వై.ఎస్.ఎస్. పాఠాల తెలుగు అనువాదం విడుదల

యోగదా సత్సంగ పాఠాల యొక్క కొత్త ప్రచురణ ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చిందని మరియు నమోదు చేసుకునే అవకాశం అందుబాటులో ఉందని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము!

డిసెంబర్ 3, 2022న, యోగదా సత్సంగ పాఠాల కొత్త ప్రచురణ యొక్క తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వై.ఎస్.ఎస్. సన్యాసులు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 600 మంది హాజరయ్యారు మరియు అనేక వందల మంది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

స్వామి స్మరణానంద, మాధవానంద గార్లు, బ్రహ్మచారి శరత్, కేదారానంద గార్లు సంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేయడంతో కార్యక్రమం ప్రారంభమైంది. తరువాత, బ్రహ్మచారి శరత్ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.), దాని వ్యవస్థాపకుడు మరియు గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారిని మరియు వై.ఎస్.ఎస్. గురువులను స్లైడ్-షో ద్వారా పరిచయం చేశారు. వై.ఎస్.ఎస్ పాఠాలు గీతా జయంతి సందర్భంగా విడుదల చేయబడుతున్నాయి అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు మరియు భగవద్గీతలో దాగి ఉన్న గురుదేవుని క్రియాయోగ బోధనల ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.

“ఆనందమైన, సాఫల్యవంతమైన జీవితం కోసం క్రియాయోగ ధ్యానం” అనే అంశంపై స్వామి స్మరణానందగారు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని అందించారు. అయన “సత్-చిత్-ఆనంద” మరియు “అహం బ్రహ్మాస్మి” అని దేవుని భావనలను వివరించారు. మరియు ప్రతి వ్యక్తి భగవంతునిలో ఒక భాగమైనందున స్వాభావికంగా ఆనందంగా ఉంటాడని నొక్కి చెప్పారు; మరియు ఆ ఆనందాన్ని వెలికితీసే పద్ధతి యోగా ధ్యానం ద్వారా తనలో తాను వెతకడమేనని తెలియజేశారు.

అనంతరం స్వామి మాధవానందగారు హారతి కార్యక్రమం నిర్వహించారు. దీని తర్వాత వేదిక నుండి మరియు ఆన్‌లైన్‌లో కార్యక్రమానికి హాజరైన భక్తులందరి ఆనందకర కరతాళధ్వనులు, ప్రశంసలు మరియు కృతజ్ఞతల మధ్య వై.ఎస్.ఎస్. సన్యాసులచే తెలుగు పాఠాలను విడుదల చేయడం జరిగింది.

అనంతరం వై.ఎస్.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. అధ్యక్షుడు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి సందేశాన్ని స్వామి మాధవానందగారు చదివి వినిపించారు. స్వామి చిదానందగారి లేఖ ద్వారా తన ఆశీర్వాదాన్ని పంపి, అంకితభావంతో వై.ఎస్.ఎస్. పాఠాలు తెలుగులో తీసుకురావడానికి కృషి చేసిన వారందరికీ తన అభినందనలు తెలిపారు. “పాఠాల తెలుగు అనువాదం ద్వారా ఆయన ఆత్మ-విముక్తి బోధనలు ఇప్పుడు భారతదేశంలోని అనేక మంది భక్తులకు అందుబాటులోకి వచ్చిన ఈ రోజున గురుదేవులు ఎంత సంతోషంగా ఉంటారో” అని ఆయన అన్నారు.

తరువాత, బ్రహ్మచారి కేదారానందగారు తెలుగు వెర్షన్‌ను తీసుకురావడానికి సహకరించిన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అంతటా అన్ని విభాగాలకు చెందిన అనువాదకులు మరియు సహకారుల బృందానికి ధన్యవాదాలు తెలిపారు. వై.ఎస్.ఎస్. తెలుగు పాఠాలు, తెలుగులో వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్ మరియు ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ గురించి వివరించారు. స్లైడ్ షో మరియు చిన్న వీడియో ప్రదర్శన ద్వారా ఆయన ఆన్‌లైన్ పాఠాల నమోదు ప్రక్రియను ప్రదర్శించారు మరియు పాఠాల యాప్ యొక్క ముఖ్యాంశాలను వివరించారు.

తరువాత, హాజరైన వారిలో చాలా మంది తెలుగు పాఠాల కోసం నమోదు చేసుకున్నారు, మరియు పలువురు వేదిక వద్ద తెలుగులో వై.ఎస్.ఎస్. సాహిత్యాన్ని కొనుగోలు చేశారు. కొత్తగా పాఠాల కొరకు నమోదు చేసుకున్న విద్యార్థులకు శక్తిపూరక వ్యాయామాలు మరియు హాంగ్-సా ప్రక్రియ ద్వారా ఏకాగ్రత పొందడానికి సూత్రాలు బోధించబడ్డాయి.

తెలుగులో వై.ఎస్.ఎస్. పాఠాల కోసం నమోదు చేసుకోవడానికి, దయచేసి క్రింది లింక్‌ను క్లిక్ చేయండి:

ఇతరులతో పంచుకోండి