Yogoda Satsanga Dhyana Mandali – Rishikesh

ఉత్తరాఖండ్

సామూహిక ధ్యానం అనేది కొత్త ఆధ్యాత్మిక సాధకులను, అలాగే అనుభవజ్ఞులైన ధ్యానులను ఇరువురినీ రక్షించే ఒక దుర్గము. కలసి ధ్యానం చేయడం, సమూహ అయస్కాంతత్వం యొక్క అదృశ్య ప్రకంపనా వినిమయ సిద్ధాంతం ద్వారా, అందులో పాల్గొనే ప్రతి సభ్యుని ఆత్మ-సాక్షాత్కార స్థాయిని వృద్ధి చేస్తుంది.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) వారి Rishikesh Meditation Centreకు స్వాగతం పరమహంస యోగానంద గారు, సర్వతోముఖమైన సాఫల్యతను, శ్రేయస్సును మరియు భగవంతుని యొక్క వ్యక్తిగత ప్రత్యక్షానుభవాన్ని పొందడానికి, క్రియాయోగం యొక్క ధ్యాన ప్రక్రియలు మరియు ప్రాచీన శాస్త్రీయ బోధనలను అందుబాటులోకి తీసుకురావడానికి వై.ఎస్.ఎస్. ను 1917లో స్థాపించారు.

సత్యాన్వేషకులందరు సామూహిక ధ్యానాల శక్తిని అనుభూతి చెందడానికి మరియు ఆధ్యాత్మిక సహవాసంలో ఉండేలా సహాయపడడానికి వై.ఎస్.ఎస్.కు భారతదేశమంతటా 200కు పైగా కేంద్రాలు ఉన్నాయి.

అత్యధికంగా అమ్ముడయ్యే ఆధ్యాత్మిక గ్రంథం, ఒక యోగి ఆత్మకథ తో సహా, పరమహంస యోగానంద గారు అందించిన జ్ఞానరత్నాలైన వై.ఎస్.ఎస్. ప్రచురణలు మా కేంద్రాలలోను మరియు మా ఆన్‌లైన్ బుక్ స్టోర్ లోను లభ్యమవుతాయి.

Devotees share their experience of group meditation

Devotees in group meditation

వై.ఎస్.ఎస్. కు కొత్తవారా?

గృహ-అధ్యయన పాఠ్యక్రమం అయిన వై.ఎస్.ఎస్. పాఠాలు, మీరు ఊహించని విధంగా మీ జీవితంలో పరివర్తన చేకూర్చి, సమతుల్యము మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ఎలా సహాయపడతాయో మరింతగా తెలుసుకోండి.

మమ్మల్ని సంప్రదించండి

Yogoda Satsanga Dhyana Mandali – Rishikesh
C/o Dr. Suman Chaurasia, C1-ground
Gangasthal part 1, (opp hotel Vasundhara palace)
near Janaki Jhula, Muni ki Reti
Rishikesh - 249137
Tehri Garhwal
Uttarakhand
India

ప్రతి వారం కార్యక్రమాలు

సామూహిక ధ్యానాలు

ప్రజలందరికీ అందుబాటులో ఉండే ధ్యానం మరియు సత్సంగాలను క్రమబద్ధంగా నిర్వహిస్తాము. ఈ కార్యక్రమాలలో నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానం, భక్తి గీతాలాపన మరియు స్ఫూర్తిదాయక పఠనం ఉంటాయి.

ప్రత్యేక కార్యక్రమాలు మరియు దీర్ఘ ధ్యానాలు

వై.ఎస్.ఎస్. స్మారక దినోత్సవాలు, దీర్ఘ ధ్యానాలు మరియు ఇతర ప్రత్యేక కార్యక్రమాలు సంవత్సరం పొడవునా నిర్వహించబడతాయి.

కొన్ని స్మారకోత్సవ కార్యక్రమాలు:

  • పరమహంస యోగానందగారి జన్మోత్సవం (జనవరి 5)
  • పరమహంస యోగానందగారి మహాసమాధి దినోత్సవం (మార్చి 7)
  • స్వామి శ్రీయుక్తేశ్వరుల మహాసమాధి దినోత్సవం (మార్చి 9)
  • స్వామి శ్రీయుక్తేశ్వరుల ఆవిర్భావ దినోత్సవం (మే 10)
  • గురుపూర్ణిమ
  • మహావతార్ బాబాజీ స్మృతి దినోత్సవం (జూలై 25)
  • జన్మాష్టమి
  • లాహిరీ మహాశయుల మహాసమాధి దినోత్సవం (సెప్టెంబర్ 26)
  • లాహిరీ మహాశయుల ఆవిర్భావ దినోత్సవం (సెప్టెంబర్ 30)
  • క్రిస్మస్ (డిసెంబర్ 25)

కార్యక్రమాల వివరాల కోసం Yogoda Satsanga Dhyana Mandali – Rishikesh ను దయచేసి సంప్రదించండి.

ఇతరులతో పంచుకోండి