-
- మీ మనస్సులోకి ఎడతెగని సత్యం ప్రవహించాలని… మరియు మీ ఆత్మలోకి ఎడతెగని ఆనందం ప్రవహించాలని ప్రార్థించండి.
-
- నిజమైన ఆత్మలలో ప్రేమ యొక్క సూక్ష్మ బిందువులు తళతళలాడుతాయి, కానీ పరమాత్మలో మాత్రమే ప్రేమ సముద్రాన్ని కనుగొనగలం.
-
- సృష్టి యొక్క ఏకైక ఉద్దేశ్యం, దాని రహస్యాన్ని చేధించడానికి మరియు అన్నిటి వెనుక ఉన్న భగవంతుణ్ణి గ్రహించడానికి మిమ్మల్ని బలవంతం చేయడమే.
-
- ప్రేమ అనేది సృష్టిలోని ఆకర్షణ యొక్క దివ్య శక్తి, అది సమన్వయ పరుస్తుంది, ఏకం చేస్తుంది, మరియు కలిపి ఉంచుతుంది.
-
- మంచిని అన్వేషించడం ద్వారా, మంచిగా ఉండడం ద్వారా, మరియు మంచిని ధృవీకరించడం ద్వారా ఈ ప్రపంచాన్ని ఒక సౌందర్యవంతమైన తోటగా మీరు దర్శిస్తారు.









































