Yogoda Satsanga Upa Dhyana Kendra – Kandivali, Mumbai

మహారాష్ట్ర

సామూహిక ధ్యానం అనేది కొత్త ఆధ్యాత్మిక సాధకులను, అలాగే అనుభవజ్ఞులైన ధ్యానులను ఇరువురినీ రక్షించే ఒక దుర్గము. కలసి ధ్యానం చేయడం, సమూహ అయస్కాంతత్వం యొక్క అదృశ్య ప్రకంపనా వినిమయ సిద్ధాంతం ద్వారా, అందులో పాల్గొనే ప్రతి సభ్యుని ఆత్మ-సాక్షాత్కార స్థాయిని వృద్ధి చేస్తుంది.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) వారి Kandivali (Mumbai) Meditation Centreకు స్వాగతం పరమహంస యోగానంద గారు, సర్వతోముఖమైన సాఫల్యతను, శ్రేయస్సును మరియు భగవంతుని యొక్క వ్యక్తిగత ప్రత్యక్షానుభవాన్ని పొందడానికి, క్రియాయోగం యొక్క ధ్యాన ప్రక్రియలు మరియు ప్రాచీన శాస్త్రీయ బోధనలను అందుబాటులోకి తీసుకురావడానికి వై.ఎస్.ఎస్. ను 1917లో స్థాపించారు.

సత్యాన్వేషకులందరు సామూహిక ధ్యానాల శక్తిని అనుభూతి చెందడానికి మరియు ఆధ్యాత్మిక సహవాసంలో ఉండేలా సహాయపడడానికి వై.ఎస్.ఎస్.కు భారతదేశమంతటా 200కు పైగా కేంద్రాలు ఉన్నాయి.

అత్యధికంగా అమ్ముడయ్యే ఆధ్యాత్మిక గ్రంథం, ఒక యోగి ఆత్మకథ తో సహా, పరమహంస యోగానంద గారు అందించిన జ్ఞానరత్నాలైన వై.ఎస్.ఎస్. ప్రచురణలు మా కేంద్రాలలోను మరియు మా ఆన్‌లైన్ బుక్ స్టోర్ లోను లభ్యమవుతాయి.

Devotees share their experience of group meditation

Devotees in group meditation

వై.ఎస్.ఎస్. కు కొత్తవారా?

గృహ-అధ్యయన పాఠ్యక్రమం అయిన వై.ఎస్.ఎస్. పాఠాలు, మీరు ఊహించని విధంగా మీ జీవితంలో పరివర్తన చేకూర్చి, సమతుల్యము మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ఎలా సహాయపడతాయో మరింతగా తెలుసుకోండి.

మమ్మల్ని సంప్రదించండి

మొదటిసారి వై.ఎస్.ఎస్. కేంద్రాన్ని సందర్శించాలని భావిస్తున్నారా?
మేము మీకు మరింతగా సహాయం చేసేందుకు, మీకు వీలైనప్పుడు మీ నగరంలోని మా ప్రధాన కేంద్రమైన - Mumbai Meditation Centre కూడా సందర్శించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.
Yogoda Satsanga Upa Dhyana Kendra – Kandivali, Mumbai
C/O Sri Krishnamurthi
408 Hill View, Charkop Deep Co-op Society Ltd.
Plot No. 14, RSC – 25
Charkop, Sector 8, Kandivali
Mumbai - 400067
Maharashtra

ప్రతి వారం కార్యక్రమాలు

సామూహిక ధ్యానం

అందరూ పాల్గొనేలా ధ్యానం మరియు సత్సంగాలను ప్రతిదినం మేము అందిస్తున్నాం. ఈ సమావేశాలు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానం, భక్తి గీతాలాపన మరియు స్ఫూర్తిదాయక పఠనంతో కూడి ఉంటాయి.

గురువారం
సాయంత్రం 5:00 – రాత్రి 8:00
సామూహిక ధ్యానం
శనివారం
సాయంత్రం 5:00 – రాత్రి 8:00
సామూహిక ధ్యానం

ఇతరులతో పంచుకోండి