్మ యొక్క మిధ్యా ప్రతిబింబానికీ (అహంకారం) మధ్య భేదాన్ని గురించి, పరమాత్మలో శాశ్వత అంతర్భాగమని మరచిపోయిన మనం ఆత్మ స్వరూపులమన్న సత్యాన్ని తిరిగి ఎలా గ్రహించాలి అన్న విషయాన్ని గురించీ స్వామి కేదారానందగారు లోతుగా చర్చించారు. క్రమం తప్పని ఆధ్యాత్మిక సాధన, మరియు పరమహంస యోగానందగారి బోధనలలో ఆయన విశదం చేసిన ‘జీవించడం ఎలా’ అనే దాని గురించిన సిద్ధాంతాలను నిత్య జీవితంలో తప్పక పాటించడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆత్మసాక్షాత్కార లక్ష్యం వైపు నిలకడగా ముందుకు వెళ్ళగలుగుతారు.

ఈ సత్సంగం మా వెబ్‌సైట్‌లోను, యూట్యూబ్ లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయబడినది.

నూతన సందర్శకులు

వై.ఎస్.ఎస్. కు మరియు పరమహంస యోగానందగారి బోధనలకు కొత్తవారైతే, క్రింద ఉన్న లింక్ లను అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:

ఒక యోగి ఆత్మకథ

ఒక అత్యుత్తమ ఆధ్యాత్మిక రచనగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతున్న తమ పుస్తకం గురించి పరమహంసగారు తరచుగా, “నేను లేనప్పుడు ఈ పుస్తకం నా దూత అవుతుంది,” అనే వారు.

వై.ఎస్.ఎస్. పాఠాలు

మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని మార్చడానికి, సమతుల్యతను సాధించటానికి మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడే గృహ-అధ్యయన పాఠ్యక్రమం.

ఇతరులతో పంచుకోండి