శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి భగవద్ప్రేరితమైన భగవద్గీత అనువాదం మరియు విస్కృత వ్యాఖ్యానమైన God Talks With Arjuna లో ఆ మహాగురువులు వివరించిన భగవద్గీత యొక్క జ్ఞానం ఆధారంగా “జీవన సమరంలో విజయం సాధించడం (నా లోపలి కురుక్షేత్రం)” అనే పేరుతో వై.ఎస్.ఎస్. సన్యాసి అయిన సామి స్మరణానంద గిరి గారి తెలుగు ప్రసంగాల శ్రేణిలో ఇది మొదటిది.
ఈ స్ఫూర్తిదాయక ప్రసంగంలో, కురుక్షేత్ర యుద్దం యొక్క ప్రతీకాత్మక ప్రాముఖ్యత గురించి స్వామి స్మరణానంద మాట్లాడతారు. I వ అధ్యాయంలోని 1వ శ్లోకం నుండి 9వ శ్లోకం వరకు పరమహంసగారి వ్యాఖ్యానం ఆధారంగా, కురుక్షేత్రం అనే మన అంతర్గత యుద్ధంలో, మనలోని కౌరవుల (చెడు ధోరణులు) ఉనికి మన ఆధ్యాత్మిక పురోగతికి ఎలా ఆటంకం కలిగిస్తుందో, మరియు మనలోని పాండవులను (మంచి ధోరణులు) పెంపొందించుకోవడం వల్ల మన ఆంతరంగిక కురుక్షేత్ర యుద్ధంలో చివరికి ఆ కౌరవుల ఓటమి ఎలా సంభవించి, తద్ద్వారా ఆత్మసాక్షాత్కారం యొక్క అంతిమ లక్ష్యం సాధించేందుకు దారి తీస్తుందో, ఉపమానాలు మరియు ఉపాఖ్యానాల ద్వారా ఆయన వివరిస్తారు.
గీతా జయంతి సందర్భంగా ఈ సత్సంగం నవంబరు 2025లో యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం – నోయిడా నుండి ప్రత్యక్ష-ప్రసారం చేయబడింది.

















