YSS

మీ ప్రార్థనలకు దేవుడు ప్రత్యుత్తరమిచ్చే అనేక మార్గాలు

మీ ప్రార్థనలకు దేవుడు ప్రత్యుత్తరమిచ్చే అనేక మార్గాలు

పరమహంస యోగానందగారి జ్ఞాన సంపద నుండి

నిజమైన భక్తులు కూడా కొన్నిసార్లు ఈశ్వరుడు తమ ప్రార్థనలకు సమాధానం ఇవ్వడని భావిస్తారు. ఆయన తన నియమాల ద్వారా నిశ్శబ్దంగా ప్రతిస్పందిస్తాడు; కాని భక్తుని గురించి పూర్తి విశ్వాసం కలిగేవరకు ఆయన స్పష్టంగా సమాధానం ఇవ్వడు, భక్తునితో సంభాషించడు. విశ్వానికి అధిపతికి ఎంత వినమ్రత అంటే ఆయన మాట్లాడడు, ఎందుకంటే అలా చేయడం ద్వారా, తనను కోరుకోవడానికి లేదా తిరస్కరించడానికి భక్తునికి ఉన్న స్వేచ్ఛ ప్రభావితం అవ్వకూడదని.


సర్వాంతర్యామి అయిన భగవంతునికి తన నిజ భక్తులందరూ తెలుసు, ఆయనను వారు ఏ రూపంలో ప్రేమించినా సరే….[మరియు] వారి ప్రార్థనలకు అనేక రీతిలలో ప్రతిస్పందిస్తాడు. భగవంతుని పట్ల చూపి౦చబడిన భక్తి ఎల్లప్పుడూ ఏదో ఒక రీతిలో సరళమైన లేదా నిగూఢమైన ప్రతిస్పందనను తీసుకొస్తుంది. నిజమైన ఏ భక్తుడినీ ఈశ్వరుడు ఉపేక్షించడు.

భగవంతుడు అభీష్ట సిద్ధి ద్వారా ప్రతిస్పందిస్తాడు

దృఢమైన మరియు గాఢమైన, ప్రార్థన ఖచ్చితంగా దేవుని సమాధానాన్ని పొందుతుంది…. ఏదో ఒక స౦దర్భ౦లో, మనలోని ప్రతి ఒక్కరికి ప్రార్థన ద్వారా ఏదో ఒక కోరిక ఈడేరి౦దని తెలుసు . మీ సంకల్పం చాలా బలంగా ఉన్నప్పుడు అది పరమాత్ముని స్పృశిస్తుంది, అపుడు మీ కోరిక నెరవేరాలని ఈశ్వరుడు సంకల్పిస్తాడు.


కొన్నిసార్లు మీ కోరికను లేదా అవసరాన్ని తీర్చగల మరొక వ్యక్తి మనస్సులో ఒక ఆలోచనను నాటడం ద్వారా ఆయన ఉత్తరవు ఇస్తాడు; అప్పుడు ఆ వ్యక్తి, కోరుకున్న ఫలితాన్ని తీసుకురావడానికి దేవుని ఉపకరణంగా పనిచేస్తాడు.

ఒక్కొకప్పుడు “లేదు” అనేది దేవుని ప్రతిస్పందన

దేవుడు తమ ప్రార్థనలకు ప్రతిస్ప౦ది౦చడ౦ లేదని జనులు భావిస్తారు, ఎ౦దుక౦టే దేవుడు కొన్నిసార్లు తాము ఆశి౦చేదానికి లేదా కోరే దానికి భిన్న౦గా జవాబిస్తాడని వారు అర్థ౦ చేసుకోరు. వారి పరిపూర్ణత కోసం దేవుడి యొక్క కోరికను నెరవేర్చే వరకు, ఆయన అన్నిసార్లూ వారి అభ్యర్థనకు అనుగుణంగా ప్రత్యుత్తరమివ్వడు.


కొన్నిసార్లు మనం కోరుకున్నది పొందకపోవడం చాలా లాభదాయకమవుతుంది. ఒక పిల్లవాడు నిప్పును తాకాలని అనుకోవచ్చు, కానీ ఆ అపాయము నుండి కాపాడటానికి తల్లి తన బిడ్డ కోరికను తీర్చదు.

శా౦తి, ఆన౦దాల అనుభవమే దేవుని ప్రతిస్ప౦దన

మీరు మరింత గాఢమైన ఏకాగ్రతతో పదేపదే ఆయనను ప్రార్థిస్తే, ఆయన మీ ప్రార్థనకు జవాబిస్తాడు. శాంతి, ఆనందాలు మీ హృదయాన్ని తాకుతాయి. ఆ అనుభవము కలిగినప్పుడు, మీరు దేవునితో అనుశ్రుతిలో వున్నారని మీకు తెలుస్తుంది.


ఆర్తితో “పరమేశ్వరా” అని ఉచ్ఛరించడం, మరియు ప్రతి నామ పునశ్చరణముతో ఏకాగ్రత, భక్తిని పెంచుకుంటూ, ఆయన సన్నిధి అనే సంద్రములో ఎంత లోతుగా మునగాలంటే దివ్య శాంతి, అనంత ఆనందపారవశ్యాల లోతుల్లోకి చేరుకునేవరకు,ఇది తమ ప్రార్థనలు దేవుణ్ణి స్పృశించాయనడానికి నిశ్చయమైన నిదర్శనం.


ఎటువంటి బాహ్య ప్రాబల్యం లేని జీవనాధారమైన బేషరతు అంతర్గతపు ఆనందం భగవంతుని ప్రతిస్పందించే సన్నిధికి ప్రత్యక్ష నిదర్శనం.

దేవుని ప్రతిస్పందనం ఒక సమస్యకు సహజమైన పరిష్కార౦గా రావచ్చు

మన అవసరాలను తీరడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి భౌతికమైనది. ఉదాహరణకు, మనకు అనారోగ్యం ఉన్నప్పుడు, వైద్య చికిత్స కోసం వైద్యుడి వద్దకు వెళ్ళవచ్చు. కానీ మానవ చికిత్స ఏదీ సహాయపడలేని సమయం వస్తుంది. అప్పుడు మన౦ ఇంకో వైపు చూస్తాము, మన శరీరాన్ని, మనస్సును, ఆత్మను సృష్టి౦చిన ఆధ్యాత్మిక శక్తి వైపు. భౌతిక శక్తి పరిమితమైనది, అది విఫలమైనప్పుడు, మనం అపరిమితమైన దివ్య శక్తి వైపు తిరుగుతాము. అదే విధంగా మన ఆర్థిక అవసరాల విషయంలోనూ; మనం మన వంతు కృషి చేసినప్పుడు, అయినా అది సరిపోనప్పుడు, మనం ఆ ఇంకో శక్తిని ఆశ్రయిస్తాము.… మన౦ కష్టాల్లో ఉన్నప్పుడు ముందుగా మన పరిసరాలపై స్ప౦దిస్తా౦, మన౦ సహాయ౦ పడగలవని విశ్వసించే భౌతిక స౦బ౦ధమైన సర్దుబాట్లు చేసుకు౦టా౦. కానీ మనం ఇలా అనుకోవాల్సివస్తే, “నేను ఇప్పటివరకు ప్రయత్నించిన ప్రతిదీ విఫలమైంది; తరువాత ఏమి చేయాలి?” మనం పరిష్కారం కోసం తీవ్రంగా ఆలోచించడం ప్రారంభిస్తాము. మనం లోతుగా ఆలోచించినప్పుడు, మనలోనే మనకు సమస్యకు సమాధానం దొరుకుతుంది. ఈ సమాధానమే ఫలించిన ప్రార్థన యొక్క ఒక రూపం.


గుర్తుంచుకోండి, మనస్సు యొక్క పదిలక్షల తర్కాల కంటే మెరుగైనది ఏమిటంటే, మీలో ప్రశాంతతను అనుభూతి చెందేవరకు కూర్చొని భగవంతుని పై ధ్యానం చేయడం. అప్పుడు ప్రభువుతో ఇలా చెప్పండి, “నేను లక్షలాది విభిన్న యోచనలు చేసినప్పటికీ, నా సమస్యను నేనుగా పరిష్కరించలేను; అయితే నేను దాన్ని మీ కరతలముల వద్ద ఉంచి, ముందుగా మీ మార్గదర్శకత్వం కోసం ప్రార్థించి, ఆపై సాధ్యమైన పరిష్కారం కోసం వివిధ కోణాలను ఆలోచించడం ద్వారా దానిని పరిష్కరించగలను.” తమకు తాముసహాయ౦ చేసుకునేవారికి దేవుడు సహాయ౦ చేస్తాడు. ధ్యానంలో భగవంతుడిని ప్రార్థించిన తరువాత మీ మనస్సు ప్రశాంతతో మరియు విశ్వాసంతో నిండినప్పుడు, మీరు మీ సమస్యలకు వివిధ సమాధానాలను చూడగలుగుతారు; మరి మీ మనస్సు ప్రశాంతంగా ఉన్నందున, మీరు అత్యుత్తమ పరిష్కారాన్ని ఎంచుకోగలుగుతారు. ఆ పరిష్కారాన్ని అనుసరించండి, మీరు విజయం సాధిస్తారు. ఇది మీ దైనందిన జీవితంలో మత శాస్త్రాన్ని ఉపయోగించే మార్గము.

కార్య సిద్ధి కోసం మీ స్వీయ సంకల్ప శక్తిని పెంచడం ద్వారా దేవుడు ప్రతిస్పందిస్తాడు

నిర్మాణాత్మక చర్యల ద్వారా సంకల్పశక్తిని నిరంతరంగా ఉపయోగించండి. వైఫల్యాన్ని సమ్మతించడానికి నిరాకరిస్తూ, మీరు పట్టుదలగా ఉన్నప్పుడు, సంకల్పం యొక్క లక్ష్యం కార్యరూపం దాల్చుతుంది. మీ ఆలోచనలు మరియు కార్యకలాపాల ద్వారా మీరు నిరంతరం ఆ సంకల్పశక్తిని పని చేయించినపుడు, మీరు కోరుకున్నది జరగుతుంది. మీ అభీష్టానికి అనుగుణంగా ప్రపంచంలో ఏదీ లేనప్పటికీ, మీ సంకల్పం దృఢంగా ఉన్నపుడు, ఆశించిన ఫలితం ఏదో ఒక విధంగా వ్యక్తమవుతుంది. అలా౦టి సంకల్ప౦లోనే దేవుని సమాధాన౦ ఉ౦ది; ఎందుకంటే సంకల్పం భగవంతుడి నుండి వస్తుంది, మరియు నిరంతర సంకల్పం అనేది దివ్య సంకల్పమే.

Share this on

Share on facebook
Share on twitter
Share on whatsapp