శ్రీ శ్రీ దయామాత రచనల నుండి సారాంశాలు

దేవుడిని వెతకడం యొక్క ప్రాముఖ్యత

ప్రపంచం అంతా మనల్ని నిరాశపరచవచ్చు లేదా మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ మనం దేవునితో మధురమైన మరియు సున్నితమైన అంతర్గత సంబంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే, మనం ఎప్పటికీ ఒంటరిగా లేదా ఉపేక్షించబడినట్లుగా భావించము. మన పక్కన ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు — నిజమైన స్నేహితుడు, నిజమైన ప్రేమ, నిజమైన తల్లి లేదా తండ్రి. మీరు ఏ రూపంలో దైవాన్ని ఊహించుకున్నారో, ఆ రూపంలోనే దేవుడే మీకు ఉంటాడు.

పారా-ఆభరణం

ప్రతి మనిషి హృదయంలో భగవంతుడు మాత్రమే పూరించగల శూన్యత ఉంటుంది. దేవుణ్ణి కనుగొనడం మీ ప్రాధాన్యతగా చేసుకోండి.

పారా-ఆభరణం

దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఒక నిశ్శబ్ద దేవాలయాన్ని ఇచ్చాడు, అక్కడ వేరెవరూ ప్రవేశించలేరు. అక్కడ మనం దేవునితో ఉండవచ్చు. దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరియు అది మన ప్రియమైనవారి నుండి మనల్ని దూరం చేయదు, కానీ మన సంబంధాలన్నింటినీ తీయగా చేస్తుంది, బలపరుస్తుంది మరియు శాశ్వతం చేస్తుంది.

అన్ని ప్రేమలు ఎక్కడినుండి వస్తాయి అనే మూలానికి నేరుగా వెళితే—పిల్లల పట్ల తల్లితండ్రుల ప్రేమ, తల్లిదండ్రుల కోసం బిడ్డ, భర్త కోసం భార్య, భార్య కోసం భర్త మరియు స్నేహితుని కోసం స్నేహితుని ప్రేమ—మన అన్ని ఊహలకు మించి సంతృప్తినిచ్చే నీటి బుగ్గ నుండి తాగుతాము.

పారా-ఆభరణం

మనిషికి ఐదు ఇంద్రియాలతో కూడిన మనస్సు మరియు శరీరం ఇవ్వబడ్డాయి, దాని ద్వారా అతను తన పరిమిత ప్రపంచాన్ని గ్రహించి, దానితో తనను తాను ఏకమని గుర్తించుకుంటాడు. కానీ మనిషి శరీరం లేదా మనస్సు కాదు; అతని స్వభావం ఆత్మ, అమరాత్మ. అతను తన ఇంద్రియ గ్రహణశక్తి ద్వారా శాశ్వత ఆనందాన్ని వెతకడానికి ఎంత తరచుగా ప్రయత్నిస్తాడో, అంతే తరచుగా అతని ఆశలు, అతని ఉత్సాహం, అతని కోరికలు, తీవ్ర నిరాశ మరియు ఆశాభంగానికి గురి అవుతాయి. భౌతిక విశ్వంలో ప్రతిదీ తప్పనిసరిగా అశాశ్వతమైనది మరియు నిరంతరం మారుతూ ఉంటుంది. మార్పుకు లోనయ్యేది దానిలో నిరాశ యొక్క విత్తనాలను కలిగి ఉంటుంది. కాబట్టి మన లౌకిక అంచనాలు అనే ఓడ ఇవాళో, రేపో భ్రమల గాధములో దిగబడిపోతుంది. కాబట్టి మనం భగవంతుడిని వెతకాలి, ఎందుకంటే ఆయన సమస్త జ్ఞానానికి, సమస్త ప్రేమకు, సర్వానందానికి, సమస్త తృప్తికి మూలాధారం. భగవంతుడు మన ఉనికికి మూలం, సర్వ ప్రాణులకు మూలం. మరియు మనము ఆయన స్వరూపములో చేయబడ్డాము. మనం ఆయనను కనుగొన్నప్పుడు, ఈ సత్యాన్ని మనం గ్రహిస్తాము.

దేవునితో ప్రేమపూర్వక సంబంధాన్ని పెంపొందించుకోవడం

దేవుణ్ణి ఒక పదంగానో, అపరిచితుడిగానో, లేదా ఒక్క గొప్ప వ్యక్తిగానో, తీర్పు ఇవ్వడానికి మరియు శిక్షించడానికి వేచి ఉన్నవాడిగా భావించవద్దు. మీరు దేవుడైతే మీ గురించి అందరూ ఎలా ఆలోచించాలీ అని అనుకుంటున్నారో అలా ఆయనను గురించి ఆలోచించండి.

పారా-ఆభరణం

మనలో ఉన్న పెద్ద బలహీనత ఏమిటంటే మనం దేవుడికి భయపడటం. మన ఆత్మలలో, మన హృదయాలలో, మన మనస్సాక్షిలో మనలను తీవ్రంగా ఇబ్బంది పెట్టే విషయాలను ఆయన ముందు గుర్తించడానికి మనము భయపడతాము. కానీ అది తప్పు. మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు మీరు ముందుగా వెళ్ళవలసినది మన ప్రియతమ దేవుని దగ్గరికి….ఎందుకు? ఎందుకంటే మీరు మీ స్వంత బలహీనతలను గుర్తించడానికి చాలా కాలం ముందే, దేవుడికి వాటి గురించి తెలుసు. మీరు ఆయనకు కొత్తగా ఏమీ చెప్పడం లేదు. మీరు భగవంతునికి మీ విషయాలన్నీ చెప్పినపుడు మాత్రమే ఆత్మకు అద్భుతమైన విముక్తి లభిస్తుంది.

పారా-ఆభరణం

భగవంతునితో నాకున్న సంబంధంలో నేను ఆ పరమాత్మని తల్లి రూపంలో ఊహించుకోవాలని అనుకుంటాను. తండ్రి ప్రేమ తరచుగా వివేకము ద్వారా మరియు పిల్లల యోగ్యత మీద ఆధారపడి ఉంటుంది. కానీ తల్లి ప్రేమ షరతులు లేనిది; ఆమె బిడ్డ విషయానికి వస్తే, ఆమె ప్రేమ, కరుణ మరియు క్షమకు రూపం….“మనం చిన్నపిల్లల లాగా తల్లి రూపాన్ని సంప్రదించవచ్చు మరియు మన అర్హతతో సంబంధం లేకుండా ఆమె ప్రేమను మన స్వంతం చేసుకోవచ్చు.”

పారా-ఆభరణం

హృదయం యొక్క నిశ్శబ్ద కేంద్రం నుండి మనం దేవుణ్ణి పిలిచినప్పుడు—ఆయనను తెలుసుకోవాలని మరియు ఆయన ప్రేమను అనుభవించాలనే సరళమైన, హృదయపూర్వకమైన కోరికతో ఆ పిలుపు ఉంటే—మనం తప్పకుండా ఆయన ప్రతిస్పందనను పొందుతాము. దైవిక ప్రియతమ యొక్క ఆ మధురమైన ఉనికి మన సర్వోన్నత వాస్తవికత అవుతుంది. ఇది పూర్తి పరిపూర్ణతను తెస్తుంది. ఇది మన జీవితాలను మార్చివేస్తుంది.

పారా-ఆభరణం

దేవుని హృదయాన్ని తాకేవి సుదీర్ఘ ప్రార్థనలే కావు. ఆత్మ లోతుల నుండి పదే పదే వ్యక్తీకరించబడిన ఒక ఆలోచన అయినా దేవుని నుండి అద్భుతమైన ప్రతిస్పందనను తెస్తుంది. ప్రార్థన అనే పదాన్ని ఉపయోగించడం కూడా నాకు ఇష్టం లేదు, ఇది దేవునికి ఒక అధికారిక, ఏకపక్ష విజ్ఞప్తిని సూచించినట్లు అనిపిస్తుంది. నాకు, దేవునితో సంభాషణ అంటే, ఆయనతో సన్నిహిత మరియు ప్రియమైన స్నేహితునితో మాట్లాడినట్లుగా మాట్లాడటం అనేది మరింత సహజమైన, వ్యక్తిగతమైన మరియు ప్రభావవంతమైన ప్రార్థన.

పారా-ఆభరణం

మిమ్మల్ని మీరు ఆయన బిడ్డగా లేదా ఆయన స్నేహితునిగా లేదా ఆయన భక్తుడిగా చూసుకోవడం ద్వారా దేవునితో మరింత వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోండి. అత్యంత దయ, అవగాహన మరియు ప్రేమగల వానితో మన అనుభవాలను పంచుకుంటున్నామన్న స్పృహతో జీవితాన్ని ఆస్వాదించాలి.

పారా-ఆభరణం

ప్రతి క్షణం ఆయన మనకు ఎంత దగ్గరగా ఉన్నారో గుర్తుంచుకోవడానికి మనం ప్రయత్నించినప్పుడు దేవునితో మన సంబంధం చాలా సరళంగా మరియు మధురంగా ​​మారుతుంది. దేవుని కోసం మన అన్వేషణలో మనం అద్భుత ప్రదర్శనలు లేదా అసాధారణ ఫలితాలను కోరుకుంటే, ఆయన మన వద్దకు అన్ని సమయాలలో వచ్చే అనేక మార్గాలను మనం చూడలేకపోతాము.

పారా-ఆభరణం

పగటిపూట, ఎవరైనా మీకు ఏదైనా సహాయం చేసినప్పుడు, ఆ బహుమతిని అందించడంలో దేవుని హస్తాన్ని చూడండి. ఎవరైనా మీ గురించి ఏదైనా మంచిగా చెప్పినప్పుడు, ఆ మాటల వెనుక ఉన్న దేవుని స్వరాన్ని వినండి. ఏదైనా మంచి లేదా అందమైనది మీ జీవితానికి ప్రసాదించిబడినప్పుడు, అది దేవుని నుండి వచ్చినట్లు భావించండి. మీ జీవితంలోని జరిగే ప్రతిదాన్ని దేవునితో ముడి వేయండి.

ధ్యానం యొక్క ప్రాముఖ్యత

నా దగ్గరకు, ఇక్కడ మరియు విదేశాలలో ప్రజలు వచ్చి, “అన్ని గంటలు ధ్యానంలో కదలకుండా కూర్చోవడం మీకు ఎలా సాధ్యము అవుతుంది? ఆ నిశ్చల కాలంలో మీరు ఏమి చేస్తారు?” అని అడుగుతుంటారు. ప్రాచీన భారతదేశంలోని యోగులు మత శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. కొన్ని శాస్త్రీయ పద్ధతుల ద్వారా మనస్సును నిశ్చలంగా మార్చడం సాధ్యమవుతుందని వారు కనుగొన్నారు. ఆ స్పష్టమైన చైతన్య సరస్సులో, మనలోని దేవుని ప్రతిరూపాన్ని మనం చూస్తాము.

పారా-ఆభరణం

మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డామని ప్రపంచ గ్రంథాలు చెబుతున్నాయి. ఇది అలా అయితే, ఆయన వలె మనం కళంకం లేనివారం మరియు అమరత్వం ఉన్న వారమని మనకు ఎందుకు తెలియదు? ఆయన ఆత్మ యొక్క స్వరూపులుగా మనల్ని మనం ఎందుకు గుర్తించలేము?…మళ్ళీ, గ్రంథాలు ఏమి చెబుతున్నాయి? “నిశ్చలంగా ఉండండి, నేను దేవుడునని తెలుసుకోండి.” “ఎడతెగకుండా ప్రార్థించండి.”…

స్థిరమైన శ్రద్ధతో యోగ ధ్యానాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా, మీతో మీరు అకస్మాత్తుగా ఇలా చెప్పుకునే సమయం వస్తుంది, “ఓహ్! నేను ఈ శరీరం కాదు, అయితే నేను ఈ ప్రపంచంతో సంవదించడానికి దీనిని ఉపయోగిస్తాను; కోపం, అసూయ, ద్వేషం, దురాశ, చంచలత్వం వంటి భావోద్వేగాలతో కూడిన ఈ మనస్సును నేను కాదు. నేను లోపల ఉన్న అద్భుతమైన చైతన్య స్థితిని. నేను దేవుని ఆనందమైన మరియు ప్రేమ యొక్క దైవిక రూపంలో సృష్టించబడ్డాను.”

పారా-ఆభరణం

చాలా చురుగ్గా ఉంటూనే మన అంతర్గత శాంతి లేదా సమతుల్యతను కోల్పోకుండా ఉండటానికి అనేక దారులు ఉన్నాయి. వీటిలో మొదటిది ప్రతి రోజును ధ్యానంతో ప్రారంభించడం. ధ్యానం చేయని వ్యక్తులు వారి మనస్సు లోపలికి వెళ్ళినప్పుడు చైతన్యాన్ని నింపే అద్భుతమైన శాంతి గురించి ఎప్పటికీ తెలుసుకోలేరు. మీరు ఆ శాంతి స్థితికి మీ ఆలోచనా మార్గం నుండి చేరలేరు; ఇది స్పృహ చిత్తము మరియు ఆలోచన ప్రక్రియలకు మించి ఉంటుంది. అందుకే పరమహంస యోగానందగారు మనకు బోధించిన యోగ ధ్యాన పద్ధతులు చాలా అద్భుతంగా ఉంటాయి; ప్రపంచంమంతా వాటిని ఉపయోగించడం నేర్చుకోవాలి. మీరు వాటిని సరిగ్గా ఆచరించినప్పుడు, మీరు అంతర్గత శాంతి సముద్రంలో ఈదుతున్నట్లు మీకు నిజంగా అనిపిస్తుంది. ఆ అంతర్గత ప్రశాంతతలో మీ మనస్సును ఉంచడంతో మీ రోజును ప్రారంభించండి.

పారా-ఆభరణం

ధ్యానంతో స్వీయ-మరుపు వస్తుంది, దేవుడితో ఒకరి సంబంధాన్ని మరియు ఇతరులలో భగవంతుడిని సేవించడం గురించి ఎక్కువగా ఆలోచించడం చేస్తారు. భగవంతుని అమరత్వం, నిత్య చైతన్యం కలిగిన దివ్య స్వరూపంలో తాను సృష్టించబడ్డానని స్మరించుకోవాలంటే భక్తుడు తన చిన్న స్వయాన్ని మరచిపోవాలి. “నిశ్చలంగా ఉండు, నేనే దేవుడునని తెలుసుకో” అని బైబిలు చెబుతోంది. ఇది యోగం…ఒక వ్యక్తి తన చైతన్యమును ఉన్నతమైన గ్రహణ కేంద్రాలలో ఉంచినపుడే అతను భగవంతుని స్వరూపంలో సృష్టించబడ్డాడని గ్రహించగలడు.

పారా-ఆభరణం

అందరూ అత్యవసరంగా కోరుకునే శాంతి మరియు సామరస్యం భౌతిక వస్తువుల నుండి లేదా ఏదైనా బాహ్య అనుభవాల నుండి పొందలేము…. మీ జీవితంలోని బాహ్య పరిస్థితులలో సామరస్యాన్ని తీసుకురావడం యొక్క రహస్యం ఏమిటంటే, మీ ఆత్మతో మరియు దేవునితో అంతర్గత సామరస్యాన్ని నెలకొల్పడం. ప్రపంచం నుండి వైదొలగడానికి, మీ మనస్సును అంతర్గతీకరించడానికి మరియు భగవంతుని ఉనికిని అనుభూతి చెందడానికి ప్రతిరోజూ కొంత సమయం కేటాయించండి. అదే ధ్యానం యొక్క ఉద్దేశ్యం. మీరు అఘదంగా ధ్యానం చేసి, అంతర్గతంలో ఉన్న దేవుని శాంతితో మీ చైతన్యమును సమన్వయం చేసుకున్న తర్వాత, బాహ్య ఇబ్బందులు మీకు అంత ఒత్తిడిని కలిగించవని మీరు కనుగొంటారు. మీరు మీ ప్రశాంతతను కోల్పోకుండా మరియు అతిగా స్పందించకుండా వాటితో వ్యవహరించగలరు. “సరే, నేను ఈ అడ్డంకిని ఎదుర్కొంటాను మరియు దానిని అధిగమిస్తాను” అని అనుకోవడానికి మిమ్మల్ని అనుమతించే అంతర్గత బలం మీకు ఉంటుంది.

సమతుల్య జీవితాన్ని గడపడం

మనలో ప్రతి ఒక్కరిలో ప్రపంచంలోని అల్లకల్లోలం యొక్క చొరబాట్లను అనుమతించని నిశ్శబ్ద ఆలయం ఉంది. మన చుట్టూ ఏమి జరిగినా, మన ఆత్మలోని నిశ్శబ్ద ఆలయంలోకి ప్రవేశించినప్పుడు, మనం దేవుడి, ఆశీర్వదింపబడిన సన్నిధిని అనుభవిస్తాము మరియు ఆయన శాంతి మరియు శక్తిని పొందుతాము.

పారా-ఆభరణం

అనేక సమస్యలతో—నిరాశలు, దుఃఖాలు, నిరుత్సాహాలతో బాధపడే వ్యక్తులను చూసినప్పుడు—నా హృదయం వారి కోసం బాధపడుతుంది. ఇలాంటి అనుభవాల వల్ల మనుషులు ఎందుకు బాధపడుతున్నారు? ఒక కారణం: వారు ఎక్కడి నుండి వచ్చారో ఆ దైవాన్ని మరచిపోవడం. మీ జీవితంలో ఉన్న లోటు ఒక్కటే, భగవంతుడు, అని మీరు ఒక్కసారి గ్రహించి, ప్రతిరోజూ ధ్యానంలో భగవంతుని చైతన్యముతో మిమ్మల్ని మీరు నింపుకోవడానికి కృషి చేయడం ద్వారా ఆ లోటును తొలగించుకోవడానికి మీరు సిద్ధపడితే, పూర్తిగా సంపూర్ణంగా ఉండే సమయం వస్తుంది. ఎంత పూర్తిగా సంతృప్తి అంటే, ఏదీ మిమ్మల్ని కదిలించదు లేదా భంగపరచదు.

పారా-ఆభరణం

కష్టాలు మనలను నాశనం చేయడానికి లేదా శిక్షించడానికి రావు, కానీ మన ఆత్మలలోని అజేయతను ప్రేరేపించడానికి సహాయపడతాయి….మనం అనుభవించే బాధాకరమైన పరీక్షలు ఆశీర్వాదంతో ముందుకు చాచిన దేవుడి చేతి నీడ మాత్రమే. ద్వంద్వత్వంతో కూడిన సమస్యాత్మకమైన ఈ మాయ నుండి మనల్ని బయటకు తీసుకురావాలని భగవంతుడు చాలా ఆతురతతో ఉన్నాడు. ఆయన మనము దాటడానికి అనుమతించే ఏలాంటి ఇబ్బందులైన, ఆయన వద్దకు త్వరగా తిరిగి వెళ్ళడాని త్వరితము చేస్తాయి.

పారా-ఆభరణం

ఆధ్యాత్మికంగా సమతుల్యత ఉన్న వ్యక్తి నిజంగా విజయం సాధిస్తాడు. నేను ద్రవ్య విజయాన్ని సూచించడం లేదు; దానికి అర్థంలేదు. ఇది నా అనుభవమే అలాగే పరమహంసగారిది కూడా: నేను భౌతికంగా విజయవంతమైన మానవులను కలుసుకున్నాను, వారు భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక వైఫల్యాలు–ఒత్తిడితో ఉన్నారు; అంతర్గత శాంతి మరియు ప్రేమను ఇచ్చే మరియు స్వీకరించే సామర్థ్యం లేకపోవడం; వారి కుటుంబాలతో, లేదా ఇతర మానవులతో లేదా దేవునితో సామరస్య సంబంధం కలిగి ఉండలేరు. ఒక వ్యక్తి యొక్క విజయాన్ని అతని వద్ద ఉన్నదానితో కొలవలేము, అతను ఎలాంటి వాడో మరియు అతను తనదానిలో ఇతరులకు ఏమి ఇవ్వగలడో అనే వాటితో మాత్రమే తెలుసుకొగలము.

పారా-ఆభరణం

ఈ ప్రపంచంలో మరేదీ చేయలేని విధంగా మన బాహ్య జీవితాన్ని ఆత్మ యొక్క అంతర్గత విలువలతో సమలేఖనం చేయడానికి ధ్యానం సహాయపడుతుంది. ఇది కుటుంబ జీవితం లేదా ఇతరులతో సంబంధాల నుండి వేరుచేయదు. ఇది మనల్ని మరింత ప్రేమగా, మరింత అవగాహన కలిగి ఉండేట్లుగా చేస్తుంది—ఇది మన భర్త, మన భార్య, మన పిల్లలు, మన పొరుగువారికి సేవ చేయాలనే కోరికను కలిగిస్తుంది. శ్రేయస్సు కోసం మన కోరికలలో ఇతరులను చేర్చుకున్నప్పుడు, మన ఆలోచనలను “నేను మరియు నన్ను మరియు నాది” కంటే విస్తరించినప్పుడు నిజమైన ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది.

పారా-ఆభరణం

పరమహంస యోగానందగారు మనకు చూపించిన భగవంతునిలోని సమతుల్య జీవితం ఎంత అద్భుతంగా భిన్నమైనది మరియు సంతృప్తికరంగా ఉంది….మీరు భగవంతుడిని చేరుకోవాలనుకున్నప్పుడు, మీరు చాలా గంభీరంగా ఉండాలనే భావన ప్రజలలో ఉంది! కానీ అలాంటి తప్పుడు భక్తి ఆత్మకు సంబంధించినది కాదు. పరమహంసగారితో సహా నేను కలుసుకున్న మరియు సహవసించిన అనేక మంది సాధువులు ఆనందంగా, ఆకస్మికంగా, చిన్నపిల్లల వలె ఉన్నారు. నా ఉద్దేశ్యం పిల్లతనపు—అపరిపక్వత, బాధ్యతారాహిత్యం కాదు; నా ఉద్దేశ్యం చిన్నపిల్లలాంటిది—సులభమైన ఆనందాలను ఆస్వాదించగలవాడు, ఆనందంతో జీవించేవాడు. నేడు పాశ్చాత్య నాగరికతలో సాధారణ విషయాలను ఎలా ఆనందించాలో ప్రజలకు తెలియదు. వారు తమ అభిరుచులలో ఏదీ సంతృప్తి చెందనంతగా మందకొడిగా మారారు: బాహ్యంగా అతిగా ప్రేరేపింపబడి, ఆకలితో మరియు లోపల ఖాళీగా, వారు తప్పించుకోవడానికి త్రాగడము లేదా మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారు. సమకాలీన సంస్కృతి విలువలు అనారోగ్యకరమైనవి, అసహజమైనవి; అందుకే అది ముక్కలుగా మారని చాలా మంది, నిజమైన సమతుల్య వ్యక్తులను మరియు కుటుంబాలను ఉత్పత్తి చేయడంలో విఫలమైంది…. మనం జీవితంలోని సాధారణ ఆనందాలకు తిరిగి వెళ్దాం.

శాంతి మరియు ప్రపంచ సామరస్యానికి మార్గం

అందరూ అత్యవసరంగా కోరుకునే శాంతి మరియు సామరస్యం భౌతిక వస్తువుల నుండి లేదా ఏదైనా బాహ్య అనుభవం నుండి పొందలేము; అది సాధ్యం కాదు. బహుశా అందమైన సూర్యాస్తమయాన్ని చూడటం లేదా పర్వతాలు లేదా సముద్రతీరానికి వెళ్ళడం ద్వారా మీరు తాత్కాలిక ప్రశాంతతను అనుభవించవచ్చు. కానీ మీతో మీరు సామరస్యపూర్వకంగా ఉండకపోతే చాలా ఉత్తేజకరమైన పరిసరాలు కూడా మీకు శాంతిని ఇవ్వవు.

మీ జీవితంలోని బాహ్య పరిస్థితులలో సామరస్యాన్ని తీసుకురావడం యొక్క రహస్యం ఏమిటంటే, మీ ఆత్మతో మరియు దేవునితో అంతర్గత సామరస్యాన్ని నెలకొల్పడం.

వివిధ దేశాల్లోని ప్రజలు శాంతముగా ఉండకపోతే దేశాల మధ్య శాంతి గురించి మాట్లాడటం అవాస్తవం. మరియు వారు తమ పొరుగువారితో—లేదా వారి స్వంత ఇంటి సభ్యులతో కూడా శాంతిగా ఉండలేరు—వారు తమతో తాము శాంతిగా ఉండకపోతే. ఇది వ్యక్తితో ప్రారంభం కావాలి. ప్రపంచవ్యాప్తంగా నా పర్యటనలలో ప్రతి దేశంలోని ప్రజలు నన్ను అడిగిన మొదటి ప్రశ్నలలో ఒకటి, “నేను శాంతిని ఎలా పొందగలను?” నేను వారితో ఇలా చెప్తున్నాను: “దేవుని సన్నిధిలోకి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు.” రోజువారీ ధ్యానం—పరమహంస యోగానందగారు తీసుకువచ్చిన ఈ బోధనల యొక్క పునాది—ఒత్తిడికి గురైన వ్యక్తులు మరియు విచ్ఛిన్నమైన కుటుంబాల జీవితాలలో ఆధ్యాత్మిక సమతుల్యతను పునరుద్ధరించడానికి మరియు మన ప్రపంచ గృహంలోని పెద్ద కుటుంబంలో శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించే విలువలను పునరుజ్జీవింపజేయడానికి మార్గం.

మనం జ్ఞాన నేత్రాలతో మన చుట్టూ చూస్తే, ప్రపంచ పరిస్థితులు మానవాళిని దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకునేలా బలవంతం చేయబోతున్నాయని స్పష్టమవుతుంది. గత శతాబ్దాలలో చాలా పెద్దదిగా కనిపించిన ఈ భూగోళం, తులనాత్మకంగా చెప్పాలంటే, నారింజ పరిమాణానికి తగ్గించబడింది అని అనుకోవచ్చు. ఇకపై మనం ప్రపంచంలోని ఇతర ప్రజలు మరియు సంస్కృతుల నుండి వేరుగా భావించలేము; ఆధునిక కమ్యూనికేషన్‌లు మరియు ప్రయాణ రీతులు నిజంగా మనందరినీ ముఖాముఖి తీసుకువచ్చాయి, ఒకే ఇంటి సభ్యుల లాగా తప్పనిసరిగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మరియు ఒకరితో ఒకరు కలిసిపోవడానికి ఆధ్యాత్మిక పరిపక్వతను పెంపొందించుకోవడం చాలా అవసరం. పక్షపాతాలు మరియు చిన్న మనస్తత్వం—మానవ స్వభావం యొక్క రెండు గొప్ప బలహీనతలను—మనము వదలి పెట్టాలి…

గతంలో కంటే ఇప్పుడు మనం ఈ సత్యాన్ని అంగీకరించాలి: ఇది ఒక ప్రపంచం. ఇది అన్ని రకాల వ్యక్తులతో రూపొందించబడింది, వారి అన్ని రకాల భౌతిక రూపాలు, మనస్తత్వాలు, ఆసక్తులు, ప్రేరణలు ఉన్నాయి. కానీ మానవ వ్యక్తిత్వం యొక్క ఈ అంతులేని వైవిధ్యమైన పుష్పాలను ఏకం చేయడంలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది, ఆ సూత్రం దారంలా ఈ మానవ పూవులన్నిటినీ మాలగా చేస్తుంది–అదే దేవుడు. ఆయన దృష్టిలో ఎవరూ గొప్పవారు కాదు, తక్కువ కాదు; మనమందరం ఆయన బిడ్డలం. మనం ఎక్కడ పుట్టాము, మనం ఏ మతాన్ని అనుసరిస్తాము, లేదా మన చర్మం యొక్క రంగు ఏమిటి అనే దానిపై భగవంతుడికి కనీసం ఆసక్తి లేదు–మన ఆత్మలు ఎరుపు, నలుపు, పసుపు లేదా తెలుపు దుస్తులు ధరించినా ముఖ్యమైనది ఏమిటి? ఆయన అవేవీ పట్టించుకోరు. కానీ మనం ఎలా ప్రవర్తిస్తామో అనే దానిపై ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. ఆయన తన పిల్లలను నిర్ధారించే ఏకైక ప్రమాణం. మనము పక్షపాతములతో నిండినట్లయితే, మనము పక్షపాతములను పొందుతాము. మనలో ద్వేషం నింపబడితే, మనం కూడా అదే విధంగా ద్వేషాన్ని పొందుతాము. ఏదైనా సమూహం పట్ల మనలో పగ నిండితే, మనం శత్రుత్వపు విత్తనాలను నాటడం ఖాయం…

వైవిధ్యమైన నమ్మకాలు మరియు అభ్యాసాల అంతర్లీనంగా, అన్ని మతాలలోని ఒకే విధమైన ఆధ్యాత్మిక భావనలు ఉన్నాయి… పరమహంసగారు ఈ విశ్వవ్యాప్త, ప్రాథమిక సత్యాల వైపు భక్తుల దృష్టిని ఆకర్షించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించారు—కేవలం నమ్మకం మరియు ప్రవచనానికి సంబంధించిన అంశంగా కాకుండా, ఆచరణాత్మకంగా వారి రోజువారీ జీవితంలో ఆచరించడం యొక్క ఆవశ్యకత. వీటిలో అత్యంత ముఖ్యమైనది—యుగాలుగా మానవాళి యొక్క రక్షకులచే బోధించబడినది—ప్రతి వ్యక్తి దైవంతో ప్రత్యక్షంగా, వ్యక్తిగతంగా ఐక్యమవ్వడం—…

ఆ చైతన్యంలో నివసించడానికి, మన వాస్తవ స్వభావాన్ని గుర్తుంచుకోవడానికి మనం రోజువారీ ధ్యానం ద్వారా ఎంతగా కృషి చేస్తామో, క్రీస్తులో ఉన్న మరియు మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ దైవత్వాన్ని అంత ఎక్కువగా వ్యక్తపరుస్తాము. ఇది సెల్ఫ్-రియలైజేషన్ సందేశం. ఇది భారతదేశం అంగీకరించగల, క్రైస్తవులు అంగీకరించగల, అన్ని మతస్తులు అంగీకరించగల సందేశం. ఇది ఏ విశ్వాసం యొక్క బోధనకు విరుద్ధంగా లేదు.

ఆలోచనకు అద్భుతమైన శక్తి ఉంది. ఆలోచన నుండే అన్ని చర్యలు పుట్టుకొస్తాయి. ఈ పరిమిత ప్రపంచంలోని ప్రతిదీ ఆలోచన నుండి వస్తుంది. ఇది విశ్వంలో అత్యంత శక్తివంతమైన శక్తి, జీవితాలను, సంఘాలను మరియు దేశాలను ప్రభావితం చేసే శక్తి కాబట్టి, మన ఆలోచనలు ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా ఉండటం ఎంతో ముఖ్యమైనది. నేడు కోట్లాది మంది ప్రజలు ప్రతికూలంగా ఆలోచిస్తూ, ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మనమందరం మన తోటి జీవుల కోసం ప్రార్థించడంలో చురుకుగా పాల్గొనడం మనకు మరియు మన సమస్త గ్రహానికి మంచిది. తగినంత మంది ఆత్మలు పాల్గొన్నప్పుడు, మంచితనం, ప్రేమ, కరుణ మరియు సానుకూల ప్రవర్తన యొక్క వారి ఆలోచన-ప్రకంపనలు ఒక శక్తివంతమైన శక్తిని ఉత్పత్తి చేస్తాయి, ఇది ప్రపంచవ్యాప్తంగా జీవితాలను మార్చే సత్తను కలిగి ఉంటుంది.

గురువు: పరమహంస యోగానందగారి స్మరణ

నేను పదిహేడేళ్ల అమ్మాయిని, జీవితం నాకు ఎక్కడకు వెళ్ళని ఒక పొడవైన ఖాళీ నడవగా అనిపించింది. దేవుని కోసం ఎడతెగని ప్రార్థన నా సృహలో తిరుగుతూ ఉండేది, నా అడుగులను ఒక అర్థవంతమైన జీవితము వేపు నడిపించమని, ఆ జీవితంలో ఆయనను అన్వేషిస్తూ, ఆయనకు సేవ చేయగలగాలని.
1931లో నేను సాల్ట్ లేక్ సిటీలో రద్దీగా ఉండే పెద్ద ఆడిటోరియంలోకి ప్రవేశించినప్పుడు, వేదికపై నిలబడి ఉన్న పరమహంసగారిని చూసినప్పుడు, దేవుని గురించి ప్రామాణికంగా ఆయన మాట్లాడుతున్నట్లుగా నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. నేను పూర్తిగా నిశ్చేష్టురాలైపోయాను—నా శ్వాస, ఆలోచనలు, సమయం, తాత్కాలికంగా నిలిపివేయబడినట్లు అనిపించింది. నాపై వర్షిస్తున్న ఆశీస్సులపట్ల ప్రేమ, కృతజ్ఞతతో కూడిన గుర్తింపు, నాలో పెరుగుతున్న ఒక దృఢవిశ్వాసం యొక్క అవగాహన కలిగించింది: “నేను దేవుణ్ణి ప్రేమించాలని ఎప్పుడూ కోరుకున్నట్లే ఆయన భగవంతుడిని ప్రేమిస్తున్నాడు. ఆయనకు దేవుడు తెలుసు. ఆయనను నేను అనుసరిస్తాను.”
నేను గురుదేవులతో కలిసి ఉన్న ఆ ఆశీర్వదించబడిన సంవత్సరాలలో, నేను పరమహంస యోగానందగారిని కేవలం మనిషిగా ఎప్పుడూ చూడలేదు. ఆయన అటువంటి దైవత్వాన్ని వ్యక్తపరిచారు; నేను ఆయనను వర్ణించగలిగిన ఏకైక మార్గం అదే….ఆయన నాకు పవిత్ర గ్రంథపు పుటల నుండి సాక్షాత్తు బయటికి వచ్చిన వ్యక్తిలా అనిపించారు. అంత భగవంతుని మత్తు, ప్రేమ, సార్వజనీన స్వభావం! ఆయనకు ఇవ్వబడిన కార్యమును అమలు చేయడానికి అలాంటి దైవిక వ్యక్తి అవసరం: పాశ్చాత్య దేశాలకు మరియు ప్రపంచానికి, భగవంతునితో అనుసంధానం చేసే శాస్త్రాన్ని తీసుకురావడం, మనం దాన్ని క్రియాయోగం అని అంటాము. పై సారాంశాలు యోగదా సత్సంగ పత్రిక నుండి మరియు మా ఆన్‌లైన్ పుస్తక కోశంలో అందుబాటులో ఉన్న క్రింది పుస్తకాలలోనివి.

ఇతరులతో షేర్ చేయండి