లిచీ వేది (లిచీ వృక్షం ప్రేమతో ఆ విధంగా పిలువబడుతుంది) ఒక వంద సంవత్సరాలకు పైగా ప్రాచీనమైనది, మరియు పరమహంస యోగానందగారి సాన్నిధ్యంతో పావనమైన పవిత్ర ప్రదేశాలలో ఇది ఒకటి. ఈ విశాలమైన లిచీ వృక్షపు పందిరి నీడ క్రింద పరమహంస యోగానందగారు, తన పాఠశాల బాలుర కోసం తరచుగా బహిరంగ తరగతులు నిర్వహించేవారు.
పరమహంసగారితో ఈ ప్రదేశానికి అతి సామీప్య సాన్నిహిత్యం ఉన్నందున, దాని కొమ్మల క్రింద ప్రతిష్టించబడిన పరమహంసగారి పెద్ద చిత్రం ఉన్న ఈ వృక్షం వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు మరియు సందర్శకుల తీర్థయాత్రకు మరియు ధ్యానానికి ఒక ప్రియమైన ప్రదేశంగా ఉన్నది.
ఈ వృక్షం ప్రతి సంవత్సరం ఏప్రిల్-మే నెలల్లో తియ్యని లిచీ ఫలాలను ఇస్తుంది, వాటిని ప్రసాదంగా భక్తులకు అందించడం జరుగుతుంది.