నిశ్శబ్దం అనే ప్రవేశ ద్వారం గుండా జ్ఞానము మరియు శాంతి యొక్క స్వస్థత చేకూర్చే సూర్యుడు మీపై ప్రకాశిస్తాడు.
— పరమహంస యోగానంద
ఆశ్రమ ప్రాంగణంలోని ప్రదేశాలు, విభిన్నమైన సుందర ప్రకృతి దృశ్యాలతోను అనేక రకాల మొక్కలు, వృక్షాలకు నిలయమైన వనాలు వెదజల్లినట్లుగా ఉంటాయి. నీడనిచ్చే మామిడి తోటలు, పనస చెట్ల బాటలు, సతతహరిత లిచీ వృక్షాలు మరియు సొగసుగా చెల్లాచెదురుగా ఉండే అలంకారప్రాయమైన వెదురు పొదలు, అన్నీ కలిసి రమ్యమైన ఒక ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సృష్టిస్తాయి, ప్రాపంచిక విషయాలతో అలసి-సొలసిన ఆత్మలు ఇక్కడకు వచ్చి శాంతి మరియు ఆనందం యొక్క అమృతంలో పాలుపంచుకోమని ఇవి ఆహ్వానిస్తాయి. ప్రపంచం యొక్క చింతలను విడిచిపెట్టి శరీరం, మనస్సు మరియు ఆత్మ, విశ్రాంతి పొందేలా సేద తీర్చుకోవచ్చునని ఒకరు చాలా సులభంగా గ్రహిస్తారు. ఈ పవిత్ర పరిసరాలలో ఒక వ్యక్తి ఇక్కడ కూర్చుని ధ్యానం చేసి అంతర్ముఖులయ్యేందుకు లేదా నిశ్శబ్దంగా కూర్చుని శాంతి మరియు ప్రశాంతతలో మునిగిపోయేందుకు అనేక బల్లలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి.
ప్రశాంతతను వెతుక్కుంటూ లేదా భగవంతునిపై ధ్యానం కోసం ఆశ్రమ ప్రాంగణంలోకి ప్రవేశించిన వారందరినీ, ఈ పవిత్ర ప్రదేశాల్లో నడయాడిన పరమహంసగారు మరియు అనేక మంది మహాత్ముల ఆధ్యాత్మిక ప్రకంపనలు ఉద్ధరిస్తాయి.
ఈ పవిత్ర ధ్యాన వనాలలో, ఒకరు ప్రశాంతంగా ధ్యానం చేసేందుకు అనేక శాంతియుత ప్రాంగణాలు, ఏకాంతాన్నిచ్చే నిర్జన ప్రదేశాలు ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించేందుకు పుష్పాలను, పొదలను మరియు వృక్ష సంపదను జాగ్రత్తగా పెంచడం జరిగింది. ప్రధాన భవనం ముందు, ధ్యాన మందిరం వద్ద, మరియు స్మృతి మందిరం చుట్టూ విశాలమైన పచ్చని పచ్చిక బయళ్ళు ఉన్నాయి. అరుదైన రకాల లిల్లీలు మరియు వివిధ రంగుల చేపలు గల నీటి వనరులు ఉన్నాయి. ఈ ప్రకృతి దృశ్యమాలికలన్నీ ఈ పవిత్రమైన ప్రదేశాలలో ప్రతిధ్వనించే శాంతి మరియు ప్రశాంతత యొక్క తేజాన్ని మెరుగుపరుస్తాయి.