శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు బోధించిన స్వస్థత ప్రక్రియ

ప్రార్థన సేవ (నిడివి: 15 – 20 నిమిషాలు)

స్వస్థత ప్రక్రియను అభ్యసిస్తున్న వై.ఎస్.ఎస్. సన్యాసులు.విశ్వంలోని ప్రతిదీ శక్తితో కూడి ఉంటుందని, ఘనపదార్థాలు, ద్రవాలు, వాయువులు, ధ్వని మరియు కాంతి మధ్య స్పష్టమైన వ్యత్యాసం కేవలం వాటి ప్రకంపన క్రమములో వ్యత్యాసం మాత్రమేనని ఆధునిక శాస్త్రం చూపించింది. అదే విధంగా ప్రపంచంలోని గొప్ప మతాలు అన్నీ, సృష్టించబడినవి అన్నీ ఓం లేదా ఆమెన్, అనే పదము లేదా హోలీ గోస్ట్ (దైవాత్మ) యొక్క విశ్వ ప్రకంపన శక్తి నుండి ఉద్భవించాయని పేర్కొన్నాయి. సృష్టి ప్రారంభంలో వాక్యం ఉంది, మరియు వాక్యం దేవుడితో ఉంది, మరియు వాక్యమే దేవుడు … అన్ని విషయాలు ఆయన చే సృష్టించబడ్డాయి, మరియు ఆయన లేకుండా ఏదీ సృష్టించబడలేదు” (జాన్ 1: 1, 3).

వీరు ఆమెన్ అంటారు, నమ్మకమున్న వారు మరియు నిజమైన సాక్షులు, దేవుని సృష్టి యొక్క ప్రారంభం” (ప్రక. 3:14). తిరుగుతున్న యంత్రము యొక్క ప్రకంపనల ద్వారా ధ్వని ఉత్పన్నమైనట్లు, ఓం యొక్క సర్వ వ్యాప్త శబ్దం “విశ్వ యంత్రము” నడుస్తున్నది అనడానికి విశ్వసనీయ సాక్ష్యం, ఇది ప్రకంపన శక్తి ద్వారా అన్ని జీవులను మరియు సృష్టిలోని ప్రతి కణాన్ని నిలబెడుతుంది.

ఏకాగ్రత మరియు సంకల్ప శక్తి ద్వారా మనము విశ్వ శక్తితో శరీర శక్తి సరఫరాను పెంచవచ్చు. ఆ శక్తిని శరీరంలోని ఏ భాగానికైనా ప్రసరించ జేయ వచ్చు; లేదా అవసరమైన వారికి స్వస్థత చేకూర్చే శక్తిగా ప్రవహించడానికి, కొన వేళ్ళ సున్నితమైన యాంటెనా ద్వారా మళ్ళీ అంతరిక్షంలోకి విడుదల చేయవచ్చు – వాళ్ళు వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ. గొప్ప ఓం ప్రకంపన ద్వారా, మనము భగవంతుని సర్వ వ్యాప్త చైతన్యానికి నేరుగా అనుసంధానం పొందవచ్చు – ఇక్కడ సమయం మరియు స్థలం గురించి భ్రమ కలిగించే భావనలు లేవు. ఆ విధంగా అవసరమైన వ్యక్తి యొక్క హృదయపూర్వక అభ్యర్థన మరియు ఈ క్రింది పద్ధతిలో ఇతరుల కొరకు ప్రార్థించే వారు ఏకాగ్రతతో పంపే శక్తి మధ్య తక్షణ సంబంధం ఉంటుంది:

(ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు నిలబడండి)

కళ్ళు మూసుకొని ఇలా ప్రార్థించండి:

ఇంట్లో ప్రార్థన సేవను నిర్వహించడం

సామూహిక ప్రార్థనా వలయములో చేరలేని వారు పైన పేర్కొన్న పద్ధతిని అనుసరించి ఇంట్లో వ్యక్తిగత లేదా కుటుంబ ప్రార్థన సేవను నిర్వహించవచ్చు. కావాలనుకుంటే ఇది మీ ఉదయం లేదా సాయంత్రం ధ్యానంలో సాధారణ భాగం కావచ్చు. (వీలైతే, ఈ ప్రయోజనం కోసం అలవాటుగా ఉపయోగించే ఒక గదిలో లేదా ఒక గదిలోని ఒక భాగంలో ఎల్లప్పుడూ ప్రార్థన సేవలను నిర్వహించడం ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది దేవుని పై ఏకాగ్రత మరియు ప్రేమ పూర్వక దృష్టిని కేంద్రీకరించడాన్ని సులభతరం చేస్తుంది.)

ఇతరులు మరియు ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయడానికి స్నేహితులు మరియు సమాజంలోని ఇతర సభ్యులను కూడా ఆహ్వానించడం – ఇంట్లో మరియు పెద్ద సమూహంలో ప్రేమ మరియు సామరస్యం యొక్క స్ఫూర్తికి ఎంతో దోహదపడుతుందని చాలా కుటుంబాలు కనుగొన్నాయి.

ఇతరుల కోసం ప్రార్థించే వారు ధన్యులు, ఎందుకంటే అలా చేయడం ద్వారా, వారు అన్ని జీవితాల ఐక్యత గురించి తెలుసుకుంటారు. మనము ప్రతికూల శక్తులకు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాడుతున్న ఒంటరి జీవులం కాదు. మన సంతోషము అందరి సంతోషంతో ముడిపడి ఉంది; మన అత్యున్నత నెరవేర్పు అందరి సంక్షేమంలో ఉంది. ఈ సత్యాన్ని గ్రహించి, ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయములో పాల్గొనడానికి మీ సమయాన్ని మరియు సానుభూతిని తెలియజేసే మీ అందరికీ, మేము మా ప్రశంసలను తెలియజేస్తున్నాము. మానవత్వానికి అలాంటి నిస్వార్థ సేవ ద్వారా, నిరంతర రక్షణ మరియు భగవంతుని పట్ల సంతృప్తికరమైన ప్రేమ గురించి మీరు ఎల్లప్పుడు తెలుసుకుంటారు.

— యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా

ప్రార్థనల కొరకు అభ్యర్థన

ఆత్మ (గులాబీ) కోసం ఎంతో మంది చేసే ప్రార్థనలను వర్ణిస్తున్న గులాబీపై మంచు బిందువులు.ప్రార్థనల కొరకు అభ్యర్థనలు – తమకు లేదా ఇతరుల కొరకైనా – ప్రార్థన మండలి సభ్యులు ఎల్లప్పుడూ స్వాగతిస్తారు, మరియు తక్షణం ప్రేమ పూర్వక దృష్టిని అందిస్తారు. వాటిని ఆన్‌లైన్‌లో లేదా యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు ఫోన్ లేదా లేఖ ద్వారా సమర్పించవచ్చు. పేర్లు సమర్పించిన వారిని మూడు నెలల పాటు ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక స్వస్థత సేవల్లో చేర్చుతారు. ఆ స్వస్థత శక్తి ప్రయోజనం పొందడానికి వారు ప్రార్థన సేవలో ఉండవలసిన అవసరం లేదు.

ప్రార్థన అభ్యర్థనలు ఖచ్చితంగా గోప్యంగా ఉంచబడతాయి. అభ్యర్థనలలో సమస్య గురించి వివరణ ఉండాల్సిన అవసరం లేదు, దానిని వివరించాలనుకుంటే తప్ప. ప్రార్థన కౌన్సిల్ మరియు ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయము పని కొరకు కావలసిందల్లా స్వస్థత కోరుకునే వ్యక్తి పేరు. సమస్య యొక్క వివరాలు ప్రార్థనా వలయములోని వ్యక్తులకు తెలిస్తే, అలాంటి వివరాలను చర్చించకూడదు. లేకపోతే, ప్రతికూల మానసిక సహచర్యం ప్రార్థన శక్తిని బలహీన పర్చుతుంది. బదులుగా, గ్రూప్ సభ్యులు దేవుని యొక్క స్వస్థత శక్తిపై మరియు ఏమైనా అసమాన స్థితిని భర్తీ చేయడానికి పరిపూర్ణతపై మాత్రమే దృష్టి పెట్టాలి.

ఇతరులతో షేర్ చేయండి