మీకు ధ్యానం తప్ప మిగిలినవన్నీ చెయ్యగల సామర్థ్యం ఉన్నా, మీ ఆలోచనలు సద్దుమణిగి, మీ మనస్సు దైవశాంతితో సమశ్రుతిలో ఉన్నప్పుడు కలిగే ఆనందంతో సమానమైనది మీరు ఎప్పటికీ కనుగొనలేరు.
— పరమహంస యోగానంద, యోగదా సత్సంగ పాఠాలు
రాంచీ ఆశ్రమంలోని ఈ ధ్యాన మందిర భవంతి 300 మంది భక్తులకు స్థానం కల్పిస్తుంది, ప్రపంచం యొక్క హడావిడిని తప్పించుకొని, ధ్యానం యొక్క శాంతిని అనుభవించాలని కోరుకొనే యోగదా భక్తులకు, అదే విధంగా సందర్శకులకు ఉభయులకూ ఇది ఒక ఆధ్యాత్మిక స్వర్గధామం వంటిది. ఇక్కడ వై.ఎస్.ఎస్. సన్యాసులు ఉదయం మరియు సాయంత్రం క్రమబద్ధంగా ధ్యానాలు నిర్వహిస్తారు. ఆదివారాలలో పరమహంస యోగానందగారి బోధనలపై సన్యాసులు ఆధ్యాత్మిక ఉపన్యాసాలిస్తారు.
ఈ ధ్యాన మందిరం యొక్క నిర్మాణం 2004లో ప్రారంభమై, 2007లో పూర్తి చేయబడింది. జనవరి 31, 2007న స్వామి విశ్వానంద దీన్ని ప్రారంభించారు. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రస్తుత అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి కూడా ఈ చిరస్మరణీయ తరుణంలో ఇక్కడే ఉన్నారు. ధ్యాన మందిరం, ధ్యానం చేసుకొనేందుకు ఒక చతురస్రాకారపు మందిరం, చుట్టూ వరండా మరియు నాలుగు వైపులా మెట్లు కలిగి ఉంటుంది. భరత్‌పూర్ ఇసుకరాయితో చేసిన ఈ అందమైన నిర్మాణం, ఘనంగాను మరియు కళాత్మక సమతుల్యతతోను ఉండడమే కాకుండా బాహ్య అవాంతరాలు రాకుండా ఉండేందుకు తగినంత ఏకాంతంగా కూడా ఉంటుంది.
చరిత్ర
