యోగదా సత్సంగ మఠం — దక్షిణేశ్వర్

పశ్చిమ బెంగాల్

చరిత్ర మరియు పరిణామ క్రమం

ఉత్తర కోల్‌కతాలో గంగా నది ఒడ్డున దక్షిణేశ్వర్ లో ఉన్న యోగదా సత్సంగ మఠం, 1917లో పరమహంస యోగానంద గారు స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ అయిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) యొక్క రిజిస్టర్డ్ ప్రధాన కార్యాలయం. ఈ అందమైన ఆశ్రమం యొక్క చరిత్ర 1939లో ఈ మఠం స్థాపించబడినప్పుడు ప్రారంభమవుతుంది. ఈ ఆస్తిలోని గంభీరమైన భవనాన్ని మరియు ప్రశాంతమైన పరిసరాలను పరమహంసగారు ఎంతో ఇష్టపడేవారు. 1951లో, అమెరికాలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ స్నాతకోత్సవంలో పెద్దసంఖ్యలో గుమికూడిన ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి మరియు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు దక్షిణేశ్వర్ ఆశ్రమాన్ని సందర్శిస్తారని ఆయన వెల్లడించారు.

గత సంవత్సరాలలో, ఈ ఆశ్రమం మన ప్రియమైన దివంగత వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు — శ్రీ దయామాత మరియు శ్రీ మృణాళినీ మాత యొక్క పవిత్ర సాన్నిధ్యంతో ధన్యమైంది. వారి అనేక సందర్శనల సమయంలో, వారు ఇక్కడ అనేక సత్సంగాలు, సామూహిక ధ్యానాలు, క్రియాయోగ దీక్షా కార్యక్రమాలు మరియు భక్తులతో సమావేశాలను నిర్వహించారు. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క ప్రస్తుత అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి కూడా ఈ ఆశ్రమాన్ని సందర్శించి, సత్యాన్వేషకుల ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.

శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి
(ప్రస్తుత అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి)

ఆశ్రమం యొక్క అవలోకనం

రెండు ఎకరాల విస్తీర్ణంలో పండ్ల తోట, పూల మొక్కలు మరియు పెద్ద కొలనుతో విస్తరించి ఉన్న దక్షిణేశ్వర్ ఆశ్రమం మొదట్లో ఒక ‘ఉద్యాన మందిరం’. ఆశ్రమం కోసం పరమహంసగారి దార్శనికతను దృష్టిలో ఉంచుకుని, భక్తుల సౌకర్యార్థం ప్రాంగణంలోనే ఒక ధ్యాన మందిరం, అతిథి గృహం, వంటగది, కార్యనిర్వాహక ప్రదేశం మరియు భోజన ప్రాంతాలు నిర్మించబడ్డాయి.

1939లో ప్రారంభమైనప్పటి నుండి, ఈ ఆశ్రమం సత్యాన్వేషకులకు ఒక ఆశ్రయంగా అభివృద్ధి చెందింది. ఉదయం, సాయంత్రం నిర్వహించే రోజువారీ సామూహిక ధ్యానాలు, ప్రతి ఆదివారం జరిగే సత్సంగాలు, అలాగే వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించే వివిధ స్మారకోత్సవ కార్యక్రమాలలో పాల్గొనమని మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు ఆశ్రమంలో వ్యక్తిగత ఏకాంత ధ్యానవాసాలు మరియు నిర్వహించబడే ఏకాంత ధ్యానవాసాలలో, అలాగే సాధనా సంగమాలతో సహా ఇతర ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొనడానికి స్వాగతం (సాధనా సంగమాలు సాధారణంగా రోజుకు రెండుసార్లు సామూహిక ధ్యానాల సాధన, వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియల సమీక్ష, ఇంగ్లీష్, బెంగాలీ మరియు హిందీ భాషలలో ప్రవచనాలు, అనేక ఇతర కార్యక్రమాలను కూడి ఉంటాయి).

వివిధ ఆధ్యాత్మిక కార్యకలాపాలను నిర్వహించడంతో పాటు, ఆర్థిక స్తోమత తక్కువగా ఉన్న ప్రజలకు సహాయం చేయడానికి అనేక విద్య, వైద్య మరియు ఇతర సేవా కార్యక్రమాలను కూడా వై.ఎస్.ఎస్. దక్షిణేశ్వర్ ఆశ్రమం చురుకుగా నిర్వహిస్తుంది. వాటిలో భాగంగా, కోల్‌కతా మరియు పరిసర ప్రాంతాల్లో అనేక హోమియోపతి మరియు అల్లోపతి వైద్యశాలలు, పాథాలజీ ల్యాబ్‌లు మరియు పాఠశాలలు, కళాశాలల నిర్వహణ కూడా ఉంది.

వై.ఎస్.ఎస్. కు కొత్తవారా?

గృహ-అధ్యయన పాఠ్యక్రమం అయిన వై.ఎస్.ఎస్. పాఠాలు, మీరు ఊహించని విధంగా మీ జీవితంలో పరివర్తన చేకూర్చి, సమతుల్యము మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ఎలా సహాయపడతాయో మరింతగా తెలుసుకోండి.

para-ornament

కోల్‌కతాలో పరమహంస యోగానందగారి జీవితంతో ముడిపడి ఉన్న దర్శనీయ ప్రదేశాలు

మహాత్ములు నివసించిన ప్రదేశాలను సందర్శించడంలో గొప్ప ప్రయోజనం కూడా ఉంటుంది. …ఆ నేలపై నడిచిన దివ్యాత్ములు అక్కడ వదిలివెళ్ళిన ప్రకంపనలతో ఆ ప్రదేశాలు శాశ్వతంగా నిండి ఉంటాయి. ఈ భూమి అంతమయ్యే వరకు వారి ప్రకంపనలు అక్కడే ఉంటాయి. ఆత్మలు దైవానుసంధానం పొందిన ప్రదేశాలలో మీరు భగవంతునితో మరింత గొప్ప అనుసంధానాన్ని మరియు ప్రతిస్పందనను పొందుతారు. తరచుగా ఇటువంటి తీర్థయాత్రలు వ్యక్తుల జీవితాలను మెరుగైన దిశలోకి పూర్తిగా మారుస్తాయి.

— పరమహంస యోగానంద

పరమహంస యోగానందగారి ఈ పలుకుల నుండి ప్రేరణ పొంది, ఆ మాహాగురువుల ఉనికితో పవిత్రమైన వివిధ ప్రదేశాలకు పవిత్ర తీర్థయాత్ర చేయాలని మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. ఈ కోల్‌కతా నగరంలోనే పరమహంసగారు తమ తొలి సంవత్సరాలను గడపడం, తమ గురుదేవులైన శ్రీ శ్రీ స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి నుండి ఆధ్యాత్మిక శిక్షణ పొందడం, మరియు తమ గురుపరంపర అయిన మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు మరియు శ్రీ శ్రీ స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి ప్రపంచవ్యాప్తంగా క్రియాయోగ బోధనలను వ్యాప్తి చేయమని తమకు అప్పగించిన పవిత్ర బాధ్యతను నిర్వర్తించడానికి అమెరికాకు వెళ్ళే ముందు తమ విద్యాభాసాన్ని ఇక్కడే లాంఛనప్రాయంగా పూర్తి చేశారు.

4 గర్పార్ రోడ్ మరియు ఇతర సమీప ప్రదేశాలు

కోల్‌కతాలోని 4 గర్పార్ రోడ్‌లో ఉన్న పరమహంస యోగానందగారి కుటుంబ నివాసం, ప్రపంచం నలుమూలల నుండి భక్తులు సందర్శించే ఎంతో ప్రియమైన తీర్థస్థలం. అందులో రెండవ అంతస్తులోని అటక గది, ఆయన భగవంతునితో అనుసంధానమై, అనేక పారవశ్య అనుభవాలను, దివ్యదర్శనాలను పొందిన ఆయన పవిత్ర ఏకాంత స్థానం.

దీనికి దగ్గరలోనే 50, అమ్హరెస్ట్ వీధి ఉంది – ఇది శ్రీ రామకృష్ణ పరమహంసగారి ఉన్నత శిష్యులైన శ్రీ మాస్టర్ మహాశయుల నివాసం. పరమహంసగారు తమ ప్రారంభ సంవత్సరాల్లో తరచుగా దీన్ని సందర్శించేవారు. యోగానందగారి కుటుంబం ఈ ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఆయన తల్లిగారు పరమపదించిన ప్రదేశం కూడా ఇదే.

గర్పార్ రోడ్‌లోని పరమహంస యోగానందగారి కుటుంబ నివాసానికి సుమారు అర కిలోమీటరు దూరంలో రామ్మోహన్ రాయ్ రోడ్‌లో నాగేంద్ర మఠం ఉంది. ఇది భాదురీ మహాశయులు (యోగానందగారు తమ ఆధ్యాత్మిక మహాకావ్యం ఒక యోగి ఆత్మకథ లో ప్రస్తావించిన “గాలిలో తేలే సాధువు”) నివసించిన ప్రదేశం. గురుదేవులు తమ పాఠశాల నుండి తిరిగి వస్తున్నప్పుడు తరచుగా ఇక్కడ ఆగి ఆ మహాత్ముడిని దర్శించి, ఆధ్యాత్మిక చర్చలలో పాల్గొనేవారు.

సమీపంలోని మరొక ఆసక్తికరమైన ప్రదేశం – యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం, గర్పార్. యోగానందగారి బాల్య మిత్రుడు తులసీ నారాయణ్ బోస్ ఇంటికి ఆనుకుని ఉన్న ఈ ప్రదేశంలోనే మహాగురువులు తమ యవ్వనంలో తమ స్నేహితులతో కలిసి ధ్యానం చేసేవారు.

శ్రీరాంపూర్‌లో శ్రీయుక్తేశ్వర్‌గారి ఆశ్రమం మరియు ఇతర అనుబంధ ప్రదేశాలు

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఉన్న శ్రీరాంపూర్, పరమహంస యోగానందగారి జీవితంతో, ఆయన గురువు స్వామి శ్రీయుక్తేశ్వర్‌గారి జీవితంతో ముడిపడి ఉన్న అనేక ప్రదేశాలతో ధన్యమైంది.

ఇక్కడే శ్రీరాంపూర్‌లోనే ఆయన తమ కళాశాల సంవత్సరాల్లో ఆధ్యాత్మిక శిక్షణ కోసం తమ గురుదేవుల ఆశ్రమంలో ఎక్కువ సమయం గడిపారు. శ్రీయుక్తేశ్వర్‌గారి గౌరవార్థం, ఆశ్రమ ప్రాంగణంలోనే ఒక స్మృతి మందిరం నిర్మించబడింది. ఆశ్రమానికి సమీపంలోనే యోగానందగారి బాబయ్య శ్రీ శారదా ప్రసాద్ ఘోష్ గారి ఇల్లు ఉంది, అక్కడ యోగానందగారు కొంతకాలం నివసించారు. ఆ తరువాత యోగానందగారు నివసించిన గదిని ఆనందలోక అనే పవిత్ర మందిరంగా ఆయన బంధువు శ్రీ ప్రభాస్ చంద్ర ఘోష్ మార్చారు.

శ్రీరాంపూర్‌లోని రాయ్ ఘాట్ సందులో గంగానది ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, ఇది బాబాజీ ఆదేశం మేరకు స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు చేపట్టిన కైవల్య దర్శనం అనే గ్రంథాన్ని ఆయన పూర్తి చేసిన సందర్భాన, అమర గురువులు మహావతార్ బాబాజీ మరియు స్వామి శ్రీయుక్తేశ్వర్‌గార్ల సమావేశానికి ఇది మౌనసాక్షిగా నిలిచింది.

రాయ్ ఘాట్ సందు నుండి కొన్ని వందల మీటర్ల దూరంలోనే యోగానందగారు తమ కళాశాల సంవత్సరాల్లో నివసించిన స్థలం, ఒకప్పటి పాంథీ వసతి గృహం ఉంది. ఆ పాత కట్టడం శిథిలావస్థలో ఉండటంతో, స్థానిక పరిషత్తు దానిని కూల్చివేసింది.

దీనికి సమీపంలోనే శ్రీరాంపూర్ కళాశాల ఉంది, ఇందులో యోగానందగారు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సులో చేరిన మొదటి విద్యార్థులలో ఒకరై, తమ బి.ఏ డిగ్రీని పొందారు.

దక్షిణేశ్వర్ కాళీ ఆలయం

వై.ఎస్.ఎస్. దక్షిణేశ్వర్ ఆశ్రమానికి సుమారు కిలోమీటరు దూరంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాళీ ఆలయం ఉంది. భవతారిణి రూపంలో (తన భక్తులను భవసాగరాన్ని దాటించే స్వరూపం) కాళికాదేవి వెల్లకిలా పడుకొని ఉన్న శివుని వక్షస్థలంపై నిలబడి దర్శనమిచ్చే తొమ్మిది గుమ్మటాల ఆలయం కారణంగా దక్షిణేశ్వర్ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో అతినేర్పుగా చెక్కబడిన వెయ్యిరేకుల వెండిపద్మంపై జగన్మాత మరియు శివుని అందమైన విగ్రహాలు ఉంటాయి.

తమ ఆత్మకథలో, యోగానందగారు ఈ ఆలయానికి తాము చేసిన అనేక తీర్థయాత్రలను వర్ణించారు. తమ సోదరి రమ మరియు ఆమె భర్త సతీష్‌తో కలిసి సందర్శించినప్పుడు ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆయనకు ఒక పారవశ్య దర్శనం కలిగింది. యోగానందగారు జగన్మాతకు చేసిన తీవ్ర ప్రార్థనల ద్వారా నాస్తికుడైన సతీష్ మౌనసాధువుగా మారిపోయారు. కరుణామయి అయిన తల్లి రూపంలో భగవంతుని పట్ల పరమహంస యోగానందగారికి ఉన్న ప్రేమ తరచుగా ఆయనను ఈ ఆలయానికి ఆకర్షించేది. అక్కడ ఆయన వరండాలో, శ్రీ రామకృష్ణ పరమహంసగారి గదిలో, అలాగే శ్రీ రామకృష్ణ పరమహంస జ్ఞానోదయం పొందిన పంచవటిలోని మర్రి చెట్టు కింద అనేక గంటల పాటు ధ్యానం చేసేవారు. శ్రీ రామకృష్ణులు తమ జీవితంలోని చివరి 14 సంవత్సరాలు గడిపిన ఆలయ ప్రాంగణంలోని పవిత్రమైన గది, ఒక పూజామందిరంగా భద్రపరచబడింది; అక్కడ భక్తులు ధ్యానం చేయవచ్చు మరియు ఆయన ఉపయోగించిన అనేక వస్తువుల ప్రదర్శనను కూడా చూడవచ్చు.

గంగానది ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని, రోడ్డు, రైలు, మెట్రో మరియు ఫెర్రీ వంటి వివిధ రవాణా మార్గాల ద్వారా సులభంగా చేరవచ్చు. ఆలయ వాతావరణం సందర్శకులు ధ్యానంలో లోతుగా వెళ్లి విశ్వమాతతో ఐక్యం కావడానికి సహజమైన ఏర్పాటును అందిస్తుంది.

సమీపంలోని వై.ఎస్.ఎస్. ధ్యాన కేంద్రాలు

వై.ఎస్.ఎస్. దక్షిణేశ్వర్ ఆశ్రమం సమీపంలో ఉన్న మూడు ధ్యాన కేంద్రాలు క్రింద ఇవ్వబడ్డాయి:

ఒక నిర్దిష్ట ప్రదేశానికి సంబంధించిన కార్యక్రమ వివరాలు, అక్కడికి ఎలా చేరుకోవాలి మరియు ఇతర సంబంధిత సమాచారం గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి పైన తెలియజేసిన సంబంధిత లింక్‌లను సందర్శించండి.

ప్రతి వారం కార్యక్రమాలు

సామూహిక ధ్యానం

అందరూ పాల్గొనేలా ధ్యానం మరియు సత్సంగాలను ప్రతిదినం మేము అందిస్తున్నాం. ఈ సమావేశాలు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానం, భక్తి గీతాలాపన మరియు స్ఫూర్తిదాయక పఠనంతో కూడి ఉంటాయి.

ఆదివారం
ఉదయం 10:30 – మధ్యాహ్నం 12:00
ఆదివారం సత్సంగం (ఒక సంక్షిప్త ధ్యానంతో కూడి ఉంటుంది)
సాయంత్రం 4:30 – రాత్రి 8:00
సాయంత్రపు ధ్యానం
గురువారం
ఉదయం 7:00 – ఉదయం 8:00
ఉదయపు ధ్యానం
సాయంత్రం 5:30 – రాత్రి 9:00
సాయంత్రపు ధ్యానం
ఇతర రోజులు
ఉదయం 7:00 – ఉదయం 8:00
ఉదయపు ధ్యానం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
దీర్ఘ ధ్యానం
సాయంత్రం 5:30 – రాత్రి 7:00
సాయంత్రపు ధ్యానం
బాలల సత్సంగం

ఈ సమావేశాలలో 6 నుండి 12 సంవత్సరాల పిల్లలు, ఆసక్తికరమైన కార్యక్రమాల ద్వారా వై.ఎస్.ఎస్. బోధనలు మరియు జీవన విధానం గురించి నేర్చుకునే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాలలో కథ చెప్పడం, సంక్షిప్త నిర్దేశిత ధ్యానాలు మరియు ఇతర పారస్పరిక (interactive) బోధనా పద్ధతులు ఉంటాయి. మరింతగా తెలుసుకోండి.

ఆదివారం
ఉదయం 10:30 – ఉదయం 11:30

వై.ఎస్.ఎస్. సాధనా సంగమాలు

=వై.ఎస్.ఎస్.-సాధనా-సంగం-చెన్నై-ఆశ్రమం-2024-సన్యాసులు-మరియు-భక్తుల-సామూహిక-చిత్రం

వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియలపై తరగతులు, సామూహిక ధ్యానాలు, కీర్తనలు మరియు సన్యాసులచే స్ఫూర్తిదాయక ప్రసంగాలతో కూడిన ఈ అయిదు రోజుల కార్యక్రమం యోగదా సత్సంగ విద్యార్థులు పరమహంస యోగానందగారి బోధనలలో నిమగ్నమయ్యే ఒక అపూర్వ అవకాశాన్ని కలుగజేస్తుంది. వీటిలోని కొన్ని కార్యక్రమాలు క్రియాయోగ దీక్షా వేడుకలను కూడా కలిగి ఉంటాయి.

తాజా మార్పులు మరియు కార్యక్రమాల ప్రకటనలు పొందడానికి వై.ఎస్.ఎస్. ఇ-న్యూస్ కు నమోదు చేసుకోండి

రాబోయే ప్రత్యేక కార్యక్రమాలు మరియు దీర్ఘ ధ్యానాలు

నెలవారీ దీర్ఘ ధ్యానం
అక్టోబర్ 24, 2026, శనివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
నవంబర్ 14, 2026, శనివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
సాధనా సంగమం (హిందీ)

మరింతగా తెలుసుకోండి

నవంబర్ 18, 2026, బుధవారం – నవంబర్ 22, 2026, ఆదివారం

వార్తలు & ఫోటో గ్యాలరీ

మీ సందర్శనకు ఏర్పాట్లు చేసుకోండి

ఆశ్రమాన్ని పగటి సమయంలో సందర్శించాలనుకుంటున్నారా?

సామూహిక ధ్యానాలకు హాజరు కావడానికి, ఆశ్రమ తోటల ప్రశాంతతను ఆస్వాదించడానికి, లేదా దక్షిణేశ్వర్ చుట్టుప్రక్కల పరమహంస యోగానంద గారి జీవితానికి సంబంధించిన పవిత్ర ప్రదేశాలకు తీర్థయాత్ర చేయడానికి మిమ్మల్ని మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీకు ఆశ్రమం యొక్క నిర్దేశిత పర్యటన పట్ల, లేదా మహాగురువుల జీవితానికి సంబంధించిన ఆసక్తికర ప్రదేశాల సందర్శన పట్ల ఆసక్తి ఉంటే, దయచేసి అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి ఆహ్వాన కేంద్రాన్ని సంప్రదించండి.

సమయాలు:

  • ఆశ్రమ ప్రాంగణాలు – సందర్శకులందరికీ ప్రతిరోజూ ఉదయం 6:00 నుండి రాత్రి 9:00 గంటల వరకు తెరిచి ఉంటాయి
  • ఆహ్వాన కేంద్రం మరియు పుస్తకాల గది:
    • సోమవారం నుండి శనివారం – ఉదయం 9 నుండి మధ్యాహ్నం 4:00 గంటల వరకు
    • ఆదివారం – ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 4:00 గంటల వరకు

ఆశ్రమంలో వ్యక్తిగత ఏకాంత ధ్యానవాసం లేదా నిర్వహించబడే ఏకాంత ధ్యానవాసంలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకోండి.

వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. పాఠాల విద్యార్థులకు ఆశ్రమంలో ఐదు రోజుల వరకు బస చేయడానికి స్వాగతం. భక్తులు వ్యక్తిగత ఏకాంతవాసంలో లేదా నిర్వహించబడే ఏకాంత ధ్యానవాసాలలో ఏదో ఒకదానిలో పాల్గొని, తమను తాము పునరుత్తేజం చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నాము. ఈ ఏకాంత ధ్యానవాసాల సమయంలో భక్తులు రోజుకు రెండుసార్లు వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించే సామూహిక ధ్యానాలలో పాల్గొనవచ్చు, వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియలపై సమీక్షా తరగతులకు హాజరు కావచ్చు, యోగదా సత్సంగ బోధనల అధ్యయనం మరియు సాధనలో ఆధ్యాత్మిక సలహాలు మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు మరియు ప్రశాంతమైన ఆశ్రమ ప్రాంగణం యొక్క సహజవాతారణాన్ని ఆస్వాదించవచ్చు. అన్ని కలతలను మరియు భౌతిక ఆందోళనలను వదిలివేసి, శరీరం, మనస్సు మరియు ఆత్మలో విశ్రాంతి పొందగలిగే అద్భుతమైన అవకాశాన్ని కూడా ఈ ఏకాంత ధ్యానవాసాలు అందిస్తాయి.

మమ్మల్ని సంప్రదించండి

యోగదా సత్సంగ మఠం — దక్షిణేశ్వర్
21, U. N. Mukherjee Road
Dakshineswar
Kolkata - 700076
North 24 Parganas
West Bengal
India

ఇతరులతో పంచుకోండి