ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం గురించి స్వామి చిదానంద గిరి గారి సందేశం

3 మార్చి, 2022

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులైన శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు ఈ సందేశాన్ని శ్రీ పరమహంస యోగానందగారి అనుచరులతోను మరియు స్నేహితులతోను పంచుకోమని చెప్పారు:

“ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఈ గంభీర సమయంలో, అపాయంలో ఉన్నవారి ప్రాణాల కోసం, వారి కుటుంబాల కోసం, వారి శ్రేయస్సు కోసం మరియు ప్రపంచవ్యాప్తంగా సామరస్యం మరియు శాంతి కోసం గాఢంగా ప్రార్థించడం కొనసాగించమని సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ మరియు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులకు మరియు స్నేహితులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మానవులంతా ఒకే కుటుంబం మరియు ఒక దేశానికి వ్యతిరేకంగా జరిగే దౌర్జన్యపూర్వక చర్యలు చివరకు మనందరి మీదా ప్రభావం చూపుతాయి. నాతోను మరియు పరమహంస యోగానందగారి ఆశ్రమాలలోని సన్యాసులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేయడం ద్వారా భగవంతుని కాంతి – మన ప్రపంచ కుటుంబంలోని సభ్యులందరి ఆత్మల ద్వారా, వివేకము ద్వారా మరియు సద్భావనల ద్వారా పనిచేసి – అమాయకుల చుట్టూ ఒక రక్షణ కవచాన్ని మరియు అజ్ఞానమైన చొరవతో ఈ హింస, విధ్వంసాలతో విస్ఫోటనం కలిగిస్తున్న మానవ స్వభావ చీకటి ప్రేరణలకు స్వస్థత చేకూర్చే ప్రతిఘటనశక్తిని ఏర్పరుస్తుంది.

“ధ్యానంలో దివ్యానుసంధానం వలన జనించే ఏకాగ్రమైన ప్రార్థనలు మరియు భగవంతుని అనుశ్రుతిలోని ఆలోచనలు మరియు శక్తి హానికరమైన మార్గంలో ఉన్నవారికి రక్షణను, ధైర్యాన్ని మరియు లోపలి శక్తిని అందిస్తాయి మరియు దేశాల నాయకులకు జ్ఞానాన్ని మరియు సరైన అవగాహనను అందిస్తాయి. ప్రపంచ వ్యవహారాల్లోని ఇప్పటి భయానక సమయంలో ప్రస్తుత పోరాటంలో బాధపడుతున్నవారికి మరియు ప్రపంచ కుటుంబాన్ని విశ్వ ఆధ్యాత్మిక సూత్రాలకు మరియు భగవంతుని జీవన మార్గాలకు అనుగుణంగా జాగృతం చేయడానికి మనమందరం ఈ శక్తివంతమైన జోక్యాన్ని ఉపయోగిద్దాం. ఎప్పటికీ నిలిచి ఉండే శాంతి మరియు సామరస్యానికి ఇదే శాశ్వత మార్గం.”

పరమహంస యోగానందగారు నేర్పించిన స్వస్థత ప్రక్రియను వ్యక్తిగత మరియు సామూహిక ధ్యానముల ముగింపు సమయంలో అభ్యాసం చేయవలసి ఉంటుంది. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులైన స్వామి చిదానందగారి ఈ చిన్న వీడియో చూసి, వారితో పాటు ఈ అభ్యాసంలో పాల్గొనమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ప్రపంచానికి స్వస్థతను, శాంతిని చేకూర్చే ప్రార్థన యొక్క బ్రహ్మాండమైన శక్తిని గురించి వారు మాట్లాడతారు.

మానవ పరిణామ క్రమముపై యోగానందగారి జ్ఞాన దూరదృష్టి

ప్రపంచ ఐక్యత కోసం పునాదిని నిర్మించడానికి మనమందరం తీసుకోవలసిన ఆధ్యాత్మిక సోపానాలపై పరమహంస యోగానందగారి జ్ఞాన దూరదృష్టిని కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాం. తద్వారా మానవులు గొప్ప అవగాహన, సహకారం మరియు భద్రత దిశగా పురోగమిస్తారు.

పరమహంస-యోగానందగారి-జ్ఞాన-దూరదృష్టి

రెండవ ప్రపంచ యుద్ధసమయంలో పరమహంస యోగానందగారి ప్రసంగములు మరియు సాహిత్యం నుండి:

సాంకేతిక విజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వల్ల కలిగే విధ్వంసకర పరిణామాలను ఈ యుద్ధం ద్వారా ప్రజలు తెలుసుకుంటారు…అది ముగిశాక, ఎవరైనా యుద్ధం మొదలుపెట్టాలనుకుంటేనే ప్రపంచ విధ్వంసం గురించి చాలా భయం ఆవరిస్తుంది, మిగిలిన ప్రపంచమంతా ఆ దేశంపై పడతారు. నా కాలానికి చాలా ముందు జరుగబోయే విషయాలను నేను మీకు చెబుతున్నాను.

ప్రపంచంలోని ప్రతి పౌరునికి భగవంతునితో అనుసంధానమెలా సాధించాలో (మేధస్సు ద్వారా మాత్రమే ఆయన్ని తెలుసుకోవడం కాకుండా) నేర్పగలిగితే, అంతకు ముందులేని శాంతి ఏలుబడిలోకి వస్తుందని నేను నమ్ముతున్నాను. నిలకడగా ధ్యానాన్ని చేయడంవల్ల భగవంతుడిని తెలుసుకుంటారు. మీ హృదయం మానవులందరినీ ఆలింగనం చేసుకునేలా తయారవుతుంది.

యుద్ధాలు తగ్గాలంటే ప్రపంచం ఇంకా చాలా చాలా ఆధ్యాత్మికంగా ఉండవలసి ఉంటుంది. ప్రేమ, అంతర్జాతీయ సోదరత్వం, శాంతి, ఆనందం, పంచుకోవడం – ఇవి మాత్రమే ప్రపంచంలో శాంతిని తీసుకువస్తాయి.

మీ దేశాన్ని ప్రేమించినట్లుగా ప్రపంచాన్ని ప్రేమిస్తామని, మీ కుటుంబాన్ని ప్రేమించినట్లుగా మీ దేశాన్ని ప్రేమిస్తామని నిశ్చయించుకోండి. ఈ విధమైన అవగాహన ద్వారా నాశనం చేయలేని జ్ఞానపునాదిపై ప్రపంచ కుటుంబాన్ని ఏర్పాటు చేయడానికి మీరు సహాయం చేయగలుగుతారు.

ప్రతి రోజు ఆయనను గురించి ధ్యానించడానికి విడిగా కొంత సమయం ఏర్పాటు చేసుకోండి. భగవంతుడితో ఎప్పుడైతే అనుసంధానం పొందుతారో, మీ గురించి మీరు ఎలా భావిస్తారో అలాగే ప్రతి ఒక్కరు మీ స్వంతమనే భావన కలుగుతుంది. అతడు నావాడు కాదు అనే భావాన్ని ఎవరూ కలిగించలేరు. మానవులందరు భగవంతుడి బిడ్డలే. ఆయన నా తండ్రి.

గొప్ప మహాత్ములు ఉదాహరణగా నిలుస్తారు. వారి శరీరాలకు పరిమితులున్నా, అనంతసాగరంలో తాము భాగమని ; వ్యక్తిగత రూపాలన్నీ విశ్వసాగరంలోని అలలనీ వారు లోపల గ్రహించగలిగారు. ఈ ప్రపంచంలో మనం ఒక చిన్న కుటుంబంలోని వారమని మనకు మనం హద్దులు ఏర్పరచుకుంటాం. మన ఇరుగుపొరుగు వారిని ప్రేమించినప్పుడు, మనం గొప్పవారమవుతాం. మన దేశాన్ని మనం ప్రేమించినప్పుడు ఇంకా గొప్పవారమవుతాం. అన్ని దేశాలవారిని మనం ప్రేమించినప్పుడు ఇంకా చాలా గొప్పవారమవుతాం. శరీరం విడిచాక మనం భగవంతుడితో ఉన్నప్పుడు లేదా గాఢమైన ధ్యానంలో మనం శరీరంలోనే ఉన్నప్పటికీ, సముద్రమే కెరటమనీ, కెరటమే సముద్రమనీ మనం నిజంగా గ్రహిస్తాము.

ఈ జీవనఛాయల అడుగున భగవంతుని అద్భుత కాంతి ఉన్నది. ఈ విశ్వము ఆయన సాన్నిధ్యపు బ్రహ్మాండమైన మందిరము. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో, అప్పుడు ప్రతిచోటా ఆయన వైపు ద్వారాలు తెరుచుకుంటున్నట్లు తెలుసుకొంటారు. ఆయనతో అనుసంధానం పొందినప్పుడు ప్రపంచంలోని ఏ వినాశకర పరిణామాలు మీ నుండి శాంతిని మరియు ఆనందాన్ని తీసివేయలేవు.

అభ్యాసం కోసం ప్రతిజ్ఞ: “జీవితంలో మరియు మరణంలో, రోగములో, క్షామములో, పీడలలో లేదా పేదరికంలో నేను ఎల్లప్పుడూ నిన్నే పట్టుకొని ఉండెదను గాక. బాల్యము, యవ్వనము, వయస్సు మరియు ప్రపంచ ఉపద్రవాల వలన కలిగే ఏ మార్పులు తాకకుండా, నేను మరణంలేని ఆత్మనని గ్రహించేలా నాకు సహాయం చెయ్యి.”

మా వెబ్‌సైట్‌లోని అదనపు సాధనములు

మా వెబ్ పేజీ “సవాలు చేసే ఈ కాలానికి ఆధ్యాత్మిక కాంతి”లో భయాన్ని మరియు ప్రతికూలతను జయించడానికి, శ్రీ పరమహంస యోగానందగారు, స్వామి చిదానందగారు మరియు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క పూర్వ అధ్యక్షుల నుండి ఆచరణాత్మక సాధనములను మరియు ప్రపంచ పరిస్థితుల్లో మీరొక ఆశాజనకమైన దృష్టి కోణాన్ని ఎలా ఏర్పరచుకోవాలో తెలుసుకొంటారు. పరమహంస యోగానందగారు ఆధ్యాత్మిక ప్రయత్నంగా ప్రారంభించిన, ఒక సముదాయమైన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క ప్రపంచవ్యాప్త ప్రార్థన కూడలిలో పాల్గొనడానికి దయచేసి పరిశీలించండి.

సవాలు చేసే ఈ కాలాలకు ఆధ్యాత్మిక కాంతి

ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలి

ప్రార్థనలు మరియు ప్రతిజ్ఞలు

ఇతరులతో షేర్ చేయండి